అన్నవరం (తూర్పు గోదావరి జిల్లా) : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి హుండీల ద్వారా గత 31 రోజులకు రికార్డు స్థాయిలో రూ.1,22,70,622 ఆదాయం వచ్చింది. దేవస్థానంలో హుండీలను తెరచి సిబ్బంది మంగళవారం లెక్కించారు. రూ.1,16,64,597 నగదు, రూ.6,06,025 చిల్లర నాణేలు లభించాయని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో 40 గ్రాముల బంగారం, 1,060 గ్రాముల వెండి లభించాయి. అజ్ఞాత భక్తులు రెండు కట్టలుగా కట్టి రూ.ఏడు లక్షల నగదు సమర్పించారు. 17 దేశాల కరెన్సీ కూడా హుండీల్లో లభించినట్లు ఈఓ తెలిపారు.