
నటీమణులు
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారని తెలిసి పలువురు నటీమణులు విలపించారు. ఆర్టిస్ట్గా కంటే ఒక కుటుంబ సభ్యుడుగా ఉండేవారని, ఆయన చనిపోయారని విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యామని ఏడ్చేశారు. సమస్యలతో ఇబ్బందిపడే నటీనటులతో ''నేను ఉన్నాను. మీకేం పరవాలేదు'' ధైర్యం చెప్పేవారని ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన క్యాన్సర్తో ఎంతో బాధపడ్డారని చెప్పారు. కుటుంబ సభ్యుడుగా కబుర్లు చెప్పేవారన్నారు.
సమస్యలు అడిగి తెలుసుకుని, తమకు అనేక విధాల సహాయపడినట్లు చెప్పారు. నటీమణులు సురేఖవాణి, హేమ, సన తదితరులు ఏడుస్తూనే మాట్లాడారు. ఆహుతి ప్రసాద్ ఇకలేరంటే నమ్మలేకపోతున్నామన్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. గత కొద్ది రోజులుగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదని చెప్పారు. మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు అహుతి ప్రసాద్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.