ఇటీవల మలయాళ చిత్రాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇతర దక్షిణాది భాషల్లోనూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. గతేడాదిలోనూ మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి చిత్రాలు టాలీవుడ్ ఫ్యాన్స్‌ను మెప్పించిన సంగతి తెలిసిందే.
అలా కొత్త ఏడాదిలోనూ మలయాళ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ రైఫిల్ క్లబ్ ఓటీటీకి వచ్చేసింది. ఆశిక్ అబు దర్శకత్వం వహించిన గతేడాది డిసెంబర్‌లో మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇంకేందుకు ఆలస్యం యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఎంచక్కా చూసేయండి.
ఈ చిత్రంలో విజయ రాఘవన్, దిలీశ్ పోతన్, వాణీ విశ్వనాథ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబరు 19న కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. క్రిస్‌మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్ ఉన్ని ముకుందన్ మార్కో, మోహన్ లాల్ నటించిన బరోజ్ 3డీ లాంటి చిత్రాలతో పోటీపడి సూపర్ హిట్‌గా నిలిచింది.
Ee clubil, thokkine kaalum unnam nokkinu
Watch Rifle Club, now on Netflix!#RifleClubOnNetflix pic.twitter.com/66ADkpdtMa— Netflix India South (@Netflix_INSouth) January 16, 2025
Comments
Please login to add a commentAdd a comment