sarva darshanam
-
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ లైన్ టీబీసీ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకోగా 30,320 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.26 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శనం టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలై న్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్ లో అనుమతించరని తెలియజేశారు. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.ఇక, సోమవారం శ్రీవారిని 65,874మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 23,782 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. -
జులై 29: తిరుమలలో నేటి భక్తుల రద్దీ సమాచారం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. నేరుగా స్వామి వారికి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే సర్వ దర్శనానికి ఎనిమిది గంటల టైం పడుతోంది. ఇక.. ప్రత్యేక దర్శనానికి మాత్రం 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. నిన్న(ఆదివారం, జులై 29) శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.93 కోట్లుగా తేలింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది. దీంతో అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. అలాగే.. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. సర్వ దర్శనానికి 18 గంటలు
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 27 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..5 గంటల సమయం పడుతోంది. నిన్న (శుక్రవారం) 65,980 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 27,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.21 కోట్లుగా లెక్క తేలింది. -
July 06 : తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు . నిన్న 65,775 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
July 03: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 67,398 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 26,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
July 2: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 75,449 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
TTD : శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 81,005 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 28,244 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
June 30: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 80,404 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
June 28: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత సర్వ దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి.. బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్న ఉన్నారు. సుమారు 18గం. సమయం పడుతోంది. ఇక టైం స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. మరోవైపు రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 60,782 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 30,100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా తేలింది. -
June 22: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . నిన్న 72,294 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,855 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రాజసంతిరుపతి: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు.బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.వాహన సేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డిఎల్ఓ శ్రీ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద రాజన్, విజివో శ్రీ బాలి రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
June13 :తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 75,068 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
June12: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 18 గంటలు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 76,665 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు సర్వదర్శనం టోకెన్ల రద్దు..
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతోంది. ఈ సందర్భంగా డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబరు 22న అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో మంజూరు చేసే సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనంలో ఆరోజు శ్రీవారిని దర్శించుకోవచ్చు. డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది. కార్యక్రమాల వివరాలు డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 10 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుండి భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలతో సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం చేస్తారు. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు. డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈరోజును స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి అని కూడా పిలుస్తారు. ఆర్జిత సేవలు రద్దు ► ఈ పర్వదినాల నేపథ్యంలో డిసెంబరు 22 నుండి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. సహస్ర దీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. ► ఈ పది రోజుల పాటు ఇతర ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ► గతంలో లాగనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. -
తిరుమల: తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలే!
సాక్షి, తిరుపతి: తిరుమలలో.. అదీ శనివారం(నేడు) భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దర్శనం కోసం నేరుగా భక్తుల్ని అనుమతిస్తుండగా.. కేవలం మూడు గంటల సమయం పడుతోంది. పెరటాసి మాసం.. పైగా మూడో శనివారం అయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తిరుమలలో శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,104. తలనీలాలు 25,044 మంది సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్లుగా తేలింది. మరోవైపు ఈ నెల 9వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 14వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. -
Tirumala: పెరిగిన భక్తుల రద్దీ.. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు భక్తులు. సర్వ దర్శనానికి 12 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లుగా తేలింది. 29,508 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదిలా ఉంటే.. నేడు నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరగనుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. -
తిరుమల: సర్వదర్శనానికి 12గం. సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3. గంటలు పడుతోంది. శుక్రవారం నాడు.. స్వామివారిని 69,378 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 28,371 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు రూపాయలుగా తేలింది. రెండు బ్రహ్మోత్సవాలు అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: వేడుకగా అర్జున తపస్సు -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. పది కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (మంళవారం) 64 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లుగా లెక్క తేలింది. తిరుమల పుష్ప పల్లకీ సేవ.. ఫొటోలు వీక్షించండి -
తొలి ఏకాదశి.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,615గా ఉండగా.. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లుగా తేలింది. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న(సోమవారం జూన్ 26) శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్లుగా లెక్క తేలింది. ఇదీ చదవండి: ఏపీ: ఇక్కడ సీటొస్తే విదేశాల్లో చదవొచ్చు! -
TTD: శ్రీవారి ఉచిత(సర్వ) దర్శనానికి 24 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండడంతో.. క్యూలైన్ల బయట వేచి ఉన్నారు భక్తులు. ఈ క్రమంలో శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నేటి(శుక్రవారం) నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఎనభైవ దశకం నుంచి జేష్టాభిషేకం ప్రారంభించారు. ఉత్సవమూర్తుల అరుగుదల గురికావడంతో బింభరక్షనార్థం జేష్టాభిషేకం నిర్వహిస్తారు. 🙏 సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఉత్సవమూర్తులకు కవచాల తొలగిస్తారు. ఉత్సవమూర్తులకు కవచాలు తిలగించి, మరమ్మత్తులు చేపడుతారు. 🙏 మొదటి రోజు వజ్రాభరణాలు, రెండవరోజు ముత్యాల ఆభరణాలు, మూడవరోజు స్వర్ణకవచాలతో అలంకరణ చేపడతారు. ఎల్లుండి అర్జిత సేవలు రద్దు చేస్తారు. -
శ్రీవారి దర్శనానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
-
తిరుమల: ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. కోవిడ్- 19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి నిలిపి వేసిన ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను నేటి నుంచి కొనసాగించనున్నారు. ఫిబ్రవరి 16న (బుధవారం) దర్శనం కోసం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టీటీడీ టోకెన్లను జారీ చేస్తోంది. తెల్లవారుజామున నుంచే టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. చదవండి: (పార్టీ కార్యకర్త వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్) -
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వ దర్శన టోకెన్ల జారీ