Pulwama Encounter: 3 Terrorists Killed With Security Forces In Jammu And Kashmir - Sakshi
Sakshi News home page

Pulwama Encounter: పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం

Published Wed, Jan 5 2022 7:35 PM | Last Updated on Wed, Jan 5 2022 9:26 PM

Jammu And Kashmir: 3 Terrorists Killed In Pulwama Encounter - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని చండ్గామ్ గ్రామంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
చదవండి: పంజాబ్‌ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం

వీరిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలతోపాటు రెండు M-4 కార్బెన్స్, ఒక ఏకే సీరీస్ రైఫిల్ వంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
చదవండి: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అక్కడ పర్యటనలు, ర్యాలీలు రద్దు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement