ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి హిమ దాస్ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరుగుతున్న ఈ ఈవెంట్ 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం.