సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం | Supermoon total lunar eclipse | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం

Published Sat, Jul 14 2018 4:18 AM | Last Updated on Sat, Jul 14 2018 4:18 AM

 Supermoon total lunar eclipse - Sakshi

న్యూఢిల్లీ: ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఈనెల 27, 28వ తేదీల్లో సాక్షాత్కారం కానుంది. దాదాపు గంటా 43 నిమిషాలపాటు కొనసాగే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం జూలై 27వ తేదీ అర్ధరాత్రి 11.54 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ గ్రహణంగా మారనుంది. అలా 2 గంటల 43 నిమిషాలపాటు కొనసాగి తిరిగి 28వ తేదీ వేకువజామున 3 గంటల 49 నిమిషాలకు గ్రహణంవీడనుందని భూగోళ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఆస్ట్రేలియా, ఆసియాలో పూర్తిగా కనిపించనుంది. ఇది ఈ శతాబ్దం(2001 నుంచి 2100కాలం)లో అతి ఎక్కువ కాలం పాటు కొనసాగే చంద్రగ్రహణంగా రికార్డులకెక్కనుందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement