15 ఏళ్ల క్రితం తప్పించుకున్నాడు.. తాజాగా అరెస్ట్‌  | Absconder Jawan Arrested After 15 Years In UP | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల క్రితం తప్పించుకున్నాడు.. తాజాగా అరెస్ట్‌

Published Fri, Jun 25 2021 9:20 PM | Last Updated on Fri, Jun 25 2021 9:24 PM

Absconder Jawan Arrested After 15 Years In UP - Sakshi

లక్నో: ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ 15 ఏళ్ల క్రితం సెంట్రల్ జైలు నుంచి పరారైన మాజీ జవాన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివరాలు.. అనిల్‌ సింగ్‌ అనే వ్యక్తి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు.  1994లో  సింగ్ విధుల్లో ఉన్నప్పుడు తన పై అధికారిని హత్య చేసి అరెస్ట్ అయ్యాడు. జమ్మూ కశ్మీర్‌లో పనిచేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఎస్పీ విపిన్ టాడా అప్పట్లో వెల్లడించారు.

ఈ కేసులో దోషిగా తేలిన అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత అలహాబాద్ కోర్టు అతడికి 2005 అక్టోబర్ 12 నుంచి 2006 ఏప్రిల్ 13 వరకు పెరోల్ ఇచ్చింది. 6 నెలల పెరోల్ ముగిసినా అతడు జైలుకు రాకపోవడంతో సింగ్‌ పారిపోయినట్లు గుర్తించారు. అప్పటి నుంచి అతనికోసం గాలిస్తుండగా తాజాగా తన స్వగ్రామం గైగాట్ సమీపంలో సంచరిస్తున్న సమాచారం అందడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

చదవండి: బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement