Vip Darshan
-
ఆ 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వైకుంఠ ఏకాదశి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన సీవీఎస్వో శ్రీధర్‌తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ...పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతించాలన్నారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలగు వారికి విశేష దర్శనాలను ఆ పది రోజులూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేశారు.వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తారని తెలిపారు. అలాగే, తిరుమలలో జనవరిలో జరిగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా అంశాలపై గురువారం ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తిరుమలలో అధికారులతో సమీక్షించారు. రేపు ’డయల్ యువర్ ఈవో’ టీటీడీ డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం ఈ నెల 28న శనివారం ఉదయం 9–10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగుతుందని టీటీడీ అధికారులు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్యామలరావుకు ఫోన్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఇంద్రకీలాద్రి: వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తుల అగచాట్లు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. ప్రోటోకాల్ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలుకావడం లేదు. సిఫార్సు లెటర్స్ ఉంటే చాలు అంతా వీఐపీలే అన్నట్టుగా, ఉదయం నుంచి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూకట్టారు. క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లలోనే పడిగాపులు పడుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులతో 500 రూపాయల క్యూలైన్లలోని భక్తులు వాగ్వాదానికి దిగారు. ఐదు రూపాయల ఎందుకు పెట్టారంటూ మండిపడ్డారు.మరోవైపు ఇంద్రకీలాద్రిపై లడ్డూలు అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేదు ఇవ్వటం కుదరదంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో ఒకే ఒక్క లడ్డూ సేల్ పాయింట్‌ను అధికారులు ఏర్పాటు చేయడంతో దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది.సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. -
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,027 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్ధు చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 61,499 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,789. మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.14 కోట్లు ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. నేడు విఐపీ దర్శనాలు రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి కార్యక్రమం, సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన టిటిడి. కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పి వేసి గర్భగుడిని, పూజా సామాగ్రిని సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ది చేశారు. తిరుమంజనం సందర్భంగా అష్టదళ పాద పద్మ ఆరాధన సేవ రద్దు. 23 న వైకుంఠ ఏకాదశి, టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము అన్నారు. -
ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇసుకేస్తే రాలని జనం
సాక్షి, హైదరాబాద్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంగణం మారుమోగిపోతోంది.ఆదివారం మధ్యాహ్నం వరకే లక్షన్నర మంది భక్తుల దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తోంది ఖైరతాబాద్ మహా గణపతి నిర్వాహక కమిటీ. సెప్టెంబర్ 28వ తేదీన నగరంలో నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో జనం ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దాటాక.. జనం రావడం ఒక్కసారిగా పెరిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర లైన్లో నిల్చున్నారు భక్తులు. దీంతో.. వీఐపీ దర్శనాలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ సందడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు.. మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క.. నగరంలో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వందల కొద్దీ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు.. శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారు. -
తిరుమల: సర్వదర్శనానికి 12గం. సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3. గంటలు పడుతోంది. శుక్రవారం నాడు.. స్వామివారిని 69,378 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 28,371 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు రూపాయలుగా తేలింది. రెండు బ్రహ్మోత్సవాలు అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: వేడుకగా అర్జున తపస్సు -
తిరుమల : అంగరంగ వైభవంగా పుష్పపల్లకీ సేవ (ఫోటోలు)
-
తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం
సాక్షి, తిరుపతి: తిరుమలలో ఇవాళ(సోమవారం, జులై 17) శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను సైతం రద్దు చేసింది. ఇక సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా.. బంగారం వాకిలిలో ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు. ఆపై స్వామివారికి రూపాయి హారతి ఇస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్ప పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి శ్రీవారి ఆలయం ఇప్పటికే ముస్తాబయ్యింది. ఉదయం బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో ఉభయదేవేరుల సమేతంగా మలయప్పస్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేయనున్నారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. గతంలో ఆణివార ఆస్థానం రోజు నుండి శ్రీవారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేది. అయితే టీటీడీ ఏర్పడ్డాక ఏప్రిల్ నుండి ఆదాయ వ్యయాలు అనుసరిస్తూ వస్తోంది. జియ్యంగార్ల వస్త్ర సమర్పణ తిరుమల పెద జియ్యర్ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామిని ఆశీర్వదిస్తారు. భక్తులకు శుభవార్త భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదీ చదవండి: వాళ్లకు డబ్బులు ఇవ్వకండి.. భక్తులకు ఈవో సూచన -
Srisailam Temple: శ్రీశైలంలో సామాన్య భక్తులకు పెద్దపీట
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సగటున 20 వేల నుంచి 25 వేల మంది, ప్రభుత్వ సెలవు రోజుల్లో 40 వేల నుంచి 50వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. శ్రావణమాసం, కార్తీకమాసం తదితర పర్వదినాల్లో 70 వేల నుంచి 80 వేల దాకా భక్తులు వస్తుంటారు. వీరు సర్వదర్శనం క్యూలలో వెళ్లి మల్లన్నను దర్శించుకుంటారు. దర్శన సమయంలో వీఐపీలు వస్తే సర్వదర్శన క్యూలలోని సామాన్య భక్తులు కొద్దిసేపు ఆగాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు సులభంగా స్వామిని దర్శించుకునేలా వీఐపీ ప్రోటోకాల్ దర్శన విధానంలో మార్పులు చేసింది. దీనిని ఈనెల 5 నుంచి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది. రోజుకు రెండు సార్లు మాత్రమే దేవస్థానం ప్రవేశపెట్టిన నూతన విధానంలో రోజుకు రెండు సార్లు అది కూడా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రముఖులకు భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి 6.15 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రముఖులకు విరామ దర్శనాన్ని, అభిషేకం, కుంకుమార్చన జరిపిస్తారు. ఆలయానికి వచ్చే ప్రముఖులు తమ పర్యటన వివరాలను కనీసం రెండు రోజులు ముందుగానే తెలియజేయాలనే నిబంధన పెట్టారు. సిఫారసు లేఖల విధానంలో మార్పులు ప్రముఖులు వసతి, దర్శనం, ఆర్జితసేవలను ఇతరులకు సిఫారసు చేసేందుకు ఎస్ఎంఎస్, వాట్సాప్ విధానాన్ని వినియోగించేవారు. దీనిని రద్దు చేసి విధిగా లెటర్‌హెడ్ పై కనీసం రెండు రోజులు ముందుగా దేవస్థానానికి సమాచారం ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలాగే సిఫారసు లేఖపై స్పష్టంగా వసతి కావాల్సిన తేదీలు, దర్శనం, ఆర్జితసేవల వివరాలను, దర్శనానికి వచ్చే భక్తుల ఆధార్, ఫోన్ నెంబర్లను తప్పనిసరిగా పొందుపర్చాలి. యథావిధిగా స్పర్శ దర్శన వేళలు ప్రస్తుతం అమలులో ఉన్న స్పర్శ దర్శన సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 8.15 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.15 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు స్పర్శదర్శనం కల్పిస్తారు. అలాగే ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భక్తులకు ఉచిత స్పర్శదర్శనం కొనసాగుతోంది. సామాన్య భక్తుల కోసమే మార్పులు సామాన్య భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు ప్రోటోకాల్ దర్శనంలో మార్పులు చేశాం. దేవస్థాన ఆగమ కమిటీ, దేవస్థానం ధర్మకర్తల మండలి సూచనల మేరకు ఈ మార్పులు చేశాం. ఈ కొత్త విధానంలో రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రముఖులకు స్వామి అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలను కల్పిస్తున్నాం. అలాగే ప్రముఖుల సిఫారసు లేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశాం. ఈ నూతన విధానం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చాం. – ఎస్.లవన్న, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
ఇంద్రకీలాద్రి: రేపు, ఎల్లుండి వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాల రద్దు
సాక్షి, విజయవాడ: రేపు, ఎల్లుండి ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. రేపు,ఎల్లుండి సాధారణ దర్శనాలను మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించమని కలెక్టర్ తెలిపారు. చదవండి: ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ -
శ్రీవారిని దర్శించుకున్న నిహారిక దంపతులు
సాక్షి, తిరుమల: నూతన దంపతులు నిహారిక కొణెదల, చైతన్య జొన్నలగడ్డ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యల వివాహ వేడుకను డిసెంబర్ 9న జైపూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 11 (శుక్రవారం)న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు సినీ ప్రముఖలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్) -
‘వీఐపీ అయినా క్యూలైన్లో రావాల్సిందే’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం(అక్టోబర్ 14) రోజు మూలా నక్షత్రం సందర్బంగా సరస్వతీ దేవీ అవతారంలో కనకదుర్గమ్మను అలంకరించనున్నారు. ప్రతి యేటా మూడు లక్షల మందికి పైగా భక్తులు మూలా నక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో రేపటి ఉత్సవాల నిర్వహణ గురించి దుర్గ గుడి ఈవో వి. కోటేశ్వరమ్మ పాలకమండలి సభ్యులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తులకు అంతరాయల దర్శనం ఇవ్వలేమని తెలిపారు. ముఖమండప దర్శనానికి రూ.100 టికెట్ పెడుతున్నామని, రేపు ఏ వీఐపీని ప్రత్యేకంగా చూడమని స్పష్టం చేశారు. వీఐపీ అయినా క్యూలైన్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ లెవెల్ వీఐపీలకు తప్ప ఎవరికీ ప్రత్యేక దర్శనం లేవని పేర్కొన్నారు. అందరూ క్యూలైన్లో నిలబడితే అమ్మ వారి సేవ చేసినట్టేనని వివరించారు. పాలకమండలి మధ్య విభేదాలు ఇంట్లో కుటుంబసభ్యుల గొడవలాంటిదన్నారు. పాలకమండలి సభ్యులు కూడా టికెట్లు కొనేల చర్యలు చేపడతామన్నారు. దుర్గమ్మ గుడి పవిత్రతను కాపాడాలని, రాజకీయ పార్టీల ప్రచారాలకు తావులేదని పేర్కొన్నారు. -
దర్శన భాగ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వ్యయప్రయాసల కోర్చి పిల్లాపాపలతో మేడారం వస్తున్న భక్తులకు వనదేవతల దర్శనం దుర్లభంగా మారుతోంది. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, గద్దెలపై దేవతలకు మొక్కులు చెల్లించే విధానంలో స్పష్టమైన పద్ధతి లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఐపీ, అధికారుల సిఫార్సుతో వచ్చే ఇతర కుటుంబాలు, స్నేహితుల స్పెషల్ దర్శనాలతో చిక్కులు ఎక్కువవుతున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరింది. ఇలా వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించే విషయంలో దేవాదాయశాఖ అధికారులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిఫార్సులు.. భక్తుల రద్దీ ఎక్కువైతే గేట్లకు తాళం వేసి గద్దెలపైకి ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. సాధారణ భక్తులు, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు దర్శ నం కోసం అడిగితే మా దగ్గర ఏమీ లేదు. పోలీసుల దగ్గరే గేట్ల తాళాలు ఉన్నాయంటూ దేవాదాయశాఖ సిబ్బంది సమాధానమిస్తున్నారు. దీంతో దూరం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే సమయంలో వీఐపీలు, ప్రభుత్వ అధికారుల బంధువులు, వారి సన్నిహితులు వస్తే గేట్లకు ఉన్న తాళం తీస్తూ గద్దెలపైకి అనుమతిస్తున్నారు. వీరితోపాటు గద్దెలపైకి చేరుకునేందుకు అక్కడున్న ఇతర భక్తులు ప్రయత్నిస్తున్నారు. దీంతో గద్దెల గేట్ల వద్ద తీవ్రమైన తోపులాట జరుగుతోంది. సిఫార్సు చేయించుకునే వారిని గద్దెలపైకి అనుమతించి, సాధారణ భక్తులను అనుమతించకపోవడంతో వాగ్వావాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు ఒక్కసారైనా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఈ నిరాదరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తే తమ పట్ల వివక్ష చూపారంటూ నిరాశ చెందుతున్నారు. దాగుడుమూతలు మేడారంలో రద్ధీ లేని రోజుల్లో ప్రధాన ప్రవేశ మార్గం గుండా భక్తులు గద్దెలపైకి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు మొదట సమ్మక్క గద్దె మొదటి గేటు ద్వారా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించి రెండో గేటు గుండా బయటకు వస్తారు. అక్కడి నుంచి సారలమ్మ గద్దెకు మొదటి గేటు ద్వారా లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని రెండో గేటు ద్వారా బయటకు వెళ్తారు. సెల వు రోజుల్లో భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరుకోవడంతో ప్రధాన ప్రవేశ మార్గాన్ని పూర్తిగా వీఐపీలకు కేటాయిం చారు. క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు ఒకటే గేటు ద్వారా లోపలికి వెళ్లడం, బయటకు రావడం కష్టంగా మారింది. ఎప్పుడో ఒకసారి వచ్చే వీఐపీ భక్తుల కోసం సమ్మక్క గద్దెకు సంబంధించి ఒక గేటు పూర్తిగా మూసివేయడంతో భక్తులు పాట్లు పడుతున్నారు. ఇబ్బందులు గద్దెలపై భక్తులు సమర్పించిన బంగారం, కొబ్బరి నీళ్లు కలిసి గద్దెల ప్రాంగణం తడిగా మారుతోంది. మొక్కు చెల్లించే బంగారాన్ని(బెల్లం) తలపై పెట్టుకుని తడిగా ఉన్న గ్రానైట్ ఫ్లోర్‌పై తీవ్రమైన తోపులాట మధ్య లోపలికి బయటికి వెళ్లడం కష్టంగా మారింది. వృద్ధులు, చిన్నపిల్లలను ఎత్తుకుని గద్దెలపైకి చేరే భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆదివాసీ వలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఒకే విధానం అమలు చేయకుండా వీఐపీ, అధికారుల బంధువులకు ఓ విధానం, సాధారణ భక్తులకు ఓ విధానం అమలు చేయడంతో భక్తులను అదుపు చేయడం కçష్టంగా ఉందంటున్నారు. గద్దెలపైకి భక్తులను అనుమతించే విషయంలో జనవరి 30 వరకు కచ్చితమైన విధానం అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దూరం నుంచి వచ్చే తమకు ప్రశాంతంగా దర్శనం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
-
తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్లయించింది. వీఐపీ దర్శనాల్లో మూడో కేటగిరిని తొలిగించామని, ఇక మెదటి రెండు కేటగిరిలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో డి.సాంబశివరావు సోమవారం మీడియాకు తెలిపారు. ఈ నిబంధన ఏప్రిల్ 7 నుంచి 10 వారాలపాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. శుక్ర, శని వారల్లో వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలు రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో రద్దీని బట్టి మార్పులు చేస్తామని తెలిపారు. వకులమాత అతిథి భవన నిర్మాణానికి రూ.39 కోట్లు కేటాంయించామని, రాయచోటి, అప్పలాయగుంటలో రూ.4.5 కోట్లతో కళ్యాణ మండపాలు నిర్మించనున్నట్లు ఈవో తెలిపారు. -
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం శుక్రవారం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 9 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 9 గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా ఈ రోజు నుంచి 4 వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం గాంధీ జయంతి, పెరటాశి నెలలో మూడో శనివారం, ఆదివారం సెలవు కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు సిఫారసు లేఖలకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. ఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు మాత్రమే తక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయిస్తారు. -
వీఐపీ దర్శనాలు రద్దు : టీటీడీ
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునే వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. నేటి నుంచి జనవరి 2వ తేదీన వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రం పరిమిత సంఖ్యలో వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది చివర వారంతోపాటు నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తిరమలకు భక్తులు పోటెత్తుతున్నారు.