World Athletics
-
వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపుపై సీఎం హర్షం
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి గుర్తింపు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మారథాన్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చ, తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ చైర్మన్ స్టాన్లీ జోన్స్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ కమిటీ మెంబర్ రామ్ కటికనేని సీఎం రేవంత్‌రెడ్డిని సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆగస్టు 24న జరగనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన మద్దతు ఇస్తామని, మారథాన్‌లో పాల్గొనే వారందరికీ సీఎం 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.ఇవి చదవండి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు! -
వరల్డ్ ఒలింపిక్స్ చారిత్రక నిర్ణయం
ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగత, రిలే విభాగాల్లో (48 ఈవెంట్స్) స్వర్ణాలు గెలిచే వారికి 50,000 అమెరికన్ డాలర్లు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది పారిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్ నుంచి స్వర్ణ పతక విజేతలకుప్రైజ్‌మనీ పంపిణీ అమల్లోకి వస్తుందని తెలిపింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య పతక విజేతలకు కూడా ప్రైజ్‌మనీ అందిస్తామని పేర్కొంది. నాలుగేళ్లకు ఒకసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి వచ్చే ఆదాయ వాటాతో (2.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒలింపిక్స్‌లో ప్రైజ్ మనీ అందజేసే తొలి అంతర్జాతీయ సమాఖ్య తమదేనని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ప్రకటించారు. -
డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్‌పై మూడేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: భారత మహిళా డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) మూడేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్‌ప్రీత్ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా ‘పాజిటివ్’ అని తేలడంతో అదే నెల 29న సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
Avinash Sable: 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు
కాలిఫోర్నియా: మూడు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పురుషుల 5000 మీటర్ల భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహారాష్ట్రకు చెందిన అవినాశ్ సాబ్లే తన పేరిట మరో జాతీయ రికార్డును లిఖించుకున్నాడు. అమెరికాలో జరిగిన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్లో 27 ఏళ్ల అవినాశ్ 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ ఇండియన్ ఆర్మీ అథ్లెట్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసి 12వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 1992లో బర్మింగ్హమ్ వేదికగా భారత అథ్లెట్ బహదూర్ ప్రసాద్ 13 నిమిషాల 29.70 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అవినాశ్ సవరించాడు. అవినాశ్ ఖాతాలో ఇది మూడో జాతీయ రికార్డు కావడం విశేషం. ప్రస్తుతం అవినాశ్ పేరిట 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, హాఫ్ మారథాన్ జాతీయ రికార్డులు ఉన్నాయి. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో భాగమైన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్లో అవినాశ్‌కు పతకం రాకపోయినా జాతీయ రికార్డును తిరగరాశానన్న సంతృప్తి లభించింది. అంతేకాకుండా ఈ ఏడాది జూలై 15 నుంచి 24 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం దక్కింది. #BreakingNews 🚨 Olympian & #TOPScheme 🏃♂️ #AvinashSable breaks 30-yr old long standing record of Bahadur Prasad (13:29.70/1992) in 5000m, setting a new #nationalrecord with a brilliant performance of 13:25.65 in Sound Running Track meet in San Juan Capistrano 🇺🇸 #Athletics 1/2 pic.twitter.com/vNxWGhi7mT — SAI Media (@Media_SAI) May 7, 2022 -
మాజీ అథ్లెట్ అంజూ బాబీ జార్జీకి అరుదైన గౌరవం
Former Indian Athlete Anju Bobby George Was Women Of The Year.. భారత మాజీ మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జీకి అరుదైన గౌరవం దక్కింది. అథ్లెట్ విభాగంలో ఆమె చేసిన సేవలకు గాను వరల్డ్ అథ్లెటిక్స్ 2021 ఏడాదికి గానూ ''వుమెన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుతో సత్కరించింది. లాంగ్‌జంప్‌లో ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించిన ఆమె రిటైర్మెంట్ తర్వాత 2016లో అమ్మాయిల కోసం ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి శిక్షణ ఇచ్చింది. కాగా ఇప్పటికే అండర్ 20 విభాగంలో అంజూ బాబీ జార్జీ శిక్షణలో రాటుదేలిన పలువురు యువతులు మెడల్స్ కూడా సంపాదించారు. ఎంతోమంది భారతీయ యువతులకు ఆదర్శంగా నిలిచిన అంజూబాబీ జార్జీ.. ''వుమెన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుకు అర్హురాలని ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక మెన్స్ విభాగంలో ఒలింపియన్స్ అయిన జమైకాకు చెందిన ఎలైన్ థాంప్సన్.. నార్వేకు చెందిన కార్స్టెన్ వార్లోమ్‌లు ''వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుకు ఎంపికయ్యారు. 1977లో కేరళలో జన్మించిన అంజూ బాబీ జార్జీ లాంగ్‌జంప్ విభాగంలో ఎన్నో పతకాలు సాధించింది.వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ►2003 పారిస్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో కాంస్య పతకం ►2005 వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్లో బంగారు పతకం ►2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం ►2002 బుసాన్, 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం ►2005 ఇంచియాన్, 2007 అమ్మన్ ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం, రజతం Congratulations to @anjubobbygeorg1 on being crowned this year's Woman of the Year at the #WorldAthleticsAwards Her efforts in advancing the sport in India as well as inspiring more women to follow in her footsteps make her more than a worthy recipient of this year's award. pic.twitter.com/5TSWxj4vqt — World Athletics (@WorldAthletics) December 1, 2021 And the @WorldAthletics Woman of the Year 2021 goes to Ms Anju Bobby George 🎉 Congrats @anjubobbygeorg1 pic.twitter.com/cVEFfu7EvO — Athletics Federation of India (@afiindia) December 1, 2021 -
టాప్–10లో నీరజ్ పసిడి ప్రదర్శన
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శన మరో స్థాయికి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో పది అద్భుత ఘట్టాల్లో అతని ప్రదర్శనకు స్థానం లభించిందని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) వెల్లడించింది. 23 ఏళ్ల చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర పుటలకెక్కాడు. ‘ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్రా ప్రతిభ గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. విశ్వక్రీడల్లో బంగారు విజేతగా చరిత్ర సృష్టించాక అతని ప్రొఫైల్ ఆకాశాన్ని తాకింది. అంతలా అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు’ అని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) తమ వెబ్సైట్లో పేర్కొంది. విజయం తర్వాత నీరజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘ఈ అనుభూతి అద్భుతమైంది. ఈ క్షణం నాతో చిరకాలం ఉండిపోతుంది. దేశానికి స్వర్ణం అందించేందుకు నాకు మద్దతు తెలిపినవారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు. ఇది లక్షల మందిని చేరుకుంది. ఒలింపిక్స్‌కు ముందు అతని ఇన్‌స్టాగ్రామ్‌లో 1,43,000 మంది ఫాలోవర్లు ఉండగా... ఒలింపిక్ చాంపియన్ అయ్యాక, ఆ పోస్ట్ పెట్టాక ఏకంగా 32 లక్షల మంది ఫాలోవర్లు జమ అయ్యారని డబ్ల్యూఏ తెలిపింది. రెండో ర్యాంక్‌కు నీరజ్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరో ఘనత సాధించారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు ప్రపంచంలోనే రెండో ర్యాంకును చేరుకున్నారు. 1,315 స్కోరుతో నీరజ్ చోప్రా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. కాగా 1,396 స్కోరుతో జర్మనీ ఆటగాడు జొహెనెస్ వెటెర్ అగ్రస్థానంలో నిలిచాడు. గత ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో నిలిచిన నీరజ్ బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. -
భారత అథ్లెట్ గోమతి అప్పీల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మరిముత్తుకు చుక్కెదురైంది. డోపింగ్‌కు పాల్పడినందుకు గోమతిపై 2019లో నాలుగేళ్ల నిషేధం పడింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించింది. 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో గోమతి స్వర్ణం గెలవగా... ఆ తర్వాత ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో వరల్డ్ అథ్లెటిక్స్ డిసిప్లినరీ ట్రిబ్యునల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. తాను పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతుండటంతో పాటు గర్భస్రావం జరిగిన కారణంగా శరీరంలో 19–నోరాన్డ్రోస్టిరోన్ ఎక్కువగా కనిపించిందని, సరైన రీతిలో పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆమె తన అప్పీల్లో పేర్కొనగా... ఆర్బిట్రేటర్ జాన్ పాల్సన్ దానిని త్రోసి పుచ్చి నిషేధం కొనసాగుతుందని తీర్పునిచ్చారు. -
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీకి భారత్ దూరం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నమెంట్ నుంచి భారత అథ్లెటిక్స్ జట్టు వైదొలిగింది. పోలాండ్లోని సిలెసియా నగరంలో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నీ జరుగుతుంది. భారత మహిళల 4గీ100 మీటర్ల రిలే, పురుషుల 4గీ400 మీటర్ల రిలే జట్టు సభ్యుల కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ ద్వారా గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అమ్‌స్టర్‌డామ్ వరకు విమానం టికెట్లను బుక్ చేసింది. అమ్‌స్టర్‌డామ్ నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్లో భారత జట్లు పోలాండ్‌కు వెళ్లాల్సింది. అయితే కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి రద్దు చేసింది. భారత్ నుంచి నేరుగా పోలాండ్‌కు విమానాలు లేకపోవడంతో ఏఎఫ్ఐ ముందుగా అమ్స్టర్డామ్కు టికెట్లు బుక్ చేసి అక్కడి నుంచి పోలాండ్‌కు పంపించే ఏర్పాట్లు చేసింది. ‘యూరప్‌లోని ఇతర నగరాల నుంచి పోలాండ్‌కు వెళ్లేందుకు ఏమైనా ఫ్లయిట్స్ ఉన్నాయా అని తీవ్రంగా ప్రయత్నించాం. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దాంతో ఈ టోర్నీ నుంచి భారత జట్లు వైదొలగక తప్పలేదు’ అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు అదిలె సుమరివల్లా తెలిపారు. భారత మహిళల 4గీ100 రిలే జట్టులో హిమ దాస్, ద్యుతీ చంద్, ధనలక్ష్మీ, అర్చన, ధనేశ్వరి, హిమశ్రీ రాయ్ సభ్యులుగా ఉన్నారు. వరల్డ్ రిలే టోర్నీలో టాప్–8 లో నిలిచిన జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీ: భారత మహిళల బృందం ఔట్!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నమెంట్ నుంచి భారత మహిళల 4x400 మీటర్ల బృందం వైదొలిగింది. పోలాండ్‌లో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో రాణించిన రిలే జట్లకు టోక్యో ఒలింపిక్స్‌కు, వచ్చే ఏడాది జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించే అవకాశముంది. ‘వరల్డ్ రిలే టోర్నీకి సిద్ధమవుతున్న భారత మహిళల 4x400 రిలే బృందానికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి. ఈ నెలారంభంలో పూవమ్మ, సుభా, కిరణ్, అం జలి దేవి, రేవతి, విస్మయ, జిస్నా మాథ్యూలను రిలే జట్టులో ఎంపిక చేశాం. ఈ బృందం లోని నలుగురిలో ముగ్గురు అన్‌ఫిట్‌గా ఉన్నా రు. సబ్‌స్టిట్యూట్ కూడా లేకపోవడంతో భారత బృందం వైదొలగాలని నిర్ణయించుకుంది’ అని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వివరించింది. అయితే పురుషుల 4x400 మీటర్ల రిలే, మహిళల 4x400 మీటర్ల రిలే రేసుల్లో భారత్ బరిలోకి దిగుతుందని ఏఎఫ్ఐ తెలిపింది. జూన్‌లో క్వాలి ఫయింగ్ గడువు ముగిశాక టాప్–16లో ఉన్న రిలే జట్లు ఒలింపిక్స్ బెర్త్‌లు దక్కించుకుంటాయి. -
భారత అథ్లెట్ గోమతిపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత గోమతి మరిముత్తు డోపీగా తేలింది. దీంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించినట్లు సోమవారం వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది. తమిళనాడుకు చెందిన గోమతి నుంచి సేకరించిన నాలుగు నమూనాల్లోనూ నిషేధిత ఉత్ప్రేరకం ‘19 నార్ ఆండ్రోస్టెరోన్’ స్టెరాయిడ్ ఆనవాళ్లు ఉండటంతో... అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నాలుగేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. 2019 మే 17 నుంచి 2023 మే 16 వరకు ఆమెపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఏఐయూ పేర్కొంది. 2019 దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 800 మీటర్ల పరుగును తన అత్యుత్తమ టైమింగ్‌తో (2ని: 2.70 సెకన్లు) పూర్తిచేసిన గోమతి విజేతగా నిలిచింది. ఈ క్రీడల సెలక్షన్స్ సందర్భంగా గతేడాది ఏప్రిల్‌లో, ఫెడరేషన్ కప్ సందర్భంగా పాటియాలాలో గోమతి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇవి పాజిటివ్‌గా రావడంతో ఆమె ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన పసిడి పతకాన్ని కూడా ఆమె కోల్పోనుంది. దీంతో పాటు ఆమె ఏఐయూకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జాతీయ డోపింగ్ టెస్టు ల్యాబ్ (ఎన్‌డీటీఎల్)లో పరీక్షించిన తన నమూనాల పరిమాణంపై ఆమె సందేహాలు వ్యక్తం చేసింది. కానీ ఇవేవీ ఆమెను శిక్ష నుంచి తప్పించలేకపోయాయి. -
టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా?
సాక్షి, హైదరాబాద్ : హిమ దాస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. గత రెండు రోజులుగా ఈ అసోం అమ్మాయిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసించడానికి పోటీ పడ్డారు. అయితే ఆమె ప్రతిభను కేవలం ప్రశంసలతోనే సరిపెట్టడమే విస్మయానికి గురిచేస్తోంది. గతంలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు దక్కిన నజరానా, బహుమతులు కానీ ఈ గ్రామీణ క్రీడాకారిణికి దక్కకపోవడం గమనార్హం. క్రీడలకు అంతంత మాత్రానే ప్రోత్సాహకం లభించే మన దేశంలో విజయాలు సాధిస్తే మాత్రం బహుమతులు, నజరానాలతో పోటీపడటం గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే హిమ విషయంలో మాత్రం 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆమె ఖర్చులు భరిస్తామని, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద నెలకు రూ. 50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పి క్రీడా మంత్రిత్వ శాఖ చేతులు దులుపుకోవడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారిణులకు దేశం ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. ఏవేవో కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు వరదలో ముంచెత్తాయి.. ఆకాశానికి ఎత్తాయి.. కార్లు ఇచ్చాయి.. కానుకలిచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ చాలా మంది స్పాన్సర్లు, పుష్కలంగా డబ్బులున్న టెన్నిస్, బ్యాడ్మింటన్ స్టార్లకే కాకుండా.. మట్టిలో మాణిక్యమైన హిమ దాస్ వంటి గ్రామీణ క్రీడాకారులకు కూడా సాయం అందిస్తే బాగుంటుందని ప్రతీ సగటు క్రీడా ప్రేమికుడు అభిప్రాయపడుతున్నాడు. అసలెవరూ ఈ హిమ దాస్ ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం నెగ్గారు. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ దాస్ రికార్డు సృష్టించింది. అసోంలోని నగావ్ జిల్లా ధింగ్ గ్రామం 18 ఏళ్ల హిమ దాస్ స్వస్థలం. నలుగురు పిల్లల్లో చిన్నది. దేశంలోని ఎందరో మేటి అథ్లెట్ల మాదిరిగానే ఆమెది గ్రామీణ, పేదరిక నేపథ్యం.. వారిలాగే ఆటలంటే ఆమెకు ఎక్కడలేని ఇష్టం.. బురద, మట్టితో కూడిన తన పొలమే ఆమెకు తొలి ‘ట్రాక్’ అయింది.. అక్కడ నిరంతర సాధన ఆమెను శారీరకంగా బలవంతంగా తయారు చేస్తే.. కుటుంబ కష్టాలు, కన్నీళ్లు మానసిక దృఢత్వాన్ని పెంచాయి.. అయితే తొలి అడుగు ఫుట్‌బాల్‌వైపు పడినా పరుగులో ఆమె వేగం చూసిన స్థానిక కోచ్ ఇచ్చిన సలహాతో రన్నింగ్‌కు మారింది.. అలా రెండేళ్లలోనే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది.. దిగ్గజ మిల్కాసింగ్, పీటీ ఉష తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత పతాకంను రెపరెపలాడించిందీ. చదవండి: కన్నీళ్లురాని ఇండియన్ ఉండరు : మోదీ -
హిమదాస్ అరుదైన ఘనత: ప్రధాని మోదీ స్పందన
-
కన్నీళ్లురాని ఇండియన్ ఉండరు.. వైరల్
న్యూఢిల్లీ : ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రికార్డ్ టైమింగ్‌తో భారత క్రీడాకారిణి హిమ దాస్ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. హిమ దాస్ అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘హిమ దాస్ విజయం మరిచిపోలేని క్షణాలు. రేసులో నెగ్గిన వెంటనే జాతీయ పతాకం కోసం ఆమె అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై విజేతగా నిలిచిన హిమ దాస్ మన జాతీయ గీతాన్ని పాడటం మనసును కరిగించింది. ఈ వీడియో చూసిన భారతీయులెవ్వరూ సంతోషంతో కంటతడి పెట్టకుండా ఉండలేరంటూ’ మోదీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, ఫిన్లాండ్లోని టాంపెరెలో జరుగుతున్న ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం నెగ్గారు. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం. ఆ రేసులో ఆండ్రియా మెక్లోస్ (రొమేనియా– 52.07సెకన్లు), టేలర్ మ్యాన్షన్ (అమెరికా – 52.28 సెకన్లు) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. తన తాజా ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు హిమ దాస్. Unforgettable moments from @HimaDas8’s victory. Seeing her passionately search for the Tricolour immediately after winning and getting emotional while singing the National Anthem touched me deeply. I was extremely moved. Which Indian won’t have tears of joy seeing this! pic.twitter.com/8mG9xmEuuM — Narendra Modi (@narendramodi) 14 July 2018 -
హిమ దాస్ కొత్త చరిత్ర
-
ఈ విజయం అసామాన్యమైనది : సెహ్వాగ్
ప్రపంచ అండర్- 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి హిమ దాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిమ దాస్‌ను ప్రశంసిస్తూ.. ‘వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన హిమకు శుభాకాంక్షలు. అస్సాం, భారత్‌కు నువ్వు గర్వకారణం. ఇక ఒలంపిక్ మెడల్ సాధించే దిశగా కృషి చేయాలి’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా.. ‘మమ్మల్ని గర్వంతో తలెత్తుకునేలా చేశావంటూ’ హిమను ప్రశసించారు. ఇక ట్విటర్ ఫన్నీమ్యాన్ వీరేంద్ర సెహ్వాగ్... ‘చాలా గర్వంగా ఉంది. నీ విజయం అసామాన్యమైనది. స్వర్ణ పతకం సాధించి మాకు సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలందరికీ హిమ దాస్ ధన్యవాదాలు తెలిపారు. కాగా అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. తద్వారా ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ చరిత్ర సృష్టించారు. Congratulations to our sensational sprint star Hima Das for winning the 400m gold in the World Under-20 Championship. This is India’s first ever track gold in a World Championship. A very proud moment for Assam and India, Hima; now the Olympic podium beckons! #PresidentKovind — President of India (@rashtrapatibhvn) July 12, 2018 Wow! So proud of you Hima Das. Incredible, historic achievement on becoming the first Indian track athlete to win a medal at any global event winning Gold at women's 400m World U-20 Championships clocking a time of 51.47 seconds. Thank you for the happiness. pic.twitter.com/Cs5wY8sDuM — Virender Sehwag (@virendersehwag) July 12, 2018 T 2865 - CONGRATULATIONS .. #HimaDas , the first Indian Women to win a GOLD in World Athletic track event EVER ! INDIA is proud of you .. you have given us reason to hold up our heads HIGH ! JAI HIND !! 🇮🇳🇮🇳 pic.twitter.com/Q0YVCx6FSf — Amitabh Bachchan (@SrBachchan) July 12, 2018 -
హిమ దాస్ స్వర్ణ చరిత్ర
టాంపెరె: ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి హిమ దాస్ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్లోని టాంపెరెలో జరుగుతున్న ఈ ఈవెంట్ 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం. 2016 చాంపియన్‌షిప్‌లో ఫీల్డ్ విభాగంలో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) స్వర్ణం నెగ్గాడు. 400 మీటర్ల పరుగులో ఆండ్రియా మెక్లోస్ (రొమేనియా– 52.07 సె.), టేలర్ మ్యాన్షన్ (అమెరికా – 52.28 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్లో చెలరేగి భారత అథ్లెటిక్స్ ప్రపంచం గర్వపడే ప్రదర్శన కనబర్చింది. -
మరోసారి దుమ్ము రేపిన బోల్ట్
-
మరోసారి దుమ్ము రేపిన బోల్ట్
బీజింగ్: గత ఏడేళ్లుగా 100 మీటర్ల పరుగులో ఓటమి ఎరుగని జమైకా విఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్డ్ మరోసారి సత్తా చాటాడు. ఇక్కడ ఆదివారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్ 100 మీటర్ల ఫైనల్ పోరులో బోల్ట్ విజేతగా నిలిచాడు. ఆదిలో బోల్ట్ తన పరుగును నెమ్మదిగా ఆరంభించినా.. చివరకు లక్ష్యాన్ని 9.79 సెకన్లలో చేరుకుని స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో ఉసేన్ బోల్ట్- జస్టిన్ గాట్లిన్ ల మధ్య పోరు తీవ్ర ఉత్కంఠను నెలకొల్పింది. తొలి 15 మీటర్ల వరకూ వెనుకబడ్డ బోల్ట్.. ఒక్కసారిగా వేగాన్ని పెంచాడు. దీంతో అప్పటివరకూ ముందంజలో ఉన్న గాట్లిన్ వెనుకబడ్డాడు. ఇక అదే దూకుడును చివరి వరకూ కొనసాగించిన బోల్ట్ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అయితే ఒక సెకను వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకున్న అమెరికా రన్నర్ గ్లాటిన్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోల్ట్ ను ఓడించే సువర్ణావకాశం వచ్చినా.. దాన్ని గ్లాటిన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంతకుముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4/ 100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు సాధించాడు. -
వారిలో 5 శాతం భారత ఆటగాళ్లే...
న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ రంగాన్ని కుదిపేసిన ఇటీవలి బ్లడ్ డోపింగ్‌లో భారత ఆటగాళ్ల నమూనాలు కూడా ఉన్నాయని తేలింది. 5 వేల మంది అథ్లెట్లకు సంబంధించి 12 వేల రక్త నమూనాల్లో ఐదు శాతం భారత ఆటగాళ్లకు చెందినవేనని ఇంగ్లండ్‌కు చెందిన సండే టైమ్స్ పేర్కొంది. అయితే క్రీడా నిపుణులు మాత్రం ఈ విషయంలో సంశయం వ్యక్తం చేస్తున్నారు. ‘భారత్‌లో ఎరిత్రోపొయిటిన్ (ఈపీఓ) అందుబాటులోనే ఉంటుంది. ఒకవేళ ఈ కథనాలు నిజమే అనుకుంటే దీన్నే ఆటగాళ్లు తీసుకుని ఉంటారు. అయితే భారత ఆటగాళ్ల గురించి వస్తున్న వార్తలు నిజమా.. కాదా నాకు తెలీదు. కానీ ఈపీఓ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లడ్ డోపింగ్ లేదు అని మాత్రం చెప్పలేం’ అని స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు పీఎస్ఎం చంద్రన్ తెలిపారు. ఈ విషయంపై స్పందించేందుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య, నాడా అధికారులు అందుబాటులోకి రాలేదు. జాతీయ శిబిరాల్లో అథ్లెట్ల నుంచి చాలా అరుదుగా మాత్రమే నాడా రక్త నమూనాలను సేకరిస్తుందని మాజీ కోచ్ ఒకరు చెప్పారు. -
‘డోపీ’ల వ్యవహారం వెనుక కుట్ర
ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ డియాక్ ఆరోపణ కౌలాలంపూర్: ప్రపంచ అథ్లెటిక్స్‌లో 2001 నుంచి 2012 మధ్యలో సేకరించిన ఆటగాళ్ల రక్త, మూత్ర నమూనాల్లో వందల మంది ఉత్ప్రేరక పదార్థాలు అధికంగా వాడినట్టు తేలడం క్రీడారంగాన్ని నివ్వెరపరిచింది. ఆ సమయంలో జరిగిన ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లాంటి మెగా టోర్నీల్లో పతకాలు సాధించిన ప్రతి ముగ్గురిలో ఒకరు డోపీనే అని జర్మనీ, బ్రిటన్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు ఈ వ్యవహారంపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) స్పందించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు కొన్ని రోజుల ముందే ఈ కథనాలు రావడం వెనుక కుట్ర దాగి ఉందని ఐఏఏఎఫ్ చీఫ్ లామినే డియాక్ ఆరోపించారు. దీని వెనుక అప్పటి పతకాలను తిరిగి పంపిణీ చేయించాలనే ఉద్దేశం కనిపిస్తోందని అన్నారు. త్వరలోనే వీటిపై సమాధానం చెబుతామని అన్నారు. 5 వేల మంది అథ్లెట్ల నుంచి సేకరించిన 12 వేల నమూనాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు ఐఏఏఎఫ్ డాటాబేస్‌లో ఉందని మీడియా పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన 10 మంది శాంపిల్స్ అనుమానం కలిగించేవిగా ఉన్నాయని సండే టైమ్స్ రాసింది. ఇదిలావుండగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై తాము చేయగలిగిందేమీ లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. ఇదంతా అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చూసుకుంటుందని చెప్పారు.