ఘోరం: వివాహిత మిస్సింగ్‌, మూడురోజల తర్వాత.. | Missing Indonesian Woman Who Went Missing Found Inside A Python After 3 Days, Details Inside | Sakshi
Sakshi News home page

ఘోరం: వివాహిత మిస్సింగ్‌, మూడు రోజుల తర్వాత..

Published Sun, Jun 9 2024 10:01 AM | Last Updated on Sun, Jun 9 2024 1:34 PM

Missing Indonesian Woman Found Inside A Python

మూడురోజులైనా ఆమె ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కనిపించకుండా పోయిన తన భార్యను వెతికే క్రమంలో.. ఆ భర్తకు గుండె బద్ధలయ్యే దృశ్యం కనిపించింది. కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. ఇండోనేషియాలో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఫరీదా అనే 45 వివాహిత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. దీంతో, గ్రామస్థులు, పోలీసుల సాయంతో మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. 

ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ భారమైన పొట్టతో కదల్లేని పరిస్థితిలో కనిపించింది. అనుమానంతో దాని పొట్ట చీల్చి చూడగానే ఓ మహిళ తలభాగం బయటపడింది. వెంటనే  ఆ మృతదేహాన్ని బయటకు తీసి చూడగా.. అది ఫరీదాగా నిర్ధారణ అయ్యింది. ఒంటిపై దుస్తులు అలాగే ఉండడంతో ఆమెను గుర్తు పట్టిన భర్త కన్నీటి పర్యంతం అయ్యాడు. 

నిపుణులు ఏం చెప్తున్నారంటే.. సాధారణంగా కొండచిలువలు జంతువులను తప్ప మనుషులపై పెద్దగా దాడులు చేయవు. కానీ, ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో మనుషులపై దాడుల ఘటనలు పెరిగిపోయాయి. కిందటి ఏడాది ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండచిలువను గుర్తించి.. దానిని చంపి అతన్ని రక్షించారు. కొన్నాళ్ల కిందట ఏడు మీటర్ల పొడవున్న కొండచిలువ 54 ఏళ్ల మహిళను చంపి తినేసింది. అయితే అది జీర్ణించుకోలేకపోవడంతో.. ఆ మృతదేహం కొన్నాళ్లకు బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement