temples closing
-
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్ సమర్ధించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. ఇక శ్రీరామ నవమికి ఈ ఏడాది భక్తులు తమ గుండెళ్లో కొలుచుకోవాలన్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవమి నాడు రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహించుకుందామని ఆయన భక్తులకు సూచించారు. అదేవిధంగా చిలుకూరు ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేయడం తనకు బాధగానే ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాన అర్చకులు రంగారాజన్ తెలిపారు. -
చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత
సుదీర్ఘ కాలం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సాయంత్రం 6.05 గంటల వరకు ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉంటుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలను మూసేస్తున్నారు. ప్రధానంగా తిరుమల ఆలయం, విజయవాడలోని దుర్గగుడి, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వాకాతిరుమల ఆలయాలను మూసేస్తున్నారు. దుర్గ గుడిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసేస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా నాగులాపురంలోని దేవ నారాయణస్వామి, వలిగొండేశ్వర స్వామి ఆలయాలను ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసేస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసేస్తున్నట్లు అక్కడి ఆలయ ఈవో శ్రీనాథ్ చెప్పారు.