
అయోధ్య: రామమందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్(86) ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయనను లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం మహంత్ నృత్య గోపాల్ దాస్ మూత్ర విసర్జన సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధుర వెళ్లిన సమయంలో మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం క్షీణించింది. అయితే అతని ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో మేదాంతలో చేర్పించారు. నృత్య గోపాల దాస్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీస్సుల కోసం ప్రధాని మోదీ పలు మార్లు అయోధ్యకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment