
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ఆరంభ దర్శనం సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, తీర్ధప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు పేర్కొన్నారు. అదేవిధంగా జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రి సుజనా చౌదరీలు కూడా ఈరోజు స్వామి సేవలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment