చంద్రగ్రహణం సంపూర్ణం
చంద్రగ్రహణం సంపూర్ణం
Published Mon, Aug 7 2017 11:20 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
సాక్షినెట్‌వర్క్ : చంద్రగ్రహణం రావడంతో సోమవారం జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. కదిరిలో లక్ష్మీనరసింహస్వామి , తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వరస్వామి , కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి, పెన్నహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి, లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాలను మూసివేసి సేవలన్నింటినీ రద్దు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమంతో పూజలు పునఃప్రారంభమవుతాయని ఆయా ఆలయల నిర్వాహకులు తెలిపారు.
Advertisement
Advertisement