Pulwama
-
పుల్వామాలో మంచు అందాలు చూద్దామా..
-
క్రికెట్ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నాడు. కాగా రాహుల్ మరెవరో కాదు.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు.నాడు శోక సంద్రంలోకాగా కశ్మీర్లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా భద్రతా బలగాల జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచిన ఈ ఘటన నేపథ్యంలో వీరూ భాయ్ నాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో గొప్ప మనసు కూడా చాటుకున్నాడు.అమర వీరుల పిల్లలకు హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచితంగా విద్యనందిస్తామని వాగ్దానం చేశాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తమకు చేతనైంత మేర రుణం తీర్చుకుంటామని పేర్కొన్నాడు. పిల్లలను ప్రయోజకులు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపాడు. ఆ హామీని వీరూ భాయ్ నిలబెట్టుకున్నాడు కూడా!సెహ్వాగ్ భావోద్వేగంఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. సెహ్వాగ్ స్కూళ్లో చదువుతూనే.. క్రికెట్లోనూ శిక్షణ తీసుకుంటున్న రాహుల్ సోరెంగ్.. హర్యానా అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘రాహుల్ సోరెంగ్. ఈ పేరును గుర్తు పెట్టుకోండి.నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఇదీ ఒకటి. పుల్వామా దాడి వంటి విషాదకర ఘటన తర్వాత.. అమరుల పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూళ్లో ఉచిత విద్య, ఆవాసం కల్పిస్తానని మాట ఇచ్చాను.పుల్వామా అమరవీరుడు విజయ్ సోరెంగ్ గారి కుమారుడు రాహుల్ సోరెంగ్ 2019లో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాడు. నాలుగేళ్లుగామ మాతో ప్రయాణం సాగిస్తున్న రాహుల్.. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్-16 హర్యానా జట్టుకు ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసును రంజింపజేస్తాయి. మన జవాన్లకు ధన్యవాదాలు’’ అని సెహ్వాగ్ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. చదవండి: D Gukesh: ప్రైజ్‌మనీలో టాక్స్ మినహాయింపు ఇవ్వండి: లేఖ రాసిన ఎంపీRemember the Name- Rahul Soreng. This is one of the happiest feelings in life. After the tragic Pulwama attack, had made an appeal to offer free education to children of our martyr’s study and stay in my @sehwagschool . I feel so privileged that Rahul Soreng , son of Pulwama… https://t.co/gKvrcyy767 pic.twitter.com/L0Qlc1hh3j— Virender Sehwag (@virendersehwag) December 18, 2024 -
Pulwama Assembly: పుల్వామాలో గట్టి పోటీ
పుల్వామా: నేడు(సోమవారం) హర్యానాతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని 90 నియోజకవర్గాల్లో పుల్వామా అసెంబ్లీ స్థానం ఒకటి. పుల్వామా అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఈసారి పుల్వామా సీటుపై గట్టి పోటీ నెలకొంది.నేషనల్ కాన్ఫరెన్స్ పుల్వామా సీటు నుంచి మహ్మద్ ఖలీల్ బంద్‌ను నిలబెట్టింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాహిద్ పారాకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ సీటు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో చేరింది. ఈ స్థానానికి 1962లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ మాత్రమే ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి.ఈ సీటుపై బీజేపీ నేటికీ ఖాతా తెరవలేదు.2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీకి చెందిన మహ్మద్ ఖలీల్ విజయం సాధించారు. పుల్వామా జిల్లా మొత్తం జనాభా 5.60 లక్షలు. జిల్లా పరిపాలనా కేంద్రం శ్రీనగర్‌కు 31 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలో ఉంది. జిల్లాలో 85.65శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, 14.35శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం వరితో పాటు నాణ్యమైన కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.ఇది కూడా చదవండి: Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి నిందితుడు జమ్ముకశ్మీర్‌లోని జమ్మూ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇతని వయస్సు 32 ఏళ్లు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 32-year-old accused in 2019 Pulwama terror attack dies of heart attack in Jammu hospital: Officials— Press Trust of India (@PTI_News) September 24, 2024 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శ్రీనగర్-జమ్ము హైవేపై లెత్పోరా సమీపంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్లోని 54 బెటాలియన్‌కు చెందినవారు. పేలుడు ధాటికి బస్సు ధ్వంసమైంది. ఈ ఆర్మీ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఆ ఘటన చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ -
‘త్వరలో మరో పుల్వామా దాడి’ అంటూ పోస్ట్.. రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: ‘పుల్వామా దాడి’ మాదిరి మరో దాడి త్వరలో జరగనుందని ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఒక్కసారిగా దుమారం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జార్ఖండ్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ‘పుల్వామా దాడి... వంటి మరో దాడి తర్వలో జరగనుంది’ అని ఆ విద్యార్థి ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మంగళవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు పుల్వామాలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద లభించిన తుపాకాలను స్వధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆర్మీ భద్రతా సిబ్బంది, పోలీసులు సంయూక్తంగా విచారణ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ స్టూడెంట్ పెట్టిన షోషల్ మీడియా పోస్ట్ వెలుగు చూడటంతో అప్రమత్తమైన షహరాన్ పూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు మృతి చెందిన విషయం తెలిసిందే. చదవండి: Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం -
పుల్వామాలో మళ్లీ ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
కశ్మీర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. సరిహద్దుల్లో ఉగ్రదాడికి పాల్పడటానికి ప్రయత్నించిన వారి పథకాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో పుల్వామాలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. స్థానికంగా అరిహాల్ ప్రాంతంలో న్యూ కాలనీలోని తోటల్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రదాడిని తిప్పికొట్టారు. ఈ ఎదురుదాడిలో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద అయిదు కేజీల పేలుడు పదార్థం(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని బుద్గామ్‌లోని అరిగాం నివాసి అయిన ఇష్ఫాక్ అహ్మద్ వానీగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర కశ్మీర్లో భద్రతా బలగాలు భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా గత వారం జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులు అరాచానికి పాల్పడిన విషయం తెలిసిందే. కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడం గమనార్హం. చదవండి: స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు -
భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం
అవంతిపురా/శ్రీనగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం పునఃప్రారంభమైంది. రాహుల్ గాంధీ ఉదయం 9.20 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. భద్రతాపరమైన లోపాలున్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం యాత్రను నిలిపేయడం తెలిసిందే. దాంతో శనివారం మూడంచెల భద్రత కల్పించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో ఉగ్రవాద దాడిలో మరణించిన 40 సీఆర్పీఎఫ్ జవాన్లకు రాహుల్ గాంధీ శనివారం నివాళులర్పించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో బస్సు ధ్వంసమైన చోట పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. యాత్రలో ప్రియాంకా గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. శనివారం లెథ్‌పురాలో సోదరుడు రాహుల్ గాంధీపాటు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని చుర్సూలో పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం రాహుల్ గాంధీతోపాటు జోడో యాత్రలో పాల్గొన్నారు. తాజా గాలి పీల్చుకున్నట్లే ఉంది: ముఫ్తీ కశ్మీర్లో జోడో యాత్ర జరగడం తాజా గాలి పీల్చుకున్నట్లుగా ఉందని మెహబూబా ముఫ్తీ శనివారం ట్వీట్ చేశారు. 2019 తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారని చెప్పారు. యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడవడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జోడో యాత్ర ఆదివారం ఉదయం పంథాచౌక్ నుంచి పునఃప్రారంభం కానుంది. శ్రీనగర్‌లో బోలివార్డ్ రోడ్డులోని నెహ్రూ పార్కు వరకూ యాత్ర సాగుతుంది. సోమవారం శ్రీనగర్ ఎంఏ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జెండా ఎగురవేస్తారు. అనంతరం ఎస్కే స్టేడియంలో విపక్ష పార్టీల నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షాకు మల్లికార్జున ఖర్గే లేఖ జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో యాత్రకు తగిన భద్రత కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యాత్రలో భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. -
ప్రమాదవశాత్తు రైఫిల్ కాల్పుల్లో వ్యక్తి మృతి
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు రైఫిల్ పేలి మృతి చెందాడు. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం చోటు చేసుకుంది. ఒక పోలీస్ విధులు నిర్వర్తించే నిమిత్తం రైఫిల్ తీయగా అనుహ్యంగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడుని మొహ్మద్ ఆసిఫ్ ఫడ్రూగా గుర్తించి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఐతే సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. దీంతో పోలీసులు సదరు పోలీసుపై కేసు నమోదు చేసి అరెస్తు చేశారు. అంతేగాక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: వీడియో: యాక్సిడెంట్ స్పాట్లో సాయం కోసం దిగారు.. అంతలోనే ఘోరం) -
జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన సుమారు 25 నుంచి 30 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసింది సైన్యం. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఐఈడీని గుర్తించటం భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నట్లయిందన్నారు . ‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై సుమారు 25-30 కిలోలు ఉన్న ఐఈడీని పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగాం.’ అని తెలిపారు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్. అంతకు ముందు రోజు ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది. అతడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐఈడీలు పేల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు సబౌద్దిన్పై లక్నోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
Jammu and Kashmir: 100 నాటౌట్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 30 మంది ఉన్నారు. జూన్ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని, ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు భద్రతాధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల ఆవల నుంచి చొరబాట్లు, రిక్రూట్మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు. దీంతో కశ్మీర్‌వ్యాప్తంగా గాలింపు చర్యలను ఉధృతం చేశామన్నారు. ‘కశ్మీర్లో ఇంకా 158 మంది వరకు ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు సమాచారముంది. వీరిలో 83 మంది వరకు లష్కరేకు చెందిన వారే. 30 మంది జైషే మొహమ్మద్, 38 మంది హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల వారున్నారు. అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉడి, కశ్మీర్‌లోయలోని ఆరు చోట్ల ఐఎస్ఐ ఉగ్ర శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం స్టికీ బాంబులను వాడొచ్చు’’ అని వెల్లడించారు. ‘‘బాల్టాల్ మార్గంలో కంగన్ వద్ద, పంథా చౌక్ మీదుగా వెళ్లే యాత్రికులపైనా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వీటిని తిప్పికొట్టేందుకు పూర్తిస్థాయిలో నిఘా చేపట్టాం’ అని భద్రతాధికారులు తెలిపారు. -
Pulwama Encounter: జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్
జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం హైఅలర్ట్ ప్రకటించారు భద్రతా అధికారులు. శుక్రవారం రాత్రి నుంచి జమ్ములోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో ముగ్గురు ముష్కరులను మట్టుపెట్టినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో.. పుల్వామా చవల్కాన్‌లో, హంద్వారా నెచమా, గందర్బాల్ ఏరియాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా, భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. శనివారం వేకువ జామున వరకు జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. మరొకరికోసం గాలిస్తున్నామన్నారు. పుల్వామాలోని చవల్కాన్ ప్రాంతంలో జైషే మహమ్మద్‌కు చెందిన టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో JeM కమాండర్ కమాల్ భాయ్ తో పాటు ఒక పాకిస్థానీ ఉన్నట్లు వెల్లడించారు. We had launched joint ops at 4-5 locations yesterday night. So far 2 terrorists of JeM including 1 Pakistani killed in Pulwama, 1 terrorist of LeT killed each in Ganderbal & Handwara. Encounters over in Handwara & Pulwama. Also arrested 1 terrorist alive: IGP Kashmir (File pic) pic.twitter.com/BPN25Gx3dz — ANI (@ANI) March 12, 2022 ఇక గందర్బల్ హంద్వారాలో జరిగిన ఎదురుకాల్పులో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, అతడు లష్కరే తొయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించామన్నారు. పలుచోట్ల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. -
ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. వీరిలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ జహీద్ అహ్మద్ వని అలియాస్ ఉజైర్ ఉన్నాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. పుల్వామా, బుడ్గావ్ జిల్లాల్లో ఉగ్రవాదుల ఆచూకీ సమాచారం అందుకున్న భద్రతాదళాలు కూంబింగ్ నిర్వహించాయని తెలిపారు. పుల్వామాలోని నైరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు మృతి చెందగా, బుడ్గావ్లోని చరారే షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన బిలాల్ అహ్మద్ ఖాన్ చనిపోయాడన్నారు. జహీద్ వని జైషేలో టాప్ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, అతని సోదరుడు బాన్‌ప్లాజా దాడిలో నిందితుడని తెలిపారు. 2017 నుంచి జహీద్ చురుగ్గా ఉగ్రకార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని చెప్పారు. లోయలో మొత్తం జేషే కార్యకలాపాలకు ఇతనే సూత్రధారి అని, ఇతని మరణం భద్రతా దళాలు సాధించిన గొప్పవిజయమని విజయ్ కుమార్ ప్రశంసించారు. 11 ఎన్కౌంటర్లు.. 21 మంది ఉగ్రవాదులు జనవరిలో ఇంతవరకు 11 ఎన్కౌంటర్లలో 21మంది టెర్రరిస్టులు మరణించినట్లు చెప్పారు. వీరిలో 8మందికి పాక్‌తో సంబంధం ఉందన్నారు. పలు ఐఈడీ పేలుళ్లతో వనికి సంబంధం ఉందని ఆర్మీ అధికారి మేజర్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ చెప్పారు. ఉగ్రవాదుల్లోకి యువతను రిక్రూట్ చేయడంలో కూడా ఇతని పాత్ర ఉందన్నారు. మరణించిన ఇతర ఉగ్రవాదులను కఫీల్ భారీ అలియాస్ ఛోటూ, వహీద్ అహ్మద్ రెషి, ఇనాయత్ అహ్మద్ మిర్గా గుర్తించారు. వీరిలో ఛోటూ పాక్ నివాసి. కాల్పుల్లో మరణించిన మిర్ ఉగ్రవాదులుంటున్న ఇంటి యజమాని కుమారుడని, హైబ్రిడ్ టెర్రరిజానికి ఇది ఉదాహరణఅని ప్రశాంత్ తెలిపారు. ఇలాంటి వారికి టెర్రరిస్టులుగా ఐడెంటిటీ ఉండదని, కానీ ఉగ్రవాదులకు సహాయంగా వ్యవహరిస్తుంటారని వివరించారు. పాక్, హైబ్రిడ్ టెర్రరిస్టులు భద్రతాదళాలకు అసలు సమస్యన్నారు. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తొలిసారి 200 దిగువకు తెచ్చామని తెలిపారు. డ్రోన్లతో పాటు ఇతర మార్గాల్లో వీరికి ఆయుధాలు అందుతున్నాయని, ఈ ఆయుధ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అధికారులు చెప్పారు. In dual encounters - 4 neutralized in Pulwama and 1 in Budgam. Among the killed in Pulwama is Zahid Wani who was actively involved in killings and recruitments. He was the district (Pulwama) commander and JeM chief of the entire Valley: Vijay Kumar, IGP Kashmir pic.twitter.com/86nkmwaRBM — ANI (@ANI) January 30, 2022 చదవండి: సీన్ రివర్స్.. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయ్ -
పుల్వామా ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని చండ్గామ్ గ్రామంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. చదవండి: పంజాబ్ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం వీరిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలతోపాటు రెండు M-4 కార్బెన్స్, ఒక ఏకే సీరీస్ రైఫిల్ వంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ పర్యటనలు, ర్యాలీలు రద్దు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ -
పుల్వామాలో ఎన్కౌంటర్; లష్కరే కమాండర్ హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా టౌన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ఈ సందర్భంగా వారిని లొంగిపోవాలని కోరామని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ ఉన్నాడని తెలిపారు. మరో ఇద్దరు స్థానికులని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు. -
పుల్వామాలో ఉగ్రదాడి కలకలం
జమ్మూకశ్మీర్: పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్ ఇట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఫయాజ్ భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య మరణించారు. కుమార్తెను శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా, శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగాం ప్రాంతంలో ప్రార్థనలకు వెళ్లే సమయంలో మరో పోలీసు అధికారి పర్వైజ్ అహ్మద్ దార్‌పై ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మంగళవారం కాల్పులు జరిపారు. అలాగే గత నెలలో జావైద్ అహ్మద్ అనే పోలీసు అధికారిపై తన నివాసం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చదవండి: రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి అణచివేత శకం ముగియాలి -
బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్
ఢిల్లీ: ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం నిర్వహించిన బాలాకోట్ ఆపరేషన్‌కు రెండేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన ఫైటర్ జెట్లు నియంత్రణ రేఖను(ఎల్ఓసీ) దాటి, పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. బాలాకోట్ ఆపరేషన్ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం తాజాగా ప్రయోగాత్మకంగా లాంగ్ రేంజ్ స్ట్రైక్ నిర్వహించింది. ప్రాక్టీస్ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. బాలాకోట్ ఆపరేషన్ చేపట్టిన స్క్వాడ్రన్ బృందమే ఈ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌లో పాల్గొనడం విశేషం. చదవండి: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’ -
తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!
శ్రీనగర్: పుల్వామా దాడితో భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు మరోసారి అలాంటి పథకాన్నే రచించారు. అయితే, భద్రతా బలగాల ఉమ్మడి సెర్చ్ ఆపరేష్‌తో వారి కుట్రలు భగ్నమయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గడీకల్ ప్రాంతంలోని కెవారాలో హైవే పక్కన 52 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించామని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైవే పక్కన ఉన్న పండ్లతోటలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ ట్యాంక్‌లో ఈ మొత్తం బయటపడిందని తెలిపింది. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి 9 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని వెల్లడించింది. 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. ఆ ప్రాంతంలోనే మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. కాగా, 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఉగ్రవాదులు 35 కిలోల ఆర్డీఎక్స్ను మరికొన్ని జలెటిన్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. పుల్వామా దాడి వెను జైషే చీష్ మసూద్ అజార్ ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసి జైషే ఉగ్రవాద శిబిరాలను మారూపాల్లేండా చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్కౌంటర్లో ఓక ఉగ్రవాది హతం
-
పుల్వామాలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని గుసూ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో పోలీసు, ఓ ఆర్మీ సైనికుడు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందంతో గుస్సా ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే అప్పటికే అక్కడ మాటువేసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాలకు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ పోలీసు, ఆర్మీ సైనికుడు గాయపడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. (తెలంగాణ సైనికుడి వీరమరణం ) -
ఉగ్రవాది ఖతం.. బాంబులు మిస్సింగ్!
-
ఉగ్రవాది ఖతం.. కానీ, బాంబులు మిస్సింగ్!
శ్రీనగర్: పుల్వామాలో బుధవారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్ అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నట్టు కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఫౌజీ భాయ్ ఎన్కౌంటర్ భద్రతా బలగాలకు పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రెహమాన్ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో ఒకదానిని భద్రతా బలగాలు పేల్చివేయగా... మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో ఆ బాంబులు ఉండొచ్చని, వాటి జాడ కోసం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!) కాగా, పుల్వామా తరహా ఉగ్రదాడి జరగనుందనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 కిలోల శక్తిమంతమైన ఐఈడీని మోసుకెళ్తున్న శాంట్రో వాహనాన్ని మే 27న సీజ్ చేశాయి. ఐఈడీని తరలిస్తున్న టెర్రరిస్టు సమీర్ అహ్మద్ దార్ తృటిలో తప్పించుకుపోయాడు. ఇక ఐఈడీ వాహనాన్ని తరలించడం ప్రమాదమని భావించిన బాంబు స్క్వాడ్ నిపుణులు దానిని అక్కడే పేల్చివేశారు. గతేడాది పుల్వామా వద్ద భద్రతా బలగాలపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డ అదిల్ దార్‌కు సమీర్ అహ్మద్ దార్ బంధువని తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. (చదవండి: పుల్వామాలో భారీ ఎన్కౌంటర్) -
ఎన్కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. జైషే ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు కంగన్ ప్రాంతంలో గాలింపు చేపట్టిన క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మరణించిన ఉగ్రవాదులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరణించిన జైషే ఉగ్రవాదుల్లో ఓ మిలిటెంట్ కమాండర్ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో పుల్వామాలో ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్ -
పుల్వామాలో తప్పిన పెను ముప్పు
-
పుల్వామాలో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు అవంతిపొరలో గోరిపోరా ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ క్రమంలోనే జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులతోపాటూ వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని భద్రతాదళాలు మట్టుపెట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి) -
‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడికి సంబంధించి ఒక కీలక నిందితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది. అతడిని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ సభ్యుడిగా గుర్తించారు. పుల్వామాలోని కాకాపొరా ప్రాంతంలోని హజిబల్‌కు చెందిన షకీర్ బషీర్ మాగ్రే పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్‌కు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. బషీర్‌కు అక్కడ ఒక ఫర్నిచర్ షాప్ కూడా ఉంది. 2018లో పాకిస్తాన్ ఉగ్రవాది మొహ్మద్ ఉమర్ ఫారూఖ్ ద్వారా ధార్‌కు బషీర్ పరిచయం అయ్యాడు. ఆ తరువాత బషీర్.. జైషే మొహ్మద్ కోసం పూర్తి కాలం పనిచేశాడు. పలు సందర్భాలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని ఉగ్రవాదుల కోసం సిద్ధం చేశాడని ఎన్ఐఏ తెలిపింది. -
పుల్వామాలో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజహిదీన్ టాప్ కమాండర్ హమద్ ఖాన్ సహా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. భద్రతా దళాలు ఆదివారం పుల్వామా ప్రాంతంలోని గుల్షన్‌పురాలో గాలింపు చర్యలు చేపడుతుండగా ఓ నివాస గృహంలో ఉగ్రవాదులు తలదాచుకున్న సమాచారం అందడంతో ఆ ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతాదళాలపై భవనం లోపలి నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపగా, ప్రతికాల్పుల్లో హమద్ ఖాన్ సహా ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఘటనా స్ధలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా అనంత్‌నాగ్‌లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులను శనివారం భద్రతా దళాలు అరెస్ట్ చేసిన మరుసటి రోజే భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. -
జవాన్ మృతదేహంపై పార్టీ జెండా
భువనేశ్వర్: ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో అమరుడైన ఓ జవాన్ మృతదేహంపై రాజకీయ పార్టీకి చెందిన జెండాను ఉంచడం వివాదాస్పదంగా మారింది. ఒడిశాకు చెందిన అజిత్ సాహో అనే ఆర్మీ జవాన్ ఈనెల 12న కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతిచెందాడు. అయితే అంత్యక్రియల నిమిత్తం అతని మృతదేహాన్ని ఒడిశాలోని ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ)కి చెందిన కొందరు నాయకులు వచ్చి మతదేహంపై వారి పార్టీ జెండాను కప్పి.. నివాళి అర్పించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే దానిని తొలగించారు. ఈ ఘటపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ మృతదేహంపై పార్టీ జెండాను ఉంచి.. బీజేడీ తీవ్రంగా అవమానించిందని మండిపడింది. అమరుల త్యాగాలకు కించపరిచే విధంగా బీజేడీ ప్రవర్తించిందని విమర్శించింది. బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.. ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. ఆ జెండాను ఎవరు కప్పారో కూడా తమకు నిజంగా తెలీదన్నారు. ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా జవాను సోదరుడు పరేశ్వరన్ మాట్లాడుతూ.. స్థానిక బీజేడీ నాయకులు వచ్చి పార్టీ జెండాను మృతదేహంపై కప్పి వెళ్లారని తెలిపారు. విషాదంలో ఉన్న తాము దీని గురించి పెద్దగా పట్టించుకోలేదన్నారు. పక్కవారు చెప్పడంతో వెంటనే జెండాను తొలగించామని, తమ సోదరుడు దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడని చెప్పుకొచ్చారు. -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడి హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు సైనికులను ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో పుల్వామా ఉగ్ర దాడిలో ప్రమేయం ఉన్న సాజద్ భట్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని ఇదే దాడితో సంబంధం ఉన్న అహ్మద్ భట్‌గా గుర్తించారు. సాజద్ బట్ 25 కిలోల పేలుడు పదార్థంతో ఉన్న మారుతి ఈకో కారును పుల్వామా దాడిలో ఉపయోగించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. సోఫీయన్ మదర్సాలో విద్యార్థిగా ఉన్న సాజద్ పుల్వామా దాడికి ముందు కొన్ని రోజలు కనిపిచంకుండా పొయినట్లు ఎన్ఐఏ తెలిపింది. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది సోమవారం హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ రాహుల్ వర్మ మరణించిన విషయం తెలిసిదే. -
కశ్మీర్లో కాల్పులు.. మహిళ మృతి
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. సాధారణ ప్రజానీకంపైకి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు దక్షిణ కాశ్మీర్‌లోని అనంత నాగ్‌లో అల్లరి మూకలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. బందోబస్తులో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులకు అల్లరిమూకలకు మధ్య ఘర్షణ చోటుకుంది. అల్లరిమూకలులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో అనంతనాగ్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలికొంది. ముగ్గురు వేర్పాటువాదులు అరెస్ట్ ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాదులు షబ్బీర్‌షా, ఆసియా అంద్రబి, మసారత్ ఆలంభట్‌ను అరెస్టు చేసింది. ఆ ముగ్గురికి ఢిల్లీ కోర్టు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్సయీద్కు చెందిన జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు కశ్మీర్ లోయ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీలో ప్రత్యేక జడ్జి రాకేశ్ సయాల్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సమయంలోనే ఆ ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేసిందని నిందితుల తరఫు న్యాయవాది వెల్లడించారు. -
కశ్మీర్లో హిజ్బుల్ ఉగ్రవాది ఎన్కౌంటర్
శ్రీనగర్ : పుల్వామా, అనంతనాగ్‌లో సంభవించిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం పుల్వామా జిల్లా అవంతిపొర ప్రాంతంలోని పంజ్‌గామ్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. 130 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది, 55 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సాయంతో గాలింపు చేపట్టారు. ఈక్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు చోటు చోసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ షౌకత్ అహ్మద్ దార్గా భావిస్తున్నారు. గతంలో ఔరంగజేబులో జరిగిన కాల్పుల్లో.. అహ్మద్ ఓ జవాన్‌ను హత్య చేశాడు. మరొక ఉగ్రవాది గురించి వివరాలు తెలియరాలేదు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు సంఘటన స్థలం నుంచి ఒక ఏకే - 56 రైఫిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిని కూడా పేల్చేశారు. -
జమ్మూ కశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్
-
జమ్మూకశ్మీర్: పుల్వామాలో ఎన్కౌంటర్
-
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: ఉద్రవాదుల తూటాల శబ్దాలతో సోమవారం తెల్లవారుజామూన కశ్మీర్ దద్దరిల్లింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య తెల్లవారుజామున భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు విస్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే జవాన్లపైకి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ముష్కరుల దాడిని తిప్పికొట్టిన భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
సముద్ర మార్గం ద్వారా భీకర దాడులకు పాక్ స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి భారత్‌లో విధ్వంసకర దాడులు చేపట్టేందుకు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం నేడు ప్రపంచ శాంతి సుస్ధిరతలకు పెను సవాల్ విసురుతోందని, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజం ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. గత కొన్నేళ్లుగా ఇండో పసిఫిక్ ప్రాంతం భిన్నరూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో పసిఫిక్ రీజినల్ డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని నేవీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో మనం మూడు వారాల కిందట ఉగ్రవాదుల భీకర దాడిని చూశామని పుల్వామా ఘటనను ఆయన ప్రస్తావించారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు పొరుగు దేశం ఉగ్రవాదులను ప్రేరేపిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి ఉగ్రవాదులు భారత్‌లో అలజడి సృష్టించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు భారత సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. -
పుల్వామా జిల్లా పింగాన్లో భారీ ఎన్కౌంటర్
-
వాషింగ్టన్ డీసీలో అమర జవాన్లకు శ్రద్దాంజలి
వాషింగ్టన్ డీసీ : కశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన జవాన్లకు అమెరికాలోని భారతీయులు నివాళులర్పించారు. వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు చనిపోయిన సైనికులకు శ్రద్ధాంజలిని ఘటించారు. అమెరికాలోని పార్టమెంట్ ఎదుట ఏర్పాటు చేసిన అమరవీరుల శ్రద్ధాంజలి’ కార్యక్రమం లో వందలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనిక సేవలను కొనియాడుతూ వారి కుటుంబాలకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. టెర్రరిజం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించవద్దని అన్నారు. -
‘వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడొద్దు’
ముంబై: పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇప్పటికే యావత్ భారతావని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుండగా, తాజాగా పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లను మొత్తం నిషేధించాలనే ప్రతిపాదనను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే బ్రాబోర్న్ స్టేడియంలో పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తొలగించిన సీసీఐ.. వరల్డ్‌కప్ వంటి మెగాటోర్నీలో సైతం పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేసింది. (చదవండి:పాక్ క్రికెట్‌కు షాక్ మీద షాక్.. పీసీబీ స్పందన) ‘దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఆ దేశ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ముందుకు రాలేదు. దీనిపై ఇమ్రాన్ కనీసం స్పందించాల్సి ఉంది. మన జవాన్ల మీద జరిగిన దాడిని మేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సీసీఐ క్రీడా రంగానికి చెందిందే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యం. తర్వాతే క్రీడలు. ఈ దాడిపై ఇమ్రాన్ ఖాన్ కచ్చితంగా మాట్లాడి తీరాలి. ఆయన పాకిస్తాన్ ప్రధాని. వాళ్ల దేశం వైపు ఏ తప్పూలేకపోతే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?..అందుకే వరల్డ్ కప్‌లో టీమిండియా..పాకిస్థాన్‌తో ఆడకూడదు. ఈ మేరకు బీసీసీఐని కోరాం’ అని సీసీఐ సెక్రటరీ సురేశ్ బఫ్నా తెలిపారు. త్వరలో ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా-పాక్‌ల మధ్య జూన్ 16 న మ్యాచ్ జరగాల్సి ఉంది. (చదవండి:పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు) -
పాక్ క్రికెట్‌కు షాక్ మీద షాక్.. పీసీబీ స్పందన
లాహోర్: పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రన్‌ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోను తొలగిస్తూ సదరు కమిటీ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తొలగించింది. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) పోటీలను భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని డీస్పోర్ట్ చానల్ నిలిపివేసింది. కాగా, ఇప్పటివరకూ పీఎస్ఎల్కు అధికారిక ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ సైతం ఇకపై ఆ లీగ్ తో ఎటువంటి భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పందించిన పీసీబీ.. ఈ విషయాల్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి తీసుకెళతామని పేర్కొంది. ‘ ఇది చాలా దురదృష్లకరం. పాకిస్తాన్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను సీసీఐ తొలగించడం చాలా బాధాకరం. దాంతోపాటు మా దేశానికి చెందిన క్రికెటర్ల ఫొటోలను కొన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు తొలగించిన విషయం మా దృష్టికి వచ్చింది. భారత్‌లో పీఎస్ఎల్ మ్యాచ్‌లను కూడా నిలిపివేశారు. ఇక్కడ రాజకీయాలు, క్రీడలు వేర్వేరు అనే విషయం గ్రహించాలి. ప్రధానంగా క్రికెట్ అనేది దేశాల మధ్య ఐక్యతకు వారథి లాంటిది. చరిత్ర అదే చెబుతుంది కూడా. క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. వీటిపై బీసీసీఐతో చర్చిస్తాం. ఐసీసీ వద్దే తేల్చుకుంటాం’ అని పీసీబీ మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ తెలిపారు. భారత్‌లో పీఎస్ఎల్ ప్రసారాల్ని డీస్పోర్ట్ చానల్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న స్వల్ప వ్యవధిలోనే, పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకుంది. పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ రిలయన్స్ పలు మ్యాచ్ ల లైవ్ కవరేజ్ కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సివుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్ లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది. తాజాగా పీఎస్ఎల్ నుంచి ఐఎంజీ రిలయన్స్ తప్పుకోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి పీసీబీ సిద్ధమైంది. ఇక్కడ చదవండి: పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా: సెహ్వాగ్ -
పెళ్లి ఊరేగింపులో అమర జవాన్లకు ఘన నివాళి
వడోదరా: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలు ఘనంగా నివాళులు ఆర్పిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన నూతన వధూవరులు కూడా పుల్వామా ఉగ్రదాడిపై తమలో ఉన్న ఆవేదనను చాటిచెప్పారు. అందులో భాగంగా తమ పెళ్లి ఊరేగింపు వేడుకలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు. వివాహనికి ముందు జరిగిన పెళ్లి ఊరేగింపులో భాగంగా గుర్రపు రథంలో కూర్చున్న వధూవరులు జాతీయ జెండాతో పాటు.. ఓ ఫ్లకార్డును ప్రదర్శించారు. దేశంలో కేవలం 1427 పులులు మాత్రమే ఉన్నాయని ఎవరు అన్నారు.. సరిహద్దులో ఉన్న 13 లక్షల పులులు దేశానికి రక్షణ కల్పిస్తున్నాయనే సందేశాన్ని అందులో ఉంచారు. వధూవరులు మాత్రమే కాకుండా ఆ వివాహ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతబూని అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ గత గురువారం జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. -
పుల్వామా ఉగ్రదాడి: పైశాచిక ఆనందం
సాక్షి, బళ్లారి/ కృష్ణరాజపురం/ రాయచూరు రూరల్: కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్న ముగ్గురు కశ్మీరీలు సహా నలుగురు యువకులను, అలాగే ఉగ్రదాడిని సమర్థించిన ఓ కన్నడ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు అనుకూలంగా ఆ ఉపాధ్యాయురాలు వాట్సాప్‌లో పోస్ట్‌లు పెట్టింది. బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మురగోడు శివపురంలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు జిలేఖాబీ పాకిస్థాన్‌కు అనుకూలంగా వాట్సప్‌లో పోస్టింగ్ చేయడం కలకలం సృష్టించింది. ఇది తెలిసి పెద్దసంఖ్యలో స్థానిక ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె ఇంటి ముందు టైర్లకు నిప్పు అంటించి నిరసనకు దిగారు. పాక్‌కు వంతపాడుతున్న యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవలు జరగకుండా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు జిలేఖాబీపై సెక్షన్ 121, 152, 153A కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు యువకుల అరెస్ట్ ఉగ్రదాడిని సమర్థించిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ శివకుమార్ తెలిపారు. కశ్మీర్ రాష్ట్రానికి చెందిన జాకీర్, వకార్ అహ్మద్, గౌహార్‌లు కేంద్ర ప్రభుత్వ నిధులతో బెంగళూరు గ్రామీణ జిల్లాలోని స్ఫూర్తి కాలేజీలో బీఎస్సీ చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటున్నారు. గురువారం ఉగ్రవాదుల దాడి జరిగిన వెంటనే సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గురూ హాస్టల్ గదిలో డ్యాన్సులు చేశారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ప్రశ్నించగా వారిపై దాడికి తెగబడ్డారు. కాలేజీ ప్రిన్సిపల్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సూర్యనగర్ పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సంబరాలు చేసుకోవడంతో పాటు భారత సైన్యంపై అవమానకర వ్యాఖ్యలు చేశారని, కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నామని ఎస్పీ శివకుమార్ తెలిపారు. ఫేస్బుక్లో తప్పుడు పోస్ట్ కశ్మీర్లో ఉగ్రవాద దాడులపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మరొక ప్రైవేటు ఉద్యోగిని ఆదివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు కమ్మనహళ్లిలో ఉంటున్న స్థానికుడు ఫైజ్ రషీద్ పుల్వామా ఉగ్రవాద దాడులను పొగడడంతో పాటు ‘పిక్చర్ అబి బాకీ హై (సినిమా ఇంకా మిగిలే ఉంది)’ వ్యాఖ్యలు చేసి ఆ పోస్టింగ్‌ను బెంళూరు పోలీసుల ఫేస్బుక్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న బాణసవాడి పోలీసులు కేసును సీసీబీ పోలీసులకు బదిలీ చేయడంతో ఆదివారం నిందితుడిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచూరులో రంగులు చల్లుకుని సంబరాలు కశ్మీర్లో జవాన్లపై దాడిని పొగుడుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 14వ తేదీ దాడి వార్తలు రాగానే రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా ముదుగల్ మండలం తలకోనలో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. దీనిని ఖండిస్తూ ప్రజల పిలుపు మేరకు ఆదివారం ముదుగల్ బంద్ పాటించారు. నిందితులను అరెస్టు చేయాలని ఒత్తిళ్లు రావడంతో జిల్లా ఎస్పీ కిశోర్‌బాబు ఘటన స్థలానికి వెళ్లి ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే వారి పేర్లను ప్రకటించబోమని, వారిని విచారించి వారిపై క్రిమినల్, దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. సైన్యానికి వ్యతిరేకంగా పోస్ట్, అరెస్ట్ బళ్లారి టౌన్: భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన రాహుల్ పాస్వాన్ అనే యువకుడిని తోరణగల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్ దాడిపై సండూరు తాలూకా తోరణగల్లు నివాసి రాహుల్ పాస్వాన్ భారత సైన్యానికి వ్యతిరేకంగా అవహేళనకరంగా ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో తోరణగల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ యువకుడిని ఆదివారం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
వాటిని ప్రచారం చేయకండి: సీఆర్పీఎఫ్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజనిజాలు తెలుసుకోకుండా చాలా మంది నెటిజన్లు వాటిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో అమరులైన జవాన్ల స్థానంలో నకిలీ ఫొటోల షేర్ అవుతున్నాయి. ఈ రకమైన తప్పుడు వార్తలపై సీఆర్పీఎఫ్ స్పందించింది. అంతేకాకుండా సోషల్ మీడియా యూజర్లకు ఓ సూచన కూడా చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల మృతదేహాలకు బదులు కొందరు దుండగులు నకిలీ ఫొటోలను ప్రచారం చేస్తున్నారు.. దయచేసి అలాంటి షేర్లు, లైక్‌లు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అటువంటి ఏమైనా ఉంటే webpro@crpf.gov.inకు సమాచారం అందించాలని కోరింది. అంతేకాకుండా కశ్మీర్‌లోని విద్యార్థులపై జవాన్లు వేధింపులకు పాల్పడుతున్నారని కొందరు దుండగులు ప్రచారం చేస్తున్న వార్తలను కూడా సీఆర్పీఎఫ్ ఖండించింది. దీని గురించి సీఆర్పీఎఫ్ అధికారులు విచారణ చేపట్టారని.. అందులో ఏ మాత్రం నిజం లేదని తేలిందని పేర్కొంది. ADVISORY: It has been noticed that on social media some miscreants are trying to circulate fake pictures of body parts of our Martyrs to invoke hatred while we stand united. Please DO NOT circulate/share/like such photographs or posts. Report such content at webpro@crpf.gov.in — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) 17 February 2019 -
జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ రూ.5 కోట్ల సాయం?
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 కోట్లు కేటాయించాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షులు సీకే ఖన్నా ఆదివారం ప్రతిపాదించారు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, ఇండియా-ఆసీస్ మధ్య జరగబోయే టీ20 సిరీస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్-2019 మ్యాచ్‌ల ముందు 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రతిపాదించారు. పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలకు తమకు తోచినంత సహాయం చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు, ఐపీఎల్ ప్రాంఛైజీలకు ఖన్నా విజ్ఞప్తి చేశారు. గురువారం శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తుండగా ఉగ్రవాది కారుతో ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడటతో 40 మంది జవాన్లు మృతిచెందారు. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు. 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు 78 బస్సుల్లో శ్రీనగర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళి
-
అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, ఏలూరు : పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన అమర జవాన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటించింది. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటగా అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు సభా వేదికపై జ్యోతిరావు పూలే, సాయిత్రీబాయి పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గన్నవరం నుంచి ఏలూరుకు రోడ్డు మార్గంలో చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. బీసీ గర్జన సభకు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ గర్జన సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. బీసీ గర్జన వేదికపై ఆయన కూడా ఆశీనులయ్యారు. వైఎస్ జగన్‌కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం బీసీల సమస్యలపై బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య తరఫున ఆయన ప్రతినిది గూడురి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏలూరు సభా వేదికపై వైఎస్ జగన్‌ను కలిసిన బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు.. పలు సమస్యలు, సలహాలతో కూడిన అర్జీని అందజేశారు. బీసీలకు అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. -
‘ఉపాధి లేదు కానీ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : మతంతో దేశాన్ని విభజించారని.. పాకిస్థాన్‌లో ఇస్లాం రాజ్యం నడుస్తోందని.. అక్కడ ఉపాధి లేదు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన సైనికులకు ఇందిరా పార్కు వద్ద ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సభకు కిషన్‌రెడ్డి హాజరై పై విధంగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు యుద్దాలలో ఓడిపోయినా బుద్ధి రాలేదని, భారతదేశాన్ని చీల్చి జమ్మూ కాశ్మీర్‌ను సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భద్రతా బలగాలకు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. రాజకీయాలకు, మతాలకతీతంగా ఏకమై నరేంద్రమోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా చైనాలాంటి దేశాలు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రజలందరూ మన సైన్యానికి నైతికంగా బలమిస్తే.. తగిన చర్యకు పూనుకుంటారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడి ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడటం మంచి పరిణామం కాదన్నారు. భారతదేశాన్ని ముక్కలు చేసి సమగ్రత, సమైఖ్యతను దెబ్బతీయాలని ఏళ్ల తరబడి పాకిస్థాన్ యోచిస్తోందన్నారు. చైనా తప్పా మిగితా దేశాలు పాకిస్థాన్ చర్యను ఖండించాయని గుర్తుచేశారు. పాకిస్థాన్‌ను పక్కన పెట్టుకుని చైనా పాత వైరాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. పాకిస్థాన్, చైనా దేశాలు ఉగ్రవాదానికి అండగా ఉండటం బాధాకరమని, ఇస్లాం కూడా శాంతినే కోరిందని, ఉగ్రవాదాన్ని మతంతో చూడకూడదన్నారు. -
పాక్ ఆర్మీ ఆస్పత్రి నుంచే ఉగ్ర కుట్ర
ముంబై: పుల్వామా ఉగ్రదాడికి పాకిస్తాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సూచనలు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాకుండా రావల్పిండిలోని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచే తన పథకాన్ని అతడు అమలు చేశాడు. అనారోగ్య కారణాలతో కొన్ని నెలలుగా ఆర్మీ బేస్ ఆస్పత్రిలో మసూద్ చికిత్స తీసుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఆరు నెలలుగా ఉగ్ర సమావేశాలకు కూడా మసూద్ దూరంగా ఉంటున్నాడు. అయితే అక్కడి నుంచే పుల్వామా దాడికి ఆదేశాలిచ్చి భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించాడు. కేవలం ఎనిమిది రోజుల ముందే పుల్వామా ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. భద్రతా దళాల చేతిలో గతేడాది అక్టోబరులో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైంది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా యువతను రెచ్చగొట్టినట్టు బయటకు వచ్చింది. ఉగ్రవాదుల వల్ల శాంతికి విఘాతం కలుగుతోందని కొందరు మాట్లాడుతున్నారు. కానీ, మీరు మాత్రం సరిహద్దుల వెంబడి పోరాటం ఆపకండి అంటూ ఆ ఆడియోలో అన్నట్లు ఉంది. తన సోదరుడు కుమారుడు మహ్మద్ ఉమేర్, అబ్దుల్ రషీద్ ఘాజీల సాయంతో ఈ ఆడియో టేపు ద్వారా కశ్మీర్ లోయలోని యువకుల మనసులో విషబీజాల్ని నాటించాడు. శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి దాడులకు పాల్పడాలని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫర్బాద్లో జరిగిన సమావేశంలో చర్చించారని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక్కడ చదవండి: దాడి సూత్రధారి ఉమేర్ -
కశ్మీర్లో అబిద్ ?
కర్ణాటక, కృష్ణరాజపురం: కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో సందేశం పోస్ట్ చేసిన కశ్మీర్‌కు చెందిన అబిద్ మాలిక్ అనే యువకుని కోసం సీసీబీ పోలీసులు వేట తీవ్రతరం చేశారు. అబిద్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలతో పాటు ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సీసీబీ అదనపు కమిషనర్ అలోక్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు జరుగుతోంది. కశ్మీర్‌కు చెందిన ఇతడు నగరంలోనే చదువుకుని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మాహుతి దాడిని అసలైన సర్జికల్ స్ట్రైక్‌గా ఫేస్బుక్లో వర్ణించడం తెలిసిందే. అతని జాడ కోసం అన్ని రాష్ట్రాల పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అతడు కశ్మీర్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఎన్ఐఏకు సమాచారం అందించారు. అబిద్‌పై కన్నడ పోరాట సంఘాల నేత నాగేశ్గౌడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అబిద్ మాలిక్‌తో పాటు అతని ఫేస్బుక్ గ్రూప్‌లో ఉన్న అబ్దుల్ హనీఫ్, సుల్తాన్ అహ్మద్, అమీన్ షరీఫ్, ఉమర్ ఫార్జీ, సల్మాన్ అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు. -
జవాన్ అంతిమయాత్రలో ఎంపీ అభ్యంతరకర ప్రవర్తన
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ అజిత్ కుమార్ అంతిమ యాత్ర సందర్భంగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అజిత్ కుమార్‌కు కడసారి నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నావ్‌కు తరలిరాగా జవాన్ భౌతికకాయం ఉంచిన వాహనంపై స్ధానిక ఎంపీ సాక్షి మహరాజ్ వారందరికీ నవ్వుతూ అభివాదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు. కాగా, జవాన్ అంతిమయాత్రలో సాక్షి మహరాజ్ అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను మరికొందరు పోస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. సాక్షి మహరాజ్ జవాన్ అంతిమ యాత్రను అభినందన యాత్రగా పీలవుతున్నారని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్ర సంధించగా, బీజేపీ ఎంపీ చర్య సిగ్గుచేటని మరో యూజర్ మండిపడ్డారు. -
ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసేశారు..
ముంబై: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించింది. బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ‘ఆల్ రౌండర్’ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాకిస్తాన్ ఫొటోలను అక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘ఈ ఘోర దాడి వెనక ఏ దేశ హస్తం ఉందో మాకు తెలుసు. మా దేశ ప్రజల మనోభావాలే మాకు ముఖ్యం. వాటిని దృష్టిలో ఉంచుకుని పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఫొటోలను తొలగించాం’ అని పేర్కొన్నారు. మన దేశ జవాన్లపై దాడి జరిగి 40 మంది అమరులైనప్పటికీ ఈ ఘటనపై ఇమ్రాన్ మౌనం వహించడాన్ని సీసీఐ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ ఒక అడుగు ముందుకేస్తే, తాము పది అడుగులు ముందకేస్తామని ఇమ్రాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పాక్ అండతోనే భారత జవాన్లపై ఉగ్రదాడి జరిగిందని భావిస్తున్న తరుణంలో ఇమ్రాన్ మాత్రం నోరు మెదకపోవడం చర్చనీయాంశమైంది. -
డల్లాస్‌లో అమర జవాన్లకు శ్రద్దాంజలి
టెక్సాస్ : పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. అమరులైన జవాన్లకు జాతి మొత్తం నివాళులు అర్పించింది. డల్లాస్‌లోని ఎన్నారైలు చనిపోయిన సైనికులకు శ్రద్దాంజలిని ఘటించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇర్వింగ్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద శనివారం ఫిబ్రవరి 16న ఏర్పాటు చేసిన ‘అమరవీరుల శ్రద్ధాంజలి’ కార్యక్రమం లో వందలాది మంది ప్రవాస భారతీయులు వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో ఒక చీకటి రోజని భారత దేశ రక్షణ కోసం తమ జీవితాలని అంకితం చేసిన వీర జవాన్ల పై దొంగచాటుగా దాడి చేసి వారి ప్రాణాలను బలిగొనడం ఒక అనాగరిక పిరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన కుటుంబాలకు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ, గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన అమెరికా రాజకీయ నాయకులకు మరియు స్థానిక కాంగ్రెస్ మెంబెర్స్ కు, సెనెటర్స్ కు దాడి వివరాలను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సలహామండలి సభ్యుడు అరుణ్ అగర్వాల్ మరియు ప్రసాద్ తోటకూర తెలియజేయగా దాదాపుగా 50 మంది అమెరికా రాజకీయ నాయకులు ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి తమ సంతాపం తెలియజేస్తూ, ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేసి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దాడిలో మరణించిన అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిముషాలు మౌనం పాటించి, కొవ్వత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎంఎన్ టి బోర్డు సభ్యులు రావు కల్వల, బి.ఎన్ రావు, జాన్ హమొండ్, అక్రం సయ్యద్, కమల్ కౌషల్, కమ్యూనిటీ లీడర్స్ జాక్ గద్వాని, షబ్నం మొద్గిల్, స్వాతి షా, ముజ్బర్ రెహమాన్, తన్వీర్ అర్ఫీ, బెనజీర్, హరి పాత్రో, అరుణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా: సెహ్వాగ్
న్యూఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్పీఎఫ్ సైనికుల పిల్లలకు విద్యనందించేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు కొచ్చాడు. ‘అమర జవాన్లకు మనం ఏం చేసినా తక్కువే! నేను వారి పిల్లలను చదివించే పూర్తి బాధ్యతను తీసుకుంటా. నా ‘సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్’లో వారికి విద్యను అందజేస్తాను’అని ట్విట్టర్లో వీరూ పోస్ట్ చేశాడు. హరియాణా పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగి అయిన స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ఒక నెల జీతాన్ని అమరుల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రతీ ఒక్కరు ఈ హేయమైన చర్యను ఖండించడంతో పాటు ఉదారతను చాటుకొని సాధ్యమైనంత సాయం అందజేయాలని సూచించాడు. ఉగ్రమూకల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా... తీవ్రంగా గాయాలపాలైన పలువురు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మరోవైపు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వాహకులు తమ క్లబ్ ఆవరణలో ఉన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చిత్రపటాన్ని వస్త్రంతో కప్పి వేసి నిరసన వ్యక్తం చేశారు. -
తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు
-
వీరజవాన్ల కుటుంబాలకు సూపర్‌స్టార్ భారీ విరాళం
ముంబై : పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అండగా నిలిచారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ. 2.5 కోట్లు ప్రకటించారు. గురువారం జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 49 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఘటనపై ప్రపంచం అంతా భారత్‌కు మద్దతుగా నిలిచింది. అదే సమయంలో దేశంలోని చాలామంది అమరుల కుటుంబాలకు అండగా ఉంటామంటూ ముందుకు వస్తున్నారు. -
తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు
చెన్నై: కశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో మరణించిన ఇద్దరు తమిళ జవానుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఉగ్రదాడిలో చనిపోయిన శివచంద్రన్ స్వగ్రామం కారైకుడికి, మరో జవాను స్వగ్రామం తూత్తుకుడికి ప్రత్యేక మిలటరీ వాహనాల్లో తరలించారు. ముందుగా తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న జవానుల మృతదేహాలకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘననివాళులు అర్పించారు. అక్కడి నుంచి అధికార లాంఛనాలతో ఖననం చేసేందుకు జవానుల గ్రామాలకు తరలించారు. తిరుచ్చి నుంచి రెండు మార్గాల ద్వారా బయలుదేరిన జవానుల భౌతికకాయాలకు దారిపొడవునా ప్రజలు అశ్రునివాళులు అర్పించారు. అధికారులు, మంత్రులతో పాటు ప్రజలు గౌరవ సూచకంగా అంతిమ యాత్రలో పాల్గొనడంలో రోడ్లు స్తంభించిపోయాయి. అమరవీరుల త్యాగాలను మరువబోమంటూ, జైహింద్ అంటూ యువకులు, అన్నివర్గాల ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర ఘాతుక ఘటనను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తీవ్రంగా ఖండిచింది. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన 49మంది జవాన్లను భారతీయులెవరు మరిచిపోలేరని ప్రకటించింది. వారి ప్రాణాలను హరించిన పాక్ తీవ్రవాద మూకలకు భారత్ గట్టి సమాధానం చెబుతుందనే విశ్వాసాన్ని నాట్స్ వ్యక్తం చేసింది. పుల్వామాలో ఉగ్రదాడి తెలిసిన వెంటనే అమెరికాలో ఉండే తెలుగువారంతా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవానుల కుటుంబాలకు నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపింది. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు జవాన్ల కుటుంబానికి అండగా ఉండాలని పేర్కొంది. -
సైనికుల సహాయ నిధికి ప్రముఖ ఆలయ ట్రస్ట్ విరాళం
సాక్షి, ముంబై: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శ్రీసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ సైనికుల సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాల సహాయార్థం రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించింది. మరోవైపు పుల్వామాలో ముష్కరులు జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవానుల సంఖ్య 49కి చేరింది. కాగా దేశంకోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా తన వంతు సాయాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈమేరకు తన ట్విట్టర్లో ఆర్థిక సాయం అందించిన సర్టిఫికెట్‌ను షేర్ చేస్తూ.. సైనికుల కుటుంబాలకి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. మనవంతు సహాకారం అందిద్దాం.. ఎంతో కొంత సాయం చేసి మనమంతా వారికి మన మద్దతును అందించాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
కోహ్లి అవార్డుల కార్యక్రమం వాయిదా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కోహ్లి తన అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఏటా అవార్డులు అందజేస్తారు. ఆర్పీ-ఎస్జీ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ అవార్డులను అందజేస్తారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ‘ఆర్పీ-ఎస్జీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. The RP-SG Indian Sports Honours has been postponed. At this heavy moment of loss that we all find ourselves in, we would like to cancel this event that was scheduled to take place tomorrow. — Virat Kohli (@imVkohli) 15 February 2019 -
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమంటూ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగాయి. అయినా భద్రతా దళాలకు సంపూర్ణ స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. అదే ఈ మారణహోమానికి దారితీసిందన్నారు. ఇటీవల 40 రోజులు సెలవు మీద ఇంటికి వచ్చిన తన భర్త ప్రదీప్ ఫిబ్రవరి 11న కశ్మీర్ వెళ్లారనీ, కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు తరలిపోతారని అనుకోలేదంటూ ఉగ్రదాడి విషాదంలో మునిగిపోయిన నీరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎన్నడూ గౌరవించలేదని ప్రదీప్ సింగ్ తండ్రి, రిటైర్డ్ ఎస్ఐ, అమర్ సింగ్, ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి త్యాగాన్ని ప్రజలు మరో మూడు రోజుల్లో మర్చిపోతారు .ఎవరి సొంత పనుల్లో వారు బిజీ అయిపోతారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ టెర్రరిస్టుల భీభత్స దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడి, దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం ప్రస్తుత తరుణంలో చాలా ముఖ్యమన్నారు. తన కుమారుడు చిన్నతనం నుంచి దేశ సేవ చేయాలని కోరుకున్నాడు. కానీ అతని కోరిక ఇలా తమకు శాశ్వతంగా దూరం చేస్తుందని అనుకోలేదంటూ తల్లి సరోజని దేవి బావురుమన్నారు. అటు ప్రదీప్ సింగ్ సోదరుడు కుల్దీప్ మాట్లాడుతూ, తన సోదరుడి ప్రాణాలు కంటే ప్రభుత్వాలందించే నష్టపరిహారం ఎంతమాత్రం విలువైందికాదన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుబెడతామని వాగ్దానం చేసిట్టుగా ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలన్నారు. కాగా జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలోని ఆజాన్ గ్రామానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పీఎఫ్) జవాన్ ప్రదీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. -
వీరులకు వందనం
-
పుల్వామా ఘటన.. విజయ్ ఆర్థిక సాయం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఒక అడుగు ముందుకేశాడు. వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం తన వంతు సాయాన్ని చేసి.. అందర్నీ సాయం చేయమని అడిగాడు. తను ఎంత మొత్తాన్ని సాయం చేశాడన్నది తెలియకుండా చేసి.. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్‌ని క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు . అందరి కంటే విజయ్ దేవరకొండ ప్రత్యేకమని ఇలాంటి సందర్బాల్లోనే వ్యక్తమవుతూ ఉంటుంది. మరి ఎంతమంది స్పందించి తమ వంతు సాయాన్ని అందిస్తారో చూడాలి. They protect our families. We must stand by the families of our soldiers. No contribution can be substantial for our soldiers' lives, but we have to do our bit, I've done mine. Together let's Contribute, together we will create a support system.https://t.co/pHp7ITOdit pic.twitter.com/G9ztDj0gvI — Vijay Deverakonda (@TheDeverakonda) February 15, 2019 -
ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ
-
పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి
-
పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అఖిలపక్షం ఘనంగా నివాళులు అర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు అమరులకు ఘనంగా అంజలి ఘటించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల పార్థివదేహాలు శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరాయి. విమానాశ్రయం ఎయిర్ బేస్‌లో అమరులకు నివాళులు అర్పించారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండించింది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ... కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తదితరులు బుద్గాంలో నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో నేలకొరిగిన అమర జవాన్ల భౌతిక కాయాలను అమర్చిన పేటికలను రాజ్‌నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌లు తమ భుజాలకెత్తుకున్నారు. అనంతరం ఉగ్ర దాడిలో గాయపడి శ్రీనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించిన రాజ్‌నాథ్ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పుల్వామాలో శుక్రవారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
ఉగ్రదాడిపై అభ్యంతరకర ట్వీట్
లక్నో : పుల్వామా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంటే జైషే దాడిని సమర్ధిస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్ధి ట్విటర్లో చేసిన అభ్యంతరకర పోస్ట్ వివాదాస్పదమైంది. ఏఎంయూలో బీఎస్సీ మేథమేటిక్స్ అభ్యసిస్తున్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన బాసిం హిలాల్ ట్విటర్లో చేసిన పోస్ట్‌పై వర్సిటీ తీవ్రంగా స్పందించింది. ఏఎంయూ ఫిర్యాదు నేపథ్యంలో హిలాల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అభ్యంతరకర పోస్ట్ చేసిన విద్యార్ధిని సస్సెండ్ చేస్తున్నట్టు ఏఎంయూ వెల్లడించింది. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్. అంటూ హిలాల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ను హిలాల్ తర్వాత తొలగించినా అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
సాధారణ రసాయనాలతోనే భారీ విధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్ను ఉగ్రమూకలు వాడలేదని భావిస్తున్నారు. ఈ దాడిలో ఆర్డీఎక్స్‌కు బదులు ఎరువుల తయారీకి ఉపయోగించే సాధారణ రసాయనాలను ఉపయోగించి భారీ పేలుడుకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెబుతున్నారు. ఘటనా స్ధలం నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరిశీలించిన మీదట ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు వాడిన రసాయనాలపై వివరిస్తూ ఉగ్రవాదులు ఈ భీకర దాడిలో ఆర్డీఎక్స్ వాడలేదని చెప్పుకొచ్చారు. భారీ పేలుడు కోసం ఎరువుల తయారీకి ఉపయోగించే రసాయనాలతో పాటు ఇనుప ముక్కలు, ఇతర పదార్ధాలను కలిపి ధ్వంస రచన సాగించారని ప్రాధమిక ఆధారాలతో వెల్లడవుతోందని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్డీఎక్స్ వంటి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం వాడకుండా ఇంతటి భీకర దాడికి ఉగ్రమూకలు పాల్పడటం విస్తుగొలుపుతోంది. భద్రతా దళాల కన్నుగప్పి స్ధానిక మార్కెట్లో సులభంగా లభించే రసాయనాలతోనే భారీ పేలుడుకు అవసరమైన పరికరాన్ని ఉగ్రవాదులు రూపొందించారని నిపుణులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి తెగబడిన జైషే ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ అంచనాకు వచ్చారు.పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
విషాదం..కూతురుని చూడకుండానే..
జైపూర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. రాజస్తాన్‌లోని జైపూర్ సమీపంలోని అమర్‌సర్‌లోని గోవింద్‌పురా గ్రామానికి చెందిన రోహితేష్ లంబా(27) సీఆర్పీఎఫ్ జవాన్‌గా సేవలందిస్తున్నారు. రోహితేష్ లంబా 25 ఏళ్లకే సీఆర్పీఎఫ్లో ఉద్యోగం రాగా, మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో రోహితేష్ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరీత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతరును చూడలేకపోయారు. బిడ్డను చూసేందుకు సెలవుపెట్టి గోవింద్‌పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతరును చూడడానికి వస్తాడనుకున్న భర్త ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది. రోహితేష్ లంబా వీరమరణంతో గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
‘ఇది ముమ్మాటికీ పాకిస్తాన్ పనే’
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దాడికి పాల్పడిన ఉగ్రమూకలకు దీటుగా బదులివ్వాలనే డిమాండ్ పెల్లుబుకుతోంది. మరోవైపు ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని సుస్పష్టంగా వెల్లడవుతోందని 2016లో పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ర్టైక్స్‌ను పర్యవేక్షించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హుడా తేల్చిచెప్పారు. .పాకిస్తాన్ పుల్వామా దాడిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు మరింత నిలకడతో కూడిన దీర్ఘకాలిక విధానం అవసరమని హుడా అభిప్రాయపడ్డారు. కాగా పుల్వామా దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించమని, దీనిపై చర్యలు చేపట్టే స్వేచ్ఛ భారత సైన్యానికి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునే తేదీ, సమయాన్నివారే నిర్ధారించాలని ఆయన సూచించారు. -
అమర జవాన్లకు రాజ్‌నాథ్ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్‌లు శుక్రవారం బుద్గాంలో నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో నేలకొరిగిన అమర .జవాన్ల భౌతిక కాయాలను అమర్చిన పేటికలను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌లు తమ భుజాలకెత్తుకున్నారు. ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఉగ్ర దాడిలో జవాన్లను మట్టుబెట్టిన వారిపై తీవ్ర చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. పుల్వామాలో శుక్రవారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
దాడి గురించి 2 రోజుల ముందే హెచ్చరించారా..?
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ఈ దారుణం గురించి రెండు రోజుల ముందే హెచ్చరించిందా అంటే.. అవుననే అంటున్నారు అధికారులు. రెండు రోజుల క్రితం జైషే మహ్మద్ వర్గాలు అఫ్గానిస్తాన్‌లో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశాయి. అఫ్గానిస్తాన్‌లో దాడి జరిగిన తీరు.. గురువారం పుల్వామాలో జరిగిన దాడి రెండు ఒకేలా ఉన్నట్లు సమాచారం. అఫ్గానిస్తాన్‌లో కూడా పేలుడు పదార్థంతో ఉన్న వాహనాన్ని ఉపయోగించి ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. గురువారం పుల్వామాలో కూడా ఇదే తరహా దాడే జరిగింది. అయితే ఈ వీడియోను రెండు రోజుల క్రితమే గమనించిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు.. వీడియోతో పాటు అవసరమైన ఇన్‌పుట్స్‌ను కూడా ఇంటిలిజెన్స్ వర్గాలకు షేర్ చేసినట్లు సమాచారం. అయితే ఇంటిలిజెన్స్ అధికారులు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని... ఫలితంగా 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని అంటున్నారు విశ్లేషకులు. దాడి పట్ల ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లే సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండవచ్చని భావిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిసింది.(ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) -
పుల్వామా : భద్రతా బలగాలపై ఉగ్ర దాడి
-
జవాన్ల త్యాగం వృథా కాదు : మోదీ
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. జవాన్ల త్యాగం వృథా కాదని ట్విట్టర్లో పేర్కొన్నారు. అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని తెలిపారు. గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ఈ దుర్ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడి దాడితీవ్రతను తెలుసుకున్నారు. చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. భారత్‌కు మద్దతిస్తాం.. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ముష్కరదాడిని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ఖండించారు. అమరుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రవాదులతో పోరాటం సాగిస్తున్న భారత్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. -
జమ్ము కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రదాడి
-
జమ్ము కాశ్మీర్లో భారీ ఉగ్రదాడి
పుల్వామా : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 39 మంది జవాన్లు మృతిచెందారు. అవంతిపొరలోని గొరిపొరలో మెయిన్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముందుగా కాల్పులు జరిపి, అనంతరం వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు. బాంబు పేలుడు దాటికి వాహనం తునాతునకలై, 39 మంది మృతిచెందగా, మరో 40 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్‌లోకి కారును తీసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. కారు నడిపిన ఉగ్రవాదిని పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్‌లో చేరాడు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రకటించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, డీజీ సీఆర్పీఎఫ్ ఆర్ఆర్ భట్నాగర్‌తో రాజ్‌నాథ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉగ్రదాడిని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. అవంతిపురలో జవాన్ల మృతి వార్త నన్ను తీవ్ర కలవరానికి గురిచేసిందని, ఈ దారుణ ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని, సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
స్కూల్‌పై బాంబు దాడి.. విద్యార్థులకు తీవ్రగాయాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం మధ్యాహ్నాం ఓ ప్రైవేటు పాఠశాలలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. కాకపోరాలోని నర్బల్ ప్రాంతంలో ఫలాహ్-ఇ-మిలాత్ పాఠశాలలో మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఒక్కసారిగా బాంబు దాడి జరగడంతో పాఠశాలలో ఉన్న విద్యార్థులకు, టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు పాఠం బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు సంభవించందని, చాలా మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు మీడియాకు తెలిపారు. సమచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
నలుగురు జైషే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాక్ నుంచి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. హన్జన్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా, అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులందరూ జైషే మహ్మద్ సంస్థకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
జమ్మూలో హింస.. ఆరుగురు మృతి
శ్రీనగర్ : జమ్మూలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పూల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కశ్మీరీ పౌరులు మృతిచెందారు. మరికొంత మందికి తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా అమాయక పౌరులపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. దీంతో పూల్వామా లో ప్రాంతంలో పరిస్థితి హింసాత్మకంగా మారటంతో భారీగా బలగాలను మోహరించి, ఇంటర్నెట్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదుల హతం.. అంతకుముందు జమ్మూ కశ్మీర్ జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా బలగాలు వారి దాడులను తిప్పికొట్టాయి. జమ్మూ పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్) ఉమ్మడిగా జరిపిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది జహోర్ అహ్మద్ ఠాకూర్ గతంలో ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా సేవలందించాడు. ఈ ఏడాది జూలైలో ఏకే-47 ఆయుధంతో ఆర్మీ క్యాంపు నుంచి పరారైన అహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. -
బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని...
పుల్వామా : జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ నాయకుడిని ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా రాక్-ఇ-లిటర్ గ్రామానికి చెందిన షబ్బీర్ అహ్మద్ భట్ బీజేపీ అనుకూలంగా జిల్లాలో పనిచేస్తున్నారు. కాగా మంగళవారం అర్థరాత్రి షబ్బీర్‌ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున 2.30గంటల పాంత్రంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో షబ్బీర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. శరీరం నిండా బుల్లెట్లతో పడి ఉన్న మృతదేశాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
జమ్మూ కశ్మీర్లో ఉగ్ర పంజా..
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీస్ గార్డ్ పోస్ట్‌పై సాయుధ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు ఉగ్రవాదుల బృందం పోలీస్ పోస్ట్‌పై కాల్పులకు తెగబడటంతో ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలోనే మరణించారు. అనంతరం ఉగ్ర బృందం ఘటనాస్థలం నుంచి పరారయినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు అనంతనాగ్ జిల్లాలోని సదర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరినపిన గ్రనేడ్ దాడిలో పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఈ రెండు దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైన భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. -
పుల్వామా ఎన్కౌంటర్: జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. పుల్వామాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు నిన్న రాత్రి చినార్ బాగ్, మొహల్లా తకియా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు తలదాచుకున్న ఓ ఇంటిని చుట్టిముట్టాయి. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. తీవ్రవాదులను నిలువరించే క్రమంలో మన్దీప్ కుమార్ అనే జవాన్ ప్రాణాలను కోల్పోయారు. కాల్పుల్లో గాయపడ్డ పౌరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.భద్రతా దళాలు ధీటుగా ఎదురు కాల్పులు జరపడంతో.. రాళ్ల దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు చాకచక్యంగా అక్కడినుంచి పారిపోయినట్టు సమాచారం. -
పాక్ బద్ధ శత్రువు.. ఒప్పందాలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : యూరీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చి ఆరోపణలు గుప్పించింది. అదంతా ఓ పెద్ద డ్రామాగా అభివర్ణిస్తోంది. పుల్వామా ఎన్కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇప్పుడు జరిగిన పుల్వామా ఎన్కౌంటర్ అదంతా డ్రామాగా తేల్చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కట్టిడి చేసేందుకు ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ సత్ఫలితాలను ఇవ్వటం లేదు. పైగా పాకిస్థాన్ బద్ధ శత్రువంటూ ఓ వైపు ప్రకటనలు ఇస్తూ.. మరోవైపు వారితో చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు? బీజేపీ హయాంలో దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు’’ అంటూ దీక్షిత్ పేర్కొన్నారు. కాగా, అవంతిపూర్ సెంటర్ ట్రైనింగ్ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారేమోనన్న అనుమానంతో తనిఖీలు చేపట్టినట్లు సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. -
సీఆర్పీఎఫ్ సెంటర్‌పై మెరుపుదాడి.. నలుగురు జవాన్ల మృతి
-
పుల్వామా ఉగ్రదాడి.. నేలరాలిన జవాన్లు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు నేలరాలారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పుల్వామా జిల్లా కేంద్రంలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. గ్రెనేడ్లు, తుపాకి కాల్పులతో బీభత్సం సృష్టించారు. గంటలపాటు కొనసాగిన కౌంటర్ ఆపరేషన్‌లో చివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సుదీర్ఘ ఆపరేషన్ : తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. క్యాంప్‌లోని ఓ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదులు దొంగచాటుగా కాల్పులు జరిపారు. గంటలపాటు సాగిన ఆపరేషన్‌లో చివరికి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
సీఆర్పీఎఫ్ కేంద్రంపై ఉగ్రదాడి.. పుల్వామాలో హైటెన్షన్
శ్రీనగర్ : కల్లోల కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై మెరుపుదాడికి తెగబడ్డారు. క్షణాల్లో తేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రమూకలకు ధీటుగా జవాబిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి ఎడతెగని కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రెనేడ్లు విసిరి బీభత్సం.. : తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. క్యాంప్‌లోని ఓ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులు ఉండి ఉండొచ్చని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. టార్గెట్ పుల్వామా : సరిహద్దుకు సమీపంలోని పుల్వామా జిల్లాపై తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత ఆగస్టులో పుల్వామా పోలీస్ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది సిబ్బంది చనిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 12 గంటల ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ తర్వాత రెండు నెలలకే శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని బీఎస్ఎఫ్ క్యాంపు సమీపంలో పేలుడు, కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజా దాడికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి.. సీసీఫుటేజ్ వీడియో
శ్రీనగర్ : ముగ్గురు ఉగ్రవాదులు కశ్మీర్‌లోని ఓ బ్యాంకులో చొరబడి అందిన కాడికి డబ్బు దొచుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పుల్వామా జిల్లాలోని నూర్పొరాలోని జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్‌లో సోమవారం ముగ్గురు తీవ్రవాదులు మొహాలకు మాస్కులు ధరించి చొరబడ్డారు. బ్యాంకు సిబ్బందిని, బ్యాంకు కస్టమర్లను బెదిరించి లక్ష రూపాయలు దోచుకున్నారు. పరారయ్యే సమయంలో కొన్ని రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే దుండగులు పరారయ్యారు. భద్రతాబలగాలు, పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడి వెనక ఉగ్రవాది జకీర్ మూసా హస్తం ఉన్నట్టు సమాచారం. జకీర్ మూసా, మరో ఇద్దరు ఉగ్రవాదుల సహాయంతో ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. (జకీర్ మూసా ఫైల్ ఫోటో) -
బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి..
-
సంబూర ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్ : సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పుల్వామా జిల్లాలోని సంబూర గ్రామంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఘటనలో ఓ ఉగ్రవాది కూడా హతం అయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న భద్రతా దళాలు వారి కోసం గాలించాయి. వారిని గమనించిన ముష్కరలు కాల్పులు మొదలుపెట్టాయి. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురు దాడి ప్రారంభించిన సైనికులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపాయి. చికిత్స పొందుతూ జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదిని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన బాబర్‌గా గుర్తించారు. చీకట్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు పరారైనట్లు భావించిన పోలీసులు.. వారి కోసం తనీఖీలు చేపట్టారు. చివరకు వారు దొరక్కపోవటంతో నేటి ఉదయం ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. -
టాప్ ఎల్ఈటీ కమాండర్ ఖతం!
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాదళాలకు మరో విజయం. పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ వసీం షాను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో వసీం షా సహా అతని అనుచరుడైన మరో ఉగ్రవాది నజీర్ అహ్మద్ మృతి చెందారు. వసీం షా లష్కరే తోయిబా షోపియన్ జిల్లా కమాండర్‌గా కొనసాగుతున్నాడు. అతన్ని మట్టుబెట్టిన భద్రతా దళాలను జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ప్రశంసించారు. 'క్లీన్ ఆపరేషన్‌లో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. వెల్డన్ జేకేపీ (జమ్మూకశ్మీర్ పోలీస్) బాయ్స్, సెక్యూరిటీ ఫోర్సెస్' అని వైద్ ట్వీట్ చేశారు. దక్షిణ పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు, పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. శనివారం ఉదయమే ఈ గ్రామాన్ని చుట్టుముట్టి.. ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. -
హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన్ కీలక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ కార్డన్ సెర్చ్‌లో భాగంగానే ఫస్తూరా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన గుల్జార్ దార్ అనే ఉగ్రవాదిని.. అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
కశ్మీర్లో ముష్కరుల మారణకాండ
-
కశ్మీర్లో ముష్కరుల మారణకాండ
- పుల్వామా పోలీసు కాంప్లెక్స్‌పై దాడి.. 8 మంది భద్రతా సిబ్బంది మృతి - ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లా పోలీసు కాంప్లెక్స్‌పై దాడికి పాల్పడడంతో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా 8 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌కు 25 కి.మీ. దూరంలోని పుల్వామా జిల్లాలోని పోలీసు కాంప్లెక్స్‌లోకి విదేశీయులుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు చొరబడ్డారు. వెంటనే పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది అప్రమత్తమై ఉగ్రవాదుల్ని చుట్టుముట్టారు. అదే సమయంలో ఆ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న పోలీసు సిబ్బంది కుటుంబసభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మధ్యాహ్నానికి భద్రతా సిబ్బంది ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. సాయంత్రం 5 గంటల సమయంలో మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమైందని అధికారులు తెలిపారు. ఎదురు కాల్పులు ముగిశాయని, మూడో మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని వారు వెల్లడించారు. మృతుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదులు.. పోలీసు కాంప్లెక్స్‌లోని మూడు బ్లాకుల్లోకి ప్రవేశించి భద్రతా బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదుల్లో ఒకరు భవనం నుంచి బయటకు వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని, అతన్ని అక్కడే మట్టుబెట్టామని పోలీసు అధికారులు చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినవారిలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది, జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్, ముగ్గురు ప్రత్యేక పోలీసు సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఇది ఆత్మాహుతి దాడేనని శ్రీనగర్ 15వ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సంధు చెప్పారు. భారీ ప్రాణనష్టం చోటుచేసుకుందని, భద్రతా బలగాలకు ఇది దుర్దినమని డీజీపీ ఎస్పీ వైద్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే మన భద్రతా బలగాలు ఎంతో ధైర్యంగా పోరాడాయని, రాష్ట్రం నుంచి ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు మరింత దృఢనిశ్చయంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ముగ్గురు పాక్ రేంజర్లు మృతి జమ్మూలోని భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని దీటుగా తిప్పికొట్టామని, భారత బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు పాక్ రేంజర్లు మరణించారని బీఎస్ఎఫ్ తెలిపింది. జమ్మూలోని పర్గ్వాల్ ప్రాంతంలో శనివారం మధ్యా హ్నం నుంచి పాక్ కాల్పుల్ని కొనసాగించిందని, అదే స్థాయిలో గట్టిగా బదులిచ్చామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. కాగా శనివారం పాక్ బలగాలు ఆర్ఎస్ పురా సెక్టార్ సరిహద్దు వెంట కాల్పులకు పాల్పడడంతో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కె.కె.అప్పారావు గాయపడ్డారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని బీఎస్ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. -
కశ్మీర్లో ఉగ్రదాడి
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో పోలీసు లైన్ల వద్ద కాపలాగా ఉన్న భద్రతా సిబ్బందిపై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, మరో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఆసుపత్రిలో ఓ జవాన్ అమరుడయ్యారు. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో భద్రతాసిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎల్ఈటీ టాప్ కమాండర్ ఖతం!
-
ఎల్ఈటీ టాప్ కమాండర్ ఖతం!
శ్రీనగర్: కశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అబు దుజనా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు తెలుస్తోంది. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో అబు (27)తోపాటు మరో మిలిటెంట్ చనిపోయాడని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. పుల్వామాలోని హక్రిపోరా గ్రామంలో మిలిటెంట్లుకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా తాము స్వాధీనం చేసుకోలేదని, కాబట్టి ఎవరు చనిపోయింది ఇప్పుడే చెప్పలేమని కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ విలేకరులకు తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి చెందిన అబు దుజనా దక్షిణ కశ్మీర్లో జరిగిన చాలా మిలిటెంట్ దాడుల వెనక ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. -
ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
జమ్మూకశ్మీర్: పుల్వామా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉగ్రవాదుల నక్కి ఉన్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టిన బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. దీంతో ఆత్మరక్షణలో పడిన బలగాలు ఉగ్రవాదులను హతమార్చాయి. కాగా, భద్రతా బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. -
భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్ : భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు బెట్టాయి. బామ్నూ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారే విషయం తెలుసుకున్న సైన్యం వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని కాక్పోరాలో జరిగిన హోరాహోరి కాల్పుల్లో భద్రతాబలగాలు ముగ్గురు తీవ్రవాదులను హతమార్చాయి. వారినుంచి మూడు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
రెండు గంటల్లో.. రెండు బ్యాంకుల్లో దోపిడీ
-
రెండు గంటల్లో.. రెండు బ్యాంకుల్లో దోపిడీ
శ్రీనగర్ : కశ్మీర్ బ్యాంకుల్లో మిలిటెంట్ల దోపిడీ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 1.50 కి వాహిబుగ్‌లో ఉన్న ఇలాకి దెహతి బ్యాంకులోకి నలుగురు సాయుధ మిలిటెంట్లు ప్రవేశించి సిబ్బందిపై తుపాకి గురిపెట్టి రూ.3-4 లక్షల నగదుతో పరారయ్యారు. బ్యాంకు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దొంగలను పట్టుకోవడానికి వేట ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30కి అదే జిల్లాలో జమ్మూ కశ్మీర్ బ్యాంకు నెహమా శాఖలో కూడా మిలిటెంట్లు దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఇక్కడి నుంచి ఎంత మొత్తం తీసుకెళ్లారన్నది తెలియరాలేదు. గత మూడు రోజులు నుంచి దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు. -
రెండుగంటల్లోనే రెండు బ్యాంకులు లూటీ!
న్యూఢిల్లీ: తీవ్ర కల్లోలంగా ఉన్న కశ్మీర్లో రెండు గంటల వ్యవధిలోనే రెండు బ్యాంకులు లూటీకి గురయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఉగ్రవాదులు మొత్తంగా మూడు బ్యాంకులను కొల్లగొట్టడం గమనార్హం. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపూరలోని ఓ బ్యాంకును గుర్తు తెలియని సాయుధులు దోచుకున్నారు. జమ్మూకశ్మీర్ నిహామా శాఖలో ఈ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు భయభ్రాంతులకు బ్యాంకులోని వారిని గురిచేస్తూ డబ్బును ఎత్తుకెళ్లారని, వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరారైన దొంగలను అరెస్టుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. అంతకుముందు రెండు గంటల కిందటే పుల్వామా జిల్లాలోని వాహిబాగ్ గ్రామంలో ఉన్న ఎల్లాక్వై దేహాతి బ్యాంకులోనూ దోపిడి జరిగింది. మంగళవారం యారిపూర బ్యాంకులోనూ సాయుధులు బీభత్సం సృష్టించి దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. -
ఉగ్రదాడిలో పీడీపీ నేత అబ్దుల్ ఘని మృతి
శ్రీనగర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ పీడీపీ నేత అబ్దుల్ ఘని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పుల్వామలో సోమవారం ఉదయం అబ్దుల్ ఘని వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ని బతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అబ్దుల్ ఘనీ చికిత్స పొందుతూ మరణించారు. రెండు వారాల వ్యవథిలో అబ్దుల్ ఘనిపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది మూడోసారి. -
జమ్ముకశ్మీర్‌లో భారీ బ్యాంకు దోపిడి
పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకి చేరుతున్న భారీ డిపాజిట్లతో పాటు కొత్త కరెన్సీ నోట్లపై దుండగులు కన్నేశారు. దొరికిందే అవకాశంగా బ్యాంకులను లూటీ చేస్తూ సొమ్మును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం దక్షిణ కశ్మీర్ పుల్వామాలోని అరిహల్ ప్రాంతంలోని ప్రభుత్వరంగ బ్యాంకు జమ్ముకశ్మీర్ బ్యాంకు శాఖలో గుర్తుతెలియని దుండగులు గన్లతో దాడిచేసి, రూ.8 లక్షలకు పైగా నగదును అపహరించుకుపోయారు. నగదును పట్టుకుని వెళ్లేముందు కూడా బ్యాంకులోని వారిని బెదిరించడానికి పలుమార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే వీరు దోచుకెళ్లిన నగదు కొత్త నోట్లా, పాత నోట్లా అనేది ఇంకా తెలియరాలేదు. ఏ కరెన్సీ వారు దోచుకెళ్లారో ప్రస్తుతం బ్యాంకు అధికారులు నిర్థారిస్తున్నారు. మరోవైపు దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అరిహల్ శాఖలో దొంగతనం జరిగిన రోజే ఇదే బ్యాంకుకు చెందిన పోష్కర్ ప్రాంతంలోని శాఖలోనూ చోరి జరిగింది. అయితే పాతనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం జమ్ముకశ్మీర్ బ్యాంకుల్లో ఇలాంటి దోపిడి జరగడం ఇది రెండోసారి. గత నెల కూడా గుర్తుతెలియని దుండగులు కిషత్వార్ జిల్లాలోని జమ్ముకశ్మీర్ బ్యాంకులో రూ.35 లక్షల నగదును అపహరించుకుపోయారు. పెద్ద నోట్లను రద్దుచేయడంతో నల్లధనాన్ని నిర్మూలించడంతో పాటు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడిచేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బ్యాంకులకు వస్తున్న భారీ కొత్త, పాత కరెన్సీ నోట్లపై దొంగలు కన్నేసి, వాటిని అపహరించుకుపోతున్నారు. -
భవనంలో నక్కిన ఉగ్రవాదులు
-
భవనంలో నక్కిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. సోమవారం పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. జమ్మూకశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు.. కాంప్లెక్స్‌కు గల అన్నిదారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు భవనంలో దాక్కొని ఉండొచ్చిని అనుమానిస్తున్నారు. భవనంలో కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసు అధికారి వెల్లడించారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. -
ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఓవైపు ఆందోళనలు, మరో ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ అట్టుడుకుతూనే ఉంది. తాజాగా ఆదివారం కూడా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పూంచ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్కౌంటర్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఎల్వోసీకి సమీపంలో హంద్వారాలోని నౌగామ్ సెక్టర్లో విదేశీ ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు సరిహద్దుల మీదుగా చొరబడేందుకు ప్రయత్నించడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారా కనుగొనేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు కశ్మీర్ లోయలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారు. -
ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం!
-
ఉగ్రవాద దాడిలో పోలీసు మృతి
శ్రీనగర్: జమ్ములో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పోలీసును లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ ఉదంతంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన శనివారం పుల్వామా సమీపంలోని కొయిల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఖుర్షీద్ అహ్మద్ గనాయి కానిస్టేబుల్ గా పుల్వామా పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకొని శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం బజారుకు వెళ్లగా ఆయనను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఖుర్షీద్ అక్కడికక్కడే మృతి చెందాడని పుల్వామా పోలీసులు తెలిపారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే పోలీసులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగుతున్నారని అధికారులు తెలిపారు. గత వారం పోలీసు కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రానైడ్ దాడి చేయగా ఇద్దరు ఉన్నతాధికారులతో సహా, ఐదుగురు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
గ్రనేడ్ దాడిలో పోలీసులకు గాయాలు
పుల్వామా: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో బుధవారం జరిగిన గ్రనేడ్ దాడిలో 18మంది పోలీసులు గాయపడ్డారు. స్థానిక కళాశాల వద్ద పోలీసులు భద్రత నిర్వహిస్తుండగా ముష్కరులు గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. డిప్యూటీ ఎస్పీ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండురోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో భద్రత అధికారి మృతి చెందారు. -
కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పొహు గ్రామానికి చెందిన అమిర్ బషిర్ అనే యువకుడు గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో కశ్మీర్ ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 66 కు చేరుకుంది. ఈ ఘటనలో పుల్వామా జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన హింస ఇప్పటికీ కొనసాగుతోంది. కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ అక్కడకు చేరుకున్న విషయం తెలిసిందే. -
జమ్మూలో టెర్రరిస్టుల ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 3 ఆర్మీ, సీఆర్పీఎఫ్ క్యాంపులపై వేర్వేరుగా దాడులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. దాడులు జరిగిన పుల్వామా ప్రాంతం రాజధాని శ్రీనగర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రెనెడ్లుతో దాడులకు పాల్పడటంతో పాటు కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కరీమాబాద్ జిల్లాలోనూ టెర్రరిస్టులు కాల్పులు జరిపారని సమాచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మరో సారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారుల తెలిపిన సమాచారం ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని పల్వామా జిల్లా నెవా ఏరియాలోని ఒక ఇంటిలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆర్మీ సిబ్బంధి వారిని లొంగిపొమ్మని ఆదేశించారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో కాల్పులకు దిగినట్టు ఇందులో ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్టు తెలిపారు. -
జమ్మూకశ్మీర్‌లో కాల్పుల కలకలం
పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కాల్పుల్లో ఓ వర్తకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పుల్వామాలో కాల్పులు.. ఇద్దరు పౌరులు మృతి
పుల్వామా: జమ్ము కశ్మీర్లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. పుల్వామా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో భాగంగా కాకపోరా ఏరియాలో సైన్యం, పోలీసులు ఉమ్మడిగా సోదాలు జరుపుతుండగా అనుమానిత ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా వారిలో ఒకరు చనిపోయారు. అయితే, ఈ ఘటన స్థానికులకు బలగాలకు మధ్య ఘర్షణకు దారి తీసింది. ఎక్కువ సంఖ్యలో గుమ్మిగూడి పోలీసులు, సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. -
కశ్మీర్ లో మళ్లీ చెలరేగిన తీవ్రవాదులు
పుల్వామా: జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ చెలరేగారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సీఐఎస్ఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ తో దాడికి పాల్పడ్డారు. నూర్పోరా త్రాల్ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు. ఈ ఘటనలో జవాన్ గాయపడ్డాడు. అతడిని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ లో పర్యటించనున్న నేపథ్యంలో తీవ్రవాదులు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈనెల 9న జమ్మూకాశ్మీర్ లో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
భద్రత దళాల కాల్పులలో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్‌లోని పూల్వామా రీజియన్ లో శనివారం తెల్లవారుజాము నుంచి అటు భద్రత దళాలకు, ఇటు ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరగుతున్నాయి. ఈ సందర్బంగా భద్రత దళాలు జరిపిన కాల్పులలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది మరణించాడు. ఆ కాల్పులలో మరికొంత మంది తీవ్రవాదులు తీవ్రంగా గాయపడి ఉంటారని భద్రత సిబ్బంది వెల్లడించారు. అయితే భద్రత సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య పోరు ఇంకా కొనసాగుతునే ఉంది. పూల్వామా రీజియన్ లోని మారుమూల ప్రాంతంలో తీవ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందటంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ విషయాన్ని గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపైకి తుపాకి గుళ్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో ఉగ్రవాది మరణించారు.