Weeping
-
handsome weeping boys: కరువుతీరా ఏడ్చెయ్యండి! వీపింగ్ బాయ్ తుడిచేస్తాడు!
కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు ‘హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్’ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్ పని. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్ బాయిస్‌గా నియమించుకుంటున్నాయి. ఏడ్పించి... కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. వీరందరికి ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవీ,తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తోన్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్ కాటన్ కర్చీఫ్‌తో ప్రేమగా తుడుస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్ బాయ్ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు. టోక్యోకు చెందిన ‘క్రైయింగ్ వర్క్‌షాపు’ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయ్కు వచ్చిన ఐడియానే వీపింగ్ బాయ్. ఆలోచన వచ్చిన తరవాత అనేక వర్క్ షాపులు నిర్వహించి ఈ వీపింగ్ బాయ్‌ను అమలులోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్ బాయిస్‌ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్‌షాపులను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్సమ్ బాయిస్‌ను వీపింగ్ బాయిస్‌గా ఎంచుకున్నాడు. అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎన్నుకున్నట్లు టెకాయ్ చెబుతున్నాడు. ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టి జపాన్ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం నేర్చుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... గుంyð ల్లో ఉన్న భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు అందరితో కలిసి మెలిసి తిరగగలుగుతారు. -
సార్.. ప్లీజ్ సార్.. వెళ్లొద్దు సార్
వైరల్: గురువులకు గౌరవం ఇచ్చే విద్యార్థులు.. ఈరోజుల్లో చాలా అరుదు. లాక్డౌన్ టైంలో టీచర్ల పట్ల విద్యార్థుల మానసిక స్థాయి ఏరేంజ్‌లో ఉందో పలు వీడియోల ద్వారా కళ్లారా చూశాం కూడా. కానీ, విద్యార్థులకు తగ్గట్లుగా ఉంటూనే.. వాళ్ల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆ గురువు అనుకున్నాడు. మరి అలాంటి ఫేవరెట్ గురువును వదులుకునేందుకు ఏ విద్యార్థికి అయినా ఎందుకు మనసు ఒప్పుతుంది?. తమకు నాలుగేళ్లపాటు పాఠాలు చెప్పిన శివేంద్ర సింగ్ సార్‌ను.. మరో స్కూల్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆయన కోసం మంగళవారం వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి విద్యార్థులు ఆయన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కన్నీళ్లతో ఆయన్ను హత్తుకుని ‘వెళ్లొద్దు సార్..’ అంటూ రోదించారు. యూపీ రాయ్‌గఢ్ చందౌలీ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడ్కోలు సభలో కానుకలు ఇచ్చి, తోటి టీచర్లు ప్రశంసలు గుప్పించారు. సభ అయిపోగానే పిల్లలంతా ఆయన చుట్టూ చేరి కన్నీళ్లు గుప్పించారు. ‘‘త్వరలోనే వస్తా.. బాగా చదువుకోండి.. మీరంతా బాగుండాలి అంటూ వాళ్లను ఓదార్చి.. ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఆయన. తోటి పిల్లలతో కలిసి కొండ ప్రాంతంలో క్రికెట్ ఆడేవాడినని అనుభవాలను గుర్తు చేసుకున్నాడాయన. శివేంద్ర సింగ్.. చాలా వైవిధ్యమైన పద్ధతిలో పాఠాలు చెప్తాడు. అందుకే ఆయనంటే పిల్లలకు అంత ఇష్టం. 2018లో ఆయన అసిస్టెంట్ టీచర్‌గా ఆ స్కూల్‌కు వెళ్లారు. ఆటలు, సోషల్ మీడియా, బొమ్మలు, పాటల ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పేవారాయన. కేవలం పాఠాలు మాత్రమే కాదు.. ప్రపంచం గురించి కూడా ఆయన వాళ్లకు వివరించేవాడు. లాక్డౌన్ టైంలో ఆయన తీసుకున్న చొరవకు ఆ జిల్లాలోనే ప్రముఖ స్థానం దక్కింది. ఆయన ప్రభావంతోనే స్కూల్ హాజరు శాతం పెరిగింది కూడా. అందుకే ఆయన సేవలను ఉపయోగించుకోవాలని.. పక్క జిల్లాలోని ఓ స్కూల్‌కు ట్రాన్స్ఫర్ చేసింది యూపీ విద్యాశాఖ. Video: At UP Teacher's Farewell, Students Weep, Refuse To Let Him Go https://t.co/H9vCNQK0aj pic.twitter.com/7o0dqECKe5 — NDTV (@ndtv) July 15, 2022 ఇదీ చదవండి: గురుబ్రహ్మ.. కారడవిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..! -
సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం
బెంగళూరు: భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. అందుకే ఆ ముఖ్యమంత్రి ఆ సినిమాను చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆయన అంతలా ఎమోషనల్ కావడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉందండోయ్. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తాజాగా రక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా చూశారు. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్. అయితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఒక్కసారిగా ఏడ్చేశారు. బొమ్మై గతంలో స్నూబీ అనే కుక్కను పెంచారు. ఆయన సీఎం పదవి చేపట్టడం కంటే ముందే ఆ శునకం కన్నుమూసింది. దాని అంత్యక్రియల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చారాయన. అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా కన్నీటి పర్యంతం అయ్యారు. Okayyyyy…. I think I like our CM much more now. This is when they lost ‘Sunny’- their 14 year old family dog. #BasavarajBommai pic.twitter.com/4ECmQMdLA6 — Sangita (@Sanginamby) July 29, 2021 కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సినిమా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందే. షరతులు లేని ప్రేమ(అన్‌కండిషనల్ లవ్) గురించి మాట్లాడుతున్నాను. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ, చాలా స్వచ్ఛమైనది.. అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడారాయన. -
యువకుడితో సన్నిహితంగా ఉందని..
జకార్త: ఇండోనేషియాలో ఓ మహిళ బెత్తం దెబ్బలు తింటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బండా ఎసె ప్రాంతానికి చెందిన మహిళకు అక్కడి ఇస్లామిక్ చట్టాల ప్రకారం అధికారులు బెత్తం దెబ్బలను శిక్షగా విధించారు. ఈ శిక్ష అమలు సదర్భంగా సదరు మహిళ మొహాన్ని చేతులతో కప్పుకొని ఏడుస్తున్న తీరు పట్ల నెటీజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే.. పెళ్లి కాకుండానే ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం. దీంతో.. ప్రియుడితో పాటు ఆమెకు పబ్లిగ్గా 26 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఇండోనేషియాలో షరియా చట్టం అమలవుతున్న ఒకే ఒక ప్రావిన్స్ ఎసె. దీని ప్రకారం వివాహానికి ముందు యువతీ యువకులు సన్నిహితంగా ఉండటం నిషేధం. -
కంటతడి పెట్టిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
-
విలపించిన నటీమణులు
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారని తెలిసి పలువురు నటీమణులు విలపించారు. ఆర్టిస్ట్‌గా కంటే ఒక కుటుంబ సభ్యుడుగా ఉండేవారని, ఆయన చనిపోయారని విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యామని ఏడ్చేశారు. సమస్యలతో ఇబ్బందిపడే నటీనటులతో ''నేను ఉన్నాను. మీకేం పరవాలేదు'' ధైర్యం చెప్పేవారని ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన క్యాన్సర్‌తో ఎంతో బాధపడ్డారని చెప్పారు. కుటుంబ సభ్యుడుగా కబుర్లు చెప్పేవారన్నారు. సమస్యలు అడిగి తెలుసుకుని, తమకు అనేక విధాల సహాయపడినట్లు చెప్పారు. నటీమణులు సురేఖవాణి, హేమ, సన తదితరులు ఏడుస్తూనే మాట్లాడారు. ఆహుతి ప్రసాద్ ఇకలేరంటే నమ్మలేకపోతున్నామన్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. గత కొద్ది రోజులుగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదని చెప్పారు. మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు అహుతి ప్రసాద్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.