పూర్ణాహుతి చేస్తున్న అర్చకులు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు, అభిషేకాలు చేసి, యాగశాలలో పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల సమేత వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమణమూర్తి, దేవస్థానం చైర్మన్ ఉప్పల శివ రామ ప్రసాద్, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, అర్చకులు కురవి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉప్పల విజయ దేవ శర్మ, ప్రభాకర్ శాస్త్రి, పెళ్లూరి వెంకట రాయ శర్మ, సిబ్బంది ఎస్.విజయ కుమారి, కేవీఆర్.ఆంజనేయులు పాల్గొన్నారు.