ahuti prasad
-
నట ప్రసాద్
-
ఆహుతి ప్రసాద్ కన్నుమూత
-
ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి
-
ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. సినీ రంగ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి ఆహుతి ప్రసాద్‌కు కడపడి వీడ్కోలు పలికారు. అంతకుముందు చిరంజీవి తదితరులు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆహుతి ప్రసాద్ కేన్సర్ వ్యాధితో ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. -
ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది: చిరంజీవి
హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి సోమవారం ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ఆహుతి ప్రసాద్ విలక్షణ నటుడని, ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చిన్న వయసులోనే ఆహుతి ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిదన్నారు. ఆహుతి ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నఆహుతి ప్రసాద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. -
ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది
-
నేడు అహుతి ప్రసాద్ అంత్యక్రీయలు
-
ఆహుతి ప్రసాద్ కన్నుమూత
* చికిత్స పొందుతూ మృతి * నాలుగేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న నటుడు * రెండ్రోజుల క్రితం కిమ్స్‌లో చేరిక * ప్రసాద్ మృతిపై అభిమానులు, సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి * ఆహుతి సినిమాతో గుర్తింపు..‘చందమామ’తో ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు * నేడు అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ (57) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ‘ఆహుతి’ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన పూర్తిపేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. 122 చిత్రాల్లో నటించిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందారు. నాలుగేళ్ల నుంచి పెద్దపేగు చివరి భాగంలో కేన్సర్‌తో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆహుతి ప్రసాద్ మృతితో బంధువులు, అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రసాద్ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం ఉదయం ఫిలిం చాంబర్లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాద్ మరణంతో ఆయన స్వస్థలమైన కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలోని కోడూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అప్పుడప్పుడు కోడూరుకు వచ్చి అందరినీ కలిసి వెళ్లేవారని గ్రామస్తులు పేర్కొన్నారు. సినిమాలంటే చాలా ఇష్టం.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరులో 1958 జనవరి 2న ఉపాధ్యాయుడు రంగారావు, హైమావతి దంపతులకు ఆహుతి ప్రసాద్ జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. ప్రసాద్‌కు మొదట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్‌కు ఆయన వీరాభిమాని. సినిమాల్లోకి రావాలనే తపనతో ప్రసాద్ హైదరాబాద్‌లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత కొంతకాలం దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్‌కు ఇన్చార్జిగా ఉన్నారు. హీరో నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’తో ప్రసాద్ నటుడిగా పరిచయమయ్యారు. అనంతరం ‘ఆహుతి’ చిత్రంతో మంచి గుర్తింపు రావడంతో... అప్పటి నుంచి ఆయన పేరు ఆహుతి ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. నాగార్జున హీరోగా వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’ చిత్రంతో ఆహుతి ప్రసాద్ సెకండ్ ఇన్నిం గ్స్ మొదలైంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ ఆయన సినీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఆ తర్వాత తండ్రి పాత్రలు, కామెడీ, విలనీ పాత్రలతో తనదైన శైలిలో రక్తి కట్టించారు. 122 చిత్రాల్లో నటించిన ప్రసాద్... 2007లో ‘చందమామ’ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, 2002లో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ విలన్‌గా నంది పురస్కారాలు అందుకున్నారు. ‘రుద్రమదేవి’లో ఓ కీలక పాత్ర పోషించారు. అదే ఆయన ఆఖరి సినిమా. కాగా.. ఆహుతి ప్రసాద్ మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలుగు నటీనటుల సంఘం, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం పేర్కొన్నాయి. ఆయన మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించాయి. సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబులు ప్రసాద్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. కేసీఆర్ సంతాపం.. ఆహుతి ప్రసాద్ ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హాస్య పాత్రలతో చెరగని ముద్ర వేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సినీ కళాకారుల సంక్షేమానికి కూడా కృషి చేశారని పేర్కొన్నారు. ఆహుతి ప్రసాద్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రసాద్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ మంచి నటుడని రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి పేర్కొన్నారు. ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంపీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ పేర్కొన్నారు. -
చట్రంలో చిక్కని నటుడు
‘ఆహుతి’ ప్రసాద్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. ఎలాంటి ఇమేజ్ చట్రంలోనూ చిక్కుకోకుండా ఏ తరహా పాత్రలోనైనా ఇమిడిపోయిన నటుడు ఆయన. ముఖ్యంగా వాచికం విషయంలో చాలా శ్రద్ధ కనబరిచేవారు. గోదావరి యాసలో సంభాషణలు పలికించడంలో బాగా నేర్పు ప్రదర్శించేవారు. మీడియాతో ఇంటర్వ్యూలకు కొంత దూరంగానే ఉండేవారు. ‘ఆహుతి’ ప్రసాద్ కెరీర్‌లోని కొన్ని మలుపులు... ఆహుతి’ ప్రసాద్ ఒక సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశారు. ‘మల్లె మొగ్గలు’ చిత్రానికి సీనియర్ దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. ఆ తర్వాత ‘విక్రమ్’లో నటించే అవకాశం వచ్చింది. దూరదర్శన్ కోసం ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు చేసిన ‘మీరూ ఆలోచించండి’ ప్రోగ్రామ్‌లో నటించారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఆంజనేయ శాస్త్రి ‘ఆంధ్రప్రభ’లో ఇంటర్వ్యూ రాస్తూ - ఇకపై ‘ఆహుతి’ ప్రసాద్‌గా పేరు తెచ్చుకుంటారని రాశారు. నిజంగానే అప్పట్నుంచీ ఆయన పేరు అదే అయిపోయింది. పేరులో ‘ఆహుతి’ వద్దని చాలామంది చెప్పినా, అప్పటికే ఆ పేరు ఆయనకు స్థిరపడిపోయింది. నిర్మాత ‘ఆహుతి’ ప్రసాద్ కన్నడంలో మూడు సినిమాలు చేశారు. ‘పోలీస్ భార్య’ను కన్నడంలో నటులు హరిప్రసాద్, రఘుబాబుతో కలిసి రీమేక్ చేస్తే, అక్కడ ఘనవిజయం సాధించింది. తర్వాత ‘మామాశ్రీ’ రీమేక్ చేశారు. కె. వాసు దర్శకత్వంలో ‘సర్వర్ సుందరం’ చేశారు. నిర్మాతగా ఎదురు దెబ్బలు తిని, స్థిరాస్తి వ్యాపారంతో మళ్లీ పుంజుకున్నారు. సత్యారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘నాయకురాలు’ సినిమాలో నాగబాబు, భానుచందర్, హరితో కలిసి హీరోగా చేశారు. ‘శారద’లో కైకాల సత్యనారాయణ చేసిన పాత్ర ఆయన డ్రీమ్ కారెక్టర్. ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయలనుకున్నారు. ‘ఆహుతి’ ప్రసాద్ పెద్ద కుమారుడు భరణి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. రెండో కుమారుడు కార్తీక్ తండ్రి బాటలో సినిమాల్లోకి వచ్చారు. ‘రేస్’లో హీరోగా నటించారు. ప్రస్తుతం మరో చిత్రం చేస్తున్నారు. -
విలపించిన నటీమణులు
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారని తెలిసి పలువురు నటీమణులు విలపించారు. ఆర్టిస్ట్‌గా కంటే ఒక కుటుంబ సభ్యుడుగా ఉండేవారని, ఆయన చనిపోయారని విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యామని ఏడ్చేశారు. సమస్యలతో ఇబ్బందిపడే నటీనటులతో ''నేను ఉన్నాను. మీకేం పరవాలేదు'' ధైర్యం చెప్పేవారని ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన క్యాన్సర్‌తో ఎంతో బాధపడ్డారని చెప్పారు. కుటుంబ సభ్యుడుగా కబుర్లు చెప్పేవారన్నారు. సమస్యలు అడిగి తెలుసుకుని, తమకు అనేక విధాల సహాయపడినట్లు చెప్పారు. నటీమణులు సురేఖవాణి, హేమ, సన తదితరులు ఏడుస్తూనే మాట్లాడారు. ఆహుతి ప్రసాద్ ఇకలేరంటే నమ్మలేకపోతున్నామన్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. గత కొద్ది రోజులుగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదని చెప్పారు. మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు అహుతి ప్రసాద్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
ఆహుతి ప్రసాద్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
-
'కర్ణాటక నుంచి వచ్చి తనదైన ముద్రవేశారు'
హైదరాబాద్: సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అతి తక్కువ మంది నటుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరని నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం కన్నుమూసిన ఆహుతి ప్రసాద్ కు నివాళులు అర్పించిన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసి చాలా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆహుతి ఇక లేకపోడం చాలా బాధాకరమన్నారు. కర్ణాటక ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన ఆయన తూర్పు గోదావరి జిల్లా శైలిని బాగా అనుకరించడం సాధారణ విషయం కాదని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన బిజీ షెడ్యూల్ తో ఉన్నారని.. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీని వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
'సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయింది'
-
ఆహుతి ప్రసాద్ చివరి ఇంటర్వ్యూ
-
ఆహుతి ప్రసాద్ సినీ ప్రస్థానమిదీ..!
-
ఆహుతి ప్రసాద్ మృతికి ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు, క్యారెక్టర్ అర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. *ఆహుతి ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నటుడు గిరిబాబు అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో బాబాయి బాబాయి అంటూ ఉండే వాడని ఆయన తెలిపారు. *ప్రసాద్ మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తెలపారు. ఇద్దరం కలసి చాలా సినిమాల్లో నటించామన్నారు. చాల ప్రెండ్లీగా ఉండేవాడని భరణి ఈ సందర్బంగా ప్రసాద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ మధ్య 20 ఏళ్లగా పరిచయం ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏదో శని పట్టినట్లుందని తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మృతి చెందిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. *ప్రసాద్ మృతి వార్తా చాలా షాక్‌కు గురి చేసిందని ప్రముఖ నటుడు, మాటల రచయిత ఉత్తేజ్ తెలిపారు. తమ ఇద్దరి కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయని చెప్పారు. ఇద్దరం కలసి నంది అవార్డులు అందుకున్నామని గుర్తు చేసుకున్నారు. అందరితో స్నేహ పూర్వకంగా మెలిగేవారని ఉత్తేజ్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలోని వాళ్లకు ఇలా జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో ప్రసాద్ మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. దాదాపు 15 సినిమాల్లో ఇద్దరం కలసి నటించామని చెప్పారు. తన మనస్సుకు దగ్గరగా ఉన్న వారిలో ప్రసాద్ ఒకరని.... ఆయన ఇలా వదిలి వెళ్లిపోవడం బాధకరమని ఉత్తేజ్ తెలిపారు. ఆహుతి ప్రసాద్ ఆకస్మిక మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు. -
'ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉంది'
హైదరాబాద్: ఆహుతి ప్రసాద్ మంచి ఫ్యూచర్ ఉన్న నటుడని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. అలాంటి నటుడిని తమ నుంచి, పరిశ్రమ నుంచి భగవంతుడు ఈ విధంగా తీసుకుపోతాడని అనుకోలేదన్నారు. ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉందన్నారు. గోదావరి జిల్లాల భాషను మాట్లాడటంలో ఇప్పుడు ఉన్న నటుల్లో ప్రసాద్ ఒక్కరని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారని చెప్పారు. ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని ఎలా పరిష్కరించాలో సూచించాలని తనను ఆహుతి ప్రసాద్ తనను కోరే వాడని దాసరి ఈ సందర్భంగా వివరించారు. -
గోప్యత పాటిస్తున్న నటుడి కుటుంబసభ్యులు!
'ఆహుతి' చిత్రాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పెదవి విప్పటం లేదు. కాగా ఆహుతి ప్రసాద్.. సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇంతకీ అనారోగ్యం ఏమిటనేది ...ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకరు తెలిపారు. ' ఆహుతి ప్రసాద్‌కు ఫోన్ చేసినా... నాన్న బిజీగా ఉన్నారని ఆయన కుమారుడు సమాధానం ఇస్తున్నారని, అయితే అసలు విషయం తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లితే...ఆహుతి ప్రసాద్ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని' ఆయన పేర్కొన్నారు. కాగా ఆహుతి ప్రసాద్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన రెండు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. 1986లో 'విక్రమ్' సినిమా ద్వారా ఆహుతి ప్రసాద్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అనంతరం ఆయన నటించిన 'ఆహుతి' పెద్ద బ్రేక్ ఇచ్చింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్త బంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాల్లో ఆహుతి ప్రసాద్ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు. -
కిమ్స్‌లో చేరిన సినీ నటుడు ఆహుతి ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ సోమవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయన కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.అనారోగ్యంపై అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఆయన్ని బంధువులు, స్నేహితులు పరామర్శించారు. ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు.