కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2న బృహత్ ప్రతిఘటన
ఎల్‌ఐసీ కార్మిక సంఘం సంఘటన ప్రముఖుడు గోపాల్
కోలారు : ప్రధాని నరేంద్రమోది ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎల్‌ఐసీ కార్మిక సంఘం సంఘటన ప్రముఖుడు గోపాల్ ఆరోపించారు. నగరంలోని పాత్రికేయుల భవనంలో కార్మిక సంఘటనల సంయుక్త సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తాలూకా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు ఆనుగుణంగా నరేంద్రమోది పాలనలేదన్నారు. కేవలం శ్రీమంతులు, పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న 44 చట్టాలను మార్చి పెట్టుబడి దారులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు.
సామాజిక భద్రతా పథకాలపై కేంద్రం దాడి చేస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదల, కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా బృహత్ ప్రతిఘటన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐటీయూ నాయకుడు గాంధీనగర్ నారాయణస్వామి, కేఎస్ ఆర్టీసీ నౌకర్ల సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, అంగనవాడీ నౌకర్ల సంఘం అధ్యక్షురాలు మునిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.