Das
-
బాలికపై సవతి తండ్రి లైంగికదాడి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన సవతి తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో.. ఆ బాలిక రెండు వారాల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని 59వ డివిజన్ లూనాసెంటర్కు చెందిన మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిత్రం అతనితో విడిపోయి కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్‌దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్‌దాస్ కలిసి నివసిస్తున్నారు. శంకర్‌దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ఆ మహిళ హౌస్‌కీపింగ్ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం బాలిక (16) సింగ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్‌కీపింగ్ పనులకు ఇతర ఊర్లకు వెళ్లి అక్కడే పది, పదిహేను రోజులుండేది. నాలుగు నెలల క్రితం బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులవుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో ఆమె బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరో నెల వచ్చిందని చెప్పడంతో ఆమె తన కుమార్తెను అప్పటి నుంచి స్కూల్‌కు పంపకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్దే ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తోంది. బాలికను నిలదీయగా అమ్మా.. నువ్వు ఊరు వెళ్లినప్పుడల్లా శంకర్ దాస్ తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో శంకర్దాస్ను నిలదీయగా అతడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్‌దాస్ కోసం గాలిస్తున్నారు. -
క్షీణించిన నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
అయోధ్య: రామమందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్(86) ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయనను లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం మహంత్ నృత్య గోపాల్ దాస్ మూత్ర విసర్జన సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధుర వెళ్లిన సమయంలో మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం క్షీణించింది. అయితే అతని ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో మేదాంతలో చేర్పించారు. నృత్య గోపాల దాస్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీస్సుల కోసం ప్రధాని మోదీ పలు మార్లు అయోధ్యకు వచ్చారు. -
ఎమ్మెల్యేగా దీపాలీ దాస్ ప్రమాణ స్వీకారం
భువనేశ్వర్: ఝార్సుగుడ ఎమ్మెల్యేగా దీపాలీ దాస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:45 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఆమె తల్లి, సోదరుడు, మంత్రులు ప్రమీలా మల్లిక్, రీతా సాహు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఘన విజయంతో ఓటర్లు కట్టబెట్టిన గురుతర బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మార్గదర్శకంలో ఝార్సుగుడ నియోజకవర్గ బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో దీపాలీ దాస్ మీప ప్రత్యర్థి, బీజేపీ నాయకుడు టొంకొధొరొ త్రిపాఠిపై 48,721 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారానికి ముందు సోదరుడు విశాల్ దాస్ ఆదివారం నవీన్ నివాస్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ విజయం ఝార్సగుడ ఉప ఎన్నికలో చారిత్రాత్మక విజయమని సీఎం అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి నాయకత్వం వహించాలని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంకితభావంతో పని చేయాలని ఆమెకు సూచించారు. ఇదిలా ఉండగా.. దీపాలి దాస్ సుమారు ఏడాది కంటే తక్కువ కాలమే ఈ పదవిలో ఉంటారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉండటమే ప్రధాన కారణం. తిరుగులేని బీజేడీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 5వ విడత పాలనలో 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 7 చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బిజూ జనతాదళ్ విజయ శంఖారావం చేయగా.. మరో స్థానంలో భారతీయ జనతా పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పత్తా లేకుండా పతనమైంది. 2000 తర్వాత ఈ విడతలో రాష్ట్రంలో అత్యధిక ఉప ఎన్నికలు జరగడం విశేషం. -
ఐఏఎస్ దాస్‌పై సీబీఐ కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: వై.ఎస్.జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే దాస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు... తాజాగా ఐపీసీ సెక్షన్ కింద నమోదైన కేసును కూడా కొట్టేసింది. ఆదిత్యనాథ్ దాస్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయనపై కేసును కొట్టేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు సోమవారం తీర్పు వెలువరించారు. దాస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును హైకోర్టు ఇటీవల కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ దాస్‌పై కేసు నమోదు చేసింది. ఐపీసీ కింద సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఆదిత్యనాథ్‌దాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ దాస్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినివ్వలేదని తెలిపారు. అంతేగాక నీటి కేటాయింపులు సక్ర మమే నంటూ అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. అక్రమాలు జరిగాయన్న సీబీఐ... అందుకు ఏ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పిటిషనర్ అమలు చేశారే తప్ప ఆ నిర్ణయాలను పిటిషనర్ తీసుకోలేదని వివరించారు. పిటిషనర్ ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేదని, ఈ విషయాన్ని సీబీఐ కూడా విభేదించడం లేదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి... దాస్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి తీసుకోకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణ నిమిత్తం సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని తన తీర్పులో తప్పుబట్టారు. నీటి కేటాయింపులు, పెట్టుబడులు పెట్టిన తేదీల ఆధారంగా పిటిషనర్ తప్పు చేశారన్న నిర్ణయానికి రావడం ఎంతమాత్రం సరికాదంటూ దాస్‌పై ఐపీసీ కింద సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేశారు. -
హిమ దాస్ కొత్త చరిత్ర
-
నేడు పల్లంట్లలో మావోయిస్టు దాస్ అంత్యక్రియలు
దేవరపల్లి : ఆంధ్రా, ఒడిశా బోర్డర్(ఏవోబీ)లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ అయినపర్తి దాస్(మధు) అంత్యక్రియలు గురువారం దేవర పల్లి మండలం పల్లంట్లలో జరుగుతాయని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు షేక్ మస్తాన్, దళితహక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాస్ మృతదేహం గురువారం ఉదయం ఆయన స్వగ్రామం పల్లంట్ల చేరుతుందని, ఉదయం 11 గంటలకు దాస్ అంతక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొనాలని ఆయన కోరారు. -
ఆధార్ లింక్ అంటూ ఖాతాలో నగదు మాయం
బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల్సి ఉంటుందని వివరాలు సేకరించి ఆన్ లైన్ ద్వారా నగదు కాజేసిన సంఘటన ఇది. బాధితుడు దాస్ కథనం ప్రకారం.. గత నెల 15 వ తేదీ అతని ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ ఎస్బీఐ ఖాతా నంబర్‌కు ఆధార్ కార్డు అనుసంధానం కాలేదని నమ్మించి కార్డు గడువు తేదీని కూడా తెలుసుకొని సుమారు రూ.14,535 పేటీం,ఎస్బీఐ బడ్డీకి బదలాంపు చేసుకున్నాడు. గురువారం బ్యాంక్ పనిమీద వెళ్లి పాస్‌బుక్‌ను అప్డేట్ చేసుకున్న సమయంలో జరిగిన మోసాన్ని గుర్తించి శుక్రవారం గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. ఎస్ఎంఎస్ అలర్ట్ సౌకర్యం కూడా నమోదు చేసుకున్నానని ఖాతాలో నుంచి నగదు తగ్గిన తర్వాత ఎస్ఎంఎస్ కూడా రాలేదని దాస్ తెలిపాడు. దీనిపై అతడు పోలీసులను ఆశ్రయించాడు. -
అబౌట్ టర్న్!
ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరిని దిద్దిందీ కేంద్రీయ విద్యాలయాలే. ఇద్దరూ చదువుల్లో ఫస్ట్. ఆటల్లో ది బెస్ట్. త్రోబాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ... స్కూల్ లెవల్లో, స్టేట్ లెవల్లో... కప్పులన్నీ వారివే. మిగిలింది నేషనల్ లెవల్. ‘చాలిక, ఆటలు ఆపండి’ అన్నారు మిస్టర్ దాస్! నాన్న చెబితే అంతే. ఆయన మిలటరీ మేన్. ‘నాన్న మాటే నా మాట’ అన్నట్లు ఉండిపోయారు మిసెస్ దాస్. ఎందుకిలా జరిగింది? కూతుళ్లను ప్రాణపదంగా చూసుకునే తండ్రి... వాళ్లకు ప్రాణప్రదమైన ఆటల్ని ఎందుకు ఆడనివ్వలేదు? దేశమంతా ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్’ కొట్టొచ్చిన ఈ సిపాయి... పిల్లలు దేశాలు దాటుతామంటే ఎందుకు ‘అబౌట్ టర్న్’ అంటున్నారు?! ఈవారం ‘లాలిపాఠం’ చదవండి. కొంత డిఫరెంటుగా ఉంటుంది. మిగతాదంతా అఫెక్షనేట్గా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పసలపూడిలో పుట్టిన దాస్ ఉద్యోగరీత్యా కాశ్మీర్, పంజాబ్, నాగాలాండ్, మధ్యప్రదేశ్‌లలో పనిచేసి సికింద్రాబాద్‌లో రిటైరయ్యారు. ఆయన భార్య కాంతాదాస్కి పిల్లలే లోకం, ఇల్లే ప్రపంచం. ఒకరోజు దాస్ కాశ్మీర్లో బస్సులో వెళ్తున్నప్పుడు... చెట్టు కొమ్మకు అమర్చిన బాంబు పేలి, పక్కసీటులో ఉన్న వ్యక్తి చూపు కోల్పోవడం ప్రత్యక్షంగా చూశారు. అయినా బెంబేలు పడలేదు. కారణం ఆయన పనిచేసేది దేశ రక్షణ వ్యవస్థలో. ఆర్మీలో పని చేసేవాళ్లకు ఉండాల్సినంత గుండెధైర్యం ఆయనలో ఉంది, కానీ తన పిల్లలను ఒంటరిగా ఎక్కడికి పంపించాలన్నా భయపడతారు. పిల్లలు కాలనీలో ఆడుకుంటున్నప్పుడు కూడా వారికి తోడుగా ఉండమని భార్యకు గుర్తుచేస్తారు. సరిహద్దు రక్షణలో తన కర్తవ్యాన్ని ఎంత క్రమశిక్షణతో చేస్తున్నారో... అంతే క్రమశిక్షణతో ఉండేలా పిల్లలను పెంచుతారు. ఇంతటి మితిమీరిన భద్రత మధ్య పెరిగిన వీరి పిల్లలు ధానేశ్వరి, దివ్య. ఇద్దరూ ఆటల్లో ఫస్ట్, అల్లికల్లో బెస్ట్. తల్లీకూతుళ్లు హైదరాబాద్‌లో... భద్రత వ్యవస్థలో ఉద్యోగం అంటే ఎప్పుడు ఎక్కడ డ్యూటీ పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. తరచూ కుటుంబం అంతా మారడం కొంచెం కష్టమే. దాంతో దాస్ భార్య కాంతాదాస్ పిల్లలను చూసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉండేవారు. ‘‘కొంతకాలం పంజాబ్‌లో, ఝాన్సీ(మధ్యప్రదేశ్)లో ఉన్నాం. ఝాన్సీలో ఉన్నప్పుడు దివ్యను అక్కడి కేంద్రీయవిద్యాలయలో చేర్చాం. అప్పుడు ధానేశ్వరి మా అమ్మవాళ్ల దగ్గర హైదరాబాద్‌లోనే ఉండేది. తర్వాత కొన్నాళ్లకు మా వారికి నాగాలాండ్‌కి ట్రాన్స్ఫర్ కావడంతో నేను, దివ్య హైదరాబాద్‌కి వచ్చేశాం. అప్పటినుంచి పిల్లలిద్దరూ హైదరాబాద్‌లోని తిరుమల గిరి కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. నేను చదివింది టెన్త్‌క్లాస్ వరకే. పిల్లలకు చదువు చెప్పడం, వాళ్లు హోమ్‌వర్క్ ఎలా చేశారో చెక్ చేయడం నాకు పెద్దగా వచ్చేది కాదు. అయితే ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి స్కూల్కెళ్లి టీచర్లతో మాట్లాడేదాన్ని. నేను ప్రతి మీటింగ్‌కీ స్కూల్కెళ్తుంటే ‘మీ పిల్లల పెర్ఫార్మెన్స్ బాగుంది, మీటింగ్ కోసం మీరు రావడం ఎందుకు, ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం’ అనేవాళ్లు. టీచర్లు ఇలా చెప్తున్నారని చెప్పినా ఈయన మాత్రం ఒప్పుకునేవారు కాదు’’ అన్నారామె. మంచి భవిష్యత్తు చదువుతోనే... ధానేశ్వరి, దివ్య ఇద్దరూ ఒకే క్లాస్ కావడంతో ఆటల్లో కూడా కలిసే పాల్గొనేవారు. వాళ్లు తెచ్చుకున్న కప్పులను షెల్ఫ్‌లో వరుసగా సంవత్సరాల వారీగా సర్ది ఉంచుతారు. వాటిని చూపిస్తూ ‘‘త్రో బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ... అదీ ఇదీ అనే తేడా లేకుండా స్కూల్లో అన్ని ఆటలూ ఆడేవారు. రంగోలీ, డిబేట్లలో కూడా పాల్గొనేవారు. అలా స్టేట్ లెవెల్లో ఆడి నేషనల్స్‌కి ఎంపికయ్యారు’’ అని ఆగిపోయారు కాంతాదాస్. నేషనల్ లెవెల్ కబడీ పోటీలో ఏ ఏడాది పాల్గొన్నారన్నప్పుడు కొంచెం బిడియపడుతూ ‘‘మా పిల్లలు నేషనల్ లెవెల్స్ ఆడలేదు. స్కూల్ టీచర్లు ఫోన్ చేసి ‘నేషనల్స్‌లో మీ పిల్లలు గెలుస్తారు, అది మీకే కాదు స్కూల్‌కి కూడా విజయం అవుతుంది, పిల్లల్ని పంపించండి’ అని ఎంత అడిగినా, పంపలేకపోయాం’’ అన్నారు బాధగా. వెంటనే దాస్ ‘‘నేనే వద్దన్నాను, ఆటల్లో ఎక్కువ కాలం కెరీర్ ఉండదు. భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే చదువే ముఖ్యం అని వద్దన్నాను’’ అన్నారు. అంతే కాకుండా చదువుకి తానెంత విలువ ఇస్తారో కూడా వివరించారు. ‘‘మా నాన్నగారికి మా పెద్దమ్మాయి అంటే చాలా ఇష్టం. తనకి వాళ్లమ్మ పేరునే (ధానేశ్వరికి తాతమ్మ) పెట్టారు కూడ. ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో, ధానేశ్వరి పెళ్లి చూడాలని, వెంటనే చేయమని పట్టుపట్టారు. అప్పుడు ధానేశ్వరిని అడిగితే తాను ఇంకా చదువుకుంటానంది. దాంతో నేను... ‘ పెళ్లి తర్వాత చదువుకోవడానికి ఒప్పుకునే సంబంధాన్నే తెస్తాను’ అని నచ్చచెప్పి, పెళ్లి చేశాను. అల్లుడి ఉద్యోగం కూడా డిఫెన్స్‌లోనే. ఇప్పుడు ధానేశ్వరి సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది’’ అన్నారాయన. ఇంట్లో సెంటర్ టేబుల్ మీదున్న గ్లాస్ టాప్‌కి వేసిన పెయింటింగ్‌ని, డోర్ కర్టెన్లని చూపిస్తూ... ‘‘ధానేశ్వరి, దివ్య ఇద్దరూ కుట్లు, అల్లికలు చక్కగా చేస్తారు. వాళ్ల నాన్న కబడ్డీ ఆడేవారు, నేను అల్లికలు బాగా చేసేదాన్ని. పిల్లలిద్దరికీ ఈ అలవాట్లు వచ్చాయి. పిల్లల్ని కబడ్డీలో కంటిన్యూ కానివ్వలేదు, కనీసం వీటిలోనైనా ప్రోత్సహిద్దామనుకుంటున్నాను’’ అన్నారు కాంతాదాస్. దివ్య మాట్లాడుతూ... ‘‘మా ఫ్రెండ్స్ అంతా వేసవి సెలవుల్లో ఢిల్లీ టూర్కెళ్లాలనుకున్నారు. వాళ్లతో వెళ్తానని నాన్నను అడిగితే ‘మీ ఫ్రెండ్స్‌ని వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. అప్పుడు పంపిస్తాను’ అన్నారు. అదేమాట వాళ్లకు చెప్తే ‘అమ్మో! మీ నాన్నతో మాట్లాడడమా, మాకు భయం’ అని ఒక్కరూ రాలేదు. మాకేమవుతుందోననే భయం తప్ప నాన్న మమ్మల్ని ఎప్పుడూ భయపెట్టడు. ఒకసారి రాత్రి తొమ్మిది దాటాక ‘రేపు స్కూల్‌కి కలర్ పెన్సిళ్లు తీసుకెళ్లాలి’ అని చెప్పాను. అప్పుడు తప్ప మరే సందర్భంలోనూ ఆయన మమ్మల్ని కోప్పడింది లేదు. ఆయన వద్దన్న పని చేయాలంటే చిన్నప్పుడు మాకే భయమేసేది. తర్వాత అదే అలవాటైంది. కానీ, కార్టూన్ నెట్‌వర్క్‌లో మాకు ఇష్టమైన ప్రోగ్రామ్ వస్తుంటే ‘మళ్లీ చదువుకోవచ్చులే రండి’ అని పిలిచి మరీ చూపిస్తారు. అక్క ఈ మధ్యనే డిగ్రీలో చేరింది. తనకు కాలేజ్‌కెళ్లే రూట్ అలవాటయ్యే వరకు తానే వెళ్లి దించేవారు. ఇప్పటికీ బయలుదేరిన తర్వాత కాలేజ్‌కి చేరాల్సిన టైమ్‌కి ఫోన్ చేసి కనుక్కుంటారు, సాయంత్రం కాలేజ్ పూర్తయ్యాక ఫోన్ చేసి, తనే వెళ్లి తీసుకొస్తారు లేదా బస్సెక్కించి తన పనులకు వెళ్లిపోతారు’’ అంది. ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లల కోసం కష్టపడతారు. వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దాలని తపన పడతారు. వాళ్లు ఎదగడానికి ఆసరా అవుతారు. ఏ ఆసరా అక్కర్లేకుండా వాళ్లకై వాళ్లే ఎదుగుతుంటే పదిమందికి చెప్పుకుని మురిసిపోతారు. దాస్, కాంతాదాస్ కూడా అలాంటి తల్లిదండ్రులే. కానీ వీరికి పిల్లల విషయంలో భద్రత ఎక్కువైందనిపిస్తుంది. భద్రత కరవైన పిల్లలను చూసి జాలిపడతాం, అదే భద్రత ఎక్కువైతే? వీళ్లను చూస్తే మరీ ఎక్కువైన భద్రత వల్ల అవకాశాల రెక్కలు విరిగిపోతాయని అనుకోకుండా ఉండలేం. ఈ అమ్మాయిలకు జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చి ఉంటే అక్కడ గెలిచి రాష్ట్రానికి పతకాన్ని తెచ్చేవారు. ఆ క్రమం కొనసాగితే దేశానికి ప్రాతినిధ్యం వహించి ఇండియన్ కబడ్డీ సిస్టర్స్‌గా పేరు తెచ్చుకునేవారు కదా, అనిపించక మానదు. తండ్రి సెన్సార్ చేసిన సినిమాలనే... ‘‘మా చిన్నమ్మాయి దివ్య అవంతీ కాలేజ్‌లో బిటెక్ చదువుతోంది. తను బాగా చదువుతుంది. కాలేజ్‌లో విద్యేతర కార్యక్రమాల్లో విద్యార్థినులకు ప్రతినిధి. ఇటీవల కాలేజ్‌లో జరిగిన టెక్నికల్ ఫెస్ట్‌లో దివ్య ఇచ్చిన ప్రెజెంటేషన్‌కి మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారి చేతుల మీద బహుమతి అందుకుంది కూడ. ఇంటర్‌కాలేజ్ కాంపిటీషన్లకి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్ వంటి వాటికి దివ్యనే పిలుస్తారు వాళ్ల లెక్చరర్లు. బీటెక్ తర్వాత అమెరికాలో ఎంఎస్ చేయాలని దివ్య కోరిక. అందుకు వాళ్ల నాన్నగారు ఇంకా తన అంగీకారం తెలుపనే లేదు. మా ఆయన చాలా నెమ్మది, అలాగే చాలా స్ట్రిక్టు కూడ. ‘ఆడపిల్లలు కదా జాగ్రత్తగా పెంచకపోతే ఎలా’ అంటారు. అశ్లీలమైన సినిమాల ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుందంటారు. ఏదైనా ఒక సినిమాకి బాగుందనే టాక్ వస్తే ముందు తను వెళ్లి చూసొస్తారు. తనకు నచ్చితే పిల్లల్ని తీసుకెళ్తారు’’. - కాంతాదాస్, కబడ్డీ సిస్టర్స్ తల్లి - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి ఫొటోలు: ఠాగూర్