సాక్షి, తిరుమల: తిరుమలలో మార్చి మూడో వారం నుంచి పూర్తి స్థాయిలో సర్వదర్శనం స్లాట్ విధానం ప్రవేశపెడుతున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ నెల 9, 29న వయోవృద్ధలు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా ఈ నెల 10, 30వ తేదీలలో చంటి బిడ్డలు, తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఎన్నడా లేని విధంగా లక్షా 75 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు.
గత డిసెంబర్‌లో శ్రీవారిని 22.59 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండి ఆదాయం రూ. 91.53 కోట్ల ఆదాయం రాగా.. 92 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసామన్నారు. కాగా, 2017 ఏడాదిగాను శ్రీవారి సేవలో 2.73 కోట్ల మంది భక్తులు పాల్గొనగా..10 కోట్ల 67 లక్షల లడ్డూల విక్రయాలు జరగగా, హుండి ఆదాయం రూ. 995.89 కోట్లు వచ్చినట్టు వెల్లడించారు. అయితే 2016 లో ఆదాయం 1,046 కోట్లు వచ్చినట్లు ఆయన వివరించారు. మరో వైపు ఈ నెల 24 వ తేదీన రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment