Gopal
-
క్షీణించిన నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
అయోధ్య: రామమందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్(86) ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయనను లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం మహంత్ నృత్య గోపాల్ దాస్ మూత్ర విసర్జన సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధుర వెళ్లిన సమయంలో మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం క్షీణించింది. అయితే అతని ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో మేదాంతలో చేర్పించారు. నృత్య గోపాల దాస్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీస్సుల కోసం ప్రధాని మోదీ పలు మార్లు అయోధ్యకు వచ్చారు. -
ఆదుకోండి..లేదంటే డెత్ ఇంజక్షన్‌కు అనుమతి ఇవ్వండి
నల్లగొండ టౌన్: ‘కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాను. ప్రభుత్వం చేయూతనిచ్చి నన్ను ఆదుకోవాలి.. లేదా డెత్ ఇంజక్షన్‌కు అనుమతిచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలి’అని నల్లగొండ పట్టణానికి చెందిన బాధితుడు జంపాల గోపాల్ వేడుకుంటున్నారు. బాధితుడు గోపాల్‌తో పాటు అతని తల్లి అంజమ్మ తెలిపిన వివరాలు.. నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు పరిధి సాగర్ రోడ్డు మారుతీనగర్‌కు చెందిన 44 ఏళ్ల గోపాల్ 25 సంవత్సరాలుగా మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ (కండరాల క్షీణత) వ్యాధితో బాధపడుతున్నారు. గోపాల్ ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి 2000 సంవత్సరంలో ఆర్టీసీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం రావడంతో ఫిజికల్ టెస్టులో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతనికి మసు్క్యలర్ డ్రిస్ట్రోపీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయన ఆర్టీసీలో ఉద్యోగం కోల్పోయాడు. తరువాత ఆరు నెలల కాలంలోనే వ్యాధి తీవ్రమై కండరాలు క్షీణించి జీవచ్ఛవంలా మారారు. కదలలేక, నడవలేక, కాళ్లు, చేతులు పనిచేయక మాటకే పరిమితమయ్యారు. 25 సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అన్నీ తానైన కన్నతల్లి.. జీవచ్ఛవంలా మారి నడి వయసుకు వచ్చిన కుమారుడికి 70 ఏళ్ల వృద్ధురాలైన తల్లి అంజమ్మ ఒక్కతే దిక్కు. తల్లికి కుమారుడు చేదోడువాదోడుగా ఉండాల్సిన వయసులో తల్లే తన కుమారుడికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. బిడ్డ అనుభవిస్తున్న నరకం చూడలేక తాను చనిపోతే బాగుండునని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి.. కేవలం ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ 4 వేల రూపాయలే తమకు ఆధారమని ఆస్తిపాస్తులు లేని తమకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని, లేదంటే తనకు డెత్ ఇంజక్షన్ ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు. అదే విధంగా తాను మరణిస్తే తన భౌతిక కాయాన్ని మసు్క్యలర్ డిస్ట్రోపీ వ్యాధి నయం చేసే మందును కనుగొనేందుకు పరిశోధనకు ఉపయోగించాలని కోరుతున్నారు. దాతలు ముందుకొచ్చి ఫోన్ నంబర్ 9182241141 (గూగుల్‌పే, ఫోన్‌పే)కు ఆర్థిక సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. -
మీ వెంటే.. మేమంటూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించడంతో పాటు సమాజంలో సమోన్నత గౌరవాన్ని తీసుకురావడంలో చెరగని ముద్ర వేశారు. రాజకీయ చరిత్రలో ఏనాయకుడు కనీసం ఊహించని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం చిత్తశుద్ధితో అమలు చేసి విశ్వసనీయతకు సరైన నిర్వచనాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా టీడీపీ, జనసేన పార్టీల్లోని కార్యకర్తల నుంచి కీలక నేతలు వరకు వైఎస్సార్సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు క్యూ కట్టారు. వీరిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం సమక్షంలో చేరిన గోపాల్ యాదవ్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గోరుముచ్చు గోపాల్ యాదవ్ మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో తణుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పాల్గొన్నారు. మరోవైపు.. రాజంపేట టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి గంటా నరహరి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, ఏలూరు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్, వైఎస్సార్సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్ పాల్గొన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వేనాటి సూళ్లూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సీవీ మిథున్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. కాగా.. వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. జనసేన లక్ష్మీశివకుమారి చేరిక పాయకరావుపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, జనసేన నాయకురాలు అంగూరి లక్ష్మీ శివకుమారి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. జై భారత్ పార్టీ నుంచి.. జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం సమక్షంలో చేరిన విజయవాడ నేతలు విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గండూరి మహేష్, నందెపు జగదీష్, కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ కోసూరు సుబ్రహ్మణ్యం (మణి), డివిజన్ మాజీ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బత్తిన రాము వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాశ్ పాల్గొన్నారు. విశాఖ నేతల చేరిక విశాఖపట్నానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు జీవీ రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధకు సీఎం జగన్ వైఎస్సార్ïసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, విశాఖ నార్త్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన యలమంచిలి రవి, బత్తిన రాము లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సీఎం జగన్ కోరారు. మంగళవారం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవినేని అవినాశ్‌తో పాటు యలమంచిలి రవి, గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన బత్తిన రాము, ఎంపీ కేశినేని నాని, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులను పిలిపించి జగన్ మాట్లాడారు. అవినాష్ అధిక మెజార్టీతో విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జోష్ కొనసాగుతుండగా, సీఎం జగన్‌ను యలమంచిలి రవి, బత్తిన రాము కలవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక తూర్పులో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎంను కలిసిన వారిలో యలమంచిలి రవి తనయుడు రాజీవ్ కూడా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ వెంటే మేమంతా.. బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివరావు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరిస్తూ బుధవారం నుంచి బస్సు యాత్ర చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ వెంటే మేమంతా సిద్ధమని బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు ప్రకటించారు. బీసీ సంఘం రాష్ట్ర నేతలు పోనమాల నాగరాజు, వల్లభూని మణికంఠ, వల్లభుని దుర్గాప్రసాద్, సైకం చినబాబు తదితరులతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల సంక్షేమం కొనసాగాలంటే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తున్న బస్సు యాత్రలో తామంతా పాల్గొంటామన్నారు. -
"బీసీలను మోసం చేసిన టీడీపీ బాబుకంటె సీఎం జగన్ బెటర్"
-
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
ఫొటో జర్నలిస్ట్ గోపాల్‌పై దాడి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్‌పీజేఏ) అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం కారణంగా మహేష్‌గౌడ్ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గోపాల్‌ను సహచర ఫొటో జర్నలిస్టులతో కలసి వారు పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే గోపాల్‌పై దాడి చేసిన మహేష్గౌడ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఆ వృత్తం.. ఓ వి‘చిత్రం’!
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్‌లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు. అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సమాధి నమూనా అయ్యుండొచ్చు.. ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు -
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్‌ఫుల్‌గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
ముషీరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు వీళ్లే..
ముషీరాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ముఠా గోపాల్ ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది అనిల్‌కుమార్‌పై 36888 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే, 2019 వరకు బిజెపి తెలంగాణ అద్యక్షుడుగా ఉన్న డాక్టర్ కె.లక్ష్మణ్ సుమారు 30800 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తొలిసారి ఎన్నికైన ముఠా గోపాల్ గంగపుత్రుల సమాజికవర్గానికి చెందినవారు. గోపాల్‌కు 72919 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడైన అనిల్‌కుమార్‌కు 36031 ఓట్లు వచ్చాయి. డాక్టర్ కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి రెండోసార్లు గెలిచారు. 1999లో టిడిపితో కూటమి ఉన్నప్పుడు గెలవగా మళ్లీ 2014లో అదే కూటమి పక్షాన విజయం సాధించారు. 2014లో టిఆర్ఎస్ సమీప ప్రత్యర్ధి ముఠా గోపాల్‌పై 27386 ఓట్ల ఆధిక్యతతో లక్ష్మణ్ గెలిచారు. 2018లో గోపాల్ పైనే ఓడిపోయారు. గతంలో ముషీరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య మూడుసార్లు గెలుపొందగా, మూడు దశాబ్ధాల తరువాత ఆయన భార్య మణెమ్మ రెండుసార్లు గెలుపొందడం విశేషం. అంజయ్య మరణించిన తరువాత లోక్‌సభ ఎన్నికలలో ఆమె పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలలో పెద్దగా లేరనే చెప్పాలి. అయితే 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, ముషీరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయని నరసింహారెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దరిమిలా జరిగిన ఉప ఎన్నికలో పోటీచేయించడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అభ్యర్దుల అన్వేషణ చేసి చివరికి మణెమ్మను ఎంపిక చేసారు. ఆ ఉపఎన్నికలో గెలుపొందిన మణెమ్మ 2009 సాధారణ ఎన్నికలోనూ గెలిచారు. ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ ఎమ్మెల్యేలుగాను, ఎమ్.పిలు గాను పనిచేసిన అరుదైన రికార్డును అంజయ్య, మణెమ్మలు సొంతం చేసుకున్నారు. అంజయ్య వివిధ మంత్రివర్గాలలోను, 1981లో ముఖ్య మంత్రిగాను పనిచేసారు. ముఖ్యమంత్రి అయ్యాక మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఒకసారి 1957లో ఆర్మూరులో గెలిచారు. మొత్తం ఐదుసార్లు గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన ఒకసారి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించారు. టిఆర్ఎస్ నేతగా ఉన్న నాయని నరసింహారెడ్డి 1978లో జనతా పార్టీ పక్షాన పోటీచేసి అంజయ్యను ఓడిరచి సంచలనం సృష్టించారు. నాయిని 1978, 1985లలో జనతా పార్టీ తరుఫున గెలిచారు. తిరిగి 2004లో టిఆర్ఎస్లో చేరి విజయం సాధించారు. నాయని 2004లో ఎన్నికైన తరువాత కొంతకాలం రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ క్యాబినెట్లో హోం మంత్రి అయ్యారు. తదుపరి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1983లో ఇక్కడ గెలిచిన నేత శ్రీపతి రాజేశ్వర్ 1985, 1999లలో సనత్‌నగర్ నుంచి గెలుపొందారు. ఎన్.టి.ఆర్. క్యాబినెట్లలో మంత్రిగా కూడా పనిచేసారు. కాంగ్రెస్ నాయకుడు ఎమ్.కోదండరెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. 1957లో గెలుపొందిన సీతయ్య గుప్త, 1962లో బేగంబజార్ నుంచి గెలిచారు. 1952లో ఇక్కడ విజయం సాధించిన జి.ఎస్. మేల్కొటే మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ముషీరాబాద్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిదిసార్లు, జనతాపార్టీ రెండుసార్లు,టిఆర్ఎస్ రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, టిడిపి ఒక్కోసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో పదిసార్లు రెడ్డి నేతలు గెలిస్తే నాలుగుసార్లు బిసి నేతలు(మున్నూరుకాపు) గెలిచారు. ఒకసారి బ్రాహ్మణ, మరోసారి వైశ్య నేత గెలుపొందారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ
పలమనేరు (చిత్తూరు జిల్లా): చదివింది కేవలం ఏడో తరగతి.. వారపు సంతలో దుకాణాల వద్ద తిరుగుతూ టీ అమ్మడం అతని వృత్తి. ఇంట్లో రహస్యంగా దొంగ నోట్టు ముద్రించి సంతలో మార్చి సులభంగా డబ్బులు సంపాదించడం ప్రవృత్తి. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్ (41) ఏడో తరగతి చదివాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశాడు. ఇప్పుడు సంతలకు వెళ్లి టీ అమ్ముతుంటాడు. వ్యసనాలకు బానిసైన గోపాల్ సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని యూట్యూబ్‌లో చూసేవాడు. అందులో దొంగనోట్లను ముద్రించే వీడియోలు చూస్తూ దొంగనోట్లను ముద్రించాలనుకున్నాడు. బెంగళూరు వెళ్లి కలర్ ప్రింటర్, మందంగా ఉండే ఖాళీ బాండ్ పేపర్లు, కలర్లు, గ్రీన్ కలర్ నెయిల్ పాలీష్ కొనుక్కొచ్చాడు. 6 నెలలుగా ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ముద్రిస్తున్నాడు. రూ.500 నోట్లపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్ కోసం గ్రీన్ నెయిల్ పాలిష్ వేశాడు. ఇలా ముద్రించిన నోట్లను వారపు సంతలో చలామణి చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కూరగాయల దుకాణంలో రూ.500 దొంగనోటు ఇచ్చి రూ.50 విలువైన కూరగాయలు కొని చిల్లర తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్‌ను అరెస్ట్ చేసి రూ.8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలైన రేణుక భర్త డాక్యా ఆమెకు తెలియకుండానే మరో ఇద్దరికి ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి ప్రశ్నపత్రాలను మరో నిందితుడు ప్రవీణ్ నుంచి అందుకున్న రేణుక... తన బంధువు ద్వారా నీలేష్ , గోపాల్లతోనే పేపర్ల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కు చెప్పి ప్రశ్నపత్రాలు తీసుకునేప్పుడే రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డదారిలో రాసిన ‘ప్రవీణ్ అండ్ కో’మెయిన్స్‌ను అదే పంథాలో క్లియర్ చేయాలనే పథకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పేపర్ లీక్ చేయొద్దని ప్రవీణ్ రేణుకకు చెప్పాడు. అందుకే రేణుక తన భర్తతో కలిసి నీలేష్, గోపాల్‌లను ఇంటికే తీసుకెళ్లి చదివించింది. అయితే ఈ పేపర్లను మరో ఇద్దరికి అమ్మి ఎక్కువ మొత్తం సొమ్ము చేసుకోవాలని డాక్యా భావించాడు. ఇందులో భాగంగానే భార్యకు చెప్పకుండా తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్ అనే మరో ఇద్దరు అభ్యర్థులకు ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సులు సైతం తీసుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టకూడదనే ఉద్దేశంతోనే వారిని ఈ నెల 4న (పరీక్ష ముందురోజు రాత్రి) హైదరాబాద్‌లో తాము బస చేసిన ఓ లాడ్జికి రప్పించి పేపర్లు అందించాడు. ప్రవీణ్ ఇంటి నుంచి నగదు స్వాదీనం... ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా రూ. 14 లక్షల వరకు ఆర్జించిన రేణుక అందులో రూ. 10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. రెండు దఫాలుగా ఈ డబ్బు అందుకున్న ప్రవీణ్ అందులో కొంత మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. అకౌంట్లో ఉన్న డబ్బును ప్రవీణ్ అరెస్టు సందర్భంలోనే అధికారులు గుర్తించారు. అదనపు కస్టడీలో భాగంగా అతన్ని విచారిస్తున్న సిట్ అధికారులు సోమవారం బడంగ్‌పేటలోని మల్లికార్జునకాలనీలో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ లభించిన రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌లను అరెస్టు చేసిన సిట్ పోలీసులు... సోమవారం తిరుపతయ్యను అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. వారి నుంచి మరెవరికైనా పేపర్ అందిందా అనే కోణంలో ఆరా తీయనున్నారు. గ్రూప్–1 టాపర్లకు సామర్థ్య పరీక్షలు.. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100కుపైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో ఇప్పటికే 53 మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు... అభ్యర్థుల సమర్ధతను పరీక్షించడానికి ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. నిపుణులతో మరో ప్రశ్నపత్రం తయారు చేయించి వాటికి సమాధానాలు రాయించడం ద్వారా అభ్యర్థుల సమర్థతను పరీక్షిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి వచ్చి గతేడాది గ్రూప్–1 పిలిమ్స్ రాసి 100కుపైగా మార్కులు పొందిన మరో నిందితుడైన రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌కు సిట్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. హ్యాకింగ్ ద్వారానే... పేపర్ల లీకేజీ కేసులో అదనపు కస్టడీకి తీసుకున్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను రెండో రోజైన సోమవారం తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. ముఖ్యంగా కమిషన్ సెక్రటరీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.ప్రవీణ్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్‌లను లోతుగా విచారించి పేపర్ల లీకేజీ అంశంలో మరో చిక్కుముడిని విప్పారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న శంకరలక్ష్మి కంప్యూటర్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రవీణ్ సిస్టం ద్వారా హ్యాక్ చేసిన రాజశేఖర్ అందులోంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్నట్లు తేల్చారు. -
యాక్షన్ థ్రిల్లర్
విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్రంథాలయం’. ఎస్.వైష్ణవి శ్రీ నిర్మించిన ఈ సినిమా మార్చి 3న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకులు బి.గోపాల్, కాశీ విశ్వనాథ్, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ట్రైలర్ రిలీజయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ గ్రూప్‌లలో మా ట్రైలర్ వైరల్‌గా మారింది’’ అన్నారు సాయిశివన్ జంపాన, ఎస్.వైష్ణవి శ్రీ. -
భిక్షగాడిగా మారిన మాజీ వ్యవసాయ అధికారి దీనగాథ.. 26 ఏళ్ల తరువాత న్యాయం
పాతికేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినా.. రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు(లోన్ ఉందనే కారణంతో) ఉన్నతాధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో కుమారుడి మరణం అతడిని కుంగదీసింది. తన కళ్లెదుటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెలు రోజు కూలీలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై పాతికేళ్లుగా జీవచ్ఛవం అయ్యాడు. అయితే ఓ గుడి దగ్గర యాచించే సమయంలో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడుతుండడంతో ఓ భక్తుడు గుర్తించారు. ఇతని దీనస్థితిని తెలుసుకుని మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఎట్టకేలకూ 26 ఏళ్ల తరువాత న్యాయం దక్కింది. సాక్షి, చెన్నై: పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు. చివరికి ఆ అభాగ్యుడిపై కోర్టు కరుణ చూపించింది. ఆరు వారాల్లోపు ఆయనకు చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేయాలని మదురై ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలు.. మదురై శివారుల్లోని ఆల యాల వద్ద గత కొన్నేళ్లుగా ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఆయన అనర్గళంగా ఆంగ్లం, తమిళ భాషాలను మాట్లాడటం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలను వల్లిస్తుండడంతో ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఇటీవల ఆయన వివరాలను ఆరా తీశాడు. అతడి దీనగాథ∙విన్న ఆ భక్తుడు తన మిత్రుడైన న్యాయవాది జిన్నాకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్) భిక్షగాడిగా.. విచారణలో తంజావూరు జిల్లా తిరుచ్చిట్రంబలంకు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారి గోపాల్‌గా గుర్తించారు. 1996లో ఈయన పదవీ విరమణ చేసిన సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలం దక్కలేదు. ఇందుకు కారణం ఆయన సహకార బ్యాంక్‌లో రుణం తీసుకుని ఉండడమే. అదే సమయంలో మధ్యలో చదువు ఆపేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గోపాల్ మానసికంగా కుంగిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి కూడా చేయలేని పరిస్థితిలో పడ్డాడు. ఆ ఇద్దరు కూలి పనులకు వెళ్తుండడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండడం వెలుగు చూసింది. దీంతో ఆయనకు రావాలసిన పదవీ విరమణ మొత్తం కోసం న్యాయవాది జిన్నా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ బెంచ్ మందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. 74 ఏళ్ల వయస్సులో గోపాల్ పడుతున్న వేదనపై కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సహకారం సంఘంలో ఆయన తీసుకున్న అప్పు ప్రస్తుతం వడ్డీతో రూ. 5.37 లక్షలకు చేరినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు రావాల్సిన నగదును రుణానికి జయచేయాలని, మిగిలిన సొమ్ముకు వడ్డీ లెక్కించి గోపాల్‌కు ఆరు వారాలలోపు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. -
ఒక కొమ్మకు పూచిన అనుబంధం
పుట్టినింటి ప్రేమ బంధం ఎన్నేళ్లయినా దారం పోగులతో మరింత పదిలంగా అల్లుకుంటూనే ఉంటుంది. అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఆండగా ఉండే ఆప్యాయతలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ మది నిండా సంతోషాలను నింపుతూనే ఉంటుంది. రక్షగా నేనున్నానంటూ జీవితమంతా భరోసాను చూపుతూనే ఉంటుంది. ఒక కొమ్మకు పూచిన పూలను కలిపే దారమైన రాఖీ తోబుట్టువుల ప్రేమను లోకాన చల్లని పున్నమి వెలుగులుగా పంచుతూనే ఉంటుంది. ‘‘బాగున్నావా అన్నా!’’ అంటూ ఆప్యాయతల మధ్య పుట్టినింటి గడపకు వచ్చి యోగక్షేమాలను కనుక్కునేలా చేసే రాఖీ పండగ అంటే అన్నకు అమితమైన ఆనందం. ‘అంతా సంతోషమేనా చెల్లీ’ అనే అన్న పలకరింపుతో గుండె బరువును దింపేసే రాఖీ అంటే తోబుట్టువుకు సంబరమే. హంగూ ఆర్బాటాలకు చోటు లేని, ధనిక–పేద తేడా చూపని రాఖీ తమ జీవితాల్లో నింపే ఆనందం గురించి కొందరు తోబుట్టువులు పండగపూట పంచుకున్న అనుభవాలు ఇవి. కేరింగ్.. షేరింగ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. పీజీ వరకు చదువుకున్న. గవర్నమెంట్ టీచర్ అవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు. మా చిన్నమ్మ కొడుకు గోపాల్ నాకు తోడబుట్టినవాడికంటే ఎక్కువ. ఏ చిన్న అవసరమైనా ‘అక్కా’ అంటూ ముందుంటాడు. తోడబుట్టిన అన్నదమ్ములు లేరనే లోటు ఎప్పుడూ అనిపించలేదు. చిన్ననాటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. స్కూల్, కాలేజీ ప్రతి చిన్న విషయం తమ్ముడితో షేర్ చేసుకోకుండా ఏ రోజూ లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాఖీ కట్టడం మిస్ అవలేదు. – విజయలక్ష్మి జీవితానికి మంచి దారి ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నానంటే అక్క ఇచ్చిన సజెషన్సే. చదువులో ఎప్పుడూ సాయంగా ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఆ తర్వాత బీటెక్ చేసే విషయంలోనూ అక్క గైడెన్స్ ఉంది. నాకు అవసరమైనది అమ్మనాన్నలకు చెప్పి మరీ ఒప్పిస్తుంది. నేనే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తే చాలు వెంటనే పసిగట్టేస్తుంది. ట్యూషన్స్ చెప్పి, పార్ట్ టైమ్ వర్క్స్ చేస్తుంటుంది. చదువే జీవితాలను మార్చుతుంది అని ఎప్పుడూ చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటుందని, నాకే డబ్బులు ఇస్తుంటుంది. – గోపాల్ నా బాధ్యత మా అమ్మ, నాయినలు కూలీనాలీ చేసుకుని బతుకుతుండిరి. నేను ఏడో తరగతి దాగా చదివిన. నలుగురు అక్కచెల్లెళ్ల తోడ నేను ఒక్కణ్ణే. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు ముందుగల్లనే అయిపోయినయి. అమ్మ, నాయిన చనిపోతే చెల్లెలి బాధ్యత∙నాదే అనుకున్న. మంచిగ చదువుకుని మా ఇంటికి వెలుగైంది. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల చదువుల సంగతి మా చెల్లెనే చూసుకుంటోంది. నా చెల్లెలిని చూస్తే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – సాయిలు మా అన్న త్యాగం గొప్పది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఉంటున్నాం. మా అమ్మనాన్నలు చనిపోతే అన్నీ తానై చూసుకున్నాడు మా అన్న. కూలి పనులకు వెళుతూ నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉన్నత చదువు చదవడానికి కారణం మా అన్నయ్యే. ఎం.ఎ. బీఈడీ చేశాను. ఇప్పుడు విద్యాశాఖలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్నాను. అన్నయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిగింది. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానంటే మా అన్ననే కారణం. నా కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది. – సరోజ కలిస్తే పండగే! రాఖీ పండగ నాడు మా అన్న మా ఇంటికైనా రావాలి. లేదంటే నేనే మా అన్న ఇంటికి వెళ్లాలి. అన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తాడు. నేను ఇండ్లళ్ల పనులు చేస్త. నా పెళ్లయి పదిహేనేళ్లయినా ఏ ఒక్కసంవత్సరమూ రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదు. ఒకసారి అన్నకు ఆరోగ్యం బాగోలేకుండే. ఎంత తల్లడిల్లిననో. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్ననో. అన్న ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తది. మేం, మా అన్నపిల్లలు, మా పిల్లలు కలిస్తే చాలు ఆ రోజు మా ఇంట్ల పండగే. ఇక రాఖీ పండగ అయితే చాలు, ఆరోజు అందరం కలిసి సినిమాకు కూడా పోయేవాళ్లం. రాఖీ పండగ నాడు మాత్రం మా అన్న నాకు చీర తేకుండా రాడు. – సుమలత ఒకరికొకరం రక్ష మా సుమలత మనసు మంచిది. తన చేత్తో ఏది తీసుకున్నా నాకు మంచి జరుగుతుందని చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం. మేం సదువుకున్నది లేదు. కానీ, ఒకరి కష్టంలో ఒకరం తోడుంటం. మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నం. ఊరి నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నవాళ్లం, మాకు మేమే రక్షగా ఉండాలనుకుంటాం. – సురేష్ మా మామయ్యకు మా అమ్మ రాఖీ కడుతుంది. నేను మా తమ్ముడు అజయ్‌కి రాఖీ కడతాను. పొద్దున్నే నేనూ, తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటాం. అమ్మ స్వీట్ చేస్తుంది. నాకు చాక్లెట్స్ ఇష్టం. అమ్మనడిగితే తిడుతుంది. కానీ, రాఖీ పండగ రోజు మాత్రం పెద్ద చాక్లెట్ కొని తమ్ముడితో నాకు ఇప్పిస్తుంది. ఒకటే చాక్లెట్ కదా అందుకని సగం చాక్లెట్‌ను తమ్ముడికి ఇస్తాను. ఈ పండగ చాలా బాగుంటుంది. – లాస్య ఎంత పని ఉన్నా ముందుంటాడు మాది తెలంగాణలోని చేవెళ్ల. ఆశావర్కర్‌గా పనిచేస్తున్నాను. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మా తమ్ముడు ఇంటికి రాకుండా ఉండడు. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు అన్నదమ్ములం. మా శేఖర్ చిన్నవాడు. అందుకే మా కందరికీ వాడంటే కొడుకులెక్క. నాకు ముగ్గురు బిడ్డలు. అందరి బాగోగులు తెలుసుకుంటూ, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ‘అక్కా’ అని వచ్చేస్తడు. – అమృత రాఖీ కడితేనే ఆ ఏడాది అంతా మంచి అమ్మనాన్నలు పనికిపోతే అక్కనే నన్ను ఎక్కువ చూసుకుంది. అమ్మలెక్కనే నా బాగోగులు చూసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఓ హాస్పిటల్లో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తా. మా అందరి పెళ్ళిళ్లు అయి ఎవరి కుటుంబాలు వారివి అయినా వారానికి ఒకసారైనా కలుసుకుంటం. రాఖీ పండగ వస్తే మాత్రం ఎక్కడున్నా అక్కల దగ్గరవాలిపోతా. వారి చేత రాఖీ కట్టించుకుంటేనే ఆ సంవత్సరం అంతా నాకు మంచిగ ఉంటుందని నమ్మకం. – శేఖర్ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవూర: విద్యుదాఘాతంతో మాజీ సర్పంచ్ మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో సోమ వారం ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన బూరుగు గోపాల్ (54) వ్యవసాయం చేస్తున్నారు. వరినాటు వేసేందుకు మడులకు తడి అందించేందుకు ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. బోరు పోయకపోవడంతో పక్కనే ఉన్న రైతు బోరును చూసేందుకు వెళ్లాడు. కాగా, పక్కనే ఉన్న బత్తాయి తోట రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్ సరఫరా కోసం ఫెన్సింగ్ మీదుగా బంజరు కేబుల్ తీగను తీసుకెళ్లాడు. అప్పటికే బంజరు కేబుల్ వైరు ఎక్కడో తెగిపోయి ఫెన్సింగ్‌కు విద్యుత్ సరఫరా అవుతోంది. గోపాల్ పొలం గట్టుపై నుంచి వెళ్తూ కాలు జారి ఫెన్సింగ్‌పై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. గోపాల్ గతంలో శిర్సనగండ్ల పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేశారు. -
నాన్నా! నేనున్నాను!!
‘‘నాన్నా! నీకు కొడుకుల్లేరని దిగులు వద్దు. నేనే కొడుకుని’’ ఈ డైలాగ్ సినిమాల్లో చూస్తుంటాం. కేరళలోని శ్రీదేవి ‘‘నాన్నా! నీకు కొడుకుని నేనే’’ అని అనట్లేదు. కానీ ‘‘నాన్నా! నేనున్నాను’’ అని తండ్రికి భరోసా ఇచ్చింది. లాక్డౌన్లో ఇంటికి ఆసరా అయింది. శ్రీదేవి గోపాలన్‌కి పాతికేళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, బీఈడీ ఫైనల్ ఇయర్లో ఉంది. ఈ వేసవి గడిస్తే టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు... అనుకుంది. కరోనా లాక్డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆమె తండ్రి గోపాలన్ కొబ్బరి చెట్ల నుంచి కాయలు దింపుతాడు. ‘‘ఆ సంపాదనతో ముగ్గురి కూతుళ్లను పెంచి పెద్ద చేయడం, కాలేజీ చదువులు చదివించడం చిన్న విషయం కాదు. అయినా సరే... మా నాన్న ఏనాడూ తనకు పుట్టింది కూతుళ్లు మాత్రమే. కొడుకులు లేరు... అని బెంగ పడలేదు. ముగ్గురినీ చదివిస్తున్నాడు. అలాంటిది ఈ లాక్డౌన్ కాలం ఆయనను మానసికంగా కుంగదీసింది. వయసు పెరగడం, లాక్డౌన్ మొదటినెలల్లో ఎవరూ పనికి పిలవలేదు. చేతిలో పని లేకపోవడం, ఇంటి ఖర్చులేవీ తప్పక పోవడంతో బాగా ఆందోళనకు గురయ్యారు. అమ్మతో ‘కొడుకు ఉండి ఉంటే... చేదోడుగా ఉండేవాడు’ అన్నాడు. ఆ మాటతో నా మనసు కదిలిపోయింది. ‘‘కొబ్బరి కాయలు దించడానికి నేను కూడా వస్తాను నాన్నా’’ అంటే ఒప్పుకోరని తెలుసు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండా యూ ట్యూబ్‌లో కొబ్బరి చెట్టు ఎక్కడం, కాయలు దింపడం చూశాను. కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఉపయోగించే సాధనాలను మా చెల్లెళ్లు ఆన్లైన్లో బుక్ చేశారు. ఆ సాధనంతో నేను స్వయంగా కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకున్నాను. పని కూడా వెతుక్కున్నాను. ఒక చెట్టు నుంచి కాయలు దింపితే నలభై రూపాయలు వస్తాయి. రోజుకు ఇరవై చెట్ల పని ఉంటుంది. నేను పనికి వెళ్లడం చూసి నాన్న తాను కూడా నాతో వస్తానన్నారు. చెట్టు మీద ఎక్కువ సేపు స్థిరంగా ఉండడం, కోత దశకు వచ్చిన కాయలను గుర్తించడం నేర్పించారు నాన్న. ఈ పనితో మా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి. కానీ అమ్మ మాత్రం చాలా బాధ పడుతోంది. ‘ఇంత చదివించింది చెట్లెక్కి కొబ్బరి కాయలు కోయడానికా’ అని ఒకరు, ‘నువ్వు కన్నది కూతుర్ని... ఆడపిల్ల చేసే పనులేనా ఇవి’ అని మరొకరు బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు రకరకాలుగా దెప్పుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నాన్న ‘‘నా కూతుర్ని చూస్తే గర్వంగా ఉంది. నా కూతురి చేతికింద పని చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంద’’న్నారు. కోవిడ్ చాలా నేర్పిస్తోంది కోవిడ్ మనలో దాగి ఉన్న చాలా నైపుణ్యాలను వెలికి తీస్తోంది. మనల్ని మనం పోషించుకోవడానికి మన ఎదురుగా ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తాం. కొబ్బరి కాయలు కోయడంతో వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నాం. కాయల రవాణా కూడా చేస్తున్నాం. నాన్నకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను నాన్న దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాను. కోవిడ్ మహమ్మారి ఇంతలా జీవితాల మీద దాడి చేయకపోయి ఉంటే... బీఈడీ తర్వాత టీచర్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నించేదాన్ని. నేను ఇన్ని పనులు చేయగలుగుతాననే విషయం ఎప్పటికీ తెలిసేది కాదు కదా’’ అని నవ్వుతోంది శ్రీదేవి. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించడం అంటే ఇదే. ‘పాజిటివ్’ అనే పదమే భయపెడుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి పాజిటివ్ దృక్పథం అవసరం. అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికైనా, జీవికను గాడిలో పెట్టుకోవడానికైనా. అమ్మానాన్న, చెల్లెళ్లతో శ్రీదేవి -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
కవాడిగూడ: బంధువుల పెండ్లికి వచ్చిన పలువురు ముంబై వాసులు లాక్డౌన్ కారణంగా నగరంలోనే ఇరుక్కుపోయారు. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయి తమది కాని రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ ఓ పూట తింటూ ఓ పూట పస్తులుంటున్న వారు సాయం కోసం కనపడిన వారినందరినీ ప్రాధేయపడ్డారు. ఈ విషయం కాస్తా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి రావడంతో.. నేనున్నాంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు. వారిని మహారాష్ట్ర తరలించేందుకు తన సొంత డబ్బు లక్ష రూపాయలతో ఏర్పాట్లు చేశారు. ఇందుకు అనుమతివ్వాలంటూ ఉన్నతాధికారులతో మాటాడి వారి స్వస్థలాలకు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. పార్శిగుట్టకు చెందిన సత్యనారాయణ, సృజన దంపతుల కుమారుడి వివాహం మార్చి 19న జరిగింది. వివాహానానికి ముంబై నుంచి 30 మంది దాకా వచ్చారు. అనంతరం 30 మందిలో పదిమంది ముంబైకి వెళ్లిపోగా 20 మంది సిటీని వీక్షించి 23న వెళ్లేందుకు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు. మార్చి 22న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇక్కడే ఓ కిరాయి ఇంటిలో ఉంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన వారు ముంబై వెళ్లేందుకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలను భర్తిస్తానని, ఇందుకు అనుమతులివ్వాడంటూ కలెక్టర్‌ను కోరారు. తక్షణం అధికారులు స్పందించడంతో ఈ నెల 4న (సోమవారం) వారు ఇక్కడ నుంచి ముంబైకి వెళ్లారు. దేవుడిలా తమను ఆదుకున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామంటూ వారు భావోద్వేగంతో ముఠా గోపాల్‌కు కృతజ్ఞలు తెలిపారు. -
అతని వయస్సు 19 ఏళ్లే కానీ..
పాట్నా: బీహార్‌కు చెందిన 19 ఏళ్ల గోపాల్ జీ అతి చిన్న వయస్సులోనే అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. భాగల్పూర్ జిల్లాకు చెందిన గోపాల్‌కు నాసా ఆహ్వానం లభించింది. అమోఘమైన తెలివితేటలతో రెండు పేటెంట్ల (మేథోసంపత్తి హక్కుల)ను గోపాల్ సాధించాడు. సమాజానికి సేవ చేయడానికి తన ఆవిష్కరణలు ఉపయోగపడాలన్నదే తన ఆకాంక్షగా అతడు పేర్కొన్నాడు. తండ్రి రంజన్ కున్వర్ సాధారణ రైతు అని, కుటుంబ పరిస్థితులను అధిగమించి ఉన్నత చదువులు అభ్యసించినట్లు తెలిపాడు. గోపాల్ గొప్ప ఆవిష్కర్తగా, పరిశోధకుడిగా, డిజిటల్ విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రేరణ కలిగించే ఉపన్యాసాలతో సమాజానికి తన సేవలను అందిస్తున్నాడు. గోపాల్ ప్రస్తుతం డెహ్రాడున్‌లోని గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ చదువుతున్నాడు. అరటి, బయో కణాలకు సంబంధించిన ప్రయోగాలు సఫలం కావడంతో గోపాల్ రెండు పేటెంట్లు పొందాడు. అతడి ప్రతిభకు మెచ్చి తైపీ ఎగ్జిబిషన్లో 10 దేశాలకు చెందిన 30 స్టార్టప్ కంపెనీలు అతడిని ఆహ్వానించాయి. 2017లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసానని, ఆయనతో పది నిముషాలు మాట్లాడినట్లు గోపాల్ తెలిపాడు. మోదీతో మాట్లాడాక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని సందర్శించానని, తరువాత తనను అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) కు పంపించారని..అక్కడ మూడు ఆవిష్కరణలు చేసినట్లు తెలిపాడు. అరటి ఆకు ఆవిష్కరణకు గాను తనకు ఇన్స్పైర్ అవార్డు లభించిందని గోపాల్ పేర్కొన్నాడు. -
ఘరానా మోసం
లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది. గోపాల్ సే తన కారులోంచి దిగి కంగారుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లాడు. నేరుగా ఎస్సై రమేష్ కుమార్ దగ్గరకు వెళ్లాడు. ఎస్సైగారూ! ఎలాగైనా మీరే కాపాడాలి. దారుణంగా మోసపోయాను. మీరు నన్ను కాపాడకపోతే నాకు ఆత్మహత్యే దారి.ఆ మాటలు వినగానే కుమార్ షాక్ అయ్యాడు. ఎప్పుడూ హుందాగా, ఠీవిగా దర్పాన్ని ప్రదర్శించే గోపాల్ సేఠేనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. ‘‘గోపాల్ సే గారూ! ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? రండి. ముందు కూర్చోండి. తాగడానికి ఏమైనా తీసుకుంటారా?’’ అన్నాడు.‘‘ఏమీ వద్దు ఎస్సైగారూ! ముందు నా కంప్లైంట్ తీసుకోండి.. ప్లీజ్..!’’‘‘సరే చెప్పండి. ఏం జరిగింది?’’ అడిగాడు ఎస్సై.గోపాల్ సే పూర్వీకులది కలకత్తా. చాలా ఏళ్ల కిందటే వాళ్ల నాన్న ఇంట్లో గొడవ పడి హైదరాబాద్ వచ్చి నార్తిండియన్లు ఎక్కువగా ఉండే గాంధీనగర్ ఏరియాలో నగల దుకాణం పెట్టాడు. అది దినదినాభివృద్ధి చెంది ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే వాళ్లకు మంచి సంపాదన తెచ్చి పెట్టింది. వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత గోపాల్ సేదాన్ని మరింత అభివృద్ధిలోకి తెచ్చాడు. ఆ ఏరియాలో మిగిలిన అన్ని నగల దుకాణాల కన్నా గోపాల్ సే దుకాణానికి గ్లామరెక్కువ. సిటీలో ఒక పెద్ద మల్టీ ఫ్లోర్ జ్యువెలరీ షాపు ఓపెన్ చేయాలనేది అతని ఆశ. అతని బంధువులంతా కలకత్తాలోనే ఉంటారు. అందరూ జ్యువెలరీ బిజినెస్‌లోనే ఉన్నారు. అక్కడి వాళ్లకు ఇతను డిజైన్లు పంపడం, అక్కడి డిజైన్లు వాళ్లు ఇతనికి పంపడం ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది.ఎస్సై రమేష్‌కుమార్ ఈ మధ్యనే నిజామాబాద్ నుంచి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. అతని భార్య అంటే అతనికి ఎనలేని ప్రేమ. ఆమె కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడు. మొన్నామధ్య డీజీపీ ఇంట్లో జరిగిన వేడుకలో డీజీపీ భార్య వేసుకున్న నెక్లెస్ రమేష్‌కుమార్ భార్యకి తెగ నచ్చేసింది. వచ్చే నెలలో జరగబోయే పోలీస్ గెట్ టుగెదర్ పార్టీకి అలాంటిదే కావాలని పట్టుబట్టింది. ఎంక్వైరీ చేస్తే అది గోపాల్ సే షాపు డిజైన్ అని తేలింది. భార్యను వెంటబెట్టుకొని షాపుకెళ్లాడు. ఆ డిజైన్ అయిపోయిందని, అటువంటిది తయారు చేయాలన్నా ఇంకో మూడునెలల టైమ్ పడుతుందని గోపాల్ సేచెప్పాడు. ఇంకో ఖరీదైన నెక్లెస్ చూపించి, ‘ఇది తీసుకోండి. లేటెస్ట్ డిజైన్. నిన్ననే డీజీపీగారి వైఫ్ వచ్చి నెక్ట్స్ మంత్ ఏదో పార్టీ ఉందని దీనిని తీసుకెళ్లారు’’ అని చెప్పాడు. ఆ మాట వినగానే రమేష్‌కుమార్ భార్య కళ్లు మెరిశాయి. తనకు అది కావాల్సిందేనని ఆమె చూపుతోనే రమేష్‌కుమార్‌కి అర్థమైంది. ధర ఎంతని అడిగితే, ‘జస్ట్ యాభై లక్షలే’ అని చెప్పాడు గోపాల్ సే. ధర వినగానే రమేష్‌కుమార్ గుండె అదిరిపోయింది. ‘‘ఏంటీ యాభై లక్షలే’’ అంటూ నోరెళ్లబెట్టాడు. ‘‘ఔను సర్! ప్యూర్ గోల్డ్. ఫైన్ కటింగ్ డైమండ్స్...’’ అంటూ ఏవేవో చెబుతున్నాడు గోపాల్ సే. కానీ అవేవీ వినకుండా రమేష్ కుమార్ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇది కొనివ్వకపోతే భార్య పెట్టే టార్చర్‌ను తట్టుకోలేడు. ఈసారి ఎన్ని నెలలు ఫుడ్డు, బెడ్డు కట్ చేస్తుందోనని అతని భయం. ఆ నెక్లెస్‌ను ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచనలో పడ్డాడు.ఇంతలో గోపాల్ సే, ‘‘ఎస్సైగారు! మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది. డీజీపీగారంటే పెద్దోళ్లు. వాళ్ల లెవలూ, వాళ్ల మెయిన్ ఇన్కమ్మూ, సైడ్ ఇన్కమ్మూ వేరే. మనమా వాళ్లతో పోటీ పడలేం. కానీ పడాలని కోరిక. సరే, అదంతా పక్కన పెట్టండి. మీరు నాకో సాయం చేస్తే మీకు ఇలాంటివి బోలెడు మీకు సగం రేటుకే అందుతాయి. అలాగే మీకొచ్చే మామూలు మీకు ఎలాగూ అందుతూనే ఉంటుంది. ఇంతకీ మీరు చేయాల్సిందల్లా బయట నుంచి నాకు వేరే దారిలో వచ్చే బంగారాన్ని అడ్డుకోకుండా ఉండటమే.. అంటే మీరు ఈ ఏరియాకి కొత్తగా వచ్చారు. చెప్పడం నా బాధ్యత. అయినా ఇవన్నీ మీకు తెలియనివి కావులెండి..’’ అంటూ నసుగుతూ అన్నాడు.రమేష్ కుమార్ కొద్దిసేపు మౌనంగా ఉండి, ‘‘సరే, ఆ నెక్లెస్ ప్యాక్ చేసి ఇంటికి పంపండి’’ అని వెళ్లిపోయాడు. అలా వాళ్ల మధ్య స్నేహం మొదలైంది.ధన్ తెరాస్ కోసం గోపాల్ సే పెద్ద ఎత్తున కొత్త డిజైన్లు చూపిస్తున్నాడు. అప్పుడే కలకత్తాలో ఉండే అతని బాబాయి కొడుకు శ్యామ్‌లాల్ తను చేసిన కొత్త డిజైన్ల ఫొటోలను వాట్సాప్ చేయమని అడిగాడు. గోపాల్ సేఆ ఫొటోలను అతనికి పంపాడు. వెంటనే శ్యామ్‌లాల్ ఫొటోస్‌లో చిన్న చిన్న డిజైన్స్ సరిగా కనపడటం లేదని, ఒకప్పట్లా పాత పద్ధతిలోనే వాటిని తనకు పంపాలని వాటిని చూసి తను నగలు చేసిన తర్వాత తిరిగి పంపిస్తానని, అవి తిరిగి వచ్చే వరకు అంతే విలువ గల నగలను వాటికి బదులు పంపిస్తానని, బంటీ వాటిని తీసుకుని వచ్చే శుక్రవారం మీ దగ్గరకొస్తాడని వాట్సాప్‌లో మెసేజ్ పంపాడు. దానికి గోపాల్ సే ‘ఓకే’ అంటూ బదులిచ్చాడు.బంటి శ్యామ్‌లాల్ దగ్గర చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చాలా నమ్మకస్తుడు. శ్యామ్‌లాల్ ఇచ్చిన నగలతో బంటి శుక్రవారం గోపాల్ సేవద్దకొచ్చాడు. బంటి ఇచ్చిన నగలు తీసుకుని, తన కొత్త డిజైన్లను అతనికి ఇచ్చి పంపించాడు గోపాల్ సేవారం గడిచిపోయింది. ధన్ తెరాస్కు మరో వారం రోజులే ఉంది. శ్యామ్‌లాల్ నుంచి ఎలాంటి కబురూ రావట్లేదు. గోపాల్ సే శ్యామ్లాల్కి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి వచ్చిన సమాధానానికి గోపాల్ సేకొయ్యబారిపోయాడు.అసలు తాను డిజైన్ల కోసం ఏ నగలూ అడగలేదని, అయినా బంటి తన దగ్గర పని మానేసి రెండు వారాలు అవుతోందని శ్యామ్‌లాల్ అన్నాడు. పైగా, ‘‘ఏంటి అన్నయ్యా! నా మీద ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నావు. అన్నయ్యా జాగ్రత్త! అక్కడ నువ్వెంతో ఇక్కడ నేనూ అంతే’’ అని ఫోన్ కట్ చేశాడు.గోపాల్ సేకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే కలకత్తాకు బయలుదేరాడు. శ్యామ్‌లాల్ షాపులోకి అడుగు పెడుతూనే షాక్ అయ్యాడు. గోపాల్ సే తయారు చేసిన డిజైన్లన్నీ షోకేసుల్లో పెట్టి ఉన్నాయి. ‘‘ఏంటి తమ్ముడూ నన్ను నగలు అడగలేదన్నావు. మరి ఈ డిజైన్లు ఎవరివి?’’‘‘అవి నా డిజైన్లే’’ అని దబాయించాడు శ్యామ్‌లాల్. గోపాల్ సేకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరికీ మాటా మాటా పెరిగి గొడవ పెద్దదయింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి గోపాల్ సేని అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత విడుదలై, నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు.జరిగినదంతా చెప్పి ‘‘తమ్మడు ఇలా చేస్తాడనుకోలేదు ఎస్సైగారూ! వీటి విలువ పది కోట్లు. ధన్ తెరాస్ వస్తోంది కదా అని సేల్స్ ఎక్కువవుతాయని అప్పు చేసి మరీ వాటిని తయారు చేయించాను. ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. లేకపోతే ఆత్మహత్యే గతి’’ అంటూ భోరుమన్నాడు. ‘‘ఊరుకోండి గోపాల్ సేగారు! చిన్నపిల్లాడిలా ఏడిస్తే ఏం లాభం? ముందు ఈ మంచినీళ్లు తాగండి’’ అంటూ గ్లాస్ అందించాడు. ‘‘అయినా మీ దగ్గర మీ తమ్ముడు ఇచ్చిన అంతే విలువ గల నగలు ఉన్నాయి కదా!’’ అని ఎస్సై అనగానే..‘‘అయ్యో! నా ఖర్మ సార్.. ఖర్మ.. అవి నకిలీవి’’ అంటూ నెత్తికొట్టుకుంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు గోపాల్ సే‘‘అదేంటి తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోలేదా?’’‘‘లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది.’’ ‘‘మరి కలకత్తా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా?’’‘‘ఏంటి ఎస్సైగారు! అన్నీ తెలిసిన మీరే ఇలా అడిగితే ఎలా? అది వాడి ఏరియా సర్. నేను కంప్లైంట్ చెయ్యక ముందే నన్ను అరెస్టు చేయించినవాడు. నేను కంప్లైంట్ చేస్తే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఉన్నవాడు. అందుకే నేను డైరెక్ట్‌గా మీ దగ్గరకు వచ్చాను. మీ పోలీసు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగైనా మీరు వాటిని నాకు దక్కేలా చూడండి. మీకు వచ్చేది మీకు వచ్చేలా చేస్తాను’’ అని ఎస్సై రమేష్‌కుమార్ చేతులు పట్టుకుని బతిమాలాడు.‘‘సరే గోపాల్ సే గారు! మీరు బాధపడకండి. ప్రాబ్లమ్ నాకు క్లియర్‌గా అర్థమైంది. వాటిని మీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. నాకు ఇవ్వాల్సింది మాత్రం మర్చిపోకండి. మీ ఫోన్ ఇచ్చి వెళ్లండి. అలాగే బంటీ ఫోన్ నంబర్ కూడా’’‘‘అలాగే సర్. మీ మీద నమ్మకంతో ఈ ఒక్కరోజన్నా నేను ప్రశాంతంగా నిద్రపోతాను’’ అని గోపాల్ సేవెళ్లిపోయాడు. గోపాల్ సే ఫోన్ చెక్ చేసి, అతను, అతని తమ్ముడు చేసిన వాట్సాప్ చాట్ చెక్ చేశాడు ఎస్సై రమేష్ కుమార్. అంతా గోపాల్ చెప్పినట్లే ఉంది. క్లూస్ టీమ్‌కి ఆ నంబర్ ఇచ్చి, గోపాల్ సేకి, శ్యామ్లాల్కి జరిగిన ఫోన్ సంభాషణలను రిట్రీవ్ చేసి విన్నాడు. అంతా గోపాల్ సే చెప్పినట్లే కరెక్ట్‌గా ఉంది. గోపాల్ సే ఇంటి నుంచి నకిలీ నగలను హ్యాండోవర్ చేసుకున్నాడు. కలకత్తాలో తనకు తెలిసిన కానిస్టేబుల్ చేత శ్యామ్‌లాల్ షాపులో ఉండే నగల ఫొటోలు తీయించి, వాటిని గోపాల్ సే వాట్సాప్‌లో పంపిన ఫొటోస్‌తో పోల్చి చూసుకున్నాడు. అవి కూడా మ్యాచ్ అయ్యాయి. ఇక ఒకే ఒక్క విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. అది బంటీగాడి వాంగ్మూలం. శ్యామ్‌లాల్ ఇదంతా చేయించాడని బంటి చెబితే సరిపోతుంది. జాక్‌పాట్ కొట్టినట్టే. పదికోట్ల విలువ చేసే నగలు రికవరీ చేసుకోవచ్చు. తనకు వచ్చే కమీషన్ కూడా భారీగానే ఉంటుంది అని మనసులో సంతోషించాడు.మర్నాడు డీజీపీకి కేసు వివరించి, ‘‘సర్! బంటీ అరెస్టుకు కావలసిందల్లా కలకత్తా పోలీసుల పర్మిషన్. వాడు అక్కడే ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేశాం. మీరు వాళ్లతో మాట్లాడి పర్మిషన్ తెప్పిస్తే మిగిలినదంతా నేను చూసుకుంటాను’’ అని చెప్పడంతో ‘‘గో అహెడ్’’ అన్నాడు డీజీపీ.మర్నాడే కలకత్తా పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. ఎస్సై రమేష్‌కుమార్ టీమ్ కలకత్తా వెళ్లి బంటీని అరెస్టు చేసి, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇంటరాగేషన్‌లో ఇదంతా శ్యామ్లాలే చేయించాడని చెప్పాడు వాడు. రేపు వాణ్ణి కోర్టులో హాజరుపరచి, జడ్జి ఎదుట ఇదే మాట అనిపిస్తే బంటీగాడు జైలుకి, లక్షల కమీషన్ తన జేబులోకి అంటూ కలల్లో తేలిపోసాగాడు రమేష్‌కుమార్. ఇంటికెళ్లి భార్యతో ఇదే విషయం చెబితే ఆమె సంతోషంతో అతణ్ణి వాటేసుకుంది. రాత్రంతా వాళ్లు కలల్లో తేలిపోతూ గడిపారు.తెల్లారుజామున కాస్త కునుకుపడుతుండగా రమేష్‌కుమార్‌కు డీజీపీ నుంచి ఫోన్ వచ్చింది. చిరాగ్గా ఫోన్ ఎత్తి ‘‘చెప్పండి సర్.’’ అన్నాడు.‘‘ఏమైందా..? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావా? తొందరగా వెళ్లి ఆ గోపాల్ సేని అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకురా. నేను స్టేషన్‌కు వస్తున్నా’’ అని ఫోన్ కట్ చేశాడు. ఎస్సై రమేష్ కుమార్‌కు నిద్రమత్తంతా వదిలిపోయింది. హడావుడిగా గోపాల్ సే ఇంటికెళ్లి అతణ్ణి అరెస్టు చేసి, స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు. స్టేషన్ కేబిన్‌లో కూర్చుని ఉన్నాడు డీజీపీ. రమేష్ కుమార్ అప్పుడే లోపలకు అడుగు పెట్టాడు. అతణ్ణి చూస్తూనే ‘‘రావయ్యా రా.. నీ కోసమే ఎదురు చూస్తున్నా’’ అన్నాడు.‘సర్ అసలేం జరిగింది? నాకేమీ అర్థం కావడం లేదు. గోపాల్ సేని ఎందుకు అరెస్టు చేసినట్లు?’’ అన్నాడు.‘‘గోపాల్ సే పెద్ద జాదూగాడయ్యా. ఆ నగలు గోపాల్ సేవి కాదు. శ్యామ్లాల్వే. శ్యామ్‌లాల్ దగ్గర పనిచేసే బంటీగాడికి డబ్బు ఆశ చూపి తనవైపు తిప్పుకున్నాడు. బంటీగాడు ఆ నగలు సేఫ్ హౌస్‌లో ఉండగానే వాటిని శ్యామ్‌లాల్ ఫోన్ దొంగిలించి, దాంతో ఫొటోలు తీసి గోపాల్సేకి పంపించాడు. తర్వాత అవి డిలీట్ చేశాడు. తర్వాత ఆ నంబర్ నుంచి బంటీగాడు శ్యామ్లాల్లాగ నగలు అడగడం, ఇక్కడ గోపాల్ సే శ్యామ్‌లాల్ నంబర్‌కి ఫోన్‌చేసి పంపడం.. ఇలా వద్దని బంటీ చేత తనకు నగలు పంపించాలని బంటీగాడే శ్యామ్లాల్లా మెసేజ్‌లు పంపడం .. తర్వాత బంటీ శ్యామ్‌లాల్ దగ్గర పని మానేయడం.. ఇదంతా వాళ్ల ప్లాన్‌లో భాగమే.. ఇక్కడ నీతో పరిచయం కూడా వాడి మాస్టర్ ప్లాన్‌లో భాగమే. వాడి తర్వాతి స్టెప్‌ను నువ్వు కంప్లీట్ చేశావు. బంటీగాడి ఫోన్ ఆన్‌లో ఉంచుకోమని చెప్పి, దాని ద్వారా నువ్వు అతన్ని పట్టుకున్నప్పుడు శ్యామ్లాలే ఇదంతా చేయించాడని చెప్పడం కూడా అతని ప్లాన్‌లో భాగమే. వాడు జైలుకెళ్తే తర్వాత వాణ్ణి బెయిల్‌పై బయటకు తెచ్చే బాధ్యత తనదేనని గోపాల్ సేవాడికి ముందుగానే మాట ఇచ్చాడు.’’ఇదంతా విన్న ఎస్సై రమేష్ నిర్ఘాంతపోయాడు. తన పక్కనే ఉంటూ తనకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేశాడా.. అనుకున్నాడు.ఇక కేసు ఎలా ఛేదించాడో డీజీపీ చెప్పసాగాడు. ‘‘ఇక్కడ గోపాల్సేకి నువ్వెలా దోస్తువో, అక్కడ శ్యామ్లాల్కి కూడా పోలీసుల్లో ఒక దోస్తు ఉన్నాడు. మనం బంటీ అరెస్టుకు పర్మిషన్ అడిగినప్పుడు అక్కడి పోలీసులు శ్యామ్‌లాల్ ఫోన్ హ్యాండోవర్ చేసుకుని, ఫోరెన్సిక్ టీమ్‌తో క్రాస్ చెక్ చేయించారు. బంటీగాడు శ్యామ్‌లాల్ ఫోన్ నుంచి గోపాల్సే కి పంపి, డిలీట్ చేసిన ఫొటోలను కూడా రిట్రీవ్ చేశాడు. అవి బయటపడటంతో గోపాల్ సే, బంటీ కుమ్మక్కై వేసిన మాస్టర్ప్లానేనని అర్థం చేసుకున్నాడు. శ్యామ్‌లాల్ కలకత్తా కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మీద అక్కడి పోలీసులు ఇక్కడకు వచ్చారు. సెల్లో ఉన్న బంటీగాడిని కలకత్తా స్టైల్లో ఇంటరాగేట్ చేయడంతో నిజం కక్కాడు’’ అని వివరించాడు. ‘‘వాళ్లు ముందే వచ్చారు కాబట్టి సరిపోయింది. మనం బంటీగాడిని జడ్జి ముందు పెట్టి, శిక్షపడేలా చేశాక వచ్చి ఉంటే మన ఉద్యోగాలకే ఎసరొచ్చేది’’ అంటూ ఎస్సై రమేష్‌కుమార్‌కి చీవాట్లు పెట్టాడు. ఎం.శంకర్ రామమూర్తి -
ప్రేమామృతం
బడినుంచి వచ్చిన దగ్గరనుంచి ముఖం వేలాడేసుకుని ఉన్న గోపాల్‌ను దగ్గరకు తీసుకుని ‘ఏం జరిగింది కన్నా? ఎందుకలా ఉన్నావు’ అని బుజ్జగింపుగా అడిగింది అమ్మ. ‘మరేం లేదమ్మా, ఆదివారం నాడు మా బడిలో పిల్లలందరినీ వనభోజనాలకు తీసుకు వెళ్తున్నారు. అందరినీ తలా రెండు రకాల పదార్థాలను తీసుకురమ్మన్నారు మాస్టారు. అందరూ రకరకాల తినుబండారాలు తీసుకు వస్తామన్నారు. మరి నేను ఏమి తీసుకు వెళ్లాలి? ఎలా తీసుకు వెళ్లాలి...’’ అని వెక్కసాగాడు. ‘‘ఓస్, ఇంతేనా! నువ్వు కూడా రుచికరమైన తినుబండారాలు తీసుకు వెళుదువుగానీ. నువ్వేమీ దిగులు పడకు కన్నా’’ అని సముదాయించింది అమ్మ. భర్త తీసుకు వచ్చే జీతం రాళ్లకు తోడు ఇంటి ముందున్న స్థలంలో కూరగాయలు, పండ్ల చెట్లు పెంచి వాటితో గుట్టుగా ఇల్లు నడుపుకొస్తూన్న ఆమె ఏం చేయాలా అని ఆలోచిస్తూ పెరటిలోకి వచ్చింది. అరటి, సపోటా, జామ, దానిమ్మ పండ్ల చెట్లు ప్రేమగా తనను పలకరిస్తున్నట్లుగా తలలు ఊగిస్తున్నాయి. తమ కొమ్మల్లో దాచుకున్న పండ్లను తినమన్నట్లు చూస్తున్నాయి. ఏదో ఆలోచన వచ్చినదానిలా ఆ చెట్లను ఆప్యాయంగా నిమురుతూనే పండ్లు కోసింది.వాటిని ముక్కలుగా తరిగింది. ఇంతలోనే ఆమెకు మా ప్రేమను పిండుకోవా అన్నట్లుగా వేపచెట్టు కొమ్మలలోనుంచి తొంగి చూస్తున్న తేనెపట్టు కనిపించింది. తంటాలు పడి ఆ తేనెపట్టు దింపింది. పట్టునుంచి పిండిన తేనెను పండ్ల ముక్కల మీద పోసింది. ముందురోజు నానపెట్టి ఉంచిన పెసరపప్పును వడకట్టి, దానిలో సన్నగా తరిగిన కేరట్, కీరదోస ముక్కలను, కొబ్బరి కోరును కలిపి చారెడు ఉప్పు వేసి, నిమ్మరసం పిండింది. తాటిమట్టలతో తయారు చేసిన రెండు దొన్నెలలో వాటిని నింపి పైన బాదం ఆకులతో కప్పేసి, కొబ్బరి ఈనెలతో వాటి మూతులను కుట్టేసింది. ‘ఇక తీసుకు వెళ్లు’ అన్నట్లుగా గోపాల్ వైపు చూసింది ప్రేమగా. గోపాల్ సంకోచంగానే వాటిని అందుకుని వనభోజనాలకు వెళ్లాడు. అక్కడ ఆటపాటలు, క్విజ్ పోటీల తర్వాత కాళ్లూ చేతులు కడుక్కొని వచ్చి చెట్ల నీడన భోజనాలకు కూర్చున్నారు పిల్లలు. అందరూ తాము తెచ్చిన వాటి మూతలు తెరిచి చూపిస్తుంటే, గోపాల్ మాత్రం బెరుకు బెరుకుగా తను తెచ్చిన దొన్నెలను వెనకాల దాచుకుంటున్నాడు. మాస్టారు అది గమనించారు.గోపాల్ నుంచి ఆ దొన్నెలను అందుకున్నారు. ముందు తాను రుచి చూశారు. చాలా బాగున్నాయి. మీరు కూడా తినండంటూ అందరికీ గోపాల్ తెచ్చిన పదార్థాలను తానే స్వయంగా పంచారు. లొట్టలు వేసుకుంటూ తిన్నారందరూ. తల్లి ప్రేమను రంగరించి మరీ పోషకాలు ఉన్న పదార్థాలు తెచ్చాడని మెచ్చుకుని మంచి బహుమతి ఇచ్చారు. డబ్బు అన్ని పనులూ చేయలేదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
‘నక్కీరన్’ గోపాల్ అరెస్టును తప్పుబట్టిన మద్రాస్ కోర్టు
సాక్షి, చెన్నై : ప్రముఖ జర్నలిస్ట్ ‘నక్కీరన్’ గోపాల్‌కు మద్రాసు హైకోర్టు ఊరట కల్పించింది. గోపాల్‌కు రిమాండ్ విధించడానికి నిరాకరించి తమిళనాడు ప్రభుత్వానికి, చెన్నై పోలీసులకు గట్టి షాక్ ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గురించి తప్పుడు కథనం రాశారంటూ ‘నక్కీరన్’ గోపాల్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్ ప్రతిష్టను దిగజార్చేవిధంగా గోపాల్ అసత్య కథనాలు రాశారంటూ రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను తప్పుపట్టిన మద్రాసు కోర్టు గోపాల్‌కు రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. కాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న గోపాల్ ప్రస్తుతం తమిళ మ్యాగ్జైన్ ‘నక్కీరన్’కు ఎడిటర్- ఇన్- చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ఈ మ్యాగజీన్ ప్రముఖంగా ప్రచురించింది. ఎక్కువ మార్కులు రావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో గవర్నర్ వద్దకు కూడా నిర్మలా దేవి విద్యార్థులను తీసుకెళ్లిందని గోపాల్ తన కథనంలో రాసుకొచ్చారు. అంతేకాక గవర్నర్ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. -
గవర్నర్‌పై ఆరోపణలు.. జర్నలిస్ట్ అరెస్ట్
చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌పై తప్పుడు కథనం రాసినందుకు గాను ప్రముఖ జర్నలిస్ట్ ‘నక్కీరన్’ గోపాల్‌ను మంగళవారం తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న గోపాల్ ప్రస్తుతం తమిళ మ్యాగ్జైన్ ‘నక్కీరన్’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మ్యాగ్జైన్ తమిళనాడు ప్రోఫెసర్ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ప్రచురించింది. మార్కులు కావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ ప్రొఫెసర్ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆమె గవర్నర్ వద్దకు కూడా విద్యార్థులను తీసుకెళ్లిందని నక్కీరన్ తన కథనంలో పేర్కొన్నారు. అంతేకాక ‘గవర్నర్ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారు. అందుకే గవర్నర్ ఈ కేసుపై విచారణ చేసేందుకు అంగీకరించడం లేదు’ అంటూ నక్కీరన్ తన కథనంలో రాసుకొచ్చారు. దీంతో నక్కీరన్‌పై రాజ్‌భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ ఖండించారు. నిందితురాలైన ప్రొఫెసర్ నిర్మలా దేవీని తాను ఎప్పుడూ కలవలేదని ఆయన వెల్లడించారు. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు రిటైర్డ్ ఉన్నతాధికారి ఆర్.సంథమ్‌ను గవర్నర్ నియమించారు. ఈ క్రమంలో గవర్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆయన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా అమర్యాదకరంగా కథనాన్ని ప్రచురించినందుకు గాను నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పుణె వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చిన నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గోపాల్ అరెస్ట్‌ను తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు డీఎమ్‌కే ప్రెసిడెంట్ ఎమ్కే స్టాలిన్ ఖండించారు. బీజేపీ, అధికార ఏఐడీఎమ్కే ప్రభుత్వాలు ప్రెస్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తున్నాయని స్టాలిన్ ఆరోపించారు. -
చిత్రహింసలు పెడుతుండ్రు
దుబ్బాక రూరల్: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తన భర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వెంటనే అతడిని ఇక్కడికి రప్పించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన దేవవ్వ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రామానికి చెందిన సారుగు గోపాల్ (33) గతేడాది సౌదీ వెళ్లాడు. ఏజెంట్ల మోసానికి బలైన అతను అక్కడికెళ్లాక ఒంటెలు కాసే పనికి కుదిరాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. స్వదేశానికి రాకుండా వీసా, పాస్‌పోర్టు లాక్కున్నారు. గోపాల్‌తో పాటు మరికొందరు కామారెడ్డి జిల్లావాసులు ఇలాగే బాధపడుతున్నట్టు సమాచారం అందిందని దేవవ్వ తెలిపింది. ప్రభుత్వం స్పందించి వెంటనే రప్పించాలని వేడుకుంది. -
జానపథం..‘నిజ’బంధం
కొలుములపల్లె (బేతంచెర్ల):వేలి వేలి ఉంగరాలు... నా స్వామి... ఎడమచేతి ఉంగరాలు ..నాస్వామి.. అంటూ అతను పాడుతుంటే ప్రేక్షకులు పాటలో లీనమై తమను తాము మరచిపోతారంటే అతిశయోక్తి కాదు. కాళ్లకు గజ్జెలు కట్టి చేతిలో అందెలు పట్టుకొని పాటకు అనుగుణంగా అతను వేసే చిందు అద్భుతం. అతని నోటి వెంట వచ్చే జానపదం విని.. పల్లెజనం శ్రమను మరచిపోయి.. ఆనందడోలికల్లో తేలియాడుతుంటారు. బేతంచెర్ల మండలం కొలుములపల్లె గ్రామానికి చెందిన నిజాంగారి గోపాల్ విజయగాథ ఇదీ.. జానపద కళాకారుడు నిజాంగారి గోపాల్ చిరుప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల గాన గంధర్వుడిగా, జానపద గాన కోకిలగా బిరుదులు అందుకున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక పదో తరగతిలోనే ఇతను చదువుకు స్వస్తి పలికాడు. చిరుప్రాయంలోనే తన మేనమామ కేశాలు ప్రోత్సాహంతో జానపద గేయాలు నేర్చుకున్నాడు. కొంతమంది దాతల సహకారంతో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పొల్గొని విజేతగా నిలిచాడు. మాటీవీ రేలా రే రేలా ప్రోగ్రాంలో పలు ఎపిసోడ్లలో ప్రతిభ కనబరిచి.. 2010 నవంబర్‌లో ఫైనల్ విన్నర్‌గా నిలిచాడు. నాపరాయికి ప్రసిద్ధి గాంచిన కొలుముల పల్లె పేరు రాష్ట్రస్థాయిలో పేరుమోగేలా చేశారు. సినిమాల్లో పాటలు.. పల్లె గొంతుకు అయిన జానపదాన్ని రాష్ట్ర స్థాయిలో వినిపించిన ఘనత గోపాల్‌కే దక్కింది. ఇతని పాటలు.. జానపద కళాకారులను, సంగీత ప్రియులను సైతం మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఒంగోలు గిత్త సినిమాలోనూ ఒక జానపద గేయాన్ని ఆలపించాడు. జానపద కళాబృందం సభ్యులతో కలిసి ఇప్పట వరకు 300 ప్రదర్శనలు ఇచ్చారు. గోపాల్..తండ్రి ఓ సాధారణ రైతు. పేదరికం కారణంగా.. కొంత మంది దాతల సహకారంతో తాను నమ్ముకున్న రంగంలో రాణిస్తున్నాడు. ఉత్సాహవంతులైన వారికి నేర్పిస్తున్నా కళ మరుగున పడకుండా ఉత్సాహవంతులైన జానపదకాళాకారులను ప్రోత్సాహిస్తూ కొత్తబాణిలు నేర్పుతున్నాను. 15 నుంచి 35 సంవత్సరాలలోపు యువతి, యువకులను ప్రోత్సాహిస్తూ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో దాతలు ఆహ్వానం మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నాను. కొత్త వారితో జానపదాలు పాడిస్తున్నాను. జానపదం ప్రాచీన కళ. ఈ కళను మరుగున పడకుండా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. – నిజాంగారి గోపాల్ -
భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని..
హైదరాబాద్: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక న్యూ రక్షాపురంలో నివాసముంటున్న గోపాల్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నాడు. కాగా.. జ్యోతి మూడేళ్లుగా స్థానికంగా నివాసముంటున్న రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ అంశంపై గోపాల్ ఆమెను పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన గోపాల్ సూసైడ్ నోట్ రాసి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.