సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. ప్రోటోకాల్ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలుకావడం లేదు. సిఫార్సు లెటర్స్ ఉంటే చాలు అంతా వీఐపీలే అన్నట్టుగా, ఉదయం నుంచి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూకట్టారు. క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.
500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లలోనే పడిగాపులు పడుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులతో 500 రూపాయల క్యూలైన్లలోని భక్తులు వాగ్వాదానికి దిగారు. ఐదు రూపాయల ఎందుకు పెట్టారంటూ మండిపడ్డారు.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై లడ్డూలు అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేదు ఇవ్వటం కుదరదంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో ఒకే ఒక్క లడ్డూ సేల్ పాయింట్‌ను అధికారులు ఏర్పాటు చేయడంతో దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: గోల్‌మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా!
Comments
Please login to add a commentAdd a comment