Moist
-
పుల్వామా ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని చండ్గామ్ గ్రామంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. చదవండి: పంజాబ్ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం వీరిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలతోపాటు రెండు M-4 కార్బెన్స్, ఒక ఏకే సీరీస్ రైఫిల్ వంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ పర్యటనలు, ర్యాలీలు రద్దు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ -
మావోయిస్టుల పట్టుతప్పుతోంది...
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుతోపాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారుతోంది. పార్టీకి ఏవోబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గతరెండేళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పలు సంఘటనలుజరగగా.. 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది. 29 మందిమంది మావోయిస్టులు, దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది. రామ్‌గూడ అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ఈ ఘటనలో 33మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నాతోపాటు, అనేకమంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టు నేతలుఆర్కే, ఉదయ్, చలపతి, అరుణలు మరలా మావోయిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకుప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లోను ఐదుగురు కీలక నేతలను పోగొట్టుకోవడంమావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అంతేకాక ఇటీవలఅమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం..తాజాగా గురువారం డీజీపీ సమక్షంలో ఆరుగురుమావోయిస్టు కీలక నేతల లొంగిపోవడం పార్టీ ప్రాభవానికివిఘాతమే. తగ్గిన కార్యకలాపాలు ఏవోబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్,గుమ్మా, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలపాలు తగ్గాయని సమాచారం. గాలికొండ దళంలో10మంది, పెదబయలు, కోరుకొండ దళాలకు చెందిన 25మంది, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో50మంది వరకు మావోయిస్టులు గతంలో పనిచేసేవారు.ఈ రెండేళ్ల వ్యవధిలో వారి సంఖ్య 50కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో దళాలు తగ్గి ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏవోబీస్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసునిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతోపాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్ గిరి జిల్లాల్లో పోలీసుయంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.పోలీసులకు కలిసొచ్చిన అభివృద్ధి నినాదం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతకాలంగా చేస్తున్న ప్రచారం పోలీసు యంత్రాంగానికి అనుకూలమైంది. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రకృతిపరమైన సమస్యలున్నాయి. కష్టసాధ్యమైనా వీటిని అధిగమిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పిస్తోంది. పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులకు దగ్గరవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలలో గిరిజనులంతా బహిరంగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా అభివృద్ధి నినాదంతో ర్యాలీలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో వలేమారుమూల గ్రామాల గిరిజనుల సహకారం తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు కీలకనేతలు, మిలీషియా సభ్యులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు: ఏపీ డీజీపీ
సాక్షి,అమరావతి: ఏపీ-ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరంతరం కూంబింగ్ సత్పలితాలనిస్తోంది. నిషేధిత మావోయిస్టు (సీపీఐ) పార్టీకి చెందిన ఆరుగురు కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెలలో మావోయిస్ట్ కమిటీ సభ్యుడు లోంగిపోయాడని.. ఈ రోజు మరో ఆరుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారని డీజీపీ గౌతమ్‌సవాంగ్ తెలిపారు. గతంలో సమస్యలపై మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని,ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తోంది డీజీపీ వివరించారు. మహిళలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..ఆదివాసిగూడెంలకు సైతం చేరుతున్నాయని గౌతమ్‌సవాంగ్ వాఖ్యనించారు. గతంలో 8 మావోయిస్టు కమిటీలు ఉంటే ప్రస్తుతం నాలుగు ఉన్నాయి.. మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది.. నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో బాక్సైట్ సమస్య ఉండేది.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బాక్సైట్ జీవోలను రద్దు చేసిందని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు.. -
నేడు పల్లంట్లలో మావోయిస్టు దాస్ అంత్యక్రియలు
దేవరపల్లి : ఆంధ్రా, ఒడిశా బోర్డర్(ఏవోబీ)లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ అయినపర్తి దాస్(మధు) అంత్యక్రియలు గురువారం దేవర పల్లి మండలం పల్లంట్లలో జరుగుతాయని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు షేక్ మస్తాన్, దళితహక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాస్ మృతదేహం గురువారం ఉదయం ఆయన స్వగ్రామం పల్లంట్ల చేరుతుందని, ఉదయం 11 గంటలకు దాస్ అంతక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొనాలని ఆయన కోరారు. -
మంగన్న ఎన్కౌంటర్ బూటకం
ఇల్లెందు, న్యూస్‌లైన్: మావోయిస్టు నేత మంగన్న అనారోగ్యంతో బాధపడుతూ ముంగుడవలస కొండ ప్రాంతంలోని కుగ్రామంలో షెల్టర్ తీసుకుని వైద్యం పొందుతుండగా పట్టుకుని కాల్చి చంపి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథలు అల్లుతున్నారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. మంగన్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఇల్లెందు మండలం మిట్టపల్లి వచ్చిన ఆమె మాట్లాడారు. మావోయిస్టు నేతల తలలకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు పోలీసులు ఆశపడి అత్యంత పాశవికంగా మారణహోమం ృష్టిస్తున్నారని అన్నారు. ప్రజల జీవితాలు బాగు చేసేందుకు మంగన్న చిరు ప్రాయంలోనే ఉద్యమంలో చేరి తన మనసులోకి స్వార్ధమనే భావం రాకుండా ఉండేందుకు వివాహం కూడా చేసుకోలేదని అన్నారు. రాజకీయనేతలు రోజుకోపార్టీ మారుస్తూ మేనిఫెస్టోలను ఇష్టారాజ్యంగా మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఈ క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా మావోయిస్టు ఉద్యమం పని చేస్తోందని ఆమె అన్నారు. మంగన్న ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించి అందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన మంగన్న : ఇల్లెందు, ములుగు ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, సీతక్క ప్రజల హక్కులను కాపాడేందుకు సుధీర్ఘ కాలం పాటు పోరాడి అశువులు బాసిన మంగన్న ఆశయం గొప్పదని ఇల్లెందు, ములుగు ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, సీతక్కలు అన్నారు. మంగన్న వృుతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. మంగన్న లక్ష్యం మరవలేనిది: ఎస్వీ సుధీర్ఘ కాలం పాటు విప్లవోద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మావోయిస్టు నేత మంగన్న లక్ష్యం మరువలేనిదని న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. మంగన్న వృుతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే మార్గమన్నారు. హింసించి హతమార్చారు : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సీపీఐ ఎంఎల్లో దళ సభ్యుడిగా చేరిన మంగన్న అంచెలంచెలుగా ఎదిగి ప్రజల పక్షాన ముందుకు సాగుతున్న క్రమంలో పోలీసులు పట్టుకుని చిత్ర హింసలకు గురి చేశారని ఎన్డీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, వరంగల్ కార్యదర్శి చిన్న చంద్రన్నలు అన్నారు. మంగన్న నేరం చేస్తే పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఎలాంటి విచారణ లేకుండానే హతమార్చి ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లినారని అన్నారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌హంట్ పేరుతో పోలీసులను అడవుల్లోకి అధిక సంఖ్యలో తరలించి నరమేధాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు సుగుణరావు, తుడుందెబ్బ నాయకులు వట్టం ఉపేందర్, వట్టం నారాయణ, ఈసం నర్సింమారావు, రమణాల లక్ష్మయ్య, జవ్వాజి లక్ష్మీనారాయణ, కొడెం వెంకటేశ్వర్లు, ఎస్కె సంథాని, న్యూడెమోక్రసీ (చంద్రన్న) నాయకులు గౌని ఐలయ్య, జడ సత్యనారాయణ, జె.సీతారామయ్య, ఎన్డీ (రాయలవర్గం) నాయకులు కిన్నెర నర్సయ్య, అజయ్, మోకాళ్ల కృష్ణ,నాగేశ్వరరావు పాల్గొన్నారు.