hundi collection
-
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. పది కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (మంళవారం) 64 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లుగా లెక్క తేలింది. తిరుమల పుష్ప పల్లకీ సేవ.. ఫొటోలు వీక్షించండి -
తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం
సాక్షి, తిరుమల: తిరుమలలో మార్చి మూడో వారం నుంచి పూర్తి స్థాయిలో సర్వదర్శనం స్లాట్ విధానం ప్రవేశపెడుతున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ నెల 9, 29న వయోవృద్ధలు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా ఈ నెల 10, 30వ తేదీలలో చంటి బిడ్డలు, తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఎన్నడా లేని విధంగా లక్షా 75 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. గత డిసెంబర్లో శ్రీవారిని 22.59 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండి ఆదాయం రూ. 91.53 కోట్ల ఆదాయం రాగా.. 92 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసామన్నారు. కాగా, 2017 ఏడాదిగాను శ్రీవారి సేవలో 2.73 కోట్ల మంది భక్తులు పాల్గొనగా..10 కోట్ల 67 లక్షల లడ్డూల విక్రయాలు జరగగా, హుండి ఆదాయం రూ. 995.89 కోట్లు వచ్చినట్టు వెల్లడించారు. అయితే 2016 లో ఆదాయం 1,046 కోట్లు వచ్చినట్లు ఆయన వివరించారు. మరో వైపు ఈ నెల 24 వ తేదీన రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సింఘాల్ తెలిపారు. -
వడ్డికాసుల వాడి ఆదాయం రూ.1.60 కోట్లు
దేవరపల్లి (ద్వారకా తిరుమల) : ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. 20 రోజులకు నగదు రూపంలో రూ.1,59,80,346 ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ సైతం భారీగా రావడం విశేషం. కానుకల రూపంలో 627 గ్రాముల బంగారం, 7.728 కేజీల వెండిని భక్తులు సమర్పించుకున్నారు. నగదు రూపంలో రోజుకు సగటున 7.99 లక్షల ఆదాయం లభించినట్టు ఈవో వి.త్రినాథరావు చెప్పారు. హుండీల ఆదాయాన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సోమవారం లెక్కించారు. -
19 రోజులు.. రూ.1.35 కోట్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించా రు. ఆలయ ఆవరణలో ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 19 రోజులకు నగదు రూపంలో రూ. 1,35,45,752, కానుకల రూపంలో 371 గ్రాముల బంగారం, 4.236 కిలోల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. ఓ విదేశీ భక్తుడు అమెరికన్ కరెన్సీ నోట్ల కట్టను హుండీలో సమర్పించాడని, దీంతో పాటు ఇతర దేశాల కరెన్సీ నోట్లు లభించాయని చెప్పారు. -
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రానికి శ్రీవారిని 63,267మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.90 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా నడకమార్గం భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. -
వెంకన్న ఆదాయం రూ. 89 కోట్లు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని జూన్ నెలలో 24.7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. 94 లక్షల లడ్డూలు భక్తులకు పంపిణీ చేశామని.. ఈ నెలలో హుండీ ద్వారా రూ. 89 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. ప్రత్యేక దర్శన టికెట్లు 90 రోజులు ముందుగానే ఆన్లైన్ ద్వారా తీసుకునే ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలోనే బంగారు, వెండి శ్రీవారి డాలర్లతో పాటు రాగి డాలర్లను కూడా భక్తులకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు
అన్నవరం (తూర్పు గోదావరి జిల్లా) : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి హుండీల ద్వారా గత 31 రోజులకు రికార్డు స్థాయిలో రూ.1,22,70,622 ఆదాయం వచ్చింది. దేవస్థానంలో హుండీలను తెరచి సిబ్బంది మంగళవారం లెక్కించారు. రూ.1,16,64,597 నగదు, రూ.6,06,025 చిల్లర నాణేలు లభించాయని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో 40 గ్రాముల బంగారం, 1,060 గ్రాముల వెండి లభించాయి. అజ్ఞాత భక్తులు రెండు కట్టలుగా కట్టి రూ.ఏడు లక్షల నగదు సమర్పించారు. 17 దేశాల కరెన్సీ కూడా హుండీల్లో లభించినట్లు ఈఓ తెలిపారు. -
శ్రీవారి హుండీ చరిత్ర
-
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.70.82 లక్షలు
అన్నవరం (తూర్పుగోదావరి జిల్ల్లా) : సత్యదేవునికి హుండీల ద్వారా గత నెల రోజులకు రూ.70,82,250ల ఆదాయం సమకూరింది. హుండీలను శనివారం లెక్కించగా రూ.67,21,425 నగదు, రూ.3,60,825 చిల్లర నాణాలు, 45 గ్రాముల బంగారం, 605 గ్రాముల వెండి కూడా లభించాయని దేవస్ధానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. అమెరికా డాలర్లు 115, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 57, సింగపూర్ డాలర్లు ఆరు, సౌదీ అరేబియా రియల్స్ 68, ఇంగ్లాండ్ పౌండ్స్ 20, మలేషియా రిమ్స్ 68, రెండు జతల బంగారు గాజులు లభించాయన్నారు. హుండీల లెక్కింపులో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, సిబ్బంది, పురోహితులు, విశాఖపట్నానికి చెందిన శ్రీహరి సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు
బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలోని హుండీని దేవాదాయ శాఖ అధికారులు సోమవారం లెక్కించారు. ఆలయ ఈవో తిమ్మానాయుడు ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. గత మూడు నెలలుగా హుండీ లెక్కింపు జరగలేదని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. సోమవారం జరగిన హుండీ లెక్కింపులో రూ. 40లక్షల 13వేల మూడువందల నగదును భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి సమర్పించుకున్నారు. అంతేకాకుండా 24 తులాలకు పైగా బంగారం, 4కేజీల 245గ్రామలు వెండి ఆభరణాలు కానుకల రూపంలో వచ్చాయని ఈవో తెలిపారు. -
శ్రీనివాసుని రికార్డ్ కలెక్షన్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి ఆదివారం భక్తులు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. ఆదివారం ఆలయంలోని హుండీలో భక్తులు వేసిన కానుకలను సోమవారం సిబ్బంది పరకామణిలో లెక్కించారు. మొత్తం రూ.3.47 కోట్లు కాణుకలు స్వామివారికి భక్తులు సమర్పించుకున్నారు. అజ్ఞాత భక్తులు కొందరు వేయి రూపాయల నోట్ల కటల్ని వేసినట్లు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఒక రోజు హుండీ కానుకల్లో ఇదే అధిక మొత్తం. గతంలో ఒక రోజు అత్యధికంగా వచ్చిన హుండీ కానుకల్లో రూ.5.4 కోట్లు రికార్డుగా ఉంది.