Venkateswara Swami
-
వైఎస్ జగన్ సీఎం కావాలి
భూపాలపల్లి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తెలిపారు. 14 నెలల క్రితం జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుకోగా ఎలాంటి అవాంతరాలు లేకుండా యాత్ర పూర్తయినందుకు సోమవారం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. కిషన్ వెంట జిల్లా నాయకులు వెంకటరెడ్డి, నరేష్, కుమార్, సంపత్ ఉన్నారు. -
‘వెంకన్న చౌదరి’పై మురళీమోహన్ మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: కలియుగ దైవం తిరుమలేశుడికి కులాన్ని ఆపాదిస్తూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారలేదు. వేంకటేశ్వరుడిని ‘వెంకన్న చౌదరి’గా పేర్కొన్న వీడియో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడం, దీంతో టీడీపీ ఇరకాటంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్ శుక్రవారం మళ్లీ ఓ వీడియోను విడుదల చేశారు. నోరు జారడం సహజంగా జరిగేదేనని, దేవుడితో కూడా ఇదే చెప్పుకున్నానని అన్నారు. టంగ్ స్లిప్ సహజమే!: ‘‘రాజమండ్రిలో ఒక మీటింగ్‌లో పొరపాటున ‘వెంకన్న చౌదరి’ అన్నాను. అప్పటిదాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని ‘చౌదరిగారూ.. చౌదరిగారూ..’ అని మాట్లాడుకున్నాం. వెంకన్న చౌదరి అనడం టంగ్ స్లిప్పే తప్ప.. దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాను. ఎందుకంటే అసలు నాకు కులాల మీద నమ్మకమే ఉండదు. అలాంటిది వెంకటేశ్వరస్వామికి కులం ఎలా అంటగడతాను? టంగ్ స్లిప్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఉదయం పూజ చేసేటప్పుడు కూడా దేవుడికి మొక్కుకున్నా.. ‘టంగ్ స్లిప్ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు..’ అని దేవుడికి దండం పెట్టుకున్నా’’ అంటూ మురళీమోహన్ వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగింది?: బుధవారం రాజమండ్రిలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ఓటమికిగల కారణాలను విశ్లేషించారు. ఆ క్రమంలో మా ‘వెంకన్న చౌదరి’ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందంటూ ఏకంగా దేవుడికి కులాన్ని అంటగట్టేశారు. మురళీమోహన్ వ్యాఖ్యలు పెనుదుమారం రేగడంతో టీడీపీ ఇరాకటంలో పడింది. నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఇప్పుడు మురళీమోహన్ మరో వీడియోను పోస్ట్ చేశారు. -
శ్రీవారి సేవలో పీవీ సింధు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ఆరంభ దర్శనం సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, తీర్ధప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు పేర్కొన్నారు. అదేవిధంగా జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రి సుజనా చౌదరీలు కూడా ఈరోజు స్వామి సేవలో పాల్గొన్నారు. -
'మారిషస్‌లో అత్యంత ఎత్తైన శ్రీవారి విగ్రహం'
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం మారిషస్ ఉపాధ్యక్షుడు పరమశివం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలకు చేరుకున్నఆయనకు టీటీడీ ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పరమశివం మాట్లాడుతూ.. భారత్,మారిషస్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మారిషస్ 50వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 108 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీవారి విగ్రహాన్ని జూలై 1న మారిషస్‌లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. మారిషస్‌లో భారతదేశ వాతావరణమే ఉంటుందని.. హిందువుల పండుగలుకు ప్రభుత్వ సెలవులుతో ఉంటాయని తెలిపారు. -
తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం
సాక్షి, తిరుమల: తిరుమలలో మార్చి మూడో వారం నుంచి పూర్తి స్థాయిలో సర్వదర్శనం స్లాట్ విధానం ప్రవేశపెడుతున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ నెల 9, 29న వయోవృద్ధలు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా ఈ నెల 10, 30వ తేదీలలో చంటి బిడ్డలు, తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఎన్నడా లేని విధంగా లక్షా 75 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. గత డిసెంబర్లో శ్రీవారిని 22.59 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండి ఆదాయం రూ. 91.53 కోట్ల ఆదాయం రాగా.. 92 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసామన్నారు. కాగా, 2017 ఏడాదిగాను శ్రీవారి సేవలో 2.73 కోట్ల మంది భక్తులు పాల్గొనగా..10 కోట్ల 67 లక్షల లడ్డూల విక్రయాలు జరగగా, హుండి ఆదాయం రూ. 995.89 కోట్లు వచ్చినట్టు వెల్లడించారు. అయితే 2016 లో ఆదాయం 1,046 కోట్లు వచ్చినట్లు ఆయన వివరించారు. మరో వైపు ఈ నెల 24 వ తేదీన రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సింఘాల్ తెలిపారు. -
మన్యం కొండ తెలంగాణ తిరుపతి
కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా... కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మన్యంకొండ దేవస్థానం. తిరుపతి వెళ్లలేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సుచేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. సుమారు 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహం... ప్రత్యేకతలు. ఆహ్లాదభరిత వాతావరణం... ఎల్తైన గుట్టలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం, ఒడలు పులకింప జేసే చల్లనిగాలి, గుట్టపైనుంచి వచ్చే ఓంకారనాదం భక్తులను కట్టిపడేస్తాయి. దేవస్థానం చరిత్ర... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీరప్రాంతంలోగల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవాకార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబసభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో అర్ఘ్యం వదులుతుండగా చెక్కని శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషశాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. హనుమద్దాసుల కీర్తనలతో ఖ్యాతి... అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతోపాటు స్వామివారి ఉత్సవాలకు తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్తకుండలో అన్నం, పచ్చిపులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి నివేదిస్తారు. నిత్యకల్యాణం.. పచ్చతోరణం మన్యంకొండ దిగువ కొండవద్ద అలమేలు మంగమ్మ గుడి ఉంది. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. స్థలపురాణం... శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానానికి 58 ఏళ్ల చరిత్ర ఉంది. 1937లో అప్పటి నైజాంసర్కార్ దేవస్థానం నిర్మాణానికి దిగువ కొండ వద్ద 42 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఎలా వెళ్లాలి..? హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్లో దిగితే మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే మహబూబ్‌నగర్ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. పాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి. – అబ్దుల్ మొక్తదీర్,సాక్షి, దేవరకద్ర రూరల్, మహబూబ్‌నగర్ జిల్లా -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) స్వామివారిని 96,113 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.54 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
వేంకటేశ్వరుణ్ణి నా స్నేహితునిగానే చూస్తా
– నాగార్జున ‘‘వేంకటేశ్వరునితో నా అనుబంధం గురించి చెప్పాలి. చిన్నతనంలో అమ్మతో కలసి తొలిసారి తిరుపతి వెళ్లా. అయితే.. ‘అన్నమయ్య’ తర్వాత స్వామితో పరిచయం ఎక్కువ. ఆయన్ను స్నేహితునిగానే చూస్తా. కానీ, ఎప్పుడూ ఏమీ అడగలేదు. మొదటిసారి బాధతో ఒకటి అడిగా. సుస్తీ చేయడంతో అమ్మ చాలా బాధపడింది. అప్పుడు చూడడానికి వెళితే... నన్ను గుర్తు పట్టలేదు. ఏమీ చేయలేక నాన్న ముఖం తెల్లబోయింది. మరునాడు ‘స్వామీ... అమ్మని తీసుకువెళ్లు’ అనడిగితే తీసుకు వెళ్లారు. రెండోసారి నాన్న చివరి చిత్రం ‘మనం’ హిట్టవ్వాలని అడిగా. అదీ జరిగింది. అడిగినవన్నీ ఇస్తుంటే కోరికలు పెరుగుతాయి కదా! ‘నా అబ్బాయిలను బాగా చూసుకోండి’ అనడిగా. నెల తిరిగేలోపు వాళ్లిద్దరికీ స్వామి పెళ్లి కుదిరేలా చేశారు. ఆయనెప్పుడూ నాతోనే, మా ఇంట్లోనే ఉంటారు’’ అన్నారు అక్కినేని నాగార్జున. ఆయన హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ.మహేశ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన పాటల సీడీలను నాగచైతన్య, అఖిల్ విడుదల చేశారు. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ – ‘‘కీరవాణిగారి సంగీతం వింటుంటే కంట్లోంచి నీళ్లు అలా వస్తాయి. ఇందులో ‘కమనీయం..’ పాట చేస్తున్నప్పుడు నా ముందు వేంకటేశ్వరస్వామి, ఆయన సతీమణులు ఉన్నట్టు.. వాళ్లకి పెళ్లి చేస్తున్నట్టు కలలు వచ్చాయి. అదంతా పాట మహత్యం. హీరోగా అటూ ఇటూ అడుగులు వేస్తున్నప్పుడు ‘ఆఖరి పోరాటం’తో నేను నిలదొక్కుకునేలా చేశారు రాఘవేంద్రరావుగారు. ఆ తర్వాత ‘శివ’, ‘గీతాంజలి’ రకరకాల సినిమాలు చేశా. ‘వాళ్లందరూ గొప్ప సినిమాలు తీశారనుకుంటున్నావా? నేను అంత కంటే గొప్ప సినిమా తీస్తా’ అని ‘అన్నమయ్య’ తీశారు. తర్వాత ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’, ఇప్పుడీ ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం నాకు ఎంత ముఖ్యమంటే... మళ్లీ ఆయనతో పని చేస్తానో లేదో తెలీదు. ‘ఇది నా ఆఖరి చిత్రం’ అని ఆయన నాతో అన్నారు. అది అబద్ధమని అనుకుంటా. నాన్నగారికి ‘మనం’ హిట్టవ్వాలని మనసులో ఎంత కోరుకున్నానో... ఈ చిత్రం కూడా అంత క్లాసిక్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘అన్నమయ్య’, ‘రామదాసు’, ‘పాండురంగడు’ చిత్రాలు నేను చేస్తాననుకోలేదు. అంతా స్వామి దయే. ఆయన దగ్గరకు వెళ్లినప్పుడల్లా... ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ భక్తుడి కథలే. స్వామి గురించి ఏం తీయలేదనే బాధ ఉండేది. అప్పుడే ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చేయాలని పించింది’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘వేంకటేశ్వర స్వామి మా కులదైవం. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు స్వామివారి గురించి చెబుతున్నాం. ఇది మరో ‘అన్నమయ్య’. అంత కన్నా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు ఏ. మహేశ్‌రెడ్డి. ‘‘ఈ చిత్రంలో చేసింది చిన్న పాత్రే. కానీ, బంపర్ ఆఫర్ ఏంటంటే... చాలాకాలం తర్వాత నాపై ఓ పాట, అదీ అనుష్కతో చిత్రీకరించారు’’ అన్నారు జగపతిబాబు. ‘‘నాన్నగారి కెరీర్ చూస్తుంటే... ట్రెండ్‌ని పట్టించుకోకుండా, ఆయన ట్రెండ్‌లో ఆయన వెళ్తుంటారు. అదో ట్రెండ్‌లా సెట్ అవుతుంది. నటుడిగా నాకు ఆయనే స్ఫూర్తి’’ అన్నారు నాగచైతన్య. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ‘శాంతా బయోటెక్’ వరప్రసాద్, అక్కినేని అమల, చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, నటీనటులు అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, సౌరభ్‌జైన్, విమలా రామన్, అస్మిత, ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్‌రెడ్డి, రచయిత జేకే భారవి పాల్గొన్నారు. -
వెండి కిరీటం సమర్పణ
తణుకు అర్బన్ : స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన వేంకటేశ్వరస్వామికి ఉండ్రాజవరం మండలం పాలంగికి చెందిన ద్వారంపూడి నాగిరెడ్డి, లావణ్య దంపతులు, కొవ్వూరి పెద వెంకటరెడ్డి, నాగమణి దంపతులు బుధవారం వెండి కిరీటాన్ని సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వెంకటరెడ్డి, పీపీ రంగరాజన్ పాల్గొన్నారు. -
పవిత్రోత్సవం..పరిసమాప్తం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు, అభిషేకాలు చేసి, యాగశాలలో పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల సమేత వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమణమూర్తి, దేవస్థానం చైర్మన్ ఉప్పల శివ రామ ప్రసాద్, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, అర్చకులు కురవి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉప్పల విజయ దేవ శర్మ, ప్రభాకర్ శాస్త్రి, పెళ్లూరి వెంకట రాయ శర్మ, సిబ్బంది ఎస్.విజయ కుమారి, కేవీఆర్.ఆంజనేయులు పాల్గొన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వెళ్లే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. -
వెంకటేశ్వరస్వామికి థ్యాంక్స్ : ఛోటా కె. నాయుడు
‘‘సంజు (సందీప్) ఓ కథ తీసుకొచ్చి, నన్ను వినమన్నాడు. నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బాగా నచ్చింది. ‘ఠాగూర్’ మధుకి ఈ కథ చెబితే, చేద్దామన్నారు. గ్యారంటీ హిట్ అనే నమ్మకంతో ఈ చిత్రం చేశాం. మొదటి మూడు రోజుల్లో దాదాపు ఆరు కోట్లు వసూలు చేసి, మాకు ఘనవిజయాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు చెప్పాలి’’ అని ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు అన్నారు. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్‌కపూర్ ముఖ్య పాత్రల్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ ఇటీవలే విడులైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ఛోటా ఇంకా మాట్లాడుతూ -‘‘ ‘టైగర్’ ముగిసిన తర్వాత మొక్కు అంటూ తిరుపతి వెళ్లి, సంజు తలనీలాలు సమర్పించాడు. కానీ, ఇంకా ఏదో సన్నివేశాలు తీయాల్సి వచ్చింది. గుండుతో ఉన్నాడు కాబట్టి, విగ్ తయారు చేయిస్తే, అది సెట్ కాలేదు. దాంతో మూడు నెలలు ఆగాం. ఈ గ్యాప్‌లో ఎడిటింగ్ మీద బాగా దృష్టి పెట్టాం. అది చిత్రవిజయానికి దోహదపడింది. అందుకే, ఆ వెంకటేశ్వరుడికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరం చాలా ఇష్టపడి చేశాం. టైటిల్ మాస్‌గా ఉన్నా కూడా ఆడియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఇష్టపడుతున్నారు. ఈ సినిమా ఫలితం విని ఏడ్చేశాను’’ అని సందీప్ కిషన్ అన్నారు. రజనీకాంత్, చిరంజీవి వంటి సూపర్‌స్టార్స్‌తో పనిచేసిన చోటా. కె. నాయుడుగారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ‘‘ఈ కథ పై నమ్మకంతో సందీప్ మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. అబ్బూరి రవి డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ‘ఠాగూర్’ మధు, తాగుబోతు రమేశ్, సప్తగిరి, సీనియర్ దర్శకుడు ధవళ సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్సోత్సవాలు
కొడంగల్: కలియుగ వైకుంఠ దైవం.. ఆపదల మొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవారి బ్రహ్సోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కొడంగల్‌లోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతి సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు 11రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగాయి. బుధవారం ఉదయం పల్లకిసేవలో స్వామివారిని ఊరేగించారు. వరహాస్వామి ఆలయ ప్రాంగణంలో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు. సుందర వరద భట్టాచార్యులు, కంకణభట్టు లక్ష్మీకాంతాచార్యులు పలు కార్యక్రమాలు జరిపారు. ఉత్సవమూర్తులకు విశేషపూజలు చేశారు. అభిషేకం, దూపదీప నైవేద్యం సమర్పించారు. పవిత్రజలంతో నింపిన గుండంలో స్వామివార్లకు స్నానం చేయించారు. తిరుమల తిరుపతి నుంచి వచ్చిన సుమారు పాతిక మంది అర్చకులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దొంగలు ముఖాలకు ముసుగులు, మంకి టోపీలు ధరించి ఉన్నట్లు ప్రిన్సిపాల్ కుమార్తె హర్ష, కుమారుడు అభినందన్లు తెలిపారు. షాట్లు ధరించి పైన పంచతో గోచీలు పెట్టుకున్నట్లు, ఒంటికి నూనె రాసుకుని బట్టలు లేకుండా ఉన్నట్లు వివరించారు. తాము అల్లరి చేసే ప్రయత్నం చేస్తే తన 20 రోజుల కుమారుడిపై కత్తిపెట్టి బెదిరించారని హర్ష పేర్కొంది. అదే సమయంలో పోలీసులు సైరన్ ఇవ్వడంతో పారిపోయారని తెలిపింది. దీంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న నిత్యానంద, రంజిత
తిరుమల: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ధ్యాన పీఠాధిపతి నిత్యానంద స్వామి, ఆయన అంతరంగిక శిష్యురాలు, మాజీ నటి రంజిత బుధవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వీరు శిష్యబృందంతో కలసి ఆలయానికి వచ్చారు. అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వద్ద మీడియా ఉండటాన్ని చూసిన రంజిత దూరంగా వెళ్లిపోయారు. చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని నిత్యానంద శిష్యబృందం ‘వద్దు..వద్దు..’ అంటూ అడ్డుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
తిరుపతి కేంద్రంగా ‘ఆక్టోపస్’
రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తీవ్రవాదులను అణచివేయడానికి 400 మంది కమెండోలతో ఆక్టోపస్ విభాగం తిరుమల వేంకటేశ్వరుని ఆలయానికి పెరగనున్న మరింత భద్రత సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఆఫ్ కౌంటర్ టైస్ట్ ఆపరేషన్స్) రాష్ట్ర ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఇప్పటికే ఆక్టోపస్ భద్రత కల్పిస్తున్న విషయం విదితమే. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఏర్పాటుకానున్న నేపథ్యంలో వేంకటేశ్వరస్వామి దేవాలయానికి భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడం, నిరోధించడం, తిప్పికొట్టడం కోసం హైదరాబాద్ కేంద్రంగా అక్టోబర్ 1, 2007న ఆక్టోపస్ ఏర్పాటుచేశారు. పోలీసుశాఖలో పనిచేసే 500 మంది మెరికల్లాంటి అధికారులను ఆక్టోపస్‌కు ఎంపిక చేసి, వారికి కమెండో శిక్షణ ఇప్పించారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు గతంలో హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో ఏఆర్ పోలీసు విభాగంతో ఆలయానికి భద్రత కల్పించారు. ఆక్టోపస్ ఏర్పాటైన తర్వాత 90 మంది సభ్యులున్న ఒక దళం ప్రస్తుతం తిరుమ ల తిరుపతి దేవస్థానం భద్రతను పర్యవేక్షిస్తోంది. చిత్తూరు జిల్లాలో తీవ్రవాద కదలికలు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు అనేకమార్లు హెచ్చరించాయి. పుత్తూరులోని ఓ ఇంట్లో తిష్టవేసిన ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్(ఐఎల్ఎఫ్) తీవ్రవాద విభాగానికి చెందిన ఫకృద్దీన్, ఇస్మాయిల్ పన్నా, బిలాల్ మాలిక్‌ను అక్టోబర్ 6, 2013న ఆక్టోపస్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇందులో ఇస్మాయిల్ పన్నా బెంగళూరులో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిలో ప్రధాన భూమిక పోషిస్తే, తమిళనాడు సేలంలో బీజేపీ నేత రమేష్ హత్య కేసులో బిలాల్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఫకృద్దీన్ ఐఎల్ఎఫ్ తీవ్రవాద సంస్థ అధినేత. ఈ ముగ్గురూ కలిసి తిరుమలలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు కేంద్ర నిఘా వర్గం గుర్తించింది. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆక్టోపస్ రంగంలోకి దిగి పుత్తూరులో తీవ్రవాదులు మకాం వేసిన ఇంటిపై దాడి చేసి, వారి ఆట కట్టించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల హిట్‌లిస్ట్‌లో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో.. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం తెలంగాణకు కేటాయించారు. మన రాష్ట్రంలో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిని పరిశీలించారు. చివరకు తిరుపతిలోనే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుమలలో నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తే.. అక్కడే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తామన్న ఆ విభాగం ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని రేణిగుంట, చంద్రగిరిల్లో ఆక్టోపస్‌కు భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేణిగుంటకు సమీపంలో విమానాశ్రయం ఉంది. ఎక్కడైనా తీవ్రవాదుల దాడులు జరిగితే.. అక్కడికి తక్షణమే చేరుకోవాలంటే విమానాశ్రయానికి సమీపంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఆక్టోపస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో రేణిగుంట పరిసర ప్రాంతాల్లో భూమిని ఆక్టోపస్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో కనిష్ఠంగా 400 మంది కమెండోలతో కూడిన నాలుగు దళాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయ భద్రతకు ఒక దళాన్ని కేటాయిస్తారు. తక్కిన మూడు దళాలను తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి వినియోగించనున్నారు. -
ప్రజల వద్దకే ‘అపోలో అట్ హోం’
అపోలో సంస్థల యజమాని ప్రతాప్ సీ రెడ్డి తిరుమల, న్యూస్‌లైన్ : ప్రజల వద్దకే చికిత్సను తీసుకువెళ్లేందుకు ‘అపోలో అట్ హోం’ అనే కార్యక్రమానికి త్వరలో శ్రీకా రం చుట్టనున్నట్లు ఆ సంస్థ యజమాని ప్రతాప్ సీ రెడ్డి వె ల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు దగ్గరుండి స్వామి దర్శనాన్ని కల్పించారు. అనంత రం ప్రతాప్ సీ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రులు విజయవంతంగా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయన్నారు. చిత్తూరు జిల్లా అరగొండకు సమీపంలో ఉన్న అపోలో ఆస్పత్రిలో సుమారు 70 వేల మందికి అన్ని రకాల వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. నాన్ కమ్యునికబుల్ డిసీస్(ఎన్సీడీ), డయాబెటిస్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి ప్రధానమైన నాలుగు సమస్యలతో ఏడాదికి 36 మిలియన్ల మంది మృతి చెందుతున్నారన్నారు. ఈ సమస్యలకు ముందుగానే పరిష్కారాన్ని కనుగొనాలనే లక్ష్యం తో ‘టోటల్ హెల్త్ ప్రాజెక్ట్’ రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే అప్పుడే పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయ్యే వరకు ఎటువంటి రోగాలు సోకకుండా ఎలా సంరక్షించాలి అనే విషయాలపై కూడా పూర్తి ప్రణాళికను రూపొందిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన అపోలో హృదయ అత్యవసర చికిత్స కేంద్రంలో అనేక మంది శ్రీవారి భక్తులు ఉచితంగా చికిత్స పొందుతున్నారని చె ప్పారు. శబరిమళై, పూరిలో కూడా ఉచిత హృదయ అత్యవసర చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
నేత్రపర్వంగా కల్యాణ వెంకన్న పుష్పయాగం
చంద్రగిరి, న్యూస్‌లైన్ : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పుష్పయాగ కైంకర్యం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చక బృందం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అభిషేకించారు. ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువుంచారు. అంతకు ముందు స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. దేశ విదేశాల నుంచి తెప్పించిన పుష్పాలతో అభిషేకించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వెయ్యి కిలోల పుష్పాలతో కల్యాణ వెంకన్నను అభిషేకించారు. టీటీడీ ఈవో గోపాల్, జేఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు పుష్పాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. -
గరుడునిపై గోవిందుని వైభవం
చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజన సందోహం మధ్య కల్యాణ వెంకటేశ్వరస్వామి సతీసమేతంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అంతకు ముందు తెల్లవారు జామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి ధూపదీప నిత్య కైంకర్య, పూజాకార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వాహన మండపంలో కొలువుంచి స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. గరుడ వాహన సేవను పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన పుష్ప హారాలు, పచ్చల హారాలు, తిరుమల నుంచి వచ్చిన లక్ష్మీహారాన్ని తొడిగారు. అనంతరం కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి గరుడవాహన మెక్కి వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు ఏర్పాటు చేసిన భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి చెందిన భక్తుడు సుబ్రమణ్యం రూ.12 లక్షల విలువ చేసే గరుడవాహనాన్ని కానుకగా ఇచ్చారు. గరుడ వాహన సేవకు ముందు ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, సూపరింటెండెంట్ ధనంజయ ఉత్సవంలో పాల్గొన్నారు. -
ఏడు కొండల వాడా.. ఎక్కడున్నావయ్యూ!
వీఐపీలకు భలే మంచి దర్శనం సామాన్యులకు అడుగడుగునా నరకం పట్టించుకునే వారే లేరు బస, దర్శనానికి నానా తిప్పలు బంధుగణం, కార్పొరేట్ సేవల్లో తరించిన ధర్మకర్తల మండలి భక్తులకు అరచేతిలో వైకుంఠం చూపిన టీటీడీ సాక్షి,తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు పడరాని పా ట్లు పడ్డారు. స్వామివారిని దర్శించుకునేందు కు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చారు. సు లభ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అధికారులు ప్రకటించినా, వాస్తవ పరి స్థితులు అందుకు భిన్నంగా మారారుు. వీఐపీలకు మాత్రం అరగంట నుంచి గంట లోపే దర్శనం లభించింది. సామాన్య భక్తులకు మా త్రం అరచేతిలోనే వైకుంఠం కనిపిచింది. అడుగడుగునా నరకం అనుభవించారు. ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళనలు, బైఠాయిం పుల పర్వం కొనసాగింది. శుక్రవారం మొదలైన డౌన్డౌన్ల పర్వం శనివారం కూడా కొనసాగిం ది. రద్దు చేసిన రూ.300 టికె ట్లను బోర్డు కోటా కింద కొందరికే కేటాయించడం ఎంత వరకు సబబు?అని భక్తులు మండిపడ్డారు. ఏకంగా చైర్మన్ కార్యాలయం వద్ద భక్తులు బైఠారుుం చారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. శనివారం ఉదయం క్యూ లైన్లలో కూడా సామాన్య భక్తులు ఆందోళన చేశారు. తమను దర్శనానికి త్వరగా అనుమతించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల క్యూ నుంచి దాటి వచ్చేందుకు ప్ర యత్నించారు. ఏటా వీఐపీ భక్తులకు దర్శనం, బస చాలా సులువవుతోంది. టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో వీఐపీలకు తిరుమలలో బస, దర్శనం హక్కుగా మారిపోతోంది. శని వారం ఏకంగా 8వేల వీఐపీ టికెట్లు కేటాయిం చారు. ఏడుగంటలపాటు దర్శనం చేయించి సాగనంపారు. సామాన్య భక్తులకు తిప్పలు త ప్పలేదు. కిక్కిరిసి క్యూలలో నరకయాతన అనుభవించారు. అయినా టీటీడీ అధికారుల్లో మాత్రం స్పందన అంతంతమాత్రమే. రాత్రంతా చలిలోనే భక్తుల కష్టాలు సామాన్య భక్తులను కదలిస్తే కష్టాల కన్నీళ్లు వస్తున్నాయి. శనివారం దర్శనం కోసం శుక్రవారం మధ్యాహ్నం నుంచే భక్తులు క్యూ లైన్లనలో పడిగాపులు కాచారు. వారిని ఎక్కడి క క్కడ టీటీడీ సిబ్బంది, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత తమకు కేటాయించిన సమయానికి భక్తులు క్యూలోకి వెళ్లారు. తీవ్రమైన చలిలో, మంచులో భక్తులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. గదులు లభించని భక్తులు ఆరుబయటే చలిలో అవస్థ పడ్డారు. చంటి బిడ్డలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సొమ్మసిల్లి కింద పడిన భక్తుడు శనివారం ఉదయం శ్రీవారి స్వర్ణరోథత్సం నే త్రపర్వంగా సాగింది. రథాన్ని లాగేందుకు జనం తోపులాడుకున్నారు. పడమర మాడ వీధిలోని చినజీయర్మఠం వద్ద ఓ భక్తుడు రథాన్ని లాగుతూ సొమ్మసిల్లి కింద పడిపోయారు. అ ప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని లేపడంతో ప్రమాదం తప్పింది. ఇదిమినహా రథోత్సవం వైభవంగా జరిగింది. -
వేయి నుంచి ‘నూరు కాళ్లు’
సాక్షి, తిరుమల: తిరుమలలో కూల్చివేసిన వేయికాళ్ల మండపాన్ని తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉన్న శ్రీనివాసమంగాపురంలో నూరుకాళ్లతో నిర్మించేందుకు టీటీడీ సిద్ధమైంది. శ్రీవారి ఆలయం ముందున్న వేయికాళ్ల మండపాన్ని తిరుమల మాస్టర్ప్లాన్కింద 2003లో కూల్చివేసిన విషయం తెలిసిందే. పదేళ్లుగా నలుగుతున్న ఈ మండ పం వివాదాన్ని పరిష్కరించే దిశగా టీటీడీ చర్యలు చేపట్టింది. మండపం తిరుమలలో వద్దంటున్న భద్రతా కమిటీ కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలో నూరుకాళ్ల మండపం నిర్మించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మేరకు కూల్చివేసిన రాతి స్తంభాలతోనే 2009లో ప్రారంభమైనా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కోర్టు ఉత్తర్వులతో గత ఏడాది రాష్ట్ర పోలీసు, టీటీడీ అధికారులు ఆరుగురితో టీటీడీ ధర్మకర్తల మండలి కమిటీ వేసింది. టీటీడీ సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, రాష్ర్ట ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్ ఐజీ మహేష్ భగవత్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, ఎస్బీ డీఐజీ వీసీ సజ్జనార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డితో కూడిన కమిటీ వేశారు. సోమవారం కమిటీ సభ్యులు ఆరుగురూ కూల్చివే సిన మండపాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆలయం వద్దే నిర్మించడం వల్ల తీవ్రమైన భద్రతా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా నూరుకాళ్ల మండపాన్ని పాపవినాశనం వెళ్లే మార్గంలోని పారువేట మండపం పక్కనే నిర్మించాలన్న ప్రతిపాదన కూడా సరైనది కాదనే అభిప్రాయంతో కమిటీ ఉంది. అక్కడ నిర్మించటం వల్ల సరైన పర్యవేక్షణ లేక మండపం శిధిల స్థితికి చేరుకోవడంతో పాటు భద్రతా సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్ధారించారు. వేయికాళ్ల మండపాన్ని తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురం కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద నిర్మించాలని టీటీడీ సిద్ధమవుతోంది.. కూల్చివేసిన చోటే మండపాన్ని నిర్మించాలని చినజీయరు స్వామి కోరుతుంటే.. అలా చేస్తే భద్రతా పరమైన ఇబ్బందులు తప్పవని నిఘా, భద్రతా అధికారులు తేల్చిచెప్పారు. దీంతో చినజీయరు స్వామిని కూడా ప్రసన్నం చేసుకోడానికి శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తిరుమలలోని పురాతన మండపాన్ని పునరుద్ధరించేందుకు ఎలాంటి అవరోధాలు ఉండవనే భావనతో టీటీడీ ఉంది. స్థలం పరిశీలిస్తున్నాం : జేఈవో వేయికాళ్ల మండపం స్థానంలో నిర్మించాలని తలపెట్టిన నూరుకాళ్ల మండపం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇందుకోసం బోర్డు నియమించిన సిక్స్‌మెన్ కమిటీ సోమవారం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిందన్నారు. సున్నితమైన ఈ అంశంపై మరో మారు చర్చించి సిఫారసులను టీటీడీ ధర్మకర్తల మండలికి అందజేస్తామన్నారు. వీటితోపాటు మరో మూడు నెలల్లో ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్లోని తూర్పుమాడ వీధి పనులు పూర్తి చేసేలా కమిటీ నిర్ణయించిందన్నారు. అలాగే, ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పనులు కూడా మూడో దశలో ఉన్నాయని అన్నారు. -
బాబు హామీల గాలం
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆదివారం చేపట్టిన ప్రజాగర్జన సభలో ఓటర్లకు గాలం వేసేందుకు వరుస హామీలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రసంగం ప్రారంభంలోనే చిత్తూరు జిల్లా సమస్యలు, స్థానిక సమస్యలను ప్రస్తావించారు. తొలుత తనకు వేంకటేశ్వరస్వామి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు శక్తిని ఇస్తాడని, శ్రీవారు మన అందరి ఇలవేల్పు అంటూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రసంగంలో మధ్యలో ‘ఏం తమ్ముళ్లు..చెప్పండి.. నేను చెప్పింది కరె క్టేనా’ అంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉంటూ తాను ఏ పనులు అయితే చేయలేకపోయారో వాటన్నింటిని ఈసారి సీఎం అయితే చేస్తానని, నమ్మండి అంటూ ముఖ్యంగా యువతను అభ్యర్థించారు. దీనిలో భాగంగా గాలేరు-నగరి, హంద్రీ-నీవా, స్వర్ణముఖి-సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు తాగునీరు లేకపోతే కల్యాణి డ్యాం పైపు లైన్ నిర్మించానని, బర్డ్, రుయా, స్విమ్స్ ఆస్పత్రులను ఒక్కటిగా చేశామని చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రాణదానం స్కీమ్ ప్రారంభించి తిరుమల వెళ్తూంటే తనపై 22 క్లేమోర్ మైన్స్‌తో దాడి జరిగిందని, మీకు మేలు చేసేందుకే తనను వేంకటేశ్వరస్వామి బతికించారని గుర్తుచేస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అలాగే తిరుపతిని వాటికన్ సిటీగా మారుస్తామని, ఆ బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని రెండుసార్లు చెప్పారు. తాగునీటికి కొరత లేకుండా చూస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత, ఆరోగ్యభద్రత కల్పిస్తామన్నారు. వారికి ఇళ్లస్థలాలు కేటాయించేందుకు చర్యలు చేపడతామన్నా రు. ఉచిత కరెంట్, రుణమాఫీ ప్రకటించారు. జన్మభూమి రుణం తీర్చుకుంటా ‘‘నేను ఇక్కడే పుట్టాను, తిరుపతిలోనే పెరిగాను, నాకు రాజకీయాలు నేర్పింది తిరుపతి. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నది చిత్తూరు జిల్లా వాసులే. మీలో ఒకడిగా ఉంటూ వ్యవసాయ పనులు చేశాను. నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నది ఇదే తిరుపతిలోనే. పక్కనున్న ఎస్వీ యూనివర్సిటీలోనే నేను చదువుకున్నది. జన్మభూమి రుణం తీర్చుకుంటాను. కచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడేవిధంగా పని చేస్తాను’’ అంటూ ముఖ్యంగా తిరుపతి ఓటర్లకు గాలం వేసేందుకు తంటాలు పడ్డారు. ఉపన్యాసం ముందు, చివరన ఎక్కువగా యువతను, మహిళలను, మధ్యతరగతి వారిని, కార్మికులను ఇలా రంగాల వారీగా వారి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. నిత్యావసరవస్తువుల ధరల ప్రస్తావన, పెట్రోల్డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలెండర్ల కోత, ఆధార్ సమస్యలు.. ఇలా ప్రతి అంశాన్ని పేర్కొంటూ ఎన్నికల ప్రసంగం చేశారు. పదే, పదే ‘‘నన్ను ఆశీర్వదించండి, ఓట్లు వేసి గెలిపించండి. నన్ను ఆశీర్వదించండి బుల్లెట్లా దూసుకెళ్తా’’ అంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పల్చబడిన జనం జిల్లా వ్యాప్తంగా ప్రజాగర్జనకు తెలుగుతమ్ముళ్లు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ జీపులు, కార్లు అద్దెకు తీసుకుని జనాన్ని తరలించినా ఒక దశలో జనం పల్చబడ్డారు. 2 గంటలకని చెప్పిన మీటింగ్ 4.30 గంటలకు ప్రారంభం కావటం, చంద్రబాబు ఉపన్యాసంలో కొత్తదనం లేకపోవటంతో పార్టీకార్యకర్తలు, నాయకులు లేచి వెళ్లిపోవడం కనపడింది. చంద్రబాబు విజన్ 2020 గురించి ప్రస్తావిస్తున్న సమయంలోనే వెనుక ఉన్న కుర్చీలు చాలా వరకు ఖాళీ అయ్యాయి. వేదికపై ఉన్న టీడీపీ రాష్ట్రనాయకులు, ఎమ్మెల్యేలే చంద్రబాబు ఉపన్యాసం సమయంలో నిద్రపోతూ కనిపిం చారు. చివరలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రజాగర్జనకు హాజరైన పార్టీనాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు.