
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రానికి శ్రీవారిని 63,267మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.90 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా నడకమార్గం భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.