చంద్ర గ్రహణం కారణంగా కడప నగరంలోని దేవాలయాలను మూసివేశారు.
చంద్ర గ్రహణం కారణంగా కడప నగరంలోని దేవాలయాలను మూసివేశారు. ఈ ప్రాంతంలో గ్రహణం మధ్యాహ్నం 3.45 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఉండగా, ఆలయాలను మాత్రం ఉదయమే మూసి వేశారు. ప్రభాత పూజలనంతరం దేవాలయాల్లో రోజువారి పూజలను నిలిపి వేసి ఆరు గంటలకే దేవాలయాల ప్రధాన తలుపులు మూసి వేశారు.
శనివారం కావడంతో పలువురు భక్తులు ఆలయాలకు వెళ్లి తలుపులు మూసి ఉండడం చూసి కారణం తెలుసుకుని నిరాశగా వెనుదిరిగారు. గ్రహణం ముగిసిన తర్వాత తిరిగి ఆలయాలు తెరిచి శుద్ధి చేశారు. మూలమూర్తులకు విశేష అభిషేకాలు చేసి నైవేద్యం తదితర కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించారు. - కడప కల్చరల్