బ్రిటిష్‌ దౌత్యాధికారుల్ని బహిష్కరించిన రష్యా | Russia says it will expel British diplomats from Moscow | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ దౌత్యాధికారుల్ని బహిష్కరించిన రష్యా

Published Sun, Mar 18 2018 3:41 AM | Last Updated on Sun, Mar 18 2018 3:41 AM

Russia says it will expel British diplomats from Moscow - Sakshi

పుతిన్‌

మాస్కో: రష్యాకు చెందిన 23 మంది దౌత్యాధికారుల్ని బ్రిటన్‌ బహిష్కరించడంపై పుతిన్‌ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇందుకు ప్రతిగా మాస్కోలోని 23 మంది బ్రిటిష్‌ దౌత్యాధికారుల్ని రష్యా బహిష్కరించింది. వీరంతా వారం రోజుల్లోగా మాస్కో నుంచి వెళ్లిపోవాలని రష్యా విదేశాంగశాఖ శనివారం ఓ ప్రకటన జారీచేసింది. అంతేకాకుండా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని బ్రిటిష్‌ కాన్సుల్‌ను మూసివేయాలని రష్యా ఆదేశించింది. ఈ మేరకు మాస్కోలోని బ్రిటిష్‌ రాయబారి లౌరీ బ్రిస్టోను పిలిపించుకున్న రష్యా విదేశాంగశాఖ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement