Under-20
-
సెమీ ఫైనల్లో తెలంగాణ ముద్దుబిడ్డ అగసార నందిని
కొలంబియాలోని కాలిలో జరుగుతున్న అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అగసార నందిని సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. 100 మీ. హర్డిల్స్ పరుగును ఆమె 13.58 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నందిని కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. గతంలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 13.70 సెకన్లుగా ఉంది. హీట్స్‌లో మూడో స్థానంలో నిలవడంతో నందిని సెమీస్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప 36వ స్థానంలో నిలిచి నిష్క్రమించింది. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా నందిని సెమీస్ చేరగలిగింది. సెమీస్‌లో 14.16 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన ఆమె ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. -
భారత రిలే జట్టుకు రజతం
కలి (కొలంబియా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మిక్స్డ్ రిలే జట్టు 4X400 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపల్ చౌదరీలతో కూడిన భారత జట్టు రేసును 3 నిమిషాల 17.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్ అండర్–20 అథ్లెటిక్స్‌లో భారత మిక్స్డ్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో పతకంతో నిలబెట్టుకుంది. గతేడాది నైరోబీలో మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ అండర్ –20 అథ్లెటిక్స్‌లో మిక్స్డ్ జట్టు కాంస్యం గెలిచింది. అప్పుడు రూపల్ మినహా భరత్, ప్రియా, కపిల్ ముగ్గురు కాంస్యం గెలిచిన బృందంలో ఉన్నారు. 🇮🇳The Indian U-20 4x400m mixed relay team of Bharath, Priya, Kapil & Rupal make the nation proud💥 They finish with a timing of 3.17.76, a new Asian U-20 record, to win 🥈 at the #U20WorldChampionships #Athletics pic.twitter.com/2890EMphNM — The Bridge (@the_bridge_in) August 2, 2022 That effort by #TeamIndia 🇮🇳🫡 pic.twitter.com/gkOW1y1MZk — Athletics Federation of India (@afiindia) August 3, 2022 -
జీఎం టైటిల్‌కు చేరువలో హర్ష
ఇస్తాంబుల్ (టర్కీ): గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా ఖరారు చేసుకోవడానికి తెలంగాణ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి మరింత చేరువయ్యాడు. ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు దక్కించుకున్న హర్ష ఎలో రేటింగ్ 2500 లేకపోవడంతో జీఎం టైటిల్ ఇంకా లభించలేదు. శనివారం ముగిసిన ప్రపంచ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్ష ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్ష 7.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో ఆరు గేముల్లో గెలిచిన అతను, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన హర్ష... అలెన్ పిచోట్ (అర్జెంటీనా), సునీల్‌దత్ లైనా నారాయణన్ (భారత్), లియాంగ్ అవండర్ (అమెరికా)లపై గెలుపొంది... అలెగ్జాండర్ డాన్‌చెంకో (జర్మనీ)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగిం చాడు. పర్హామ్ మగ్సూద్లు (ఇరాన్), ఆమిన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఓవరాల్‌గా ఈ ప్రదర్శనతో హర్ష 18 పాయింట్లు సంపాదించి తన ఓవరాల్ ఎలో రేటింగ్‌ను 2492కు పెంచుకున్నాడు. తదుపరి టోర్నీల్లో హర్ష మరో ఎనిమిది పాయింట్లు సాధిస్తే అతనికి అధికారికంగా జీఎం టైటిల్ ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత్‌కే చెందిన అభిమన్యు పురాణిక్ రజత పతకం సాధించాడు. 8.5 పాయింట్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌కు చెందిన పర్హామ్ మగ్సూద్లు 9.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. -
హిమ దాస్ కొత్త చరిత్ర
-
ఈ విజయం అసామాన్యమైనది : సెహ్వాగ్
ప్రపంచ అండర్- 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి హిమ దాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిమ దాస్‌ను ప్రశంసిస్తూ.. ‘వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన హిమకు శుభాకాంక్షలు. అస్సాం, భారత్‌కు నువ్వు గర్వకారణం. ఇక ఒలంపిక్ మెడల్ సాధించే దిశగా కృషి చేయాలి’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా.. ‘మమ్మల్ని గర్వంతో తలెత్తుకునేలా చేశావంటూ’ హిమను ప్రశసించారు. ఇక ట్విటర్ ఫన్నీమ్యాన్ వీరేంద్ర సెహ్వాగ్... ‘చాలా గర్వంగా ఉంది. నీ విజయం అసామాన్యమైనది. స్వర్ణ పతకం సాధించి మాకు సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలందరికీ హిమ దాస్ ధన్యవాదాలు తెలిపారు. కాగా అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. తద్వారా ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ చరిత్ర సృష్టించారు. Congratulations to our sensational sprint star Hima Das for winning the 400m gold in the World Under-20 Championship. This is India’s first ever track gold in a World Championship. A very proud moment for Assam and India, Hima; now the Olympic podium beckons! #PresidentKovind — President of India (@rashtrapatibhvn) July 12, 2018 Wow! So proud of you Hima Das. Incredible, historic achievement on becoming the first Indian track athlete to win a medal at any global event winning Gold at women's 400m World U-20 Championships clocking a time of 51.47 seconds. Thank you for the happiness. pic.twitter.com/Cs5wY8sDuM — Virender Sehwag (@virendersehwag) July 12, 2018 T 2865 - CONGRATULATIONS .. #HimaDas , the first Indian Women to win a GOLD in World Athletic track event EVER ! INDIA is proud of you .. you have given us reason to hold up our heads HIGH ! JAI HIND !! 🇮🇳🇮🇳 pic.twitter.com/Q0YVCx6FSf — Amitabh Bachchan (@SrBachchan) July 12, 2018 -
బాల్‌బ్యాడ్మింటన్.. అదిరెన్
- నిడదవోలులో అంతర్ జిల్లాల పోటీలు ఆరంభం - 13 జిల్లాల నుంచి 260 మంది రాక - మూడు రోజులపాటు టోర్నమెంట్ నిడదవోలు: వాయు వేగంతో దూసుకువచ్చే బాల్స్.. రాకెట్ వేగంతో ప్రత్యర్థులను చిత్తుచేసే షాట్స్.. అనుక్షణం ఉత్కంఠ కలిగించిన పాయింట్లు.. ఇవీ నిడదవోలు ఎస్వీడీ మహిళా డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కనిపించిన దృశ్యాలు. రాష్ట్ర బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల జూనియర్ (అండర్-20) బాల బాలికల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 260 మంది క్రీడాకారులు తరలివచ్చారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు తొలిరోజు హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో 12 మ్యాచ్‌లు, బాలికల విభాగంలో 11 మ్యాచ్‌లను జరిగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 260 మంది తరలివచ్చారు. తొలిరోజు విజేతలు బాలుర విభాగం.. శ్రీకాకుళంపై (29-12, 29-10) తేడాతో తూర్పుగోదావరి జట్టు, చిత్తూరుపై (29-17, 29-12) తేడాతో కృష్ణా జట్టు, కడపపై (29-17, 29-12) తేడాతో విశాఖ జట్టు సత్తాచాటాయి. విజయనగరంపై (29-07, 29-09) తేడాతో గుంటూరు జట్టు, నెల్లూరుపై (29-21, 29-05) తేడాతో కర్నూలు జట్టు, పశ్చిమగోదావరిపై (29-08, 29-20) తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించాయి. నెల్లూరుపై (29-10, 29-11) తేడాతో విశాఖ జట్టు, ప్రకాశంపై (29-19, 29-23) తేడాతో తూర్పుగోదావరి జట్టు, శ్రీకాకుళంపై (29-13, 29-02) తేడాతో విజయనగరం జట్టు గెలుపొందాయి. గుంటూరుపై (29-26, 29-20) తేడాతో చిత్తూరు జట్టు, కృష్ణాపై (29-23, 29-06) తేడాతో ప్రకాశం జట్టు, అనంతపురంపై (29-15, 29-23) తేడాతో కర్నూలు జట్టు సత్తాచాటాయి. బాలికల విభాగం.. కడపపై (29-07, 29-08) తేడాతో విశాఖ జట్టు, చిత్తూరుపై (29-21, 29-14) తేడాతో కర్నూలు జట్టు, అనంతపురంపై (29-11, 29-05) తేడాతో కృష్ణా జట్టు విజయం సాధించాయి. శ్రీకాకుళంపై (29-07, 29-03) తేడాతో గుంటూరు జట్టు, నెల్లూరుపై (29-16, 29-12) తేడాతో తూర్పుగోదావరి జట్టు, ప్రకాశంపై (29-17, 29-17) తేడాతో కర్నూలు జట్టు గెలుపొందాయి. పశ్చిమగోదావరిపై (29-23, 29-10) తేడాతో విజయనగరం జట్టు, అనంతపురంపై (29-04, 29-11) తేడాతో విశాఖ జట్టు, నెల్లూరుపై (29-16, 29-13) తేడాతో గుంటూరు జట్టు సత్తాచాటాయి. చిత్తూరుపై (29-26, 29-08) తేడాతో కృష్ణా జట్టు, తూర్పుగోదావరిపై (29-02, 29-12) తేడాతో విజయనగరం జట్టు విజయం సాధించాయి. జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి విద్యార్థులు క్రీడాపోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆకాంక్షించారు. బాల్‌బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించి ఆయన ప్రసంగించారు. విద్యార్థులు బాల్య దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మరో ముఖ్య అతిథి స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి క్రీడలు దోహదపడతాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారని చెప్పారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచిం చారు. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చుక్కపల్లి అమర్‌కుమార్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తిగా ముందుకుసాగాలని సూచించారు. రాష్ట్ర పునఃనిర్మాణం కోసం అసోసియేషన్ తరఫున లక్ష రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. గౌరవ వందనం : ముందుగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని ఉప ముఖ్యమంత్రి స్వీకరించారు. అనంతరం పావురాలను గాలిలో వదలి ఆయన క్రీడాజ్యోతిని వెలిగించారు. బ్యాట్ పట్టుకుని కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులకు ఉల్లాసపరిచారు. కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏపీఎస్బీబీఏ కార్యదర్శి రావు వెంకట్రావు, బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఎన్.త్రిమూర్తులు, చీఫ్ ప్యాట్రన్ నీలం నాగేంద్రప్రసాద్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, పీడీ సత్తి బాపిరెడ్డి, టోర్నమెంట్ కమిటీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఆర్.ప్రసాద్, కార్యదర్శి సీహెచ్ సతీష్‌కుమార్, అధ్యక్షుడు ఏవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.