
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్‌ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది.
చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్‌పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు స్టేటస్‌గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే..
Comments
Please login to add a commentAdd a comment