
అమెరికా యోచన
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించిన ట్రంప్ సర్కార్ త్వరలో విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాల సిబ్బందిపైనా తొలగింపు వేటు వేయనుందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత మంత్రిత్వశాఖకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఆయా వివరాలు ఉన్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రధానంగా యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువ రాయబారకార్యాలయాలు, కాన్సులేట్లను శాశ్వతంగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ కార్యాలయాలకు తాళాలు పడే అవకాశముంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ వ్యయ నియంత్రణ ప్రతిపాదనల్లో భాగంగా ప్రభు త్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. సోమాలియా, ఇరాన్ దేశాల్లోనూ అమెరికా తన ప్రాధాన్యాన్ని తగ్గించుకోనుంది.