సత్యదేవుని హుండీ ఆదాయం రూ.70.82 లక్షలు | Rs 70.82 lakh Hundi collection in Annavaram temple | Sakshi
Sakshi News home page

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.70.82 లక్షలు

Published Sat, Aug 29 2015 8:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

సత్యదేవునికి హుండీల ద్వారా గత నెల రోజులకు రూ.70,82,250ల ఆదాయం సమకూరింది.

అన్నవరం (తూర్పుగోదావరి జిల్ల్లా) : సత్యదేవునికి హుండీల ద్వారా గత నెల రోజులకు రూ.70,82,250ల ఆదాయం సమకూరింది. హుండీలను శనివారం లెక్కించగా రూ.67,21,425 నగదు, రూ.3,60,825 చిల్లర నాణాలు, 45 గ్రాముల బంగారం, 605 గ్రాముల వెండి కూడా లభించాయని దేవస్ధానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు.

అమెరికా డాలర్లు 115, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 57, సింగపూర్ డాలర్లు ఆరు, సౌదీ అరేబియా రియల్స్ 68, ఇంగ్లాండ్ పౌండ్స్ 20, మలేషియా రిమ్స్ 68, రెండు జతల బంగారు గాజులు లభించాయన్నారు. హుండీల లెక్కింపులో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, సిబ్బంది, పురోహితులు, విశాఖపట్నానికి చెందిన శ్రీహరి సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement