లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం అత్యంత దారుణ హత్యకు గురైంది. గురువారం ఉపాధ్యాయుడికి ఇంట్లో చొరబడిన గుర్తుతెలియని దుండగులు నాలుగురు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్(35)గా గుర్తించారు. ఆయన పన్‌హౌనాలోని కాంపోజిట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. దుండగుల కాల్పల్లో సునీల్ భార్య పూనం (32), వారి కుమార్తె దృష్టి (6), ఏడాది వయసున్న కుమార్తె మృతి చెందారు.
ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. టీచర్ భార్య ఆగస్టు 18న చందన్ వర్మా అనే వ్యక్తి రాయ్ బరేలీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమకు, తమ కుటుంబానికి ఏమైనా జరిగినే చందన్ వర్మానే బాధ్యుడు అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. ఆమెను వేధింపులకు గురిచేసినట్లు కూడా కేసులో ఆమె ప్రస్తావించటం గమనార్హం. అయితే ఈ హత్యకు సంబంధించి అనుమానితుడు చందన్ వర్మా ఆచూకీ ఇంకా దొరకలేదని, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కుటుంబ హత్యకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదని అన్నారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా చందన్ వర్మా వాట్సాప్ చాట్ బయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్ అందులో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ ఐదుగురు చనిపోతారు" అని వర్మ వాట్సాప్ చాట్‌లో వ్రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment