
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3. గంటలు పడుతోంది.
శుక్రవారం నాడు.. స్వామివారిని 69,378 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 28,371 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు రూపాయలుగా తేలింది.
రెండు బ్రహ్మోత్సవాలు
అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: వేడుకగా అర్జున తపస్సు