embassies
-
ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి బెదిరింపులకు దిగింది. ఆ తర్వాత ఇప్పుడూ కీవ్ రాయబార కార్యాలయాలకు జంతువులు కళ్లు, నెత్తుటితో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను పంపుతోంది రష్యా. ఈ మేరకు హంగేరి, నెదర్లాండ్స్, పోలాండ్, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని కీవ్ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన బ్లడ్ ప్యాకేజీలను రష్యా పంపినట్లు సమాచారం. అదీగాక వాటికన్లోని ఉక్రెయిన్ రాయబారి కార్యాలయం తలుపులను ధ్వసం చేసి అక్కడ మానవ మలం వదిలి వేసినట్లు ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే కజకిస్తాన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్‌లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్‌ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. ఉక్రెయిన్ ఎప్పుడూ సదా అప్రమత్తంగానే ఉంటుంది. అలాగే ఈ రాయబార కార్యాలయాలు సదా ఉక్రెయిన్ గెలుపు కోసం సమర్థవంతంగా పని చేస్తూనే ఉంటాయి అని నొక్కి చెప్పారు. ఐతే రష్యా రాయబార కార్యాలయాలు ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. -
ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?
Ukrainian Woman Confronts Russian Soldiers: రష్యా దళాలు గురువారం ఉక్రెయిన్ సరిహద్దును దాటి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవి ఇప్పుడు రాజధాని కైవ్‌కు సమీపంలో ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి వీధుల్లోకి ప్రవేశించడంతో ఉక్రెనియన్లు రష్యా దాడిని ఖండిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా విస్తృత నిరసనలు చేపట్టారు. టోక్యో నుంచి న్యూయార్క్ వరకు రష్యా కార్యాలయలు వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు సైతం సైనిక దుస్తులతో యుద్థ రంగంలోకి వెళ్లి తమ సైనికులకు ధైర్యాన్ని నింపడమే కాక తాను సైతం రష్యా బలగాలతో తలపడుతున్నాడు. ఇంకో వైపు ఆ దేశపు మహిళలు సైతం తాము కూడా తమ దేశం కోసం ఏం చేయడానికైన సిద్ధం అంటున్నారు. ఈ మేరకు రాజధానికి సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్‌లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఒక ఉక్రెయిన్ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ మాత్రం బెరుకు లేకుండా మా దేశంలో ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. తుపాకులు, పెద్ద మెషిన్ గన్లు పట్టుకున్న ఆ సైనికులు నివ్వెరపోయాలా ఆక్రోసించింది. దీంతో వారు ఆ మహిళతో ఇక్కడ ఏం జరగటం లేదంటూ..ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఏ మాత్రం ఖాతరు చేయకుండా మీకు ఇక్కడేం పని అంటూ గర్జించింది. దెబ్బకు ఆ రష్యా సైన్యం తాము ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండి అని వాళ్లు సున్నితంగా చెబుతున్న ఆమె లక్ష్యపెట్టలేదు. పైగా ఈ భూమి పై మీకు ఏం దొరకదు. కనీసం ఈ గింజలైన తీసుకుని జేబులో పెట్టుకోండి. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు కనీసం ఆ పొద్దుతిరుగుడు పువ్వులు అయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి నిష్క్రమించింది. పొద్దు తిరుగుడు పువ్వు ఉక్రెయిన్ జాతీయ పుష్పం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సైనికులను చూసి ఏ మాత్రం భయపడకుండా నిలబడిన "నిర్భయ", ఆమెను తమ దేశ దళాలతో మాట్లాడమని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ బలగాలను ధైర్యంగా పోరాడేలా చేయగల సమర్థురాలు అని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. Woman in Henichesk confronts Russian military. “Why the fuck did you come here ? No one wants you!” 🤣#Russia #Ukraine #Putin pic.twitter.com/wTz9D9U6jQ — Intel Rogue (@IntelRogue) February 24, 2022 (చదవండి: చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!) -
బ్రిటిష్ దౌత్యాధికారుల్ని బహిష్కరించిన రష్యా
మాస్కో: రష్యాకు చెందిన 23 మంది దౌత్యాధికారుల్ని బ్రిటన్ బహిష్కరించడంపై పుతిన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇందుకు ప్రతిగా మాస్కోలోని 23 మంది బ్రిటిష్ దౌత్యాధికారుల్ని రష్యా బహిష్కరించింది. వీరంతా వారం రోజుల్లోగా మాస్కో నుంచి వెళ్లిపోవాలని రష్యా విదేశాంగశాఖ శనివారం ఓ ప్రకటన జారీచేసింది. అంతేకాకుండా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బ్రిటిష్ కాన్సుల్‌ను మూసివేయాలని రష్యా ఆదేశించింది. ఈ మేరకు మాస్కోలోని బ్రిటిష్ రాయబారి లౌరీ బ్రిస్టోను పిలిపించుకున్న రష్యా విదేశాంగశాఖ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించింది. -
తెరుచుకోనున్న యూఎస్ దౌత్య కార్యాలయాలు
మధ్య ప్రాచ్య దేశాల్లో తత్కాలికంగా మూసివేసిన రాయబార కార్యాలయాలు ఆదివారం నుంచి తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. ఈ మేరకు నిన్న ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి శనివారం వెల్లడించారు. కాగా యెమెన్ రాజధాని సనాలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని మాత్రం తెరవడం లేదని తెలిపింది. అలాగే పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాల్లోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేయాలని ఒబామా ప్రభుత్వం ఆదేశించిన సంగతిని ఈ సందర్భంగా ఆ అధికారి గుర్తు చేశారు. అలాగే కార్యాలయ సిబ్బంది స్వదేశానికి సాధ్యమైనంత త్వరగా తరలిరావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని యూఎస్ దౌత్య కార్యాలయాలపై తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా దాడుల చేయనున్నట్లు అమెరికా నిఘా సంస్థకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఒబామా ప్రభుత్వం వివిధ దేశాల్లోని దాదాపు 25పైగా యూఎస్ దౌత్య కార్యాలయాను ఈ వారం మొదట్లో మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే యెమెన్ దేశంలో ఆల్ ఖైదాకు చెందిన విభాగం అత్యంత వేగంగా దాడులు చేసే సూచనలు ఉన్నాయని యూఎస్ నిఘా వర్గాలకు సమాచారం చేరింది. దీంతో ఆ దేశ రాజధాని సనాలోని రాయబార కార్యాలయాన్ని ఇప్పుడు అప్పుడే తెరిచే ఆలోచనను యూఎస్ పక్కన పెట్టింది.