lunar eclipse
-
వినువీధి నుంచి చంద్ర గ్రహణ వీక్షణం
టెక్సాస్: చంద్రగ్రహణాన్ని భూమి నుంచి చూశారు. అయితే అత్యంత దగ్గరగా, అది కూడా ఆకాశం నుంచి చూశారా? లేదు కదా. అయితే వచ్చే నెలలో చంద్రునిపై దిగనున్న బ్లూ ఘోస్ట్ ల్యాండర్ చంద్రగ్రహణాన్ని అత్యంత సమీపం నుంచి చూపించి అబ్బురపరిచింది. అది తాజాగా తీసిన చంద్రగ్రహణం ఫొటోలను జతకూర్చి వీడియోగా కూర్చి ల్యాండర్ తయారీదారు ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో తెగ వైరలవుతోంది. ల్యాండర్ ప్రస్తుతం అంతరిక్షంలో భూ సమీప కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రగ్రహణం ఫొటోలను తన 6.6 అడుగుల ఎత్తయిన డెక్ నుంచి కెమెరాలో బంధించింది. సూర్యకిరణాల వల్ల ఏర్పడిన తన నీడతో భూమి చంద్రుడిని కప్పేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనువిందు చేస్తున్నాయి. చంద్రునిపై నాసా పరిశోధనలకు పరికరాలను మోసుకెళ్లేందుకు ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సరీ్వసెస్’ ప్రాజెక్టులో భాగంగా జనవరి 15న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బ్లూ ఘోస్ట్ ల్యాండర్‌ను ప్రయోగించారు. -
సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం
న్యూఢిల్లీ: ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఈనెల 27, 28వ తేదీల్లో సాక్షాత్కారం కానుంది. దాదాపు గంటా 43 నిమిషాలపాటు కొనసాగే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం జూలై 27వ తేదీ అర్ధరాత్రి 11.54 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ గ్రహణంగా మారనుంది. అలా 2 గంటల 43 నిమిషాలపాటు కొనసాగి తిరిగి 28వ తేదీ వేకువజామున 3 గంటల 49 నిమిషాలకు గ్రహణంవీడనుందని భూగోళ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఆస్ట్రేలియా, ఆసియాలో పూర్తిగా కనిపించనుంది. ఇది ఈ శతాబ్దం(2001 నుంచి 2100కాలం)లో అతి ఎక్కువ కాలం పాటు కొనసాగే చంద్రగ్రహణంగా రికార్డులకెక్కనుందని పేర్కొంది. -
27న శ్రీశైలం ఆలయం మూసివేత
శ్రీశైలం: చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని ఈ నెల 27న మధ్యాహ్నం 2 నుంచి మరుసటిరోజు వేకువజామున 4.30 వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్రీరామచం ద్రమూర్తి సోమవారం తెలిపారు. 27న తెల్లవారు జామున 3.30 నుంచి మంగళ వాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహా మంగళహారతి ఉంటాయన్నారు. 5.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. -
27న శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న సాయంత్రం 5 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 వరకు శ్రీవారి ఆలయం మూసేయనున్నారు. చంద్రగ్రహణం 27న రాత్రి 11.54కు ప్రారంభమై 28న ఉదయం 3.49కు పూర్తవుతుంది. 4.15కు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యా హవచనం చేస్తారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి సర్వదర్శ నం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం వల్ల 27న కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. -
ఈ నెల 27న ఆకాశంలో అద్భుతం
-
షాకింగ్ చంద్రగ్రహణ వీడియో వైరల్
-
షాకింగ్ చంద్రగ్రహణ వీడియో : వైరల్
ఆకాశంలో అరుదైన అద్భుతమైన దృశ్యం జనవరి 31న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. చంద్రుడు... సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్లను ఒకేసారి తన వెంట పెట్టుకుని వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు ఎగబడ్డారు. జనవరి 31న ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. సోషల్ మీడియా సైతం ఈ సూపర్ మూన్ పిక్చర్లను విపరీతంగా షేర్చేసింది. అయితే ఈ గ్రహణ సమయంలో చంద్రుని పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఓ వస్తువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ మూన్ సందర్భంగా ఇలా వెళ్లిన వస్తువును ఏలియన్లుగా భావిస్తున్నారు. నాసా విడుదల చేసిన వీడియోలో ఈ వస్తువు కనిపించింది. ఆ వస్తువు కనిపించడం ద్వారా ఏలియన్స్ ఉన్నారనేందుకు నిదర్శనమని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. మనుషులు తయారు చేసిన వాహనమైతే ఇంత వేగంగా వెళ్లడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుణి చుట్టూ తిరిగిన గుర్తు తెలియని ఈ వస్తువు కచ్చితంగా ఏలియన్స్‌కు చెందినదేనని అంటున్నారు. ''మెరుపు వేగంగా చంద్రునికి ఎడమ వైపుకు కిందకి పడిపోతూ ఉందని, అలా కిందకి ట్రావెల్ చేసినట్టు'' శాస్త్రవేత్తలు చెప్పారు. యూట్యూబ్ ఛానల్ యూఎఫ్ఓమానియాలో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
కనువిందు చేసిన సూపర్ బ్లూ బ్లడ్‌మూన్
-
కనువిందు చేసిన జాబిల్లి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ బుధవారం కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. ఇటు భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించేందుకు వివిధ నగరాల్లోని నక్షత్రశాలలకు క్యూ కట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఖగోళ వింతను చూసేందుకు గుమిగూడారు. దక్షిణ భారతంలోని పలు నగరాల్లోనూ ప్రజలు ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్ అంటారు. బుధవారం ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి. హాంకాంగ్‌లో సాయంత్రంవేళ టెలిస్కోప్‌తో సూపర్‌మూన్‌ను వీక్షిస్తున్న దృశ్యం -
నమ్మకమా..నిజమా?
-
ఆకాశంలో సెలీన్ సుందర కావ్యం
వెబ్‌డెస్క్, హైదరాబాద్ : సుమారు 36 ఏళ్ల తర్వాత ఆకాశంలో చంద్రుని సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్, బ్లూ మూన్, సంపూర్ణ చంద్ర గ్రహణం మూడు కలసి ఒకేసారి కనిపించి ప్రపంచంలోని పలు దేశాల ప్రజలను కనువిందు చేశాయి. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోవడంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో(బ్లడ్ మూన్‌గా) కనిపించింది. సాయంత్రం 04.21 గంటలకు ప్రారంభమైన గ్రహణం రాత్రి దాదాపు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ముగిసింది. ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటు చేసుకుంది. భారత్ వ్యాప్తంగా... దేశ వ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం దర్శనమిచ్చింది. చందమామ(సెలీన్)పై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో బుధవారం సాయంత్రం 5.20కి మన దేశంలో కనిపించడం ప్రారంభమైంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత 6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపించింది. ఈ నెల 1వ తేదీన తొలి పౌర్ణమి ఏర్పడింది. తిరిగి 28 రోజుల్లోనే మళ్లీ పౌర్ణమి రావటంతో దీన్ని బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. సూపర్ మూన్... చంద్రుడు గుండ్రంగా ఒక స్థిర కక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్ ప్రిసిషన్)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో.. పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు ఇలా పెద్దగా కనిపించడాన్ని సూపర్ మూన్‌గా అభివర్ణిస్తారు. -
150 ఏళ్ల తర్వాత అద్భుతం
-
నేడే సూపర్ బ్లూ బ్లడ్ మూన్
న్యూఢిల్లీ: సుమారు 150 ఏళ్ల తర్వాత ఆకాశంలో నేడు ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సూపర్‌మూన్, బ్లూమూన్, సంపూర్ణ చంద్రగ్రహణం మూడు కలసి కనువిందు చేయబోతున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోనుండటంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో (బ్లడ్‌మూన్‌గా) కనిపించనుంది. సాయంత్రం 4.21 గంటలకు ప్రారంభమై రాత్రి 7.37 గంటల వరకు ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటుచేసుకోనుంది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో ఇది మరింత బాగా కనపడవచ్చు. భారత్ వ్యాప్తంగా... మన దేశంలోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చందమామపై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో ఇది భారత్‌లో సాయంత్రం 5.20కి ప్రారంభమవుతుంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత 6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపిస్తుంది. ఆ తర్వాత జాబిల్లి వెండి రంగులోకి మారుతుంది. కొన్ని నిమిషాల తరువాత మొత్తం నీడ పరచుకుంటుంది. రాత్రి 7.25 గంటల నుంచి దాని పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనిని నెలలో రెండో నిండుపున్నమి లేదా నీలవర్ణ చంద్రుడిగా (బ్లూమూన్)గా పిలుస్తారు(జనవరి 1న తొలి పౌర్ణమి ఏర్పడింది). బ్లూమూన్ సందర్భంగా నదులు, సముద్రాల్లో అలలు కొంచెం ఎత్తులో ఎగిసిపడతాయని, దీని వల్ల భయపడాల్సిందేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూపర్‌మూన్... చంద్రుడు గుండ్రంగా ఒక స్థిరకక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్ ప్రిసిషన్)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో... పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా పౌర్ణమినాడు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు ‘సూపర్‌మూన్’ అని పిలుస్తారు. భూమండలానికి సమీపంగా రావడం వల్ల చంద్రుడు కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణంగా కనిపించే జాబిల్లితో పోల్చితే ఇది 30 శాతం పెద్దదిగా, రోజు కనిపించే దాని కంటే 14 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడని సైంటిస్టులు వెల్లడించారు. ఆకాశంలో చోటుచేసుకునే ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన బైనాక్యులర్లు, టెలిస్కోప్‌ల అవసరం లేదని, మామూలుగా అందరూ చంద్రుడిని చూసినట్టే ఎలాంటి ఉపకరణాలు లేకుండా చూడొచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే జూలై 27న ఏర్పడనుందని, అది బ్లూ లేదా సూపర్‌మూన్ మాత్రం కాదని వారు తెలిపారు. ఎప్పుడు, ఎక్కడెక్కడ... తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో సూపర్ బ్లూబ్లడ్ మూన్‌ను ముందుగా వీక్షించొచ్చు. హైదరాబాద్ ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మొత్తం చూసే అవకాశముంది. దేశవ్యాప్తంగా అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు కోల్‌కతా ప్రజలు ఈ అద్భుతాన్ని అందరికన్నా ముందు చూడొచ్చు. చంద్రోదయం..అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో సాయంత్రం 4.47 గంటలకు, కోల్‌కతా–5.16, పట్నా–5.25, ఢిల్లీ–5.53, చెన్నై–6.04, ముంబై–6 గంటల 27 నిమిషాలకు జరగనుంది. -
రేపు ఖగోళ వింత!
న్యూఢిల్లీ: ఆకాశంలో రేపు అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ నెల 31న సూపర్‌మూన్‌గా మారే చంద్రుడు బ్లూమూన్, బ్లడ్‌మూన్‌గానూ దర్శనమివ్వనున్నాడు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం జరగనుందనీ, మరో పదేళ్ల తర్వాత కానీ ఇలాంటి అవకాశం రాదని శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ ఖగోళ వింతను కెమెరాల్లో బంధించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కన్పిస్తాడు. దీన్నే సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. ఓ నెలలో రెండో పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే దాన్ని బ్లూమూన్‌గా పిలుస్తారు. ఇక చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి చేరినప్పుడు.. భూమి వాతావరణంలోకి వచ్చిన సూర్యకాంతి పరావర్తనం చెంది చంద్రుడిపైకి ప్రసరిస్తుంది. ఎక్కువ తరంగదైర్ఘ్యమున్న ఎరుపు రంగు కిరణాలు చంద్రుడ్ని చేరడంతో చందమామ రుధిర వర్ణంలో ప్రకాశిస్తాడు. దీన్నే బ్లడ్‌మూన్‌గా వ్యవహరిస్తారు. 1866 తర్వాత ఈ మూడు ఖగోళ అద్భుతాలు ఒకేసారి సంభవించడం ఇదే తొలిసారి. భారత్‌లో బుధవారం సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా చంద్ర గ్రహణం మొదలు కానుంది. సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల వరకూ బ్లూ, బ్లడ్‌మూన్ చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం 76 నిమిషాల పాటు కొనసాగనుంది. -
పట్టు విడుపులు
ఖగోళ పరంగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు. సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని, కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణమనీ అంటారు. 31న చంద్రగ్రహణం ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక, సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనున్నది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం వేళలు ఇవీ... సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలం (గ్రహణ మోక్షం )గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ కాలం 3 గంటల 23 నిమిషాలు. ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది..? భారతదేశంతో సహా ఆసియా ఖండం, అమెరికా, యూరప్ ఈశాన్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాలలో కనబడుతుంది. గ్రహణ గోచారం ఇలా... ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం, ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశి అవటం చేత ఈ రెండు రాశులవారు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది. ఏ రాశివారిపై ఏ ప్రభావం? ధనస్సు–మేషం–కర్కాటక–సింహ రాశుల వారికి అధమ ఫలం. వృశ్చిక–మకర–మీన–మిధున రాశుల వారికి మధ్యమ ఫలం. కన్య–తుల–కుంభ వృషభ రాశుల వారికి శుభ ఫలాలు. చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ.. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిణులు ప్రత్యేక్షంగా చూడకూడదు, మనస్సులో భగవంతుని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది. గర్భిణులు కదలకుండా పడుకోవాలనేది అవాస్తవం. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును. ఇందులో ఎలాంటి సందేహాలూ లేవు. గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలు చేయకూడదు అనే అపోహలు వద్దు. గ్రహణ వేళ ఆహార పానీయ నియమాలు అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. గ్రహణం పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, పండ్లరసాలు వంటివి తీసుకోవచ్చును. గ్రహణం పూర్తి అయిన తర్వాత తలస్నానం చేసి వంట చేసుకొని తినాలి. ఉదయం చేసిన అన్నం కూరలు పనికి రావు. గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహార పదార్థాలు విష స్వభావాన్ని కలిగి ఉండటమే అందుకు కారణం. అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిదానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు. శాస్త్రీయ పద్ధతి అవసరం గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్ధతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణం పట్టటానికి ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే మామూలు సమయంలో చేసిన ధ్యాన ఫలితం కన్న రెట్టింపు ఫలితం లభిస్తుంది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు చేయనక్కర్లేదు. తర్వాత ఇలా చేయాలి గ్రహణం పూర్తయిన తరవాత ఇంట్లో దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలి. విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి. జంధ్యం ధరించే సంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి. మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వాత ఆవుకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహార, వస్త్ర, వస్తు రూపంలో దానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహబాధలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఆలయాలను ఎందుకు మూసివేస్తారు? సూర్యచంద్రులతో భూమికి గల సంబంధాన్ని బట్టే కాలగణన జరుగుతుంది. అటువంటి సూర్య చంద్రులకు గ్రహణం కలిగిందంటే అది దుర్దినమేకదా! సామాన్య భాషలో చెప్పాలంటే లోకానికి వెలుగు, వేడిని ప్రసాదించే సూర్యచంద్రులను క్రూరగ్రహాలైన రాహుకేతువులు మింగడమంటే అది లోకానికంతటికీ కష్టకాలమే కదా! ఆలయాలు సమాజమంతటినీ కలిపే కేంద్రాలు కాబట్టి, దేవాలయాలను గ్రహణ కాలంలో మూసివేసి, గ్రహణం వీడిన తరువాత శుద్ధి చేస్తారు. ఆ తర్వాతనే పూజాదికాలు ప్రారంభిస్తారు. -
ఈ నెల 31 అంతరిక్షంలో వింత
న్యూఢిల్లీ : ఈ నెల 31 విశ్వంలో అద్భుతం జరగనుంది. చరిత్రలో అత్యంత అరుదైన బ్లూమూన్ సంపూర్ణ చంద్రగ్రహణం చీకట్లో కనువిందు చేయనుంది. ఈ అంతరిక్ష వింతను మధ్య ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐరోపా, అలాస్కా, కెనడా, సెంట్రల్ అమెరికా ప్రాంత ప్రజలు వీక్షించవచ్చు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పసిఫిక్ మహాసముద్రం మీద ప్రయాణిస్తుంటాడని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా నెలలో రెండోసారి కనిపించే నిండు చంద్రుడు సంపూర్ణ గ్రహణానికి గురవడాన్ని బ్లూమూన్ అని పిలుస్తారు. ఇటువంటి అపూర్వ ఘటన 150 ఏళ్ల కిందట ఒకసారి ఆవిష్కృతమైంది. మళ్లీ ఇన్నేళ్లకు 2018 జనవరి 31న అంతరిక్షంలో బ్లూమూన్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం.. మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఈ సమయంలో చంద్రడిపై పడే భూమి దక్షిణ భాగపు నీడను స్పష్టంగా వీక్షించవచ్చు. -
చంద్రగ్రహణం సంపూర్ణం
సాక్షినెట్‌వర్క్ : చంద్రగ్రహణం రావడంతో సోమవారం జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. కదిరిలో లక్ష్మీనరసింహస్వామి , తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వరస్వామి , కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి, పెన్నహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి, లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాలను మూసివేసి సేవలన్నింటినీ రద్దు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమంతో పూజలు పునఃప్రారంభమవుతాయని ఆయా ఆలయల నిర్వాహకులు తెలిపారు. -
గ్రహణం ఎఫెక్ట్ తిరుమల ఆలయం మూసివేత
-
నేడు చంద్రగ్రహణం: ఆలయాలు మూసివేత
హైదరాబాద్: చంద్రగ్రహణం సందర్బంగా సోమవారం మధ్యాహ్నం నుంచి అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తారు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. భద్రాద్రి రాముల వారి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేస్తారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసి మంగళవారం తెల్లవారుజామున స్రంప్రోక్షణ అనంతరం 4 గంటలకు తెరుస్తారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనృహింహస్వామి ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేసి మంగళవారం ఉదయం 10.30 గంటలకు తెరుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో... చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం 4 గంటల నుంచి మూసివేస్తారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. ఈ సందర్భంగా విశేష పూజ, ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాలిబాట భక్తులకు 6 వేల దర్శన టికెట్లు మాత్రమే టీటీడీ జారీ చేయనున్నది. గ్రహణ సమయంలో కంపార్టుమెంట్లలోకి భక్తులెవరినీ అనుమతించరు. ఆలయంతో పాటు అన్న ప్రసాద కేంద్రం, శ్రీవారి పోటును కూడా మూసివేస్తారు. ఉదయం 7 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయాన్ని కూడా మధ్యాహ్నం నుంచి మూసి ఉంచుతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ, శ్రీమల్లికార్జునస్వామి ఆలయాలను కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేస్తారు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున తెరిచి ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సందర్భంగా మంగళవారం ఖడ్గ మాల సేవను రద్దు చేశారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఉదయం 11 గంటల నుంచి మూసివేస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. ఇక్కడ రాహుకేతు పూజలు నిర్వహిస్తుంటారు కావున ఆలయాన్ని గ్రహణ సమయాల్లోనూ యథావిధిగా తెరిచి ఉంచి భక్తులను అనుమతిస్తారు. -
నేడు చంద్ర గ్రహణం
-
ఆగస్టు 7న దుర్గగుడి మూసివేత
చంద్రగ్రహణం ఏర్పడటమే కారణం ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆగస్టు ఏడో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానాన్ని మూసివేస్తారు. ఏడో తేదీ ఉదయం 11.30 గంటలకు దుర్గగుడిలో అన్ని దర్శనాలను నిలిపివేసి ఆలయాన్ని శుభ్రం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన తర్వాత అమ్మవారి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. రాత్రి 10.52 నుంచి అర్ధరాత్రి 12.48 గంటల వరకు గ్రహణం ఉంటుందని దుర్గగుడి స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. ఆగస్టు 8వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. -
28న చంద్రగ్రహణం, సూపర్‌మూన్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే సోమవారం తెల్లవారుజామున ఆకాశంలో ఓ అరుదైన అద్భుతం జరగనుంది. ఆ రోజున భూమికి అతిదగ్గరగా చంద్రుడు రావడంతోపాటు అదే సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేయనుంది. ఇలాంటి ఘటన దాదాపు 33 ఏళ్ల క్రితం..1982లో ఒకసారి జరిగింది. మళ్లీ 2033 ఏడాది వరకూ సంభవించే వీలు లేదు. 28వ తేదీ ఉదయం గం. 5.40లకు ప్రారంభమయ్యే గ్రహణం గం.10.53కు ముగుస్తుంది. గం. 6.37 నుంచి గం.9.57ల మధ్య ఉంబ్రల్ దశ (చంద్రుడు పూర్తిగా భూమి ఛాయలోకి చేరిపోవడం) నడుస్తుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే వీలుందని ప్లానెటరీ సొసైటీ, ఇండియా డెరైక్టర్ శ్రీరఘునందన్ తెలిపారు. పూర్తిస్థాయిలో కనిపించే చోట వాతావరణ పరిస్థితులను బట్టి చంద్రుడు నారింజ లేదా ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం కావడం విశేషం. ఏడాదికి మూడు నాలుగుసార్లు.... భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రుడు తిరుగుతాడు. కక్ష్యలో తిరుగుతూ చంద్రుడు రెండుసార్లు భూమికి అతిదగ్గరగా, ఇంకో రెండుసార్లు అతిదూరంగా వస్తాడు. భూమికి, చంద్రుడికి మధ్య సగటు దూరం 3.84 లక్షల కిలోమీటర్లు కాగా...28న ఈ దూరం దాదాపు 50,000 కి.మీ.లు తగ్గనుంది. ఫలితంగా ఆ రోజున చంద్రుడి సైజు పెరిగినట్టుగా కనిపిస్తుంది. మామూలు రోజుల్లో కంటే ఆ రోజు చంద్రుడి పరిమాణం 14 శాతంఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. అందుకే దీన్ని కొందరు సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. శాస్త్రవేత్తలు దీన్ని అరుదైన చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. -
గ్రహణం వేళ.. రోకలి ఇలా..
ముక్కామల (పెరవలి): గ్రామీణ ప్రాంతాల్లో గ్రహణ సమయంలో ఇంటి ఆవరణలో నీళ్లతో నిండిన పళ్లెం ఉంచి దానిలో రోకళ్లను నిలబెట్టి పూజలు చేయడం అనాదిగా వస్తోంది. సాధారణంగా రోకలి పళ్లెంలో నిలబడదు. అరుుతే గ్రహణ సమయంలో మాత్రమే భగవంతుని కృప వల్ల నిలబడుతుందని గ్రామీణుల విశ్వాసం. శనివారం చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ముక్కామలలో అఖండం వెంకటేశ్వరరావు ఇంటి ఆవరణలో పళ్లెంలో రోకలిని నిలబెట్టగా అది నిలబడింది. దీని వద్ద వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు పూజలు చేశారు. -
చంద్ర గ్రహణంతో ఆలయాల మూసివేత
చంద్ర గ్రహణం కారణంగా కడప నగరంలోని దేవాలయాలను మూసివేశారు. ఈ ప్రాంతంలో గ్రహణం మధ్యాహ్నం 3.45 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఉండగా, ఆలయాలను మాత్రం ఉదయమే మూసి వేశారు. ప్రభాత పూజలనంతరం దేవాలయాల్లో రోజువారి పూజలను నిలిపి వేసి ఆరు గంటలకే దేవాలయాల ప్రధాన తలుపులు మూసి వేశారు. శనివారం కావడంతో పలువురు భక్తులు ఆలయాలకు వెళ్లి తలుపులు మూసి ఉండడం చూసి కారణం తెలుసుకుని నిరాశగా వెనుదిరిగారు. గ్రహణం ముగిసిన తర్వాత తిరిగి ఆలయాలు తెరిచి శుద్ధి చేశారు. మూలమూర్తులకు విశేష అభిషేకాలు చేసి నైవేద్యం తదితర కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించారు. - కడప కల్చరల్ -
తిరుపతిలో ఆలయాల మూత
తిరుపతి కల్చరల్: చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ స్థానిక ఆలయాలు శనివారం ఉదయం 9.30 నుంచి మూతపడ్డాయి. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం, శ్రీకోదండరామస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేశారు. దీంతో ఆలయాల ప్రాంతాలు నిర్మానుషంగా మారాయి. తిరిగి రాత్రి 8 గంటల వరకు ఆలయాలను తెరిచి శుద్ధి చేసి పుణ్యహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో రాత్రి 10 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. కాగా గోవిందరాజస్వామి వారు రాత్రి 10 నుంచి 11 గంటల నడుమ విశేషమైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. -
తిరుపతిలో పాక్షికంగా చంద్రగ్రహణం
తిరుపతి కల్చరల్: తిరుపతి నగరంలో చంద్రగ్రహణం దృశ్యాలు సాయంత్రం 7.10 నుంచి 7.40 గంటల మధ్య దర్శనమిచ్చాయి. చంద్రగ్రహణం సందర్భంగా నగరంలో గర్భిణులు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఇంటికే పరిమితమయ్యారు. గ్రహణం వీడిన అనంతరం గర్భిణులతో పాటు ప్రజలందరూ తమ గృహాలను శుభ్రం చేసుకుని దీపారాధనలు చేసి పూజలు చేశారు. కొందరు పేదలకు వస్త్రాలు, ధాన్యం, బెల్లం ప్రసాదాలు వండి వితరణ చేశారు. -
గ్రహణం విడిచే వరకు నీటిపై వాయు దిగ్బంధనం
పిఠాపురం : చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి అది పూర్తయ్యేవరకు ఓ పురోహితుడు వాయు దిగ్బంధనం చేసి నీటిపై తేలి ఉండడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ఘటనకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రం వేదికగా నిలిచింది. తాళ్లరేవు మండలం పిల్లంకకు చెందిన పురోహితుడు ఏలూరి వెంకట కామేశ్వర శర్మ (40) శనివారం సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరిణిలోకి దిగి 3.45 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాయు దిగ్బంధనాసనం వేశారు. జాతీయ జెండాను చేతబూని ఆసాంతం నీటిపై తేలి ఉన్నారు. దీన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
నేడు చంద్రగ్రహణం
సాక్షి, హైదరాబాద్: శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. కన్య, తుల, కుంభ, మిథున రాశులపై దాని ప్రభావం ఉంటుందని వేదపండితులు పేర్కొంటున్నారు. కన్యారాశిలోని హస్త నక్షత్రంపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గర్భిణులు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేసి గ్రహణ సమయంలో సూర్యకాంతి శరీరంపై పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణానంతరం సం ప్రోక్షణ జరిపాక భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆలయాల మూసివేత ఇలా... తిరుమల: ఉదయం 9.30- రాత్రి 8.30 దాకా యాదగిరిగుట్ట: ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం దాకా భద్రాచలం: మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7.45 దాకా కనకదుర్గ (విజయవాడ): ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 4 దాకా సింహాచలం: ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 6.30 దాకా ధర్మపురి: ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా అన్నవరం: ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 5.30 దాకా కాణిపాకం: ఉదయం 8 నుంచి రాత్రి 8.30 దాకా కొండగట్టు: ఉదయం 8.30 నుంచి ఆదివారం వేకువజాము 3 దాకా శ్రీశైలం: ఉదయం 6.30 నుంచి రాత్రి 8 దాకా వేములవాడ: ఉదయం 4 నుంచి రాత్రి 8.05 దాకా కాళేశ్వరం: ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 4 దాకా భద్రకాళి (వరంగల్): ఉదయం 11 నుంచి రాత్రి 7 దాకా (శ్రీకాళహస్తి ఆలయం మాత్రం శనివారమంతా తెరిచే ఉంటుంది. రాహు కేతు క్షేత్రం కాబట్టి ఈ ఆలయానికి గ్రహణం ప్రభావముండదని అర్చకులు తెలిపారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.) -
రేపు శ్రీశైలం ఆలయం మూసివేత
శ్రీశైలం : చంద్రగ్రహణం సందర్భంగా శనివారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయం మూసివేయనున్నారు. శనివారం వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహా మంగళహారతులు నిర్వహించిన అనంతరం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని, రాత్రి 8 గంటల తర్వాత ఆలయ ద్వారాలు తెరిచి దేవాలయశుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామి అమ్మవార్లకు పూజలు, మహానివేదన తదితర కార్యక్రమాలు చేపడతామని అధికారులు వెల్లడించారు. తిరిగి ఆదివారం ఉదయం దర్శన, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
4న చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
రంగారెడ్డి: ఏప్రిల్ 4న చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 10గంటలకు రథోత్సవం జరగనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ తెలిపారు. -
4న చంద్రగ్రహణం.. తిరుమల ఆలయం మూసివేత
తిరుమల: ఈ నెల 4న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. చంద్రగ్రహణం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు దివ్యదర్శనం రద్దు చేయనున్నట్టు తెలిపింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిలిపివేయనున్నట్టు టీటీడీ తెలిపింది. -
చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత
సుదీర్ఘ కాలం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సాయంత్రం 6.05 గంటల వరకు ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉంటుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలను మూసేస్తున్నారు. ప్రధానంగా తిరుమల ఆలయం, విజయవాడలోని దుర్గగుడి, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వాకాతిరుమల ఆలయాలను మూసేస్తున్నారు. దుర్గ గుడిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసేస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా నాగులాపురంలోని దేవ నారాయణస్వామి, వలిగొండేశ్వర స్వామి ఆలయాలను ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసేస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసేస్తున్నట్లు అక్కడి ఆలయ ఈవో శ్రీనాథ్ చెప్పారు. -
నేడు సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం