closure
-
హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోట్లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్లో వివరాలు తెలియజేశారు.‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావంహిండెన్బర్గ్ గురించి..నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్‌లో మోసం చేసిందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. -
ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
టెల్ అవీవ్: తమ దేశంలో అల్–జజీరా మీడియా సంస్థకు చెందిన స్థానిక కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెప్పారు. అల్–జజీరా ఆఫీసులను ఎప్పటినుంచి మూసివేస్తారన్నది వెల్లడించారు. ఇది తాత్కాలిమా? శాశ్వతమా? అనేది బయటపెట్టలేదు.ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ అల్–జజీరా గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులను మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలకు ఖతార్ చొరవ చూపుతోంది. ఇరువర్గాలను ఒప్పించేందుకు ప్రయతి్నస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్‌కు చెందిన మీడియా సంస్థ కార్యాలయాలను మూసివేస్తూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
జనసేన దుకాణం క్లోజ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం. ఓ పక్క పొత్తుల్లో అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండటంతో స్థానిక నేతలందరూ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పారీ్టలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ ఉండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచి్చన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్‌రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. నేతలెవ్వరూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం. ఇది రెండోసారి జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతుబజార్ సమీపంలోని అపార్టుమెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
రాజన్న సిరిసిల్లలో పవర్ లూమ్స్ పరిశ్రమ బంద్
-
భారత్‌లో అఫ్తాన్ ఎంబసీ శాశ్వతంగా మూత, కాంగ్రెస్ రియాక్షన్
Afghanistan Embassy అఫ్ఘానిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని న్యూఢిల్లీ తన రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సెప్టెంబర్ 30న ఎంబసీ చేసిన ప్రకటన తరువాత తాజా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నుండి నిరంతర సవాళ్లను ఉటంకిస్తూ న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు భారతదేశంలోని అఫ్ఘానిస్తాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. నవంబర్ 23 నుండి అమల్లో ఉంటుందని తెలిపింది. దురదృష్టవశాత్తు, ఎనిమిది వారాల నిరీక్షంచినప్పటికీ దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు , భారత ప్రభుత్వ ప్రవర్తనలో మార్పు లేదని తెలిపింది కాంగ్రెస్ రియాక్షన్ ఈ ప్రకటన తరువాత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ మనీష్ తివారీ బీజేపీపై విమర్శలకు దిగారు. అధికార బీజేపీ సహాయనిరాకరణ కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇది స్పష్టంగా కాబూల్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నమని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఎపుడూ నైతికత విలువలకు, సూత్రాలకు కట్టుబడి ఉందన్నారు. The closure of the Embassy of Afghanistan in New Delhi is an attempt by the NDA/ BJP Government to appease the Taliban. Listen in 👇🏾 https://t.co/7x2Wkhk2J9 — Manish Tewari (@ManishTewari) November 24, 2023 -
పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
భారత్‌లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత
న్యూఢిల్లీ: భారత్‌లో రాయబార కార్యాలయాన్ని అఫ్గానిస్థాన్ మూసివేసింది. ఆదివారం నుంచి కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌లో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత భారత్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వనరుల కొరత, సిబ్బంది కొరతతో దౌత్య కార్యాలయాన్ని నిర్వహించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పనిలో పనిగా భారత్‌పై కూడా ఆరోపణలు గుప్పించింది. భారత ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా రాయ బార కార్యాలయాన్ని మూసివేయడానికి కారణమని ఆ ప్రకటనలో పేర్కొంది. భారత్ సహా ఎన్నో దేశాలు అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించడం లేదని వాపోయింది. -
జీఎస్టీ దెబ్బ: కనుమరుగవుతున్న హవాయి చెప్పులు..
పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ధరించే హవాయి చెప్పులు జీఎస్టీ దెబ్బకు కనుమరుగవుతున్నాయి. పెరిగిన జీఎస్టీతో వందలాది తయారీ కేంద్రాలు మూతపడుతున్నాయి. జీఎస్టీ పెంపు కారణంగా దాదాపు 325 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు మూతపడ్డాయని జలంధర్ రబ్బర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెలిపింది. ఏడేళ్ల క్రితం ఒక్క జలంధర్‌లోనే 400 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు ఎంఎస్ఎంఈ పరిశ్రమలుగా ఉండేవి. జీఎస్టీని పెంచడం, అదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వీటిలో దాదాపు 325 యూనిట్లు మూతపడ్డాయని అసోసియేషన్ పేర్కొంటోంది. జీఎస్టీ పెంపే కారణం హవాయి చెప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడమే యూనిట్ల మూసివేతకు కారణమని ఆయా పారిశ్రమల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. జలంధర్ రబ్బర్ గూడ్స్ తయారీదారుల సంఘం కార్యదర్శి రాకేష్ బెహల్ మాట్లాడుతూ.. ‘2017 జూలై 1న జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న పాదరక్షలు, వస్త్రాలను 5 శాతం జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచాలని నిర్ణయించారు. ఆ తరువాత జీఎస్టీ 7 శాతం పెంచి 12 శాతం శ్లాబ్ కిందకు చేర్చారు. దీని ప్రభావం దేశవ్యాప్తంగా హవాయి చప్పల డిమాండ్, సరఫరాపై తీవ్రంగా పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై వ్యాట్ రేటు చాలా రాష్ట్రాల్లో సున్నా లేదా కొన్ని రాష్ట్రాల్లో 0.5 శాతం ఉండేది. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ధరించే తక్కువ ధర హవాయి చప్పలపై 12 శాతం జీఎస్టీ అస్సలు సమర్థనీయం కాదని, వెంటిలేటర్‌పై ఉన్న హవాయి చెప్పుల పరిశ్రమను బతికించాలని పరిశ్రమల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదీ చదవండి: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! -
తెగని టికెట్లు.. ద.మ. రైల్వే కీలక నిర్ణయం.. 23 రైల్వేస్టేషన్ల మూసివేత
ఏలూరు (టూటౌన్): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 23 స్టేషన్లు మూతపడ్డాయి. ఇప్పటికే ఈ స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని చాలా వరకు ఇతర రైల్వే స్టేషన్లకు సర్దుబాటు చేశారు. రవాణా సాధనాలు పెరగడం, రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే స్టేషన్లు మినహా ప్యాసింజర్ రైళ్లు ఆగే వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. మూసివేతకు కారణాలివీ.. కనీసం రోజుకు 25 మంది ప్రయాణికులు కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లను మూసివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రోజుకు ఒకటి, రెండు టికెట్లు మాత్రమే అమ్ముడవుతున్న చోట్ల బుకింగ్స్ నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. మూసివేసిన స్టేషన్లు ఇవే.. మే 1వ తేదీ విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్ఎస్జీ–6 కేటగిరీలో ఉన్న 16 స్టేషన్ల మూసివేతకు తొలుత డ్రా‹ఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యంతరాలేవీ రాకపోవడంతో అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, పెద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీ వెంకటేశ్వరపాలెం, తాలమంచి, తేలప్రోలు, వట్లూరు రైల్వే స్టేషన్లను మూసివేశారు. జూన్ 1 నుంచి 7 రైల్వేస్టేషన్లను మూసివేయగా.. ఆ జాబితాలో కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్రు స్టేషన్లు ఉన్నాయి. -
భక్తులకు అలర్ట్.. ఈ నెల 25న దుర్గగుడి మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఈ నెల 25వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంతోపాటు అన్ని ఉపాలయాలను మూసివేస్తామని ఆలయ వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గమ్మ దర్శనం నిలిపివేయడంతోపాటు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు. చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తిరిగి 26 ఉదయం ఆరు గంటలకు దుర్గగుడి తెరుస్తామని, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మహా నివేదన సమర్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.10 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 26వ తేదీన తెల్లవారుజాముతోపాటు ఉదయం జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. -
ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసుల మూసివేత
న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీలో కరోనా పడగ విప్పడంతో ప్రైవేటు కార్యాలయాన్ని మూసివేశారు. అత్యవసర ఆఫీసులు మినహాయించి అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ప్రైవేటు ఆఫీసుల్లో 50% సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబ్బంది అందరికీ ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాలంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 23 శాతం దాటింది. దేశంలో గత 24 గంటల్లో 1,68,063 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64% ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 8.85 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల విజృంభణతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ పరిస్థితులని సమీక్షించడానికి గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో ఈసారి మకర సంక్రాంతికి గంగానది జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. లతా మంగేష్కర్‌కు కరోనా ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు (92) కరోనా సోకింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బంధువులు చెప్పారు. ‘లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ లత‡ వయసును (92 ఏళ్లు) దృష్టిలో ఉంచుకొని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలని వైద్యులు మాకు సూచించారు’ అని ఆమె మేనకోడలు రచన చెప్పారు. లత కోలుకోవడానికి వారం రోజులు పడుతుందని వైద్యులు చెప్పినట్టుగా రచన తెలిపారు. లత కరోనా మొదటి వేవ్‌లోనూ వైరస్ బారినపడి కోలుకున్నారు. -
‘సర్.. నాకు ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి! మంచిదేనా?’
Banking Tips: ఇవాళ రేపు అవసరానికో బ్యాంక్ ఖాతా తెరవాల్సి వస్తోంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటున్నవాళ్లు చాలామందే ఉంటున్నారు. అయితే ఇలా ఎక్కువగా కలిగి ఉండడం వల్ల లాభం కంటే.. ఇబ్బందులే ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఖాతాదారుడికి తెలియకుండానే డబ్బును పొగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే అవసరం లేని అకౌంట్లను క్లోజ్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు బ్యాంకింగ్ నిపుణులు. ‘మినిమమ్’ ట్రబుల్ ఎక్కువ ఖాతాలు ఉంటే.. వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. అన్ని ఖాతాల్లో ఎంతో కొంత డబ్బును డిపాజిట్ చేయాలి. ప్రధాన బ్యాంకుల్లో అకౌంట్లలో(జీరో బ్యాలెన్స్ అకౌంట్లు మినహాయించి) మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు వెయ్యి, మూడు, ఐదు వేలు, పది వేలు ఇలా ఉంటోంది. ఉదాహరణకు.. ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే.. పది, పాతిక, యాభై.. ఇలా వేల రూపాయల్లో డబ్బును ఖాతాల్లో ‘మినిమమ్ బ్యాలెన్స్’ రూపంలో ఉంచాల్సి వస్తుంది. ఇదికాకుండా ఇతర ఛార్జీల వసూలు ఉంటుంది. ఇలా ఎలా చూసినా ఇబ్బందే!. శాలరీ అకౌంట్లే ఎక్కువ! బ్యాంకులు స్టూడెంట్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లుగా ‘జీరో బ్యాలెన్స్’ అకౌంట్లతో టార్గెట్లను పూర్తి చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు.. మరో అకౌంట్‌కు ఎక్కువగా మారిపోవాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో బద్ధకాన్ని వదిలి బ్యాంకులకు వెళ్లి పాత బ్యాంక్ ఖాతాను(అవసరం లేకుంటే) మూసివేయడమే మంచిది. ఎందుకంటే శాలరీ అకౌంట్లు, జీరో బ్యాలెన్స్ అకౌంట్లో చాలాకాలం డిపాజిట్ చేయకుండా ఉంటే.. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌కు మారిపోతాయి. అప్పుడు కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెయింటెన్ చేయకపోతే.. సర్ ఛార్జీలు పడుతూనే పోతుంటాయి. ఒకానొక దశకు వచ్చేసరికి అవి వేల రూపాయల్లోకి కూడా కూడా చేరుకోవచ్చు!!. ఐటీ రిటర్న్స్ టైంలో.. కొన్ని అకౌంట్లు సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతాయి. బ్యాంకులు వాటిని మూసేయవు. కాకపోతే ఎక్కువ కాలం ట్రాన్జాక్షన్స్ జరగని అకౌంట్లను సాధారణంగా కొన్ని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. ఒకవేళ ఆ అకౌంట్లను తిరిగి ఉపయోగించుకోవాలనుకుంటే(యాక్టివేషన్ కోసం) రాతపూర్వకంగా రిక్వెస్ట్ లెటర్‌తో బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా సేవింగ్స్ ఖాతాల్లో(అవసరం లేనివి, పెద్దగా ఉపయోగించని అకౌంట్లు) మినిమమ్ బ్యాలెన్స్‌తో ఎలాంటి రాబడీ రాకపోగా, ఆదాయ పన్ను రిటర్నుల సమయంలో అన్ని ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే వాటి నుంచి డబ్బు సర్‌ఛార్జీల రూపంలో కట్ అయినప్పుడల్లా.. మరింత డిపాజిట్ జమ చేయాల్సి ఉంటుంది. ఇక కార్డుల మెయింటెనెన్స్, ఏటీఎం ఛార్జీలు, మొబైల్ అలర్టు అంటూ పడే ఛార్జీల సంగతి సరేసరి!. ఇలా చేస్తే బెటర్ ఒక వ్యక్తికి సగటున శాలరీ అకౌంట్, అవసరాలకు తగ్గట్లు పర్మినెంట్ అకౌంట్లు, ఉమ్మడి ఖాతాలు ఉంటే చాలు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు మారుతుంటాయి. వీలుంటే ఉద్యోగం మారినా.. పర్మినెంట్ అకౌంట్‌నే శాలరీ అకౌంట్‌గా మార్చేసుకునే ప్రయత్నం చేయాలి. కొత్త ఖాతాకి వెళ్లినప్పుడు మాత్రం.. అవసరం లేని పాత ఖాతాల్ని మూసేయడం మంచిది. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ల విషయంలోనూ పాత అకౌంట్లను క్లోజ్ చేసి.. కొత్త అకౌంట్లకు షిఫ్ట్ చేయడం వల్ల ఒక అదనపు అకౌంట్‌ను మెయింటెన్ చేయాల్సిన బాధ తప్పుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్రత్యేకంగా ఖాతాలు తీసుకోకుండా.. పర్మినెంట్ అకౌంట్‌నే ఉపయోగించాలి. బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీలు వస్తాయన్నది తెలిసిందే. కానీ, ఖాతాదారుడు అన్ని ఖాతాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండలేడుగా!. కాబట్టే.. అవసరాలకు తగ్గట్లు రెండు లేదా మూడు అకౌంట్ల కంటే ఎక్కువ కలిగి ఉండకపోవడమే మంచిదని ఆర్థిక సలహాదారులు చెప్తున్నారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు సింగిల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే పని తేలిక అవుతుంది. వీటికి తోడు బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, పాస్ వర్డ్‌లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవహారాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. -
చమన్ బోర్డర్‌ను మూసేసిన పాక్
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌తో ఉన్న కీలక సరిహద్దు చమన్ క్రాసింగ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు గురువారం పాకిస్తాన్ ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన భయంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సరిహద్దులు దాటి వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారని జియో న్యూస్ తెలిపింది. పాక్ బాట పట్టిన వేలాదిమంది అఫ్గాన్లు ఇప్పటికే చమన్ వద్ద పడిగాపులు కాస్తుండగా, వీరందరినీ తాము అనుమతించే పరిస్థితుల్లో లేమని పాక్ అధికారులు అంటున్నారు. సరిహద్దుల్లో ఆంక్షలు సడలిస్తే 10 లక్షల మందైనా అఫ్గాన్లు వచ్చే అవకాశం ఉందని పాక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో 90% వరకు ఫెన్సింగ్ ఉంది. 12 చోట్ల ఏర్పాటు చేసిన చెక్పాయింట్ల ద్వారా సరైన ప్రయాణ పత్రాలున్న వారినే ప్రస్తుతం పాక్‌లోకి అనుమతిస్తున్నారు. -
కరోనా ఎఫెక్ట్: ఏపీలో జూ పార్క్‌లు మూసివేత
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్‌ల్లో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది. ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ.. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపట్నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. మధ్యాహ్నం 12 తరువాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. చదవండి: తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన.. తెరిచి చూస్తే షాక్.. రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
లాంబ్రెటా కంపెనీ ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: లాంబ్రెటా.. విజయ్ సూపర్ .. కొన్ని దశాబ్దాల క్రితం స్కూటర్లకు పర్యాయపదంగా నిల్చాయీ బ్రాండ్లు. అప్పట్లో ఓ ఊపు ఊపిన లాంబ్రెటా స్కూటర్లంటే ఇప్పటికీ ఒక వింటేజ్ బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమేణా లాంబ్రెటా, విజయ్ సూపర్ ఇతర వాహనాల పోటీ దెబ్బకు కనుమరుగయ్యాయి. ఇప్పుడిక వీటిని తయారు చేసిన కంపెనీ స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) వంతు వచ్చింది. నష్టాల భారంతో కుదేలవుతున్న ఎస్ఐఎల్ను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో దీన్ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. మూసివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తదుపరి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదన ప్రకారం స్కూటర్స్ ఇండియా బ్రాండ్ పేరును విడిగా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ ముందు ఉంచిన ప్రణాళిక ప్రకారం కంపెనీ మూసివేతకు రూ. 65.12 కోట్లు అవసరమయ్యే నిధులను రుణం కింద కేంద్రం సమకూర్చాలి. తగు స్థాయిలో నిధులు సమకూరిన తర్వాత అదనంగా ఉన్న రెగ్యులర్ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును (వీఆర్ఎస్/వీఎస్ఎస్) ఆఫర్ చేయనున్నారు. లక్నో కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్కూటర్స్ ఇండియాలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన 147.49 ఎకరాల స్థలాన్ని పరస్పర ఆమోదయోగ్య రేటు ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి ప్రాధికార సంస్థకు అప్పజెబుతారు. ఇక, స్టాక్ ఎ క్సే్చంజీల నుంచి షేర్లను కూడా డీలిస్ట్ చేయాల్సి ఉంటుంది. 1972 నుంచి.. స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) 1972లో ఏర్పాటైంది. వివిధ రకాల ఇంధనాలతో పనిచేసే త్రిచక్ర వాహనాల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ కోసం దీన్ని నెలకొల్పారు. 1975లో దేశీ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్‌తోనూ, విదేశీ మార్కెట్ల కోసం లాంబ్రెటా పేరుతోనూ ఎస్ఐఎల్ స్కూటర్లను తయారు చేయడం మొదలు పెట్టింది. అటు పైన విక్రమ్/లాంబ్రో పేరిట త్రిచక్ర వాహనాలను కూడా ఉత్పత్తి చేసింది. 1997లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన ఎస్ఐఎల్ .. విక్రమ్ బ్రాండు కింద వివిధ త్రిచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుండటంతో కేంద్రం గతంలో దీన్ని విక్రయించే ప్రయత్నాలు చేసింది. యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు తనకున్న పూర్తి వాటాలను విక్రయించేందుకు 2018 లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. కానీ, విక్రయ యత్నాలు కుదరకపోవడంతో చివరికి మూసివేత నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు ఐఐటీలో కరోనా కలకలం చెలరేగింది.100 మందికిపైగా విద్యార్థులకు కోవిడ్ సోకడంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసుని తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం 104 మంది విద్యార్థులకు కోవిడ్ సోకగా, అందరి పరిస్థితీ నిలకడగానే ఉన్నట్టు తమిళనాడు హెల్త్ సెక్రటరీ జె.రాధాకృష్ణన్ చెప్పారు. మొత్తం 444 శాంపిల్స్ పరీక్షించగా అందులో 104 మందికి కోవిడ్ పాజిటివ్ నమోదయ్యింది. ముఖ్యమంత్రి పళని స్వామి ఆదేశాల మేరకు వీరందరికీ, కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్‌లో చికిత్సనందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్లను, ప్రయోగశాలలను మూసివేసినట్లు ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం కేవలం 700 మంది విద్యార్థులు, ప్రధానంగా రీసెర్చ్ స్కాలర్స్ మాత్రమే తొమ్మిది హాస్టల్స్‌లో ఉన్నారని, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. విద్యార్థులను వారి వారి గదులకే పరిమితం కావాలని, క్వారంటైన్లో ఉండాలని సూచించారు. విద్యార్థుల గదులకే ప్యాకెట్లలో ఆహారాన్ని అందజేస్తున్నారు. తమిళనాడులోని అన్ని కాలేజీల్లో పీజీ రెండో సంవత్సరం, పీహెచ్డీ విద్యార్థులకు ఈనెల 2వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 7 నుంచి తరగతులు ఆరంభం అయ్యాయి. ఐఐటీలోని 66 మంది పీహెచ్డీ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. సోమవారం నాటికి ఈ సంఖ్య 104కి చేరింది. హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకడంతో ఐఐటీ ప్రాంగణంలోని అన్ని విభాగాలు, లైబ్రరీలు, క్యాంటీన్లను మూసివేస్తున్నట్లు రిజిస్ట్రార్ సోమవారం ఒక సర్క్యులర్ జారీచేశారు. అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్టు డైరెక్టర్లు, పీహెచ్డీ విద్యార్థులు వర్క్ ఫ్రం హోం పాటించాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ సోమవారం ఐఐటీకి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. -
ఆ కాలేజీలకు మంగళమేనా?
సాక్షి, అమరావతి బ్యూరో: గతంలో ఒక వెలుగు వెలిగిన ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుతం ఒక్కోటిగా కనుమరుగవుతున్నాయి. ఇంజినీరింగ్ చేసినా పెద్దగా ఉపాధి అవకాశాలు లేక సాధారణ డిగ్రీ వైపు విద్యార్థులు మొగ్గు చూపుతుండటం, గతంతో పోలి్చతే కళాశాలల స్థితిగతులు, విద్యార్థులు, లెక్చరర్ల సంఖ్యపై ప్రభుత్వం నిఘా పెంచటంతో కళాశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 40 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా అందులో ఆరు నుంచి ఏడు కళాశాలల్లో ఆడ్మిషన్ల సంఖ్య 25 శాతం కన్నా తక్కువగా ఉంటోంది. వాటిలో కొన్ని కోర్సుల్లో చేతి వేళ్లతో లెక్కగట్టేలా విద్యార్థులు చేరుతున్నారు. ఇటువంటి కళాశాలలు ఈ ఏడాది ఆడ్మిషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు, నాణ్యత లేని కళాశాలల గుర్తింపు రద్దు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. (చదవండి: హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలట!) జిల్లాలో ఆరు కళాశాలలపై వేటు? గుంటూరు జిల్లా పరిధిలో 40 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల కోర్సులు కలుపుకొని 16,910 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరు కళాశాలలు 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు పొందుతున్నాయని సమాచారం. ఈ కళాశాలల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేకపోవటంతో వీటిలో విద్యార్థులు చేరటానికి ఇష్టపడటం లేదు. గత నాలుగైదేళ్లుగా ఈ కళాశాలలు కనీస స్థాయిలో ఆడ్మిషన్లు పొందటానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులకు ఎదురుతాయిలాలు ఇచ్చి మరీ ప్రవేశాలు పొందుతున్నాయి. అందుకోసం “మా కాలేజీలో చేరండి లాప్‌ట్యాప్ ఉచితం. ల్యాబ్ ఫీజు పూర్తిగా రద్దు, బస్ ఫీజు నామమాత్రంగా వసూలు చేస్తాం. హాస్టల్ ఫీజు భారీగా తగ్గిస్తాం...మీకు ఏమైనా డిమాండ్లు ఉంటే చెప్పండి తీరుస్తాం.’’ అంటూ ఆఫర్ల వలలు విసిరేవారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చలువతోనే వీటి మనుగడ ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని గుర్తించి 2017లో జిల్లాలో తక్కువ అడ్మిషన్లు పొందుతున్న కళాశాలల సీట్లలో కొంత మేర కోత విధించింది. జిల్లాలో ఒక్కో కళాశాలలో 60 నుంచి 200 దాకా కోత పడి సుమారు ఐదు వేల సీట్లను రద్దు చేశారు. (చదవండి: కళకళలాడుతున్న బోధనాస్పత్రులు..) తెగ విసిగించేస్తారు... ఎంసెట్ పరీక్ష ముగిసిన నాటి నుంచి ఇంటరీ్మడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు ఒకటే ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్ వస్తాయి. తమ కళాశాల ప్రత్యేకతలు, విశేషాలు వివరిస్తూ, తమ కాలేజీలో చేరమని విన్నపాలు చేస్తారు. రెండు నెలల పాటు తల్లిదండ్రులు ప్రతి రోజూ ఈ ఫోన్ కాల్స్ భరించలేక తలలు పట్టుకునే పరిస్థితి.తమ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి, కొత్తగా అధ్యాపకులుగా చేరాలన్నవారికి యాజమాన్యాలు 10 మంది విద్యార్థులను చేర్చాలన్న టార్గెట్లు పెడుతుంటాయి. దీంతో సిబ్బందికి సైతం ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే. సీట్లు తగ్గితే ప్రమాణాలు పెరిగే అవకాశం... ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న వారిలో కేవలం 60 శాతం మంది మాత్రమే కోర్సు ముగిసే సమయానికి సరి్టఫికెట్లతో బయటకు వస్తున్నారు. మిగిలిన 40 శాతం మంది బ్యాక్‌లాగ్‌లతో రెండు మూడేళ్ల పాటు కుస్తీ పడి ముగించేవారు కొందరైతే, విసిగి కాడి పడేసేవారు కొందరు. కోర్సు పూర్తి చేరసిన వారిలో కేవలం 12 నుంచి 14 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తున్నారని ఓ సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ దుస్థితికి కారణం ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ చదువులే. సీట్లు తగ్గి, వాటి నాణ్యతపై నిఘా పెడితే ప్రమాణాలు పెరిగి విద్యార్థులు కోర్సులు పూర్తి చేసి, మంచి అవకాశాలు పొందే ఆస్కారం ఉంది. -
ప్రతీకార చర్యలు ప్రారంభించిన చైనా
బీజింగ్: అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్‌ను మూసివేయించడంతో చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆగ్నేయ సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్‌ను మూసివేయాలని ఆదేశించినట్టు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘చైనా అమెరికా మధ్య సంబంధాలు ఇలా క్షీణించాలని మేము కోరుకోవడం లేదు. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం’’అని ఆ ప్రకటన పేర్కొంది. భద్రతకు భంగం కలిగిస్తున్నారు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్య ఆరోపణలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించినట్టుగానే చైనా కూడా అదే బాటలో నడిచింది. చెంగ్డూ కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇది సరైన ప్రతిస్పందనని ఆయన అన్నారు. తమ నిర్ణయం చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకి వ్యూహాత్మక ప్రాంతం చెంగ్డూలో అమెరికా కాన్సులేట్‌ని 1985లో ప్రారంభించారు. అందులో 200మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 150 మందికిపైగా స్థానికులే. సమస్యాత్మక ప్రాంతమైన టిబెట్ గురించి సమాచారాన్ని సేకరించడానికి చెంగ్డూలో కాన్సులేట్ అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. అంతేకాదు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ ఎంత పెద్దదో, ఎందరు ఉద్యోగులు ఉంటారో, సరిగ్గా చెంగ్డూలో కూడా అంతే మంది పనిచేస్తారు. వాటి ప్రాధాన్యాలు కూడా ఒకటే. తొలుత వూహాన్లో అమెరికా కాన్సులేట్ మూసివేయాలన్న ఆదేశాలిస్తారని భావించారు కానీ చెంగ్డూ అయితేనే దెబ్బకి దెబ్బ తీసినట్టు అవుతుందని చైనా ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చైనా విద్యార్థుల అరెస్ట్ వీసాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నలుగురు చైనీయులపై కేసు నమోదు చేసింది. వీరు చైనా సైన్యంలో పనిచేసినప్పటికీ, ఆ వివరాలు దాచిపెట్టి, రీసెర్చ్ కోసం అమెరికాకి వచ్చినట్టు ఆరోపించింది. ఇందులో ముగ్గురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వారు చెప్పారు. వీరందరిపై వీసా మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. నేర నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.1.88 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
అగ్ర దేశాల దౌత్య యుద్ధం
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా, చైనా మధ్య విభేదాలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనర ల్ను మూసివేయాలంటూ ట్రంప్ సర్కార్ ఆదేశిం చడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో అగ్గి రాజుకుంది. హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. అమెరికా మేధో సంపత్తిని, ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గా ఓర్టాగస్ మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే చైనా ఏ తరహా గూఢచర్యానికి దిగిందో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. దెబ్బకి దెబ్బ తీస్తాం: చైనా అమెరికా నిర్ణయం అత్యంత దారుణమైనదని, అన్యాయమైనదని చైనా విరుచుకుపడింది.. అమెరికా తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతీకార చర్యలు తప్పవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌హెచ్చరించారు. కాన్సులేట్ జనరల్‌లో మంటలు అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని చైనా కాన్సులేట్ జనరల్‌లో మంటలు చెలరేగాయి. కార్యాలయం ఆవరణలో చైనా ప్రతినిధులు డాక్యుమెంట్లు తగులబెట్టడంతో మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ని మూసివేయాలని ఆదేశాలు జారీ అయిన కాసేపటికే కాన్సులేట్‌లో మంటలు రేగాయి. కొన్ని కంటైనర్లు, డస్ట్ బిన్స్‌లో డాక్యుమెంట్లు వేసి తగులబెట్టడంతో మంటలు చెలరేగిన వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ అయ్యాయి. మంటలు ఆర్పడానికి వెళ్లే అగ్నిమాపక సిబ్బందికి కాన్సులేట్ అధికారులు అనుమతినివ్వలేదని పోలీసులు తెలిపారు. ఎందుకీ మూసివేత! అమెరికా, చైనా మధ్య కోవిడ్ వ్యాక్సిన్ అధ్యయనాల హ్యాకింగ్ చిచ్చు కాన్సులేట్ మూసివేతకు ఆదేశాల వరకు వెళ్లినట్టుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అధ్యయన వివరాలను తస్కరించారంటూ అమెరికా న్యాయశాఖ ఇద్దరు చైనా జాతీయుల్ని వేలెత్తి చూపిన రోజే హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అమెరికాలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అధ్యయనాలను తస్కరించడానికి ప్రయత్నించారని అమెరికా ఆరోపిస్తోంది. -
ఏవీయం రాజేశ్వరికి లాక్
చెన్నైలోని వడపళని ఏరియాలో గల ఏవీయం రాజేశ్వరి థియేటర్లో సినిమా చూసినవాళ్లకు ఓ చేదు వార్త. ఈ స్టూడియోకి లాక్ పడబోతోంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్.. ఆ తర్వాత శివకుమార్, జయశంకర్, ఆ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్, ఆ తర్వాత కార్తీక్, శివాజీ తనయుడు ప్రభు నుంచి ఆ తర్వాతి తరం శివకుమార్ తనయుడు సూర్య, అజిత్... ఇలా మూడు నాలుగు తరాల హీరోలతో పాటు నాలుగు తరాల హీరోయిన్లనూ చూపించిన ఈ తెరకు తెరపడనుండటం అంటే చిన్న విషయం కాదు. దివంగత లెజెండ్రీ ప్రొడ్యూసర్, ఏవీయం స్టూడియోస్ ఫౌండర్ ఏవీ మెయ్యప్ప చెట్టియార్ (ఏవీయం చెట్టియార్) తన సతీమణి ఏవీయం రాజేశ్వరి పేరు మీద ఈ థియేటర్ కట్టించారు. 1979లో ఆరంభమైన ఈ థియేటర్ నిరాటంకంగా సినిమాలు ప్రదర్శిస్తూ వచ్చింది. చెట్టియార్ మరణం తర్వాత ఆయన వారసులు థియేటర్ నిర్వహణను చూసుకుంటున్నారు. ఇప్పుడు కోవిడ్ 19 కారణంగా థియేటర్లు మూతబడిన నేపథ్యంలో థియేటర్ల యజమాన్యానికి నష్టం వాటిల్లింది. మళ్లీ థియేటర్లు ఓపెన్ చేశాక ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం కూడా ఉంది. అందుకే ‘ఏవీయం రాజేశ్వరి’ థియేటర్ని పర్మినెంట్‌గా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించుకుందట. తక్కువ ధరకు టికెట్స్, మినిమమ్ పార్కింగ్ చార్జీలు, థియేటర్ ఫుడ్ స్టాల్స్‌లో తక్కువ ధరకే తినుబండారాలు.. ఇలా ఆడియన్స్ ఫ్రెండ్లీ థియేటర్‌గా ఏవీయంకి పేరుంది. అలాగే చెన్నై వాషర్‌మేన్‌పేట్‌లో గల మహారాణి థియేటర్ కూడా మూతపడనుందట. మరి.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో మరెన్ని థియేటర్లు మూతబడతాయో చూడాలి. -
చారిత్రక జామా మసీదు మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరిగిన క్రమంలో చారిత్రక జామా మసీదును గురువారం రాత్రి 8 గంటల నుంచి జూన్ 30 వరకూ మూసివేస్తున్నట్టు మసీదు షహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారి వెల్లడించారు. మసీదును తిరిగితెరిచిన మూడు రోజుల అనంతరం మూసివేత నిర్ణయం తీసుకున్నారు. సప్థర్జంగ్ ఆస్పత్రిలో తన కార్యదర్శి అమానుల్లా కరోనా మహమ్మారితో మరణించిన రెండు రోజుల తర్వాత షహీ ఇమాం మసీదు మూసివేత నిర్ణయం ప్రకటించారు. జూన్ 3న కరోనా వైరస్‌తో బాధపడుతూ అమానుల్లా ఆస్పత్రిలో చేరారు. దేశంలో కోవిడ్-19 కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా కొంతకాలం పాటు మసీదులను మూసివేయాలని బుఖారీ విజ్ఞప్తి చేశారు. మసీదులకు వెళ్లకుండా ప్రజలు ఇంటి వద్దే నమాజ్ చేసుకునేలా ఇతర మసీదులు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రెండు నెలల తర్వాత సోమవారం జామా మసీదు గేట్లు తెరుచుకున్నాయి. చదవండి : అమిత్ షాతో కేజ్రీవాల్ భేటీ -
హైకోర్టు ఉత్తర్వులు : మద్యం షాపులు మూసివేత
చెన్నై : తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మద్యాన్ని కేవలం ఆన్లైన్లోనే విక్రయించాలని స్పష్టం చేసింది. మే 17 వరకే ఆన్లైన్లో లిక్కర్ విక్రయాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమిళనాడులో తొలిరోజు మద్యం విక్రయాలు రికార్డు స్దాయిలో రూ 170 కోట్ల మేర సాగాయి. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 600 కోవిడ్-19 తాజా కేసులు వెలుగుచూశాయి. వీరిలో 399 మంది చెన్నై నగరానికి చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. చదవండి : వైన్ షాపులో రకుల్: ఇందులో నిజమెంత? -
‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ, అకస్మాత్తుగా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ప్రభుత్వం నుంచి ప్యాకేజీ మరింత ఆలస్యమవుతుండటం, గిలీడ్ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలనివ్వడం లేదన్న వార్తలు, కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలకు మించిన ప్రభావమే ఉండనున్నదన్న ఆందోళన, గత రెండు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర లాభపడటంతో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం....ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 536 పాయింట్లు క్షీణించి 31,327 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయి 9,154 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం మేర లాభపడటంతో నష్టాలకు కళ్లెం పడింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల మేర నష్టపోయాయి. సెంటిమెంట్‌పై ‘టెంపుల్టన్’ దెబ్బ.... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఆరు డెట్ స్కీమ్‌లను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. కరోనా వైరస్ కల్లోలానికి, లాక్‌డౌన్‌కు ఇప్పట్లో ఉపశమనం లభించే సూచనలు కనిపించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు 1–2%, యూరప్ మార్కెట్లు ఇదే రేంజ్ నష్టపోయాయి. ఫార్మా షేర్ల పరుగులు.... ఫార్మా షేర్ల పరుగులు కొనసాగుతున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి వివిధ కంపెనీలకు ఆమోదాలు లభించడం, ఇటీవలే వెల్లడైన అలెంబిక్ ఫార్మా ఫలితాలు ఆరోగ్యకరంగా ఉండటం, దీనికి ప్రధాన కారణాలు. అలెంబిక్ ఫార్మా, సన్ ఫార్మా, లారస్ ల్యాబ్స్(ఈ మూడు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి) అల్కెమ్ ల్యాబ్స్, అజంతా ఫార్మా, లుపిన్, ఇప్కా ల్యాబ్స్, జుబిలంట్ లైఫ్ సైన్సెస్, ఎఫ్డీసీ తదితర షేర్లు 2–8 శాతం రేంజ్లో పెరిగాయి. ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఆర్థిక, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ రంగ షేర్లు క్షీణించాయి. నిప్పన్ ఇండియా షేర్ 18 శాతం నష్టంతో రూ.216కు, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ 6 శాతం నష్టంతో రూ.2,425కు, శ్రీరామ్ ఏఎమ్‌సీ 3 శాతం పతనమై రూ.71కు పడిపోయాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.1,976 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా రూ.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. -
ఫండ్ ఇన్వెస్టర్లకు షాక్!
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి .. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది. కనిష్ట స్థాయిలకు పడిపోయిన రేట్లకు హోల్డింగ్స్ అమ్మేయడం లేదా పెట్టుబడులపై మరిన్ని రుణాలు తెచ్చి తీర్చడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని సంస్థ భారత విభాగం ఎండీ సంజయ్ సాప్రే చెప్పారు. ఏదీ కుదిరే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పనిసరై ఆయా స్కీములను మూసివేయాల్సి వచ్చిందని వివరించారు. మూసివేతతో ఇన్వెస్టర్లపరమైన లావాదేవీలేమీ జరగకపోయినప్పటికీ .. యాజమాన్యం దృష్టికోణంలో ఇవి కొనసాగుతాయని సాప్రే చెప్పారు. మెరుగైన రేట్లకు విక్రయించి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు. ‘ఇటు మార్కెట్లు, అటు ఎకానమీ ఏ దిశ తీసుకుంటాయన్నదానిపై స్పష్టత కొరవడటంతో ఇన్వెస్టర్లకు మరిం త హాని జరిగే అవకాశముందని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంతోష్ కామత్ తెలిపారు. సుమారు 26 ఏళ్ల రీసెర్చ్ అనుభవం, 19ఏళ్లకు పైగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మె ంట్ అనుభవం కామత్‌కి ఉంది. ట్రిపుల్ ఎ కన్నా తక్కువ రేటింగ్ ఉండే బాండ్ల పెట్టుబడుల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సెబీతో సంప్రదించాకే: ‘ఆరు ఫండ్ల మూసివేత నిర్ణయం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదు. దీనిపై నియంత్రణ సంస్థ సెబీతో విస్తృతంగా చర్చలు జరిపాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం తీసుకున్న నిర్ణయం వెనుక సహేతుక కారణాలే ఉన్నాయని సెబీ కూడా భావించింది‘‡అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్ ఎండీ వివేక్ కుద్వా తెలిపారు. తమకు నిధులు అందే తీరును బట్టి ఇన్వెస్టర్లకు క్రమానుగతంగా, ’అందరికీ సమానంగా’ చెల్లింపులు జరుపుతామన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడులకు వీలైనంత ఎక్కువ విలువ సాధించడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను సాధ్యమైనంతగా పరిరక్షించడమే తమ లక్ష్యమని కుద్వా వివరించారు. ఇది టెంపుల్టన్కి మాత్రమే పరిమితం: యాంఫి 6 స్కీమ్‌ల మూసివేత అంశం కేవలం ఆయా స్కీమ్లకే పరిమితమైన దని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫి పేర్కొంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌పై దీని ప్రభావమేమీ ఉండబోదని కాన్ఫరెన్స్ కాల్లో యాంఫి చైర్మన్ నీలేశ్ షా చెప్పారు. డెట్ స్కీముల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగానే ఉన్నాయని భరోసానిచ్చారు. రూ.22.26 లక్షల కోట్లు ఈ మార్చి 31నాటికి మ్యూచువల్ ఫండ్స్ వద్ద సగటు నిర్వహణ నిధులు రూ.2.13 లక్షల కోట్లు మార్చి నెలలో ఫండ్స్(ఈక్విటీ, డెట్) నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ సెబీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి: బ్రోకింగ్ సంస్థలు టెంపుల్టన్ ఆరు డెట్ స్కీముల మూసివేతతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొందని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను, కష్టార్జితాన్ని పరిరక్షించేందు కు ఆర్థిక శాఖ, సెబీ తక్ష ణం జోక్యం చేసుకుని.. పరిస్థితి చక్కదిద్దాలని కోరింది. స మస్య మూలాల గుర్తింపునకు నిపుణుల కమిటీ వేయాలని పేర్కొంది. ఏం జరిగిందంటే.... కరోనా వైరస్ ధాటికి భారత్ సహా పలు ప్రపంచ దేశాల ఈక్విటీ, బాండ్ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. అయితే, కొనేవాళ్లు కరువవడంతో .. రేట్లు గణనీయంగా పడిపోయాయి. పైపెచ్చు తక్కువ స్థాయి రేటింగ్ ఉన్న స్క్రిప్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. బలహీన క్రెడిట్ రేటింగ్స్ ఉన్న కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వడం దాదాపు నిలిపివేశాయి. దీంతో తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల డెట్ స్క్రిప్‌లకు డిమాండ్ భారీగా పడిపోయింది. రిస్కులు ఎక్కువున్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కన్నా మిగులు నిధులను తక్కువ రాబడులు వచ్చినా రిజర్వ్ బ్యాంక్ దగ్గర సురక్షితంగా ఉంచుకునేందుకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లపై నమ్మకం సన్నగిల్లి ఈక్విటీలతో పాటు డెట్ మార్కెట్లకు దూరంగా ఉంటుండటంతో కొనుగోళ్లు తగ్గిపోయాయి. కరోనా వైరస్‌పరమైన మాంద్యం భయాలతో టెంపుల్టన్ మూసివేసిన ఆరు స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అయినకాడికి అమ్ముకునేందుకు మొగ్గుచూపారు. అయితే, మార్కెట్లో అమ్ముదామన్నా కొనేవారు కరువవడంతో మరో దారి లేక ఈ స్కీములను టెంపుల్టన్ మూసివేయాల్సి వచ్చింది. మిగతా డెట్ ఫండ్స్ మాటేంటి .. ఆరు స్కీమ్‌లు మూసివేసినంత మాత్రాన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పూర్తిగా మూతబడినట్లు కాదు. దాదాపు పాతికేళ్లకుపైగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టెంపుల్టన్ మరో ఏడు డెట్ ఫండ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నాటికి వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 17,800 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా టెంపుల్టన్ దాదాపు రూ. 36,663 కోట్ల విలువ చేసే 15 ఈక్విటీ ఫండ్స్‌ను, సుమారు రూ. 3,143 కోట్ల విలువ చేసే 11 హైబ్రిడ్ కేటగిరీ స్కీమ్‌లను (ఈక్విటీలు, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్) నిర్వహిస్తోంది (విలువలు మార్చి 31 నాటికి). ఈ ఫండ్సన్నీ యథాప్రకారం కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందరాదని సంస్థ పేర్కొంది. ఇప్పుడేంటి పరిస్థితి... స్కీములను మూసివేసినా ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కుదరదు. స్కీము వాస్తవ గడువు పూర్తయ్యేదాకా వేచి ఉండాల్సిందే. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ సంగతి తీసుకుంటే.. సగటు గడువు బట్టి చూసినప్పుడు.. ఇన్వెస్టర్ల సొమ్ము వెనక్కి రావడానికి ఏడాది పైన 73 రోజులు పట్టొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్ సగటు కాలావధి బట్టి చూస్తే ఇన్వెస్టర్లు మూడేళ్ల పైన 80 రోజులు దాకా వేచి చూడాల్సి రానుంది. ఈ స్కీములు మూతబడ్డాయి కాబట్టి వీటిల్లోకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్న వారి వాయిదాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. కానీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ (ఎస్టీపీ) కింద వీటిల్లో డబ్బు పెట్టిన వారికి మాత్రం చిక్కులు తప్పవు. సాధారణంగా చేతిలో భారీ మొత్తం సొమ్ము ఉన్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టకుండా.. ఇలాంటి డెట్ సాధనాల్లో ఉంచుతారు. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా వీటిలో కాస్త ఎక్కువ రాబడి వస్తుందనే ఆలోచన ఇందుకు కారణం. ఇక, ఈ డెట్ సాధనాల నుంచి కొంత మొత్తాన్ని విడతలవారీగా (నెలకోసారి, వారాని కోసారి లాగా) ఈక్విటీల్లోకి ఇన్వెస్టర్లు మళ్లిస్తుంటారు. ప్రస్తుతం మూతబడిన టెంపుల్టన్ స్కీముల్లో ఇలా ఎస్టీపీ కింద భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేసినవారికి కాస్త ఇబ్బంది తప్పదనేది విశ్లేషకుల మాట. -
సింగరేణి భూగర్భ గనులు మూసివేత
సాక్షి, హైదరాబాద్/ పెద్దపల్లి: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భూగర్భ గనులకు లే ఆఫ్ ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండో షిఫ్టు నుంచి మూసేయాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ వ్యాప్తంగా 27 భూగర్భ గనులు, 18 ఓసీపీలు కొనసాగుతు న్నాయి. ఇందులో పూర్తిస్థాయి యాంత్రీకరణతో సాగుతున్న ఐదు భూగర్భ గనులు, 18 ఓసీపీల్లో యథావిధిగా ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు పూనుకున్నాయి. మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. అనంతరం ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. భౌతిక దూరం పాటించడంతోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కావడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో కార్మికులు యథావిధిగా విధులు నిర్వహించడం పట్ల పలు కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకేచోట పెద్ద మొత్తంలో పని స్థలాల్లో గుమిగూడాల్సి వస్తుండటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇద్దరు సింగరేణి కార్మికులు ఉన్నట్లు ప్రచారం జరగడం.. వారు విధులకు హాజరైనట్లు తెలియడంతో మరింత గంద రగోళం నెలకొంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి యాంత్రీకరణ గనులు, ఓసీపీలను మినహాయించి భూగర్భ గనుల్లో పనులు నిలిపివేయాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ మైన్స్ సేఫ్టీ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. 22 భూగర్భ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. సింగరేణి యాజమాన్యం నిర్ణయంతో సంస్థ వ్యాప్తంగా ఉన్న 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ గనుల్లో 26,692 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అత్యవసర సిబ్బంది మినహా మిగతా కార్మికులందరికీ 1947 లేబర్ యాక్ట్ ప్రకారం సగం వేతనం చెల్లించనున్నారు. కాగా, సింగరేణి లే ఆఫ్ ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి యాంత్రీకరణ ఉన్న ఐదు గనులతో పాటు 18 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి యథావిధిగా కొనసాగనుంది. యాంత్రీకరణ ఉన్న ఐదు భూగర్భ గనులు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు, వీకే–7, శాంతిఖని, జీడీకే–11, కొండాపూర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. కాగా, సింగరేణి వ్యాప్తంగా ప్రతి రోజు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా, 22 గనుల్లో లే ఆఫ్ మూలంగా ప్రతిరోజు 15 నుంచి 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. అందుబాటులో మాస్కులు.. శానిటైజర్లు: పర్సనల్ మేనేజర్ పనిచేసే గనులు, కార్యాలయాల వద్ద శాని టై జర్లు, మాస్కులను అందుబాటులో ఉంచిన ట్టు సంస్థ పర్సనల్ మేనేజర్ ఎ.ఆనందరావు ఓ ప్రకటనలో తెలిపారు. గనులు, కార్యాల యాల ఆవరణలో శానిటైజర్లను స్ప్రే చేస్తున్నా మని, అత్యవసర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. సింగరేణి కాలనీల్లో రసాయనాల పిచికారి చేస్తున్నామన్నారు. లే ఆఫ్‌లో ఉన్న ఉద్యోగులు ఆరోగ్య నియమాలను పాటిస్తూ, ఇంటివద్దనే ఉండాలని ఆయన కోరారు. మంచి నిర్ణయం కరోనా వైరస్ మూలంగా గనులకు లే ఆఫ్ ప్రకటించడం మంచి నిర్ణయం. వందల మంది ఒకే గనిలో పని చేయాల్సి వచ్చింది. లే ఆఫ్ మూలంగా కార్మికులంతా ఇళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇదే మంచి సమయం. – పసుపులేటి హరిప్రసాద్, జనరల్ మజ్దూర్ పూర్తి వేతనం ఇవ్వాలి లే ఆఫ్ నిర్ణయం మూలంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. అండర్ గ్రౌండ్ మైన్‌లో ఒకే చోట ఎక్కువ మంది పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లే ఆఫ్ కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాలి. – శ్రీనివాస్‌రెడ్డి, సపోర్ట్‌మెన్ -
కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత
న్యూయార్క్ : కరోనా కలకలంతో ఈనెలాఖరు వరకూ కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో ఉన్న మూడు థీమ్ పార్క్‌లను మూసివేస్తున్నట్టు వాల్ట్‌డిస్నీ శుక్రవారం వెల్లడించింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న క్రమంలో డిస్నీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకూ డిస్నీ క్రూయిజ్ లైన్ అన్ని డిపార్చర్లను రద్దు చేసింది. ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లోని మూడు థీమ్ పార్క్‌లను, డిస్నీలాండ్ పారిస్ రిసార్ట్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక తమ డిస్నీల్యాండ్, కాలిఫోర్నియా అడ్వంచర్ థీమ్ పార్క్‌లను శనివారం నుంచి మూసివేస్తామని డిస్నీ ఇప్పటికే ప్రకటించింది. చదవండి : డిస్నీ చేతికి ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ వ్యాపారం -
మారుతీ కారు ప్లాంట్లు మూసివేత
-
పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్ లాస్
కరాచీ: బాలాకోట్ దాడికి ప్రతీకారంగా విధించిన గగనతల నిషేధంతో భారత్‌తోపాటు పాకిస్తాన్ కూడా నష్టపోయింది. భారత్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం కారణంగా రూ.345 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్ ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత్ విమానాల రాకపోకలపై విధించిన గగనతల నిషేధం కారణంగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కూడా కొన్ని సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పౌర విమానయాన విభాగం రూ.345 కోట్ల మేర నష్ట పోయింది. మొత్తమ్మీద ఇది చాలా పెద్ద నష్టం. అయితే, భారత్‌కు ఇంతకు రెండింతలు నష్టం వాటిల్లింది’ అని అన్నారు. సరిహద్దులకు సమీపంలో మోహరించిన యుద్ధ విమానాలను భారత్ ఉపసంహరించుకున్న తర్వాతే గగనతల నిషేధాన్ని తొలగించినట్లు పాక్ విమానయాన శాఖ కార్యదర్శి షారుఖ్ నుస్రత్ తెలిపారు. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం ఫిబ్రవరిలో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యకు ప్రతీకారంగా భారత ప్రయాణికుల విమానాలు తమ గగనతలం మీదుగా రాకపోకలు సాధించడంపై పాక్ నిషేధం విధించింది. దీంతో పాక్ భూభాగం మీదుగా అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఎయిరిండియా రూ.430 కోట్ల మేర నష్టపోయింది. పాక్ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు కొద్ది రోజులకు ముందు పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఎయిరిండియాకు పెద్ద ఊరటనిచ్చింది. -
ల్యాంకో ఆస్తుల అమ్మకం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రా... మూసివేతకు రంగం సిద్ధమైంది. నిండా అప్పుల్లో కూరుకుపోయి... పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యుడు రాతకొండ మురళి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్‌గా కూడా నియమిస్తున్నట్లు మురళీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలపకపోవటంతో ల్యాంకో లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ‘‘ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం కొన్నసాగుతున్న ల్యాంకో ఇన్ఫ్రా బోర్డు, ఇతర మేనేజ్మెంట్, భాగస్వాముల అధికారాలన్నీ రద్దవుతాయి. అవన్నీ లిక్విడేటర్‌కు బదిలీ అవుతాయి. లిక్విడేటర్ ఈ ఆస్తుల విక్రయానికి సంబంధించి బహిరంగ ప్రకటన చేస్తారు. లిక్విడేషన్ మొదలైన నాటి నుంచి 75 రోజుల్లోగా ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది’’ అని మురళి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐడీబీఐ పిటిషన్‌తో దివాలా ప్రక్రియ మొదలు తమ నుంచి రుణంగా తీసుకున్న రూ.3608 కోట్లను ల్యాంకో ఇన్ఫ్రా తిరిగి చెల్లించడం లేదని, అందుకని ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐబీడీఐ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. తమకు మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు చెప్పగా... అప్పులు రూ.47,721 కోట్లని ల్యాంకో ఇన్ఫ్రా చెబుతోంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్... దివాలా పరిష్కార నిపుణుడిగా సావల్ గొడియావాలాను నియమించింది. అనంతరం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బహిరంగ ప్రకటన జారీ చేయగా, ఏడు కంపెనీలు తమ ఆసక్తిని తెలియచేస్తూ రుణ పరిష్కార ప్రణాళికలు సమర్పించాయి. ఇందులో త్రివేణి ఎర్త్‌మూవర్స్, ఇంజన్ క్యాపిల్ గ్రూపులు సమర్పించిన ప్రణాళికలు మినహా మిగిలిన కంపెనీల ప్రణాళికలు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. త్రివేణి ఎర్త్‌మూవర్స్ రుణ ప్రణాళికలో ఎలాంటి లోపాలూ లేకపోవటంతో దాన్ని రుణదాతల కమిటీ ముందు ఉంచారు. ఓటింగ్‌లో త్రివేణి ప్రణాళికకు 15.53 శాతం రుణదాతలే ఆమోద ముద్ర వేశారు. దీంతో ల్యాంకో లిక్విడేషన్‌కు అనుమతించాలంటూ సావల్ గొడియావాలా ఎన్సీఎల్టీ ముందు ఓ దరఖాస్తు దాఖలు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘చట్ట నిబంధనల ప్రకారం రుణ పరిష్కార ప్రణాళికకు 66 శాతం మంది రుణదాతల ఆమోదం కావాలి. కానీ త్రివేణి ప్రతిపాదనకు 15.53 శాతం మాత్రమే ఆమోదం లభించింది. అందుకని ల్యాంకో లిక్విడేషన్‌కు అనుమతినిస్తున్నాం’’ అని ఉత్తర్వుల్లో వివరించారు. మరోవంక ల్యాంకో కోసం పవర్ మెక్ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును ట్రిబ్యునల్ తిరస్కరించింది. పలు అభ్యర్థనలతో ల్యాంకో ఇన్ఫ్రా దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులపై విచారణ సెప్టెంబర్ 12కి వాయిదా పడింది. -
70 పీఎస్బీ విదేశీ శాఖల మూసివేత!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) నిధుల సంరక్షణ చర్యల్లో భాగంగా 70 విదేశీ శాఖల మూసివేత లేదా క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేశాయి. లాభదాయకం కాని విదేశీ కార్యకలాపాలను మూసివేయడం, అలాగే ఒకే పట్టణం లేదా సమీప ప్రాంతాల్లో ఒకటికి మించి ఉన్న శాఖలను క్రమబద్ధీకరించడం పీఎస్‌బీల ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 70 విదేశీ శాఖల్ని మూసేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు గతేడాది 35 విదేశీ శాఖల్ని మూసేశాయి. 41 విదేశీ శాఖలు 2016–17లో నష్టాల్ని ప్రకటించాయి. నష్టాల శాఖల్లో 9 ఎస్బీఐకి చెందినవి ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 శాఖలు, బ్యాంకు ఆఫ్ బరోడా 7 శాఖలు నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరికి ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే పీఎస్బీలకు విదేశాల్లో శాఖలు, రిప్రజెంటేటివ్ కార్యాలయాలు కలిపి 165 వరకు ఉన్నాయి. -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతపై సందేహాలు
సాక్షి, చెన్నై : ప్రజాందోళనలకు తలొగ్గి తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతపై తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటనపై పలు సందేహాలు ముందుకొస్తున్నాయి. స్దానికుల హింసాత్మక నిరసనల్లో 13 మంది మరణించడం, పెద్దసంఖ్యలో నిరసనకారులు గాయపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినా న్యాయపరమైన చిక్కులు సహా సరైన కసరత్తు జరపకుండానే ప్రభుత్వం ప్రకటన చేసిందని భావిస్తున్నారు. ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపడం పెనుసవాలే. ప్రభుత్వం నిర్ణయంపై తదుపరి చర్యలు చేపట్టేముందు స్టెరిలైట్ యూనిట్ ప్రమోటర్ వేదాంత స్పందించిన తీరు పలు ప్రశ్నలు ముందుకుతెస్తోంది. ప్లాంట్ మూసివేతకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం న్యాయపరమైన ప్రక్రియను అనుసరించలేదని కంపెనీ చెబుతోంది. తమకు ఎలాంటి షోకాజ్ నోటీసు జారీ చేయలేదని, యూనిట్ మూసివేతకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని స్టెరిలైట్ వాదిస్తోంది. స్టెరిలైట్ యూనిట్ మూసివేతపై మే 23న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తొందరపాటుతో కూడుకున్నవని విదుదలై చిరుతైగల్ కచ్చి సభ్యులు డీ రవికుమార్ చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల్లో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి యూనిట్ మూసివేతకు ఎలాంటి సహేతుక కారణం చూపలేదని, దీనిపై న్యాయస్ధానాలు సులభంగా స్టే ఉత్తర్వులు జారీ చేస్తాయని అభిప్రాయపడ్డారు. నిరసనకారుల ఆందోళనను దారిమళ్లించి, స్టెరిలైట్‌కు స్టే తెచ్చుకునేందుకు వీలుగా చేపట్టిన కుట్రలో ఇది భాగమని అభివర్ణించారు. స్టెరిలైట్ ప్లాంట్ చుట్టూ వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ప్లాంట్‌పై ఆధారపడిన 5000 మంది ఉద్యోగులు మాత్రం తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
స్టెరిలైట్ ప్లాంట్ శాశ్వతంగా మూసివేత
సాక్షి, చెన్నై: ప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ శాశ్వత మూసివేతకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అంతకుముందు తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు. ప్రజాభీష్టం మేరకు స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్టెరిలైట్ ఫ్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ గత వారం స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన విషయం విదితమే. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో 13మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
-
కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత
లండన్: ఫేస్బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే కేంబ్రిడ్జ్ అనలిటికాను మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిన కేంబ్రిడ్జ్ అనలిటికా ఆ సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు.. భారత్‌లోనూ సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని సేకరించి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూడటంతో కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలను తక్షణం ఆపేస్తున్నామని, దివాళా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని కేంబ్రిడ్జ్ అనలిటికా ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే తాము ఎటువంటి తప్పూ చేయలేదని, మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల వల్ల తమకు క్లయింట్లు లేకుండా పోయారని, దీనికితోడు లీగల్ ఫీజుల భారం పెరిగి పోవడంతో మూసివేత నిర్ణయం తప్పలేదని సీఏ యాజమాన్యం స్పష్టం చేసింది. -
గంగోత్రిధామ్ మూసివేత
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని పవిత్రమైన గంగోత్రి ధామ్‌ను శీతాకాలం సందర్భంగా శుక్రవారం నుంచి మూసివేశారు. భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో గుడి తలుపులు మూసేశారు. ఆర్నెల్లపాటు ఈ ఆలయాన్ని మూసే ఉంచుతారు. గంగానది జలాలను అందంగా అలకరించిన పల్లకిలో ఉంచి సమీపంలోని ముక్భా గ్రామానికి తరలించారు. భక్తులు ఉత్సాహంగా ఈ పల్లకీ సేవలో పాల్గొన్నారు. తిరిగి గుడి తెరిచేంతవరకు ఈ జలాలనే యాత్రికులు పూజిస్తారు. -
169 స్టోర్లు మూత:వేల ఉద్యోగాలు గల్లంతు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర, దక్షిణ భారతదేశంలో మెక్ డొనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్పీఎల్)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్ డొనాల్డ్స్ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడ నున్నాయి. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. మెక్‌డోనాల్డ్స్ ప్రకారం మొత్తం 169 దుకాణాల్లో మెక్ డొనాల్డ్స్ ట్రేడ్ మార్క్ ఆహార ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబరు 6 నుంచి తన బ్రాండ్ పేరు , ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించే అధికారం సీఆర్‌పీఎల్‌కు లేదని పేర్కొంది. రద్దు నోటీసు కాలం సెప్టెంబరు 5 న ముగిసినందున, మెక్‌డొనాల్డ్ మేధో సంపత్తిని ఉపయోగించేందుకు సీఆర్‌పీఎల్‌కు అధికారం లేదు. అంటే వారు మెక్‌డొనాల్డ్ పేర్లు, ట్రేడ్‌మార్క్ పేర్లు, డిజైన్లు, బ్రాండింగ్, మార్కెటింగ్ లాంటివి ఉపయోగించడం మానివేయాలి. దీనికి సంబంధించి చట్టపరమైన , ఒప్పంద హక్కుల ప్రకారం తాము వ్యవహరించనున్నామని మెక్‌డోనాల్డ్ ఇండియా ప్రతినిధి చెప్పారు. అయితే స్టోర్లమూసివేతపై సీఆర్పీఎల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు బుధవారం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నామని కంపెనీ ఎండీ విక్రమ్ బక్షి చెప్పారు. ఈ స్టోర్ల మూసివేత కారణంగా వేలాదిమంది ఉద్యోగులను రోడ్డుమీదికి నెట్టివేయనుందన్నారు. అంతేకాదు ఇది తమ వ్యాపారంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విక్రమ్ బక్షి తెలిపారు. దాదాపు 10 వేల మంది (ప్రత్యక్షంగా ,పరోక్షంగా)తో పాటు కంపెనీ సరఫరాదారులు, ఇతర వ్యాపార భాగస్వాములకు తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పారు. కాగా మెక్‌డొనాల్డ్‌తో ఫ్రాంఛైజ్ ఒప్పందం రద్దును సవాలు చేస్తూ సీఆర్పీఎల్ పిటిషన్‌ను మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టివేసింది. సీఆర్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే -
చంద్రగ్రహణం సంపూర్ణం
సాక్షినెట్‌వర్క్ : చంద్రగ్రహణం రావడంతో సోమవారం జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. కదిరిలో లక్ష్మీనరసింహస్వామి , తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వరస్వామి , కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి, పెన్నహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి, లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాలను మూసివేసి సేవలన్నింటినీ రద్దు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమంతో పూజలు పునఃప్రారంభమవుతాయని ఆయా ఆలయల నిర్వాహకులు తెలిపారు. -
హోటల్ గదుల బుకింగ్ స్టార్టప్ ‘రూమ్స్‌టునైట్’ మూసివేత
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో హోటల్ గదుల బుకింగ్‌కు వీలు కల్పించే మొబైల్ యాప్ ‘రూమ్స్‌టునైట్’ కార్యకలాపాలు అర్థంతరంగా నిలిచిపోయాయి. 1.5 కోట్ల డాలర్ల (రూ.100 కోట్లు) నిధుల సమీకరణలో విఫలం కావడం, ఉన్న పరిమిత నిధులు కాస్తా ఆవిరైపోవడంతో సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో సంస్థ యాప్ అందుబాటులో లేదు. సంస్థ వెబ్సైట్ ఓపెన్ చేసినా... బుకింగ్‌కు సంబంధించిన ఫంక్షన్లు పనిచేయడం లేదు. బెంగళూరు కేంద్రంగా రూమ్స్‌టునైట్ కార్యకలాపాలు 2015లో ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా 325 ప్రాంతాల్లోని 4,000 హోటళ్లు కంపెనీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. సీఈఓగా దీని వ్యవస్థాపకుడు సురేష్జాన్ వ్యవహరిస్తున్నారు. 90–95 మంది ఉద్యోగులను ఐడీఎస్ నెక్స్›్ట బిజినెస్ సొల్యూషన్స్ అనే మరో కంపెనీకి బదలాయించారు. -
మూతపడిన కంపెనీకి మోదీ ప్యాకేజీ
న్యూఢిల్లీ : నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) మూతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, ఉద్యోగుల వేతనాలకు బుధవారం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ మూత నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, రిటైర్మెంట్ పథకాలకు, ప్రభుత్వ రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునేందుకు అవసరమైన రూ.4,777.05 కోట్ల ప్యాకేజీని కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో హెచ్సీఎల్ను మూసేందుకు ఆమోదించారు. కంపెనీల చట్టం 1956/2013, పరిశ్రమల వివాదాల చట్టం 1947, ఇతర చట్టాల కింద దీన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ఓ ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్/వీఎస్ఎస్ ప్యాకేజ్ కింద 2007వ పే స్కేల్‌ను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ ప్యాకేజీని నగదు కింద రూ.1,309.90 కోట్లు, నగదురహిత కింద రూ.3,467.15 కోట్లను కంపెనీలోకి ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని టెలికాం శాఖకు కావలసిన కేబుల్స్‌ను తయారుచేసే సంస్థగా హెచ్‌సీఎల్ ఉండేంది. వైర్లెస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, వాటికి కేబుల్స్ అవసరం దారుణంగా పడిపోవడంతో హెచ్‌సీఎల్ మూసివేత స్థితికి చేరింది. 1952లో ఏర్పాటైన ఈ సంస్థ, నాలుగు తయారీ యూనిట్లు రుప్నరైన్ పూర్, నరేంద్రపూర్ (పశ్చిమ బెంగాల్), హైదరాబాద్ (తెలంగాణ),నాని (ఉత్తరప్రదేశ్)లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 ఫిబ్రవరిలోనే కంపెనీని మూసివేయడానికి కేంద్రం సిద్ధమైనా ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గింది.అయితే అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు. -
ఖాయిలా సంస్థల మూసివేతకు నియమావళి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో ఖాయిలా పరిశ్రమల (సీపీఎస్ఈ) మూసివేతకు కేంద్రం మార్గదర్శకాలను జారీచేసింది. చరాస్తులు, భూముల విక్రయం, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)ను కోరుకోని ఉద్యోగుల తొలగింపు వంటి అంశాలకు సంబంధించి కాలపరిమితిని ప్రభుత్వ సంస్థల శాఖ (డీపీఈ) జారీ చేసిన నియమావళి నిర్దేశించింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ⇔ 74 ఖాయిలా పరిశ్రమలను నీతీ ఆయోగ్ గుర్తించింది. ఇందులో 26 సంస్థల మూసివేతకు సిఫారసులు జరిగాయి. ⇔ స్థిర, చర ఆస్తుల విక్రయ బాధ్యతలను భూ నిర్వహణ, వేలం సంస్థలకు అప్పగిస్తారు. ⇔ వీఆర్ఎస్కు అంగీకరించని ఉద్యోగుల తొలగింపు జీరో డేట్ (మూసివేతకు మినిట్స్ జారీ అయిన తేదీ) నుంచి నాలుగు నెలల్లో పూర్తికావల్సి ఉంటుంది. ⇔ జీరో డేట్ నుంచి మూడు నెలల్లో వేతన ఇతర చట్టబద్ద బకాయిల అంశాల పరిష్కారం జరగాలి. ⇔ ఇదే మూడు నెలల్లో ఆదాయపు పన్ను శాఖకు చేయాల్సిన చెల్లింపులూ జరిగిపోవాలి. ⇔ రుణ దాతల బకాయి చెల్లింపులు 2 నెలల్లో పూర్తి కావాలి. ⇔ సంబంధిత పరిశ్రమ భూ అమ్మకాలు ఆరు నెలల్లో జరగాలి. ఈ ఆస్తుల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను తొలి ప్రాధాన్యత ఉంటుంది. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ప్రాధాన్యత ఇస్తారు. ⇔ జీరో డేట్ నుంచి ఆరు నెలల్లో కొనుగోళ్లకు ఏ సంస్థ నుంచీ డీపీఏకు ప్రతిపాదన అందకపోతే, నియమనిబంధనలకు లోబడి ఒక వేలం సంస్థకు ఈ బాధ్యతల అప్పగింత జరుగుతుంది. -
మరో మూడు బీసీ హాస్టళ్ల మూసివేత..!
కలెక్టర్‌కు నివేదిక అందజేసిన అధికారులు ఆరుకు చేరిన సంఖ్య హన్మకొండ అర్బన్: విద్యార్థులు లేని కారణంగా గత ఏడాది మూడు బీసీ హాస్టళ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరో మూడింటికి కూడా తాళం వేసేందుకు సిద్ధమయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఒక్క విద్యార్థి కూడా బీసీ హాస్టళ్లలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వాటిని మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు కలెక్టర్‌కు నివేదిక పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాగానే బచ్చన్నపేట, మహ బూబాబాద్, నల్లబెల్లి మండలంలోని నాచినపల్లి బీసీ బాలుర హాస్టళ్లను అధికారులు మూసివేయనున్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది జిల్లాలోని మూడు హాస్టళ్లను విద్యార్థులు లేక మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు హాస్టళ్లు కూడా మూతపడేందుకు సిద్ధంగా ఉండడంతో వాటి సంఖ్య ఆరుకు చేరినట్లయింది. కాగా, జిల్లాలోని మరికొన్ని హాస్టళ్లలో కూడా ప్రసుత్తం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఈ సంఖ్యను పెంచుకునేందుకు వార్డెన్లకు ఈ నెలాఖరువరకు కలెక్టర్ గడువు విధించారు. నెలాఖరు తర్వాత కూడా విద్యార్థుల సంఖ్య కనీసం 30 మందికి దాటకుంటే వాటిని కూడా మూసివేసి ఉన్న వారిని పక్క హాస్టళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మరో ఐదు నుంచి ఆరు వసతిగృహాలు కూడా మూత పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మూతపడుతున్న హాస్టళ్లలోని వార్డెన్లు, వర్కర్లను ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్న చోటకు సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
మూతపడ్డ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లు
జపాన్ భూకంపం స్థానిక ఎలక్ట్రానిక్, ఆటో సంస్థలకు భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జపాన్ లో వరుసగా సంభంవించిన భూకంపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో సోనీ... తయారీ కేంద్రాలను మూసివేసింది. దక్షిణ ద్వీపప్రాంతం క్యుషు.. కుమామోటోలో నెలకొన్న సోనీ ప్రధాన ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో భూకంపం సంభవించడంతో తమ ప్లాంట్లలొ కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. యాపిల్ ఇంక్ సహా అనేక స్మార్ట్ ఫోన్ల తయారీదారులకోసం ఉత్పత్తి చేసే ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లను సోనీ తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. నాగసాకితోపాటు క్యుషులో ఉన్న తమ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఇంకా చెప్పలేమని ప్లే స్టేషన్ మేకర్ సోనీ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చే 'కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీ కండక్టర్' (సీఎంఓఎస్) ఇమేజ్ సెన్సార్లను క్యుషులోని సోనీ కేంద్రాల్లో తయారు చేస్తారు. ముఖ్యంగా యాపిల్ ఐ ఫోన్లలో వినియోగించే ఈ సెన్సార్లతో సోనీ.. 40 శాతం మార్కెట్ ను నియంత్రిస్తుంది. ప్రస్తుతం భూకంపంతో ప్లాంట్ల లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్లాంట్లను తిరిగి ఎప్పుడు తెరుస్తామో చెప్పలేమని సోనీ ప్రతినిధులు చెప్తున్నారు. తాము సప్లై నిలిపివేయడంవల్ల యాపిల్ వంటి కష్టమర్లపై ఎటువంటి ప్రభావం పడుతుందో చెప్పలేమంటున్నారు. మార్చి 2011 లో ఉత్తర జపాన్ లో సంభవించిన తీవ్ర భూకంపం, సునామీ.. ప్రభావం జపాన్ లోని ఆటో సరఫరా వ్యవస్థపై తీవ్రంగా పడింది. అప్పటినుంచీ కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి విధానాలను సవరించుకొని, భారీ నష్టాలు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నాయి. ప్రస్తుతం భూకంపం ప్రభావంతో క్యుషులోని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు కూడా తాత్కాలికంగా తయారీని నిలిపివేశాయి. జపాన్ లోని సెమీకండక్టర్ల ఉత్పత్తి సుమారు 25 శాతం వరకూ క్యుషులోనే జరుగుతుంది. దీంతో సోనీతోపాటు క్యుషులో స్థానికంగా నెలకొన్నఅనేక కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీని భూకంపం కారణంగా నిలిపివేశాయి. భూకంప నష్టాన్ని అంచనా వేసేవరకూ ఈ ప్లాంట్లు తిరిగి ప్రారంభించే అవకాశం కనిపించడంలేదు. శనివారం సంభవించిన ప్రకృతి విపత్తు ప్రభావం అనేక ఆటో మేకర్ సంస్థలపైనా పడింది. దీంతో ఆయా కంపెనీలు కూడ ఉత్పత్తిని నిలిపివేశాయి. హోండా మోటార్ కంపెనీ కూడ తమ కుమామోటో మోటార్ సైకిల్ ప్లాంట్ లో నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తయారీని సోమవారం వరకూ నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే టయోటా మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంట్ లో పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ పరిస్థితిని ఆదివారం వరకూ సమీక్షించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది. -
నోళ్లు తెరిచిన బోర్లు మూసేయండి
♦ వృథా బోరుబావులపై యంత్రాంగం సమరం ♦ అక్కరకు రానివాటి మూసివేతకు నిర్ణయం ♦ అలాంటివి ఎన్నున్నాయో తేల్చేపనిలో నిమగ్నం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెండేళ్ల క్రితం నాలుగేళ్ల గిరిజ మంచాలలోని వ్యవసాయ క్షేత్రంలో నిరుపయోగ బోరు బావిలో పడి మరణించింది. సరిగ్గా ఏడాది క్రితం కుల్కచర్ల మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నా బాలిక మాత్రం క్షేమంగా బయటికొచ్చింది.’ ఇకపై బోరుబావుల్లో ప్రమాదాల ఘటనలే జరగొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడి మరణించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల అప్రమత్తమయ్యారు. జిల్లాలో తెరిచిఉండి అక్కరకు రాని బోరుబావుల లెక్క తేల్చేందుకు ఉపక్రమించారు. వీటి గుర్తింపునకు జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా.. వాటికనుగుణంగా వివరాలు సేకరించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. భూగర్భ జల శాఖ నుంచి లెక్కలు.. బోరు వేయాలంటే భూగర్భజల శాఖ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఆ శాఖ వద్ద ఉన్న గణాంకాల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అయితే చాలా మంది భూగర్భ జల శాఖ అనుమతి లేకుండా విచ్చలవిడిగా బోర్లు వేశారు. ఈక్రమంలో వాటిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తంగా వారంలోపు నిర్ణీత నమూనా ప్రకారం బోరుబావుల లెక్కలు తీస్తే.. వాటికనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నటు అధికారులు చెబుతున్నారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మాత్రం వెంటనే మూసివేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. అధికారులపై క్రిమినల్ కేసులే... ఇకపై బోరుబావుల్లో ప్రమాధాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, రెవెన్యూ అధికారులతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి బోరుబావుల మూసివేతకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. -
తిరుమల రెండో ఘాట్ రోడ్డు మూసివేత
భారీ వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో.. తిరుమల రెండో ఘాట్ రోడ్డును మూసేస్తూ.. టీటీడీ నిర్ణయం తీసుకుంది. సోమ వారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకూ ఘాట్ రోడ్ మూసి ఉంచుతారు. భక్తుల క్షేమం ధృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈ మేరకు ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
ఆర్టీసీ మూసివేతకు కుట్ర’
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఒక పథకం ప్రకారం ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతంరెడ్డి మండిపడ్డారు. సమ్మె నోటీసు నేపథ్యంలో రెండు నెలలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం ఇప్పుడు కమిటీ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ వేతన సవరణపై ప్రభుత్వం రోజుకో డ్రామా ఆడుతోందని, న్యాయమైన హక్కుల కోసం కార్మికులు సమ్మెకు దిగితే డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటామని బెదిరించడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులందరికి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకుండా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 1995లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే నాటికి ఆర్టీసీ రూ. 45 కోట్ల లాభాల్లో ఉందని, ఆ తర్వాత పన్నులు వేయడం, రాయితీ పాస్‌లకు సంబంధించి రీయింబర్స్మెంట్ చెల్లించకుండా చేయడం వల్ల ఆర్టీసీ రూ. 3 వేల కోట్ల అప్పు చేయాల్సివచ్చిందని తెలిపారు. దానిపై వడ్డీలు కలుపుకొని ఇప్పుడు రూ. 5వేలు కోట్లకు అప్పు చేరిందన్నారు. ఇలా ఆర్టీసీని ఇబ్బందులపాల్జేసిన చంద్రబాబు మళ్లీ సమ్మె పేరుతో ఆర్టీసీని మూసే దిశగా కుట్ర చేస్తున్నార ఆరోపించారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఆర్టీసీ 2007 నుంచి 2009 వరకు రెండేళ్లపాటు రూ.100 కోట్ల లాభాలు గడించిన సంగతి గుర్తుచేశారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మవద్దని, కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
44 టోల్‌ప్లాజాలకు త్వరలో మంగళం!!
రోడ్డెక్కితే చాలు.. తోలు తీసే స్థాయిలో ఉన్న చాలావరకు టోల్ ప్లాజాలకు త్వరలోనే కాలం చెల్లిపోతోంది. మహారాష్ట్రలో అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన 44 టోల్‌ప్లాజాలను మూసేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే.. ముంబై నగరం పరిధిలొని టోల్‌ప్లాజాలు మాత్రం ఈ జాబితాలో లేవు. రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయం చాలావరకు వెనక్కి వచ్చేసి, కొద్దిమాత్రం మిగిలిన టోల్‌ప్లాజాలను ముందుగా మూసేయాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ పని చేయాలనుకున్నామని ఆయన అన్నారు. డెవలపర్లతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పుడు మూసేస్తున్న 44 టోల్‌ప్లాజాలకు సంబంధించి రూ. 309 కోట్లను వారికి చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.