యువకుడితో సన్నిహితంగా ఉందని.. | The Acehnese woman is seen weeping and covering her face | Sakshi
Sakshi News home page

యువకుడితో సన్నిహితంగా ఉందని..

Published Fri, Feb 3 2017 12:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

యువకుడితో సన్నిహితంగా ఉందని..

యువకుడితో సన్నిహితంగా ఉందని..

జకార్త: ఇండోనేషియాలో ఓ మహిళ బెత్తం దెబ్బలు తింటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బండా ఎసె ప్రాంతానికి చెందిన మహిళకు అక్కడి ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం అధికారులు బెత్తం దెబ్బలను శిక్షగా విధించారు. ఈ శిక్ష అమలు సదర్భంగా సదరు మహిళ మొహాన్ని చేతులతో కప్పుకొని ఏడుస్తున్న తీరు పట్ల నెటీజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే.. పెళ్లి కాకుండానే ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం. దీంతో.. ప్రియుడితో పాటు ఆమెకు పబ్లిగ్గా 26 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఇండోనేషియాలో షరియా చట్టం అమలవుతున్న ఒకే ఒక ప్రావిన్స్ ఎసె. దీని ప్రకారం వివాహానికి ముందు యువతీ యువకులు సన్నిహితంగా ఉండటం నిషేధం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement