నేడు పల్లంట్లలో మావోయిస్టు దాస్ అంత్యక్రియలు
Published Thu, Oct 27 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
దేవరపల్లి : ఆంధ్రా, ఒడిశా బోర్డర్(ఏవోబీ)లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్ట్ అయినపర్తి దాస్(మధు) అంత్యక్రియలు గురువారం దేవర పల్లి మండలం పల్లంట్లలో జరుగుతాయని ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు షేక్ మస్తాన్, దళితహక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాస్ మృతదేహం గురువారం ఉదయం ఆయన స్వగ్రామం పల్లంట్ల చేరుతుందని, ఉదయం 11 గంటలకు దాస్ అంతక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొనాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement