ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగత, రిలే విభాగాల్లో (48 ఈవెంట్స్) స్వర్ణాలు గెలిచే వారికి 50,000 అమెరికన్ డాలర్లు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది పారిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్ నుంచి స్వర్ణ పతక విజేతలకుప్రైజ్‌మనీ పంపిణీ అమల్లోకి వస్తుందని తెలిపింది.
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య పతక విజేతలకు కూడా ప్రైజ్‌మనీ అందిస్తామని పేర్కొంది. నాలుగేళ్లకు ఒకసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి వచ్చే ఆదాయ వాటాతో (2.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒలింపిక్స్‌లో ప్రైజ్ మనీ అందజేసే తొలి అంతర్జాతీయ సమాఖ్య తమదేనని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment