
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. పదికిపైగా..
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. పది కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక నిన్న (మంళవారం) 64 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లుగా లెక్క తేలింది.