శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పుష్పయాగ కైంకర్యం నేత్రపర్వంగా జరిగింది.
చంద్రగిరి, న్యూస్‌లైన్ : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పుష్పయాగ కైంకర్యం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చక బృందం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అభిషేకించారు. ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువుంచారు.
అంతకు ముందు స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. దేశ విదేశాల నుంచి తెప్పించిన పుష్పాలతో అభిషేకించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వెయ్యి కిలోల పుష్పాలతో కల్యాణ వెంకన్నను అభిషేకించారు. టీటీడీ ఈవో గోపాల్, జేఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు పుష్పాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు.