
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు రైఫిల్ పేలి మృతి చెందాడు. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం చోటు చేసుకుంది. ఒక పోలీస్ విధులు నిర్వర్తించే నిమిత్తం రైఫిల్ తీయగా అనుహ్యంగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
బాధితుడుని మొహ్మద్ ఆసిఫ్ ఫడ్రూగా గుర్తించి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఐతే సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. దీంతో పోలీసులు సదరు పోలీసుపై కేసు నమోదు చేసి అరెస్తు చేశారు. అంతేగాక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: వీడియో: యాక్సిడెంట్ స్పాట్‌లో సాయం కోసం దిగారు.. అంతలోనే ఘోరం)
Comments
Please login to add a commentAdd a comment