
తిరుమలలో టెంకాయ కొడుతున్న కిషన్
భూపాలపల్లి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తెలిపారు.
14 నెలల క్రితం జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుకోగా ఎలాంటి అవాంతరాలు లేకుండా యాత్ర పూర్తయినందుకు సోమవారం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. కిషన్ వెంట జిల్లా నాయకులు వెంకటరెడ్డి, నరేష్, కుమార్, సంపత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment