Rifle
-
ఓటీటీకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఇటీవల మలయాళ చిత్రాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇతర దక్షిణాది భాషల్లోనూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. గతేడాదిలోనూ మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి చిత్రాలు టాలీవుడ్ ఫ్యాన్స్‌ను మెప్పించిన సంగతి తెలిసిందే.అలా కొత్త ఏడాదిలోనూ మలయాళ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ రైఫిల్ క్లబ్ ఓటీటీకి వచ్చేసింది. ఆశిక్ అబు దర్శకత్వం వహించిన గతేడాది డిసెంబర్లో మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇంకేందుకు ఆలస్యం యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఎంచక్కా చూసేయండి. ఈ చిత్రంలో విజయ రాఘవన్, దిలీశ్ పోతన్, వాణీ విశ్వనాథ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబరు 19న కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్ ఉన్ని ముకుందన్ మార్కో, మోహన్ లాల్ నటించిన బరోజ్ 3డీ లాంటి చిత్రాలతో పోటీపడి సూపర్ హిట్‌గా నిలిచింది.Ee clubil, thokkine kaalum unnam nokkinuWatch Rifle Club, now on Netflix!#RifleClubOnNetflix pic.twitter.com/66ADkpdtMa— Netflix India South (@Netflix_INSouth) January 16, 2025 -
డీఆర్డీవో తయారీ అస్సాల్ట్ రైఫిల్ ‘ఉగ్రమ్’
పుణే: కేంద్ర ప్రభుత్వ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సొంతంగా అభివృద్ధి చేసిన అస్సాల్ట్ రైఫిల్ ఉగ్రమ్ను సోమవారం పరీక్షించింది. డీఆర్డీవోకు చెందిన పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్(ఏఆర్డీఈ)విభాగం భారత సైన్యం అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 4 కిలోల కంటే తక్కువ బరువుండే ప్రొటోటైప్ అస్సాల్ట్ రైఫిల్‌ను సోమవారం పరీక్షించారు. ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి గత మూడేళ్లుగా అస్సాల్ట్ రైఫిల్‌ను డిజైన్ చేసినట్లు ఏఆర్డీఈ డైరెక్టర్ ఎ.రాజు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రయోగాలు జరిపేందుకు ముందుగా స్వతంత్ర నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ట్రయల్స్ ఉంటాయని చెప్పారు. -
ప్రమాదవశాత్తు రైఫిల్ కాల్పుల్లో వ్యక్తి మృతి
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు రైఫిల్ పేలి మృతి చెందాడు. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం చోటు చేసుకుంది. ఒక పోలీస్ విధులు నిర్వర్తించే నిమిత్తం రైఫిల్ తీయగా అనుహ్యంగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడుని మొహ్మద్ ఆసిఫ్ ఫడ్రూగా గుర్తించి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఐతే సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. దీంతో పోలీసులు సదరు పోలీసుపై కేసు నమోదు చేసి అరెస్తు చేశారు. అంతేగాక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: వీడియో: యాక్సిడెంట్ స్పాట్లో సాయం కోసం దిగారు.. అంతలోనే ఘోరం) -
బుల్లెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది. చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్‌గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
బ్యాంకు వద్ద తుపాకితో సన్యాసి హల్చల్... షాక్‌లో ఉద్యోగులు
చెన్నై: ఒక బ్యాంకు వద్ద సన్యాసి తుపాకితో హల్ చల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లో చోటు చేసుకుంది. ఒక సన్యాసి రైఫిల్ చేతపట్టుకుని బ్యాంకు ఉద్యోగులపై బెదరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తిరుమలై స్వామి అనే సన్యాసి తిరువారూర్ జిల్లాలోని మూలంగుడి గ్రామ నివాసి. ఆ సన్యాసి తన కుమార్తె చదువు కోసం లోన్ కావాలంటూ ఒక ప్రైవేట్ బ్యాంకు వద్దకు వచ్చాడు. తన కూతురు చైనాలో మెడిసిన్ చదివేందుకు లోన్ కావాలని అడిగాడు. అందుకు హామీ పత్రాలు సమర్పించాల్పి ఉంటుందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐతే సన్యాసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు నిరాకరించాడు. తానే వడ్డితో సహా కట్టేస్తాను కాబట్టి హామీ పత్రాలు ఎందుకంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అధికారులు వివరంగా చెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నాడు. చేసేదేమి లేక బ్యాంకు అధికారుల లోన్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో సన్యాసి ఇంటికి వెళ్లి తుపాకిని తీసుకుని లోన్ ఇస్తారా? లేదా? అని ఉద్యోగులను బెదిరించడం ప్రారంభించాడు. సామాజిక మాధ్యమాల్లో సైతం సదరు సన్యాసి లోన్ ఇవ్వనందుకు బ్యాంకును లూటీ చేస్తానంటూ లైవ్ వీడియోని పోస్ట్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు సన్యాసిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం) -
Assam Floods 2022: స్త్రీ శక్తి: సలాం... రైఫిల్ ఉమెన్
అస్సాంలోని కొన్ని జిల్లాలు వరదల బారిన పడి చిగురుటాకులా వణికిపోయాయి. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా’ అన్నట్లుగా ఉంది మృత్యువు రాకడ. అలాంటి సమయంలో ‘రైఫిల్ ఉమెన్’ రంగంలోకి దిగింది. ఎంతోమందిని రక్షించింది... చిరునవ్వుతో పలకరించిన నేస్తంలా మురిపించిన చినుకులు, సమయం గడిచేకొద్దీ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కుండపోత వర్షం. కపిలి, బేకి, బరక్, ఖుషి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. అస్సాంలో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచర్ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలమైంది. ఆ కల్లోలంలో ‘బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు’ అనే బతుకు ఆశ తప్ప‘మన గురించి కాదు ఇతరుల గురించి ఆలోచించాలి’ అనే ఆలోచన రాని సమయం అది. అలాంటి కఠిన సమయంలో ‘మేము ఉన్నాం’ అంటూ ముందుకు వచ్చారు వారు. వాగు దాటి అవతలి ప్రాంతానికి వెళదామని ప్రయత్నించి ఒకాయన వరదల్లో పడి కొట్టుకుపోతున్నాడు. ఎక్కడో ఒకచోట విరిగిపడిన కొమ్మలు, చెట్ల మధ్య ఇరుక్కుపోయాడు. వరద ఎక్కువైతే, ఆలస్యం అయితే అతని చిరునామా కూడా తెలిసేది కాదు. విషయం తెలిసిన మహిళల బృందం రంగంలోకి దిగింది. అతడిని రక్షించింది. ఒక వృద్ధురాలిని వరద చుట్టుముట్టింది. దాని నుంచి బయటపడే శక్తి ఆమెకు లేదు. ఆ వృద్ధురాలిని పట్టించుకోకుండా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈలోపు అక్కడికి పరుగెత్తుకు వచ్చిన ఒక యువతి ఆ వృద్ధురాలిని రెండు చేతులతో ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. కొన్ని ఇండ్లను పూర్తిగా వరద నీళ్లు చుట్టుముట్టాయి. బయటికి రాలేని పరిస్థితి. అలా అని ఇంట్లో ఉండలేని పరిస్థితి. అవి పాత ఇండ్లు. వర్షంతో గోడలు నానిపోయి ఉన్నాయి. ఏ నిమిషంలో ఇండ్లు కూలిపోతాయో తెలియదు. అలాంటి ఇండ్లలో నుంచి వృద్ధులు మొదలు పసిపిల్లల వరకు బయటికి తీసుకువచ్చి వారి ప్రాణాలు రక్షించారు వారు. ‘రెండు చేతులెత్తి మొక్కడం తప్ప వారి రుణం ఎలా తీర్చుకోగలం’ అని కళ్లనీళ్లపర్యంతం అయింది ఒక గృహిణి. ఇంతకీ వారు ఎవరు? ‘రైఫిల్ ఉమెన్’ బృందాలు. ‘రైఫిల్ ఉమెన్’ బృందాలకు అస్సాంలో మంచిపేరు ఉంది. అస్సాం రైఫిల్స్‌లో భాగమైన రైఫిల్ ఉమెన్ బృందాలు ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు, సహాయ కార్యక్రమాలు చేయడంలో పేరు తెచ్చుకున్నాయి. ‘ఆ వృద్ధురాలిని రక్షించిన తరువాత ఆమె కళ్లలో కనిపించిన కృతజ్ఞతాభావాన్ని ఎప్పుడూ మరచిపోలేను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించింది. రైఫిల్ ఉమెన్ బృందంలో పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను’ అంటుంది 22 సంవత్సరాల మంతిదాస్. అస్సాంలోని దుర్బీ ప్రాంతానికి చెందిన మంతిదాస్ సైన్యంలో చేరడం వారి ఇంట్లో వాళ్లకు బొత్తిగా ఇష్టం లేదు. ‘శిక్షణ సమయంలో చాలా కష్టంగా అనిపించింది. రోజూ ఉదయం 22 కేజీల బరువు పట్టుకుని 25 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి వచ్చేది. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉండేవి. ఒకానొక సమయంలో అయితే ఇక నావల్ల కాదేమో అనుకున్నాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే ఆ శిక్షణలోని గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. ఆ శిక్షణ వల్లే సహాయకార్యక్రమాల్లో చురుగ్గా, ధైర్యంగా పాల్గోగలిగాను’ అంటుంది మంతిదాస్. ‘తమ పిల్లలను సైన్యంలోకి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతుంటారు. మా తల్లిదండ్రులు మాత్రం నన్ను బాగా ప్రోత్సహించారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సహాయకార్యక్రమాల్లో మేము పాల్గొన్న ఫోటోలను పేపర్లో చూసి మా తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారు’ అంటుంది యతిర్. మంతిదాస్, యతిర్‌లు మాత్రమే కాదు ‘రైఫిల్ వుమెన్’ బృందాలలోని ఎంతోమంది మహిళా సైనికులు అసాధారణమైన సాహసాలు ప్రదర్శించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. జనం చేత నీరాజనాలు అందుకున్నారు. -
3కి.మీ దూరంలోని శత్రువు చంపేసే తుపాకీ
న్యూఢిల్లీ : మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషిని లేదా జంతువును గురిపెట్టి సునాయాసంగా చంపేసే అత్యంత ప్రమాదరకమైన స్నైపర్ తుపాకీని రష్యాకు చెందిన లొబోవ్ ఆర్మ్స్ కనిపెట్టింది. ఎస్‌వీఎల్‌కే–14ఎస్‌గా వ్యవహరించే పది కిలోల బరువుగల ఇది తుపాకుల విభాగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. ఈ తుపాకీలో నుంచి బుల్లెట్ సెకండ్‌కు 900 మీటర్ల దూరం చొప్పున అంటే, ధ్వని వేగంకన్నా మూడు రెట్లు ఎక్కువ. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 29 లక్షల రూపాయలు. (‘విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలి’ ) ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడు సెంటీమీటర్ల మందం గల ఇనుప దిమ్మ నుంచి దూసుకుపోతుందని, ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించిన వ్యక్తి కూడా ఈ బుల్లెట్ తగిలితే మరణించాల్సిందేనని ఈ తుపాకీని తయారు చేసిన కంపెనీ చీఫ్ ఇంజనీరు యూరి సించ్కిన్ తెలిపారు. ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని, గురి తప్పకుండా ఉండాలంటే మూడు కిలోమీటర్లకు మించి లక్ష్యం ఉండరాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్రిటీష్ సైన్యం ఉపయోగిస్తున్న ‘ఎల్115ఏ3’ తుపాకీ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇదే ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపాకీగా చెలామణి అవుతోంది. (ధోనికి ఎలా చోటిస్తారు..? ) -
తుపాకితో కల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
-
మెడల్‌పై గురి
పది మీటర్ల దూరంలో టార్గెట్ ఫిక్స్ చేసుకుని రైఫిల్ పట్టుకున్నారు బాలీవుడ్ హీరో హర్షవర్థన్ కపూర్. ఆయన ఏమైనా పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారా? ఇంతకీ ఏ విలన్‌పై గురిపెట్టారు? అనే సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇది యాక్షన్ మూవీ కాదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన అభినవ్ బింద్రా బయోపిక్ కోసం హర్షవర్థన్ రైఫిల్ పట్టుకున్నారు. ఇప్పుడు అర్థం అయ్యింది కదా. అయిన గురిపెట్టింది సిల్వర్‌స్క్రీన్‌పై గోల్డ్ మెడల్ కొట్టడానికి అని. కన్నన్ అయ్యర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బీ టౌన్ టాక్. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ చేయనున్నట్లు హర్షవర్థన్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా కోసం వచ్చే నెల 15 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా. రానున్న ఐదు నెలల్లో ప్రతి రోజూ నేను రైఫిల్ పట్టుకోవాల్సిందే. అలాగే ఈ సినిమాలో నాకు ఫాదర్‌గా మా నాన్న అనిల్‌కపూర్ నటించనున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అభినవ్ బింద్రా జీవితానికి సంబంధించిన 15–35 ఏజ్ మధ్యలోనే ఈ సినిమా ఉంటుంది. సో.. నేను బరువు పెరగాల్సిన అవసరం లేదు’’ అన్నారు హర్షవర్థన్ కపూర్. -
ఏకే -47
-
6న అర్చరీ, రైఫిల్ షూటింగ్ బాలబాలికల జట్ల ఎంపిక
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈనెల 6వ తేదీన కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో అర్చరీ, రైఫిల్ షూటింగ్ అండర్–19 విభాగంలో బాల బాలికల ఎంపికకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి చలపతిరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గలవారు వయో పరిమితి ధ్రువీకరణ పత్రాలతో నేరుగా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 14, 15, 16 తేదీల్లో కడప, చిత్తూరులలో అండర్–19 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 93938554601, 9491526617 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
మణికొండలో బుల్లెట్ కలకలం
ఓ వ్యక్తి చేతికి తీవ్ర గాయం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్: కాల్పుల చప్పుడు లేదు... రైఫిల్ ఎవరిదో తెలియదు... కానీ, ఓ వ్యక్తి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. శనివారం హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన సీహెచ్ శ్రీనివాసాచారి(41) కార్పెంటర్‌గా పనిచేస్తూ మణికొండలో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం నీళ్ల క్యాన్‌ను బైక్‌పై తీసుకెళ్తుండగా స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలో అతడి చేతిపై ఉన్నట్టుండి పెద్ద గాయమైంది. పాము కరిచిందని భావించి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాడు. పాము కాటుతో గాయం కాలేదని డాక్టర్ నిర్ధారించడంతో శ్రీనివాసాచారి తిరిగి తనకు గాయమైన చోటుకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ బుల్లెట్ లభించడంతో రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించాడు. ఇంతకీ ఆ బుల్లెట్ ఎక్కడిది..? శ్రీనివాసచారి చేతికి తగిలిన బుల్లెట్ ఇన్సాస్ రైఫిల్‌కు చెందినదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రైఫిల్ ఎక్కువగా మిలటరీ జవాన్లు వాడుతుంటారు. సంఘటన స్థలానికి మిలటరీ ఫైరింగ్ రేంజ్‌కి మధ్య దూరం రెండున్నర కిలోమీటర్లు. అయితే ఇన్సాస్ రైఫిల్ నుంచి వచ్చే బుల్లెట్ సామర్థ్యం 400 మీటర్లే. అయితే ఇది మిలటరీ రేంజ్ నుంచి రాకపోవచ్చని అనుమనాలు కలుగుతున్నాయి. మరోపక్క రైఫిల్ యాంగిల్ (ఎత్తుకు) మార్చి కొడితే రెండు కిలోమీటర్ల దూరం బుల్లెట్ దూసుకెళ్తుందని మరికొందరు అధికారులు అంటున్నారు. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనికోసం బుల్లెట్‌ను ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపించినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసాచారి చేతికి డాక్టర్లు ఆపరేషన్ చేసి, బుల్లెట్ ముక్కను వెలికితీశారు. -
అమెరికాలో కాల్పులు
హూస్టన్: అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. హూస్టన్‌లోని హారిస్ కౌంటీలో గల ఓ ఇంటికి గురువారం ఫెడ్ఎక్స్ కొరియర్ కంపెనీ దుస్తులు వేసుకుని వచ్చిన ఓ దుండగుడు ఆ ఇంట్లోని నలుగురు పిల్లలను, వారి తల్లిదండ్రులను కాల్చిచంపాడు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని రాన్ లీ హస్కెల్(33)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడి భార్యకు, మృతులకు బంధుత్వం ఉందని, విడాకులకు సంబంధించిన వివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు బాలురు(4, 14 ఏళ్లు), ఇద్దరు బాలికలు(7, 9 ఏళ్లు) ఉన్నారు. -
మూడేళ్ల పాప కాల్పుల్లో రెండేళ్ల తమ్ముడి మృతి
లాస్ ఏంజెలిస్: అమెరికాలో లోకం తెలియని పిల్లలు తుపాకులు పేల్చిపారేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం యూటా రాష్ట్రం కేచీ కౌంటీలో మూడేళ్ల పాప పొరపాటున రైఫిల్‌తో రెండేళ్ల వయసున్న తమ్ముడిని కాల్చేసింది. పొట్టలో తీవ్ర తూటా గాయంతో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన కు కాసేపు ముందు ఇంట్లోని పెద్దలు ఈ రైఫిల్‌ను వాడి లివింగ్ రూమ్‌లో ఉంచారు. ఈ నెలలో అమెరికాలో పిల్లలు తుపాకులతో పొరపాటున ఎదుటి మనుషులను చంపడం ఇది నాలుగోసారి. గురువారం దక్షిణ కరోలినాలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఆరే ళ్ల బాలుడు పొరపాటున తుపాకీ కాల్చడంతో ముందు సీట్లోని మహిళ మృతిచెందింది. -
రెండేళ్ల తమ్ముడిని కాల్పి చంపిన మూడేళ్ల సోదరి!
లాస్ ఎంజెలెస్: ప్రమాదవశాత్తు రెండు సంవత్సరాల తమ్ముడిని రైఫిల్ తో మూడేళ్ల అమ్మాయి కాల్చిన సంఘటన యూఎస్ లో సంచలనం రేపింది. ఇలాంటి హత్య ఘటనలో పిల్లలు కారణం కావడం ఈ నెలలో నాలుగవ ఘటన. ఈ ఘటన శుక్రవారం ఉటాలోని క్యాచే కౌంటీలో చోటు చేసుకుంది. రెండేళ్ల తమ్ముడిని పొట్టలో .22 కాలిబర్ రైఫిల్ తో కాల్చి చంపినట్టు తెలిసింది. కాల్పుల శబ్దం విన్న తల్లి సహాయం కోసం కేకలేయడంతో బాలుడ్ని లోగన్ రిజినల్ ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత సర్జరీ సాల్ట్ లేక్ సిటీలోని ప్రైమరీ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. మరణాయుధాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదని క్యాచే కౌంటీ షెరీఫ్ లెఫ్టినెంట్ మైక్ పీటర్సన్ స్థానిక మీడియాకిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇది చాలా దారుణ సంఘటన. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలను అరికట్టవచ్చని మైక్ తెలిపారు. ఇటీవల సౌత్ కారోలినాలో ఆరేళ్ల బాలుడు ఓ మహిళను కాల్చి చంపిన సంఘటన విషాదాన్ని నింపింది. తన తండ్రితో కారులో ప్రయాణిస్తున్న బాలుడు కాల్పులు జరపడంతో ఓ మహిళకు తగిలి అక్కడికక్కడే మరణించారు. -
మహిళల రక్షణ కోసం ‘నిర్భీక్’
కాన్పూర్: ‘నిర్భయ’ ఉదంతంతో దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో వారి రక్షణ కోసం ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సరికొత్త ఆయుధాన్ని రూపొందించింది. 32 తేలికపాటి తుపాకీని మహిళల కోసం తయారుచేసింది. 500 గ్రాముల బరువున్న ఈ రివాల్వర్‌కు ‘నిర్భీక్’ అనే పేరు పెట్టింది. రూ.1,22,360 ధర ఉన్న నిర్భీక్ ఆయుధం ఫిబ్రవరి చివరి వారం నుంచి కాన్పూర్‌లోని ఫీల్డ్‌గన్ ఫ్యాక్టరీలో అందుబాటులో ఉంటాయని ఫ్యాక్టరీ జీఎం అబ్దుల్ హమీద్ సోమవారం ఇక్కడ వెల్లడించారు. నిర్భయ ఘటన జరిగిన తమ పరిశోధకులు ఈ రివాల్వర్ కోసం ఎంతగానో కృషిచేశారని చెప్పారు. ఇప్పటికే 10 బుకింగ్‌లు వచ్చాయని, రోజూ దీనిపై ఫోన్‌కాల్స్ వస్తున్నాయని హమీద్ తెలిపారు. -
ఆగని వన్యప్రాణుల వేట
=కౌండిన్య అటవీ ప్రాంతంలో నాటు తుపాకుల మోత =ఉచ్చుల్లో ఇరుక్కుంటున్న జంతువులు =పశువులు, మేకల కాపరుల ప్రాణాలకు అపాయం =నిద్రావస్థలో అటవీశాఖ పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా నాటుబాంబుల మోత, తుపాకి చప్పుళ్లు ఎక్కువయ్యూయి. అడవిలో వన్య ప్రాణుల వేట ముమ్మరంగా సాగుతోంది. వేటగాళ్ల నాటు తుపాకులకు పశువులు, మేకల కాపరులు, తేనె సేకరణకు వెళ్లే గిరిజనుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అడవిలో అమర్చిన నాటు బాంబులను తొక్కడం, కొరకడంతో జంతువులు మృత్యువాతపడుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చుల్లో ఎన్నో జంతువులు ఇరుక్కుంటున్నాయి. నిఘా కొరవడడంతో వేటగాళ్లు అటవీ ప్రాంతాల్లో వీరవిహారం చేస్తున్నారు. పలమనేరు/ వి.కోట, న్యూస్‌లైన్: పలమనేరు మండలం నుంచి బెరైడ్డిపల్లె, వి.కోట మండలం వరకు కౌండిన్య అభయారణ్యం వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి దక్షిణంగా తమిళనాడులోని మోర్ధన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో పదుల సంఖ్యలో ఏనుగులు, వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, అడవి పందులు, కుందేళ్లు తదితర వన్య ప్రాణులున్నాయి. ఈ అడవిని ఆనుకుని దాదాపు 60 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని కొందరు నిత్యం అడవికి వేటకెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు. ఈ ప్రాంతంలో వెయ్యి వరకు నాటు తుపాకులున్నట్లు అనధికార సమాచారం. గతేడాది పలమనేరు సర్కిల్ పోలీసులు జరిపిన దాడుల్లో వందలాది తుపాకులు పట్టుబడిన విషయం తెలిసిందే. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా దొరికింది కొన్నే అయినప్పటికీ, భారీ సంఖ్యలో ఇవి వేటగాళ్ల వద్ద ఉన్నట్లు సమాచారం. వేటగాళ్లు పగలు, రేయి అన్న తేడా లేకుండా అడవిలో వన్య ప్రాణులను వేటాడుతున్నారు. వేటగాళ్లు నాటు తుపాకులతో గుంపులుగుంపులుగా వె ళ్లడం ఇక్కడి రివాజు. కొందరు నాటు బాంబుల్లో వన్య ప్రాణులకు ఇష్టమైన పదార్థాలను ఉంచి అడవిలో పెట్టి వస్తుంటారు. వీటిని జంతువులు తినేటపుడు బాంబు పేలి అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. ఇలా చనిపోయిన వాటిని మరుసటి రోజు వెళ్లి వేటగాళ్లు తీసుకొస్తుంటారు. ముఖ్యంగా ఈ నాటు బాంబులను కొరికి రెండు నెలల్లో 30 కుక్కల దాకా మృత్యువాత పడ్డాయి. రెండ్రోజుల క్రితం పలమనేరు మండలం కృష్ణాపురం అడవిలో కొందరు వేటగాళ్లు భారీగా నల్లమందు ఉండలను అడవిలో పెట్టి వచ్చారు. ఓ ఉండను తిన్న అడవిపంది తల ముక్కలైంది. ఆ అడవిపందిని వేటగాళ్లు తీసుకెళ్లారు. దీనిపై అటవీశాఖ విచారణ జరుపుతోంది. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులను కొందరు పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చుతున్నారు. ఇరుక్కున్న జంతువుల మాంసాన్ని తీసుకువస్తున్నారు. భయం గుప్పిట్లో పశువుల కాపరులు నాటు తుపాకులతో అమాయకులకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో బెరైడ్డిపల్లె మండలంలోని దేవదొడ్డి అటవీ ప్రాంతంలో వేటగాళ్ల నాటుతుపాకుల దెబ్బకు పశువులకాపరి మృతిచెందాడు. రెండేళ్ల క్రితం పలమనేరు మండలంలోని కల్లాడు వద్ద ఓ వ్యక్తి మరణించాడు. రెండు నెలల క్రితం బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడు తేనె తీస్తుండగా వేటగాళ్ల నాటు తుపాకి దెబ్బకు గాయపడ్డాడు. నలుగురికి పైగా తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ బయటకు పొక్కని మరెన్నో అడవిలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ కళ్లు తెరచి తగిన చర్యలు తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.