
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న సాయంత్రం 5 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 వరకు శ్రీవారి ఆలయం మూసేయనున్నారు. చంద్రగ్రహణం 27న రాత్రి 11.54కు ప్రారంభమై 28న ఉదయం 3.49కు పూర్తవుతుంది. 4.15కు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యా హవచనం చేస్తారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి సర్వదర్శ నం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం వల్ల 27న కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది.