jawan
-
ఆర్మీ జవాన్ కార్తీక్ మృతికి వైయస్ జగన్ సంతాపం
-
ముగిసిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు
-
అనంతపురం జిల్లా నార్పలలో ఘనంగా వీర జవాను సుబ్బయ్య అంత్యక్రియలు
-
సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాలలో వివాదాలను పరిష్కరించడానికి భారత్- చైనాలు దౌత్య, సైనిక చర్చలు జరుపుతున్నాయని అన్నారు.ఇరు దేశాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఏకాభిప్రాయం కుదిరింది. సైనిక బలగాల క్రమశిక్షణ, ధైర్యం వల్లే ఈ విజయం సాధించాం. ఏకాభిప్రాయ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల దృఢమైన నిబద్ధత, అద్భుతమైన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు నిజమైన స్పూర్తిదాయకంగా ఉంటూ, అంకితభావంతో మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వైమానిక యోధులు సవాళ్లను ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వైమానిక దళ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. ఇది కూడా చదవండి: స్టార్మర్ దీపావళి వేడుకలు -
అమర జవాను చితికి నిప్పంటించిన నాలుగేళ్ల చిన్నారి
సిర్సా: కశ్మీర్‌లోని బారాముల్లాలోగల గుల్మార్గ్లో జరిగిన ఉగ్రదాడిలో హర్యానాకు చెందిన 28 ఏళ్ల ఆర్మీ జవాను జీవన్ సింగ్ వీరమరణం పొందారు. ఆయన భౌతికకాయం ఆయన స్వస్థలమైన ఘరాకు చేరుకోగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడు జీవన్‌సింగ్ మృతదేహం అతని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ అమరవీరునికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.కశ్మీర్‌లోని గుల్మార్గ్లోని బూటా-పత్రి ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో రైఫిల్‌మెన్ జీవన్ సింగ్ రాథోడ్ వీరమరణం పొందారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు సహా నలుగురు మృతి చెందగా, జీవన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. నలుగురు సోదరీమణులకు జీవన్ సింగ్ ఏకైక సోదరుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు ఉన్నారు.జీవన్ సింగ్ 2016లో సైన్యంలో చేరి, రాజ్‌పుతానా రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి, అతని కుమార్తెలు అనన్య, భీషా బోరున విలపించడం అక్కడున్న అందిరినీ కంట తడిపెట్టించింది. గ్రామంలోని శ్మశాన వాటికలో జీవన్ సింగ్ పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించింది. దీనిని చూసిన అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
Prabhas: ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. కాగా ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ పేర్కొన్నారు.‘‘12.15 మిలియన్+టిక్కెట్ సేల్స్ (దాదాపు కోటీ 20 లక్షలు)తో ‘బుక్ మై షో’లో హయ్యస్ట్ సేల్స్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా 12.01 మిలియన్ల టిక్కెట్ సేల్స్ రికార్డును సాధించింది. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ‘జవాన్’ రికార్డును దాటింది. వీకెండ్‌తో పాటు వీక్ డేస్‌లోనూ మా సినిమా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
స్వగ్రామానికి అమర జవాను మృతదేహం
రెండు రోజల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆ జవాను ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడు. ఈ విషయం తెలియని అతని తల్లి కొడుకు రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో అతని మృతదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు ఇంటికి తీసుకురావడంతో, ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది.జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను కబీర్ సింగ్ ఉయికే అమరుడయ్యాడు. అతని మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకురాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కబీర్ సింగ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో వస్తానని చెప్పిన కుమారుడు ఇలా విగతజీవిగా వస్తాడని అనుకోలేదని అన్నారు.జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం చాలా కాలంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్ 11న సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కబీర్ సింగ్ ఉయికే తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు.సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు కబీర్ మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకువచ్చారు. కబీర్ తల్లిని డీఐజీ నీతూ ఓదార్చారు. కథువా ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒక సీఆర్పీఎఫ్ జవాను వీరమరణం పొందారు. కాగా కథువాలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. #WATCH | CRPF jawan Kabir Das Uikey's mother, Indravati Uikey says, "Before the incident, he spoke to me around 2 pm. He was supposed to return home on soon." pic.twitter.com/O5k04CwAVx— ANI (@ANI) June 13, 2024 -
ఇసుకలో అప్పడం కాల్చిన జవాను
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమిలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.రాజస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. తాజాగా బికనీర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలు ఏ రీతిలో ఉన్నాయో తెలియజేసేందుకు బీఎస్ఎప్ జవాను ఒకరు వినూత్న ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.బీఎస్ఎఫ్ జవాను ఎండకు అత్యంత వేడిగా మారిన ఇసుకతో ఒక అప్పడాన్ని కాల్చారు. ఈ వీడియోను చూస్తే.. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన దేశ సరిహద్దులలోని సైనికులు ఎలా విధులు నిర్వహిస్తున్నారో గమనించవచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనమంతా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా, దేశ సరిహద్దుల్లోని జవానులు ఉక్కపోత మధ్యనే విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో బికనీర్‌లోని ఖాజువాలా సమీపంలోని పాక్ సరిహద్దులలోనిది. రాజస్థాన్‌లో హాటెస్ట్ సిటీగా బికనీర్ పేరుపొందింది. उफ ये गर्मी! बीकानेर में 47 डिग्री पार पहुंचा पारा, तपती रेत पर @BSF_India जवान ने सेंका पापड़। इतनी गर्मी में भी जवान सीमा पर निभा रहे फर्ज... देखें वीडियो #summersafety पूरी खबर पढ़ें- https://t.co/ToEeaJcxG9 pic.twitter.com/yyCajuv1lt— Amar Ujala (@AmarUjalaNews) May 22, 2024 -
Manipur: తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి జవాన్ ఆత్మహత్య
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని మరణించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో మోహరించిన అస్సాం రైఫిల్స్ బెటాలియన్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కాల్పులకు మణిపూర్‌లో కొనసాగుతున్న జాతుల ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది రాష్ట్రంలో హింసకు కేంద్ర బిందువైన మయన్మార్ సరిహద్దు ప్రాంతం చురాచాంద్‌పుర్ కావడం గమనార్హం. అతడు కుకీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గాయపడిన ఆరుగురు సైనికులు మణిపూర్‌కు గానీ, మైతీ చెందిన వారు కాదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతునే ఉన్నాయి. అధికారులు, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది. వివిధ ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: రాహుల్ భద్రతపై అమిత్‌షాకు ఖర్గే లేఖ -
వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి?
నిర్మల్: ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్ కాలనీకి చెందిన గడ్ చందా రమేష్ (28) ఆర్మీ జవాన్. కోల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్ ముప్కల్ మండలంలో ఉండడంతో వచ్చాడు. వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి -
నయన్, అలియా, కత్రినాలకు ఝలక్: అరంగేట్రంలోనే వందల కోట్లతో అదరగొడుతున్న అమ్మడు
2023లో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇలా బాక్సాఫీసు వసూళ్లతో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, నయనతార, అలియా భట్లను వెనక్కి నెట్టేసింది. డెబ్యూలోనే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో చాన్స్ దక్కించుకొని.. నెక్ట్స్ ఎవరితో అనే ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఇంతకీ ఎవరా నటి? ఈ కథనంలో తెలుసుకుందాం! ఆమె ఎవ్వరో కాదు స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో పెంపుడు తల్లిగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన రిధి డోగ్రా. 2007 నుండి నటిస్తోంది. తొలుత టీవీ తెరపై వెలిగిపోయింది. ఇటీవల ఓటీటీ స్టార్‌గా రాణిస్తోంది. కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో వచ్చిన జవాన్ మూవీతో బాలీవుడ్ భారీ బేక్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టైగర్-3 సక్సెస్ ఆమెకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ లాంటి టాప్ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలోప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్.దీంతో తొలి ఏడాదిలోను 1500 కోట్ల క్లబ్లో చేరిందీ అమ్మడు. మరో వెయ్యికోట్లపై కన్ను ఈ ఏడాదికి ఇంతకుముందెన్నడూ చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్లో షేర్ చేసింది రిధి. జవాన్ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్ -3 కూడా వెయ్యి కోట్ల మార్క్‌కు చేరాలని ప్రార్థిస్తూ ఈ దీపావళికి వెయ్యి దీపాలు వెలిగించింది. With a heart full of gratitude and joy this diwali I decided to do something I had never done before coz what’s happened has never happened before !! 🤩🤩🤩🤩 Lit a 1000 🪔 for 1000 crore on #jawan whilst praying for a 1000 crore for #tiger3 pic.twitter.com/8b3MP5wD7q — Ridhi Dogra (@iRidhiDogra) November 14, 2023 ఎవరీ రిధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న పుట్టింది. న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ పట్టా అందుకుంది. ఝూమ్ జియా రేతో తన టీవీ అరంగేట్రం. హిందీ హై హమ్ (2009), YRF టెలివిజన్ రిష్తా డాట్ కామ్,సెవెన్ (2010), లాగీ తుజ్సే లగన్ (2010), మర్యాద…లేకిన్ కబ్ తక్? (2010-12), సావిత్రి (2013), యే హై ఆషికీ (2014), దియా ఔర్ బాతీ హమ్ (2015), వో అప్నా సా (2017-18), ఖయామత్ కీ రాత్ (2018) లతో ఆకట్టుకుంది. 2013లొ డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 6, ఖత్రోన్ కే ఖిలాడి 6 (2014) తో పాపులర్ అయింది. వెబ్‌లో సంచలనం సైకలాజికల్ థ్రిల్లర్ అసూర్తో రిధి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ షో స్ట్రీమింగ్ ఇటీవలే దాని రెండవ సీజన్ కూడా సక్సెస్‌పుల్‌గా ముగిసింది. ముంబై డైరీస్, బద్దమీజ్ దిల్ , వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ అండ్ ది మ్యారీడ్ వుమన్ అనే వెబ్ సిరీస్‌లలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఉత్తమనటిగా అవార్డు కొట్టేసింది. దీపికాకు దీటుగా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఆమె నటించిన పఠాన్ , జవాన్ రెండు చిత్రాలు ఏకంగా రూ.2200 కోట్లు రాబట్టాయి. దీపికా తరువాత రిధి డోగ్రా నిలుస్తోంది. నయనతార (రూ. 1150 కోట్లు), త్రిష కృష్ణన్ (రూ. 962 కోట్లు), అమీషా పటేల్ (రూ. 691 కోట్లు), రమ్య కృష్ణన్ (రూ. 610 కోట్లు), అలియా భట్ , కత్రినా కైఫ్ (ఇద్దరూ రూ. 350 కోట్లు) స్టార్లను దాటి పైకి ఎగబాకింది రిధి. 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను పెళ్లాడింది. కానీ మనస్పర్థల కారణంగా 2019లో భర్త నుంచి విడిపోయింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ మావోయిస్టులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయాలపాలయ్యాడు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. విధుల్లో భాగంగా తొండమార్కా నుంచి ఎల్మగుండ గ్రామానికి సీఆర్పీఎఫ్ జవాను వెళుతున్నాడు. ఈ క్రమంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. జవాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని జిల్లా పోలీసు అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. జవాన్‌ను శ్రీకాంత్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూడా ఓ బీఎస్ఎఫ్ జవానుతోపాటు ఇద్దరు పెట్రోలింగ్ బృందం నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుడులో గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటివిడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్విగ్నంగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 సీట్లలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: Assembly Elections Polling Live Updates: మిజోరం, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల షారుక్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షారుక్ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) పఠాన్ సాంగ్ వివాదం గతంలో రిలీజైన పఠాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటకు దీపికా పదుకొణె కుంకుమపువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీకి వీఐపీ భద్రతా విభాగానికి చెందిన ఆరుగురు శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నలుగురు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని పెంచింది. గతంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కల్పించారు. బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు భద్రతను పెంచారు. కాగా.. ఇటీవలే షారుక్ నటించిన జవాన్ చిత్రం రిలీజైన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్లో అత్యధికంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: 'నా ఎలిమినేషన్‌కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!) -
వీర జవాన్‌కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు
భట్టిప్రోలు: రాజస్తాన్‌లోని పాకిస్తాన్ బోర్డర్ జస్పల్‌మీర్ వద్ద విధి నిర్వహణలో మృతి చెందిన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్ పురమా గోపరాజు (26)కు గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జస్పల్‌మీర్ వద్ద ప్రత్యేక కవాతు నిర్వహణలో భాగంగా రైఫ్లింగ్‌లో అకస్మాత్తుగా గోపరాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి మిలటరీ అధికారులు, గ్రామస్తులు సైనిక లాంఛనాలతో భట్టిప్రోలు స్మశానవాటికకు తరలించారు. రెండు సెంట్లస్థలాన్ని రెవెన్యూ అధికారులు అమరజవాన్‌కు స్థూపం కట్టేందుకు కేటాయించారు. రాష్ట్ర సాంఘిక శాఖా మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆర్మీ జవాన్లు అమర జవాన్‌కు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం 21 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. -
గుండెపోటుతో మరణించిన వీర సైనికుడు
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్ పురమా గోపరాజు (26) సోమవారం రాజస్థాన్‌లోని పాకిస్తాన్ బోర్డర్ జస్పల్‌మీర్ వద్ద విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్ధివదేహాన్ని మంగళవారం సికింద్రాబాద్ మిలటరీ హాస్పిటల్‌కు తరలించారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం తరపున అక్కడి ఐఏఎస్, మిలటరీ అధికారులు గోపరాజు పార్ధివదేహానికి నివాళి అర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున భట్టిప్రోలు మేజిస్ట్రేట్, తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ ఆర్ఐ శివరామకృష్ణ సికింద్రాబాద్ వెళ్లి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని గోపరాజు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకు వచ్చారు. భట్టిప్రోలు నుంచి పల్లెకోన గ్రామస్తులు గోపరాజు పార్ధివదేహం వెంట ర్యాలీగా స్వగ్రామానికి వెళ్లారు. అమర్ రహే గోపరాజు అంటూ నినాదాలు చేశారు. గోపరాజు భౌతికకాయం వెంట మిలటరీ కెప్టెన్ రిషబ్ సూద్, జూనియర్ కమిషనర్ ఆఫీసర్లు (జేసీవోలు) కురేష్, సుభాష్‌చంద్ర, గురవ్, పల్లిబాబు, మరో 25 మంది వివిధ విభాగాలకు చెందిన జవాన్లు వచ్చారు. గురువారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నట్లు గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు దున్నా తిరుపతిబాబు తెలిపారు. -
జీ20 సమ్మిట్ విషయంలో మోదీపై షారుక్ ట్వీట్ వైరల్
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న జవాన్ సినిమా వజయంతో షారుక్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపై సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి షారుక్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సును విజయవంతం చేసినందుకు గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు. 'ప్రపంచ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం అన్ని దేశాల మధ్య ఐక్యతను పెంపొందించినందుకు మోదీకి అభినందనలు అని షారుక్ కొనియాడారు. (ఇదీ చదవండి: లావణ్య తీసుకున్న నిర్ణయానికి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్) దేశ శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ పనిచేస్తున్నారని SRK చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో చారిత్రాత్మక జీ20 సదస్సు ముగియడంతో షారుక్ ఖాన్ ప్రధాని గురించి ఇలా చెప్పారు. 'ఇది ప్రతి భారతీయుడి హృదయంలో గౌరవం, గర్వాన్ని సృష్టించింది. సార్, మీ నాయకత్వంలో మేము ఒంటరిగా కాకుండా ఐక్యంగా అభివృద్ధి చెందుతాము. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అని షారుక్ తన ట్వటర్ (ఎక్స్)లో రాశారు. పఠాన్ తర్వాత బాలీవుడ్ బాద్ షా మరో బ్లాక్ బస్టర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 500 కోట్ల మార్క్‌ను జవాన్ దాటింది. అట్లీ యాక్షన్ కట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే సంవత్సరంలో రెండు విజయవంతమైన చిత్రాలను అందించిన ఘనత SRKకి ఉంది. SRK తో పాటు, నటుడు విజయ్ సేతుపతి, నటి నయనతార కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమతో కలిసి షారూక్ తీసిన మొదటి సినిమా ఇది. తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు చాలా విజయవంతమైంది. పలు కీలక అంశాలపై ఆ సదస్సులో చర్చించారు. తదుపరి సమావేశానికి బ్రెజిల్ బాధ్యత వహిస్తుంది. డిసెంబర్ 1న సమాఖ్య అధ్యక్ష పదవిని బ్రెజిల్ అధికారికంగా చేపట్టనుంది. Congratulations to Hon. PM @narendramodi ji for the success of India’s G20 Presidency and for fostering unity between nations for a better future for the people of the world. It has brought in a sense of honour and pride into the hearts of every Indian. Sir, under your… https://t.co/x6q4IkNHBN — Shah Rukh Khan (@iamsrk) September 10, 2023 (ఇదీ చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) -
కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్
• నాలుగు రోజుల్లో 'జవాన్'కు రూ. 500 కోట్లు • ఆదివారం ఒక్కరోజే 28 లక్షలకు పైగా టికెట్లు • షారుక్ తర్వాతి సినిమా ఇదే ఈ ఏడాదిలో పఠాన్', జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్లను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అందుకున్నాడు. కొంతకాలం క్రితం బాలీవుడ్లో సరైన భారీ హిట్ సినిమాలు లేవు.. ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సతమతమవుతున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్‌లను అందుకుంటూ బాలీవుడ్లో వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి పఠాన్‌తో వచ్చిన షారుక్ అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి) దీంతో బాలీవుడ్ బాద్ షా తాను మాత్రమేనని నిరూపించాడు. ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్‌లోనే సెప్టెంబర్ 7న జవాన్‌గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్ చిత్రం రూ. 500 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కొంత సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్లో చేరడంతో షారుక్ రికార్డుకెక్కాడు. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగగా జవాన్ సినిమా టికెట్లు 28 లక్షలు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదీ ఎవరూ అందుకోలేని రికార్డు అంటూ పలువురు తెలుపుతున్నారు. దీంతో లాంగ్ రన్ టైమ్‌లో జవాన్ రూ.1000 కోట్ల మార్క్‌ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే. Jawan creates HISTORY. Sold a RECORD 2⃣8⃣7⃣5⃣9⃣6⃣1⃣ tickets from tracked shows alone in India on the 4th day. Biggest ever for a bollywood film. ||#ShahRukhKhan|#Nayanthara|#Jawan|| Worldwide hits ₹500 cr gross club, making Shah Rukh Khan the only actor to achieve this feat… pic.twitter.com/CHeMFO7wmS — Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023 -
స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!
స్టార్ హీరో అంటేనే ఆ రేంజే వేరు. ఎక్కడికెళ్లినా సరే ప్రత్యేకంగా కనిపించాల్సిందే. అలా ఏ దేశానికి వెళ్లినా వారికంటూ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా లగ్జరీ విల్లాలు కొనేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో షారుక్ జోడీగా నయనతార నటించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్ హీరో ఆస్తుల విషయానికొస్తే ముంబయి, దుబాయ్‌లో కోట్ల విలువైన సౌధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో షారుక్ ఖాన్‌కు ఉన్న మరో ఖరీదైన విల్లా గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: దేశం పేరు మార్పుపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్) అమెరికాలోని లాజ్ ఎంజిల్స్‌లో షారుక్ ఖాన్‌కు అత్యాధునిక వసతులతో ఖరీదైన విల్లా కూడా ఉంది. అంతే కాకుండా ఆ విల్లాను అద్దెకు కూడా ఇస్తారంట. ఓ రకంగా ఆ విల్లా ద్వారా పెద్ద బిజినెస్ నడిపిస్తున్నారు బాలీవుడ్ బాద్షా. అంతే కాకుండా ఫ్యామిలీతో కలిసి యూఎస్ వెళ్లినప్పుడు అక్కడే బస చేస్తారు. ఈ అత్యంత ఖరీదైన విల్లాలో ఆరు విశాలమైన గదులు, డ్రాయింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి. అద్దె ఎంతో తెలుసా? లగ్జరీ సదుపాయాలున్న షారుక్ ఖాన్ విల్లాను అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఆ ఇంట్లో ఒక రోజు ఉండాలంటే రూ.1.96 లక్షలు చెల్లించాల్సిందే. ఇంకేముంది మీరెప్పుడైనా అమెరికా లాస్ ఎంజిల్స్ వెళ్తే స్టార్ హీరో ఇంటికి అద్దె చెల్లించి విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. గతంలో ఈ విల్లా గురించి షారుక్ మాట్లాడుతూ..బయటి ప్రపంచానికి దూరంగా ఫ్యామిలీతో కొంత సమయం ఉండేందుకు.. రిఫ్రెష్ అయ్యేందుకు ఉంటుందని వెల్లడించారు. జబ్ హ్యారీ మెట్ సెజల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నారు షారుక్ భాయ్. ఇప్పటికే అతనికి దూబాయ్లోనూ రూ.200 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. షారుక్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: అందుకే అడల్ట్ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..) -
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. (ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!) మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్‌ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్‌గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!) Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I — Shah Rukh Khan (@iamsrk) September 3, 2023 -
నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. ఇదే విషయం ఆమెకు చెప్తే..: విజయ్ సేతుపతి
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న జవాన్ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా జవాన్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలలు పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశామని అయితే కరోనా తదితర కారణాల వల్ల మూడేళ్లు పట్టిందని చెప్పారు. అదే సమయంలో చిత్రం మరింత బ్రహ్మాండంగా రూపొందిందని, ఖర్చు కూడా భారీగా పెరిగిందన్నారు. అందుకు షారుక్ ఖాన్ ఎంతగానో సహకరించారని అట్లీ చెప్పారు. షారుక్ ఖాన్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. తాను పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే అది వన్ సైడ్ లవ్ అని చెప్పారు. ఆ అమ్మాయి మాత్రం తాను నటుడు షారుక్ ఖాన్ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందన్నారు. అప్పటినుంచి తనకు షారుక్ ఖాన్‌పై పగ ఏర్పడిందన్నారు. ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నానని సరదాగా అన్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) షారుక్ ఖాన్ మాట్లాడుతూ నటుడు విజయ్ సేతుపతి ఇంతకు ముందు చెప్పినట్లుగా తనపై ప్రతీకారం తీర్చుకోలేరని కారణం ఆయన తనకు అభిమాని అని పేర్కొన్నారు. జవాన్ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నానని షారుక్ ఖాన్ చెప్పారు. కాగా చైన్నెలో జవాన్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన షారుక్ ఖాన్‌కు నటుడు కమలహాసన్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ ఆపేయమన్న షారుక్: అట్లీ
ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్‌లో ఈ సినిమాలో షారుక్ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే) దర్శకుడు శంకర్‌తో కో-డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్ ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్‌తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్‌ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్‌కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు. 'జవాన్ షూటింగ్ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మూడు రోజులే అయింది. దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్‌కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు. తన కష్ట సమయంలో షారుక్ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్ అయ్యాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 10years back , we were shooting near #ShahRukhKhan sir home , I stood near his gate and clicked a pic. Now his home gate opened for me and Shah Rukh sir stood at the gate to welcome me ! You are more than my father , my everything sir . #Atlee pic.twitter.com/ulmjyaSOzN — iamsrksneha (@iamsrkian000) August 30, 2023 -
ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే
సౌత్ ఇండియా లేడీ సూపార్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు అందరూ రాఖీ పండుగ సెలబ్రేషన్లో ఉండగా నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. మొదటగా తన ఇద్దరు కుమారులతో (ఉయిర్, ఉలగం) కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను షేర్ చేసింది. నయనతార ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే భారీగా వైరల్ కావడంతో ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. ఆమె పెట్టిన రీల్‌ను కూడా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైక్ చేయగా.. రెండు మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) ఇప్పటికే సౌత్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుని జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నయన్‌కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. తన కుమారుల ఫోటోలను ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయని నయన్ తొలిసారి ఇలా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. జవాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నయన్ ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమెకు ఇప్పటి వరకు ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ వచ్చేవాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) 'జైలర్'లోని హుకుమ్ పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో తన కవలలను ఎత్తుకుని మాస్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన నయన్ తన ఇన్‌స్టాలో మాత్రం కేవలం ఐదుగురిని మాత్రం ఫాలో అవుతుంది. అందులో తన భర్త విఘ్నేశ్, హీరో షారుక్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతో పాటు తన సొంత ప్రొడక్షన్ సంస్థ అయిన 'ది రౌడీ పిక్చర్స్' ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'జవాన్' రెండో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్ సీన్స్‌తో షారుక్ అదరగొట్టాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్లో కూడా షారుఖ్ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్‌లోని మెట్రోను షారుఖ్ హైజాక్ చేస్తాడు.. ఈ సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. ట్రైలర్లో విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన లుక్‌లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ జవాన్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌పై షారుక్ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్‌ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
సెప్టెంబరు నెలలో విడుదల అవుతున్న ఏడు టాప్ సినిమాలు ఇవే..!
సెప్టెంబరు నెలలో సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.. ఇదే నెలలో 7కు పైగా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి పండుగ ఉండటంతో సెప్టెంబరు 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సెప్టెంబరు 1 'ఖుషి' విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబర్ 7 'జవాన్' కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'జవాన్'. పఠాన్ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 15 'స్కంద' రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌ను పక్కా మాస్ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'స్కంద' సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 15 'చంద్రముఖి 2' రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు 'చంద్రముఖి 2' విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాఘవ లారెన్స్-కంగనా రనౌత్ నటిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15 'మార్క్ ఆంథోని' హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 28 'సలార్' ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' సెప్టెంబర్ 28న విడుదలకు రెడీగా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా 'సలార్' అనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) -
జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఇప్పుడు షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఆమె చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న నయనతార సూపర్ స్టార్‌గా ఎదిగింది. అంతేకాకుండా పర్సనల్ లైఫ్‌లోనూ ఆమె వివాదాలు వెంటాడాయి. అలా అన్నింటినీ అధిగమించి ఇప్పుడిప్పుడే తన ఇద్దరు పిల్లలతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. (ఇది చదవండి: నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి) అయితే ప్రస్తుతం ఆమె నటించిన జవాన్ వచ్చేనెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ లీడ్ రోల్లో కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్లో ఆమె తొలి చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన నయన్ ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. తన సొంత చిత్రాలకు నయనతార ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపేస్తూ ఉంటోంది. అలాంటి బాలీవుడ్ అరంగేట్ర చిత్రమైన జవాన్ ప్రమోషన్లలో నయన్ కనిపించకపోవడం అభిమానుల్లో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. మరో విషయమేంటంటే ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన దీపికా పదుకొణే షారుక్‌తో కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇంతకీ జవాన్‌లో లీడ్ రోల్ చేసింది నయనాతారనా లేక దీపికనా అంటూ ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఇదే విషయం అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవలే మరో నటి కస్తూరి నయనతారను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను లేడీ సూపర్ స్టార్ గా భావించలేమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!)