చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత
సుదీర్ఘ కాలం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సాయంత్రం 6.05 గంటల వరకు ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉంటుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలను మూసేస్తున్నారు. ప్రధానంగా తిరుమల ఆలయం, విజయవాడలోని దుర్గగుడి, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వాకాతిరుమల ఆలయాలను మూసేస్తున్నారు.
దుర్గ గుడిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసేస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా నాగులాపురంలోని దేవ నారాయణస్వామి, వలిగొండేశ్వర స్వామి ఆలయాలను ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసేస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసేస్తున్నట్లు అక్కడి ఆలయ ఈవో శ్రీనాథ్ చెప్పారు.